"హిస్"లో బట్టలు లేకుండా మల్లికా..!

బాలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో అలరించిన అందాల ముద్దుగుమ్మ, సెక్సీతార మల్లికా షెరావత్ తన తాజా హాలీవుడ్ సినిమా "హిస్"లో విత్ అవుట్‌గా నటిస్తోందట. ఈ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశంలో మల్లికా బట్టలు లేకుండా నటిస్తోందని ఇటీవల విడుదలైన హిస్ ట్రైలర్‌ను బట్టి తెలిసింది. ఇందులో పగబట్టిన పాముగా మల్లిక నటిస్తోంది. ఒక సన్నివేశంలో శరీరంపై బురద పూసుకుని మల్లికా షెరావత్‌ నగ్నంగా ప్రదర్శన ఇచ్చింది. దీంతో హిస్ ప్రోమోను వీక్షించేందుకు మల్లికా షెరావత్ అభిమానులు బ్రౌజింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2009 | 5:21 pm

ఇన్ఫోసిస్ బీపీవోలో కొత్త నియామకాలు

దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ కొత్త నియమకాలు ప్రారంభించింది. ఇన్ఫోసిస్ తన బీపీవో శాఖలో తిరిగి కొత్త నియమకాలు చేపట్టినట్లు ఓ జాతీయ దినపత్రిక పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావం పడటంతో అనేక కంపెనీలు కొత్త నియామకాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 27 May 2009 | 5:14 pm

లాభాలతో ముగిసిన సెన్సెక్స్: రియాల్టీ, బ్యాంకెక్స్‌ల హవా

స్టాక్ మార్కెట్ లాభాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 520 పాయింట్లు పుంజుకుని 14,110 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 159 పాయింట్లు లాభపడి 4,276 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 3.83 శాతం, నిఫ్టీ 3.87 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఈ రోజు ఉదయం 191 పాయింట్ల లాభంతో 13,780 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: News | 27 May 2009 | 5:13 pm

బ్రిటన్ హోం కార్యదర్శిపై వేధింపుల ఆరోపణలు

బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి జాకుయ్ స్మిత్ వేధింపుల ఆరోపణలతో సమస్యల్లో చిక్కుకున్నారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగిని తీవ్రవాదిగా అనుమానిస్తూ వేధించినందుకు స్మిత్ న్యాయపరమైన చర్యలు ఎదుర్కోబోతున్నారు.
Source: Yahoo! Telugu: News | 27 May 2009 | 5:01 pm

జులై మొదటి వారంలో బడ్జెట్‌: ప్రణబ్‌

కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై మొదటి వారంలో బడ్జెట్‌ ఉంటుందని ఆయన ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 27 May 2009 | 4:53 pm

సత్యం రాజుకు రిమాండ్ పొడిగించిన కోర్టు

సత్యం కంప్యూటర్స్ సంస్థలో వెలుగుచూసిన ఆర్థిక కుంభకోణానికి సంబంధించి అరైస్టైన ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజుకు విధించిన రిమాండ్‌ను బుధవారం కోర్టు పొడిగించింది ఈ సందర్భంగా రాజుతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఆరుగురికి సైతం కోర్టు రిమాండ్ పొడిగించింది.
Source: Yahoo! Telugu: News | 27 May 2009 | 4:40 pm

ఆదాయానికి మించి ఖర్చుపెట్టకండి: ఎన్టీఆర్

ఎన్టీరామారావుగారి గురించి గుమ్మడిగారు తన "తీపి గురుతులు- చేదు జ్ఞాపకాలు"లో ఒకచోట ఇలా రాశారు. " నాకు తెలిసి 1952లో సొంతకారు కొనేంతవరకూ ఆయన... అయితే బస్సు ప్రయాణం, లేదంటే కాలినడక. ఏనాడూ రిక్షా ఎక్కినట్లు చూడలేదు. ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటించారు. మేము ఒక రోజు అలా షికారుగా నడుస్తూ వెళుతుండగా యథాలాపంగా ' నెలకు నీకు ఖర్చు ఎంత అవుతుంది' అని అడిగారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2009 | 4:31 pm

ర్యాగింగ్‌కు కళ్లెం వేసేందుకు కొత్త మార్గదర్శకాలు

ర్యాగింగ్ భూతానికి కళ్లెం వేసేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బుధవారం కొత్త మార్గనిర్దేశకాలు జారీ చేసింది. కఠినమైన ర్యాగింగ్ నిరోధక నిబంధనలు ప్రవేశపెట్టే చర్యల్లో భాగంగా యూజీసీ ఈ కొత్త మార్గనిర్దేశకాలు రూపొందించింది. ఈ మార్గనిర్దేశకాలను నిబంధనలుగా మార్చేందుకు నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
Source: Yahoo! Telugu: News | 27 May 2009 | 4:25 pm

ఆమె నాకు మంచి స్నేహితురాలు మాత్రమే..!

పాప్ క్వీన్ మడోన్నా తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని జీసస్ లజ్‌ అన్నాడు. గైరిచీకి విడాకులిచ్చిన మడోన్నా కొత్త బాయ్‌ఫ్రెండ్ జీసస్‌తో చెట్టాపట్టేలేసుకుని తిరుగుతుందని, త్వరలో జీసస్‌-మడోన్నాల వివాహం జరుగబోతోందన్న వార్తలను లజ్ కొట్టిపారేశాడు. తామిద్దరం మంచి ఫ్రెండ్స్‌గానే నడుచుకుంటున్నామని లజ్ తేల్చి చెప్పేశాడు. వృత్తిరీత్యా ఆమెను కలిసిన సందర్భాలున్నాయని, కానీ మడోన్నాతో తనకు ఎలాంటి అక్రమ సంబంధాలు లేవని జీసస్ తేల్చి చెప్పేసినట్లు కాంటాక్ట్‌మ్యూజిక్ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2009 | 4:21 pm

జోధ్‌పూర్‌లో కుప్పకూలిన మిగ్- 21 విమానం

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సమీపంలో బుధవారం మిగ్- 21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ విమానం పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. గత నెల రోజుల్లో కుప్పకూలిన మూడో వైమానిక దళ విమానం ఇది. జోధ్‌పూర్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన కాసేపటికే ఈ విమానం మోర్డిజోశ్యాన్ సమీపంలోని లూని గ్రామం వద్ద కూలిపోయింది.
Source: Yahoo! Telugu: News | 27 May 2009 | 4:12 pm

14వేల మార్కును దాటిన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ 14వేల మార్కును దాటింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 520 పాయింట్లు లాభపడి 14,110 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 159 పాయింట్లు పెరిగి 4,276 వద్దకు చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 2,740 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 2,190 కంపెనీల వాటాలు లాభాల్లో ఉన్నాయి. అలాగే 503 కంపెనీల వాటాలు నష్టాల్లో ఉండగా... మిగిలిన 47 కంపెనీల వాటాలు స్థిరంగా పయనిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 27 May 2009 | 4:04 pm

జూన్ 9న తెరపైకి మగధీర!

మెగాస్టార్ తనయుడు, చిరుత ఫేమ్ యంగ్ హీరో రామ్ చరణ్ తేజ కథానాయకుడిగా నటించే తాజా చిత్రం "మగధీర". వేసవి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను జూన్ తొమ్మిదో తేదీన రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సమాచారం. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, చందమామ ఫేమ్ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2009 | 3:57 pm

25 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు

వచ్చే నెల జూన్ 25వ తేదీ నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ బుధవారం తెలిపారు. బుధవారం పదో తరగతి పరీక్షా ఫలితాలను ఆయన విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: News | 27 May 2009 | 3:47 pm

జూల్ 19న ఎల్పీసెట్-2009

జూలై 19వ తేదీన లాంగ్వేజ్ పండిట్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎల్పీసెట్-2009)ను నిర్వహిస్తున్నట్లు ఎల్పీసెట్ కన్వీనర్ బి. మల్లమ్మ తెలిపారు. ఎల్పీసెట్ దరఖాస్తులను అభ్యర్థుల సౌకర్యార్థం ప్రస్తుతం పోస్టాఫీసుల్లో విక్రయిస్తున్నట్లు ఓ ప్రకటనలో మల్లమ్మ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 27 May 2009 | 3:33 pm

నిర్మాతల్లో ఐక్యత లేదు: విజయేంద్ర రెడ్డి

నిర్మాతల్లో ఐక్యతలేక పోవడం వల్లే చిన్న నిర్మాతలకు థియేటర్ల సమస్య తలెత్తిందని హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (నైజాం సర్క్యూట్) అధ్యక్షుడు ఎం. విజయేంద్ర రెడ్డి ధ్వజమెత్తారు. కర్నాటక ఫిలిం ఛాంబర్‌లో ఇలాంటి సమస్యలకు తావుండదని విజయేంద్ర రెడ్డి అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2009 | 3:31 pm

హీరోగా వస్తోన్న నవదీప్ సోదరుడు "పార్థు"

టూమచ్, ఎక్స్‌ట్రా వంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాలను తెరకెక్కించిన వీరుద్వైత్ దర్శకత్వంలో తాజాగా "గుడు గుడు గుంజం" రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా హీరోగా నవదీప్ సోదరుడు పార్థు పరిచయమవుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2009 | 2:02 pm

టాలీవుడ్ హాట్ గర్ల్‌గా నిఖిత!

"సరోజ" చిత్రంలో వ్యాంప్ ఐటంసాంగ్‌లో తన అందచందాలను ఆరబోసిన సెక్సీతార నిఖిత. టాలీవుడ్‌లో అమాయకమైన పాత్రలు పోషిస్తూ, ఈమెకు ఐటం సాంగ్ చేయడం కూడా వచ్చా? అని సరోజ చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన నిఖిత, తాజాగా టాలీవుడ్ హాట్ గర్ల్‌గా మారుతోందని సినీ పండితులు అంటున్నారు. గ్యాప్ ఇవ్వకుండా.. ఐటంసాంగ్స్ చేస్తానంటోన్న నిఖితకు ఈ మధ్య అంతగా అవకాశాలు రావడం లేదట. హీరోయిన్ ఛాన్సులు రాకపోయిన ఫర్వాలేదని, ఐటంసాంగ్స్ చేస్తానని నిఖిత ముందుకు రావడంతో నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం క్యూ కడుతున్నారని సినీ వర్గాల సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2009 | 1:25 pm

సినిమాలనుంచి నేనింకా రిటైర్ కాలేదు: రేఖ

వయసుమీద పడ్డా తరగని అందంతో కుర్రకారుని సైతం మత్తెక్కించగలిగిన బాలీవుడ్ నటి రేఖ నటననుంచి తాను ఇప్పట్లో తప్పుకోబోనని తేల్చి చెప్పింది. సినిమాల్లో నటించాలనే తపన తనలో ఇంకా అడుగంటలేదని, సినీ జీవితంలో తాను సాధించాల్సింది ఇంకా మిగిలే ఉందని ఈ సందర్భంగా రేఖ పేర్కొంది.
Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2009 | 1:21 pm

ప్రేమకథా నేపథ్యంలో అరుణై పిక్చర్స్ కొత్త చిత్రం

కాలేజీలో చదివే 18-21 వయస్సు గల యువతీ యువకుల మధ్య సాగే ప్రేమ కథా నేపథ్యంలో అరుణై పిక్చర్స్ ఓ కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి బి.ఆర్. వర్మ దర్శకుడు. ఇ.వి. కుమరన్ నిర్మాత. ఈ సినిమాలో అవితేజ్, తిరు, వైనవి, పార్వతి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2009 | 12:50 pm

ప్రభాస్‌తో కంగన రనౌత్ బిజీ బిజీ..!

బాలీవుడ్ హాటెస్ట్ గర్ల్ కంగన రనౌత్, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో బిజీ బిజీగా ఉందట. క్రేజీ మాస్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రంలో ప్రభాస్ సరసన కంగన నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లోనే కంగన, ప్రభాస్‌తో తెగ బిజీబిజీ కనిపిస్తోందట. షూటింగ్ సమయంలోనే ప్రభాస్ వెంటే తిరుగుతోందట. కాస్త విరామం దొరికితే చాలు.. ప్రభాస్ పక్కన కూర్చుని ముచ్చట్లు ప్రారంభిస్తోందట. మొత్తానికి కంగన ప్రభాస్‌ను వలలో వేసుకుంటుందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 27 May 2009 | 12:22 pm

జోధ్‌పూర్‌లో కుప్పకూలిన మిగ్- 21 విమానం

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సమీపంలో బుధవారం మిగ్- 21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ విమానం పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. గత నెల రోజుల్లో కుప్పకూలిన మూడో వైమానిక దళ విమానం ఇది. జోధ్‌పూర్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన కాసేపటికే ఈ విమానం మోర్డిజోశ్యాన్ సమీపంలోని లూని గ్రామం వద్ద కూలిపోయింది.
Source: జాతీయ | 27 May 2009 | 11:45 am

ర్యాగింగ్‌కు కళ్లెం వేసేందుకు కొత్త మార్గదర్శకాలు

ర్యాగింగ్ భూతానికి కళ్లెం వేసేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బుధవారం కొత్త మార్గనిర్దేశకాలు జారీ చేసింది. కఠినమైన ర్యాగింగ్ నిరోధక నిబంధనలు ప్రవేశపెట్టే చర్యల్లో భాగంగా యూజీసీ ఈ కొత్త మార్గనిర్దేశకాలు రూపొందించింది. ఈ మార్గనిర్దేశకాలను నిబంధనలుగా మార్చేందుకు నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
Source: జాతీయ | 27 May 2009 | 11:41 am

సత్యం రాజుకు రిమాండ్ పొడిగించిన కోర్టు

సత్యం కంప్యూటర్స్ సంస్థలో వెలుగుచూసిన ఆర్థిక కుంభకోణానికి సంబంధించి అరైస్టైన ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజుకు విధించిన రిమాండ్‌ను బుధవారం కోర్టు పొడిగించింది ఈ సందర్భంగా రాజుతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఆరుగురికి సైతం కోర్టు రిమాండ్ పొడిగించింది.
Source: ఏపీ న్యూస్ | 27 May 2009 | 11:11 am

టెన్త్ ఫలితాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

పదో తరగతి పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. హైదరాబాదులోని ఇందిరా ప్రియదర్శిని హాల్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యాశాఖ కొత్త మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాణిక్య వరప్రసాదరావు ఈ ఫలితాలను విడుదల చేశారు.
Source: ఏపీ న్యూస్ | 27 May 2009 | 10:10 am

పంజాబ్, హర్యానాలలో ప్రశాంత వాతావరణం

వియన్నాలో సిక్కు గురువు హత్య కారణంగా గత రెండు రోజులుగా అట్టుడికిన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో క్రమక్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆదివారం జరిగిన సిక్కు గురువు హత్యపై ఈ రెండు రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో ముగ్గురు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు.
Source: జాతీయ | 27 May 2009 | 10:02 am

పదవులపై నాకు వ్యామోహం లేదు: డీఎస్

పదవులపై తనకు ఏనాడూ వ్యామోహం లేదని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. పార్టీ సేవలందించేందుకు ప్రయత్నిస్తానే తప్ప పదవులకోసం తాను ఎదురు చూడనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 May 2009 | 9:11 am

మంత్రివర్గ విస్తరణ: ప్రధాని, సోనియా సంప్రదింపులు

కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి సంప్రదింపులు జరిపారు. మంత్రివర్గ సభ్యుల జాబితాకు తుది రూపు ఇచ్చేందుకు ఇద్దరు నేతలు బుధవారం సమావేశమైనట్లు తెలుస్తోంది.
Source: జాతీయ | 27 May 2009 | 8:22 am

కేబినెట్ విస్తరణ: మన్మోహన్‌తో పవార్ భేటి

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ మంగళవారం రాత్రి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి మండలి విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Source: జాతీయ | 27 May 2009 | 8:21 am

హెలికాఫ్టర్ ఒప్పందాలకు భారత్ బిడ్ల ఆహ్వానం

భారత్ 2 బిలియన్ డాలర్ల విలువైన రెండు వేర్వేరు రక్షణ ప్రాజెక్టులకు బిడ్‌లను ఆహ్వానించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ అధికారి ఒకరు, బోయింగ్ కార్పొరేషన్ ఇండియా అధిపతి మంగళవారం వెల్లడించారు. వైమానిక దళం ఆధునికీకరణలో భాగంగా ఈ ప్రాజెక్టులు చేపట్టారు.
Source: జాతీయ | 27 May 2009 | 5:48 am

ముగిసిన పటేల్ సుధాకర్‌రెడ్డి అంత్యక్రియలు

ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్ర నేత పటేల్ సుధాకర్‌రెడ్డి అంత్యక్రియలను మంగళవారం సాయంత్రం గద్వాల్‌లో నిర్వహించారు. చిన్న అగ్రహారంలోని సుధాకర్‌రెడ్డి సోదరుడి ఇంటినుంచి పటేల్ మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి ఆయన స్వగ్రామం మల్దకల్ మండలం కుర్తిరావుల చెరువు వద్ద అంత్యక్రియలు నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 27 May 2009 | 5:47 am

ముఖ్యమంత్రి వైఎస్ జెరుసలేమ్ యాత్ర

రెండో పర్యాయం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వైఎస్ఆర్ బుధవారం కుటుంబ సమేతంగా ఇజ్రాయెల్ తీర్థయాత్రకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండోసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే కావడం విశేషం. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఇజ్రాయెల్‌లోని బెత్లెహేమ్ తదితర పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మే 31న తిరిగి హైదరాబాదు చేరుకుంటారు.
Source: ఏపీ న్యూస్ | 27 May 2009 | 5:35 am

రాజధాని వేదికగా నేటినుంచి మహానాడు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా బుధవారం నుంచి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు ప్రారంభం కానుంది. రాష్ట్ర అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీ పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో జరగనున్న ఈ మహానాడు సందర్భంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపి వారిని కార్యోన్ముఖులను చేసేందుకు అధినాయకత్వం సిద్ధమైంది.
Source: ఏపీ న్యూస్ | 27 May 2009 | 4:39 am

ఐలా తుపాను: 81కి పెరిగిన మృతుల సంఖ్య

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విలయతాండవం చేసిన ఐలా తుపాను కారణంగా మృతి చెందినవారి సంఖ్య మంగళవారం 81కి చేరింది. బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో తుపాను కారణంగా సంభవించిన ప్రమాదాల్లో మరింత మంది మృతి చెందారు. డార్జిలింగ్ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రదేశాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
Source: జాతీయ | 27 May 2009 | 3:31 am

దేరా నేత హత్య: పంజాబ్‌లో సాధారణ పరిస్థితులు

వియన్నాలో దేరా నేత హత్యకు గురికావడంతో గత కొన్ని గంటలుగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మంగళవారం దాదాపుగా సద్దుమణిగాయి. సుమారు 40 గంటలపాటు పంజాబ్‌లో ఆందోళనకారులు విధ్వంసానికి దిగిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 27 May 2009 | 3:16 am

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు...!

మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీలో మంటలు వ్యాపించాయి. రైలు నల్గొండజిల్లా బీబీనగర్‌లోకి ప్రవేశించేటప్పుడు ఈ సంఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం.
Source: ఏపీ న్యూస్ | 26 May 2009 | 2:49 pm

జులై మొదటి వారంలో కేంద్ర బడ్జెట్: ప్రణబ్

కొత్త బడ్జెట్‌ను జులై నెల మొదటి వారంలో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర కొత్త ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌లో 'అమ్ ఆద్మీ'పై ప్రధానంగా దృష్టి సారించడమే కాకుండా, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న వస్త్ర పరిశ్రమను ఆదుకోనున్నట్టు ప్రణబ్ సూచన ప్రాయంగా వెల్లడించారు.
Source: జాతీయ | 26 May 2009 | 1:36 pm

ప్రజా సమస్యలపై పోరాటం: పీఆర్పీ

రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై ప్రజారాజ్యం పార్టీ పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజారాజ్యం పార్టీ నిఘా సంస్థలా పనిచేస్తుందని పీఆర్పీ మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 May 2009 | 12:58 pm

పదవుల్లో తెలంగాణకు అన్యాయం: టీఆర్ఎస్

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మంత్రి పదవుల కేటాయింపుల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆరోపించింది. పదవులన్నీ ఆంధ్ర ప్రాంతం వారికే కట్టబెట్టారంటూ ఆ పార్టీ ధ్వజమెత్తింది.
Source: ఏపీ న్యూస్ | 26 May 2009 | 12:47 pm

ప్రజా సమస్యలే అజెండాగా మహానాడు: టీడీపీ

ప్రజా సమస్యలే అజెండాగా ఈసారి మహానాడు నిర్వహించనున్నట్టు తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు తెలిపారు. దీంతోపాటు ఈసారి ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణమైన అంశాల గురించి కూడా విస్తృతంగా చర్చించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 May 2009 | 11:25 am

2011 నాటికి 'బహుళ ప్రయోజన కార్డు'లు: పీసీ

వచ్చే 2011 నాటికి 'జాతీయ జనాభా పట్టిక' (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) సిద్ధమవుతుందన్నారు. దీనితో పాటు 'మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డు' (ఎంఎన్ఐసీ-బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు)ను కూడా 2011 నాటికి ప్రతి పౌరునికి అందజేస్తామని మంత్రి చిదంబరం తెలిపారు.
Source: జాతీయ | 26 May 2009 | 11:04 am

అధినేతను ట్రైలర్లో తిలకించండి

జగపతిబాబు హీరోగా, సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం "అధినేత". కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.
Source: వినోదం | 26 May 2009 | 10:28 am