|
వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఆఫ్ బరోడావివిధ పరిపక్వత డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు వడ్డీ రేట్లను తగ్గించింది. కొత్తగా రూపొందించి వడ్డీ రేట్లలో 181 రోజల వరకు పెట్టే డిపాజిట్లపై ఈ వడ్డీ అమలు కానుంది.Source: Yahoo! Telugu: News | 26 May 2009 | 5:43 pm ఎలక్ట్రానిక్ కార్డులు: ఎంచెక్‌తో ఐసీఐసీఐ ఒప్పందంప్రముఖ మొబైల్ పేమెంట్ సేవల సంస్థ ఎంచెక్‌తో ఐసీఐసీఐ బ్యాంకు ఎలక్ట్రానిక్ కార్డుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. తన ఖాతాదారులకు ఎలక్ట్రానిక్ కార్డులు మంజూరు చేసేందుకు ఎంచెక్‌తో ఐసీఐసీఐ ఈ ఒప్పందంలోకి అడుగుపెట్టింది.Source: Yahoo! Telugu: News | 26 May 2009 | 5:39 pm పూణేలో ఐబీఎం డైనమిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్పూణేలో ఐబీఎం సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డైనమిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. పూర్తిగా భారతీయ నిపుణుల సహకారంతో దీనిని ఏర్పాటు చేసినట్లు ఐబీఎం తెలిపింది. పూణేలోని ఐబీఎం సాఫ్ట్‌వైర్ ల్యాబ్‌లోనే ఈ డైనమిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 26 May 2009 | 5:31 pm అతిపెద్ద టెలికాం ఒప్పందానికి రంగం సిద్ధంసునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌టెల్, దక్షిణాఫ్రికాకు చెందిన ఎంటీఎన్ గ్రూపు మధ్య ప్రతిపాదిత ఒప్పందం ఈ ఏడాదిలోనే అతిపెద్ద టెలికాం ఒప్పందం. 23 బిలియన్ డాలర్ల ఈ మెగా ఒప్పందం ఈ ఏడాదిలో అతిపెద్ద అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ లావాదేవీకాగా, నాలుగో అతిపెద్ద అంతర్జాతీయ ఎం అండ్ ఏ ఒప్పందంగా పరిశ్రమ వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 26 May 2009 | 5:21 pm దొంగనోటును గుర్తుపట్టండిలా...!కేంద్ర ప్రభుత్వంవారు తయారు చేసిన కరెన్సీ నోట్లకు బదులుగా ప్రస్తుతం మార్కెట్లో దొంగనోట్లు మనకు చాలానే దర్శనమిస్తున్నాయి. అయితే అలాంటి దొంగనోట్లకు, ప్రభుత్వం తయారు చేసిన నోట్లకు చాలా తేడాలున్నాయి. దొంగనోట్లలో ఉపయోగించేది నాణ్యత లేని కాగితమని బ్యాంక్ ఉన్నతాధికారులు చెపుతున్నారు. రెండింట్లోనూ చాలా తేడాలు ఉంటాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.Source: Yahoo! Telugu: News | 26 May 2009 | 5:19 pm సైన్యాన్ని పటిష్టపరచడంపై శ్రీలంక దృష్టి: ఫోన్సెకాఎల్టీటీఈపై విజయఢంకా మోగించిన శ్రీలంక మిలటరీ ఇప్పుడు సైనికుల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. దేశంలో తమిళ టైగర్లు లేదా మరే ఇతర తిరుగుబాటు సంస్థ పుంజుకోకుండా సైన్యం సంఖ్యను 100000కుపైగా పెంచాలనుకుంటున్నట్లు శ్రీలంక ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సెకా తెలిపారు. దళాల పెంపుతో లంక సైన్యం సంఖ్య 2 లక్షల నుంచి 3 లక్షలకు చేరుతుంది.Source: Yahoo! Telugu: News | 26 May 2009 | 5:09 pm తండ్రి కాబోతున్న మేల్ గిబ్సన్!ప్రముఖ హాలీవుడ్ నటుడు మేల్ గిబ్సన్ తండ్రి కాబోతున్నాడు. తన రష్యా గర్ల్ ఫ్రెండ్ ఓక్సానా గ్రిగోరీవా గర్భం ధరించిందని, త్వరలో తామిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నట్లు గిబ్సన్ స్పష్టం చేశాడు. "బ్రేవ్‌హార్ట్" నటుడైన గిబ్సన్ 8వ సారి తండ్రి కాబోతున్నాడని పీపుల్స్ మ్యాగజైన్ తెలిపింది.ఈ 53 సంవత్సరాల గిబ్సన్ తన భార్య రాబిన్‌కు మూడేళ్ల క్రితం విడాకులిచ్చాడు. ఈ నేపథ్యంలో గిబ్స్ గర్ల్ ఫ్రెండ్ ఓక్సానా గర్భం ధరించిందన్న వార్తలపై గిబ్సన్ స్పందిస్తూ.. రాబిన్‌కు, తన వివాహ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టి మూడేళ్లైందన్నాడు.Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2009 | 4:56 pm ప్రజా సమస్యలే అజెండాగా మహానాడు: టీడీపీప్రజా సమస్యలే అజెండాగా ఈసారి మహానాడు నిర్వహించనున్నట్టు తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు తెలిపారు. దీంతోపాటు ఈసారి ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణమైన అంశాల గురించి కూడా విస్తృతంగా చర్చించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 26 May 2009 | 4:54 pm పాకిస్థాన్‌కు చైనా సాయం చేయాలి: యూఎస్పాకిస్థాన్లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో పరిస్థితులపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో తాలిబాన్ తీవ్రవాదులను అణిచివేసేందుకు పాకిస్థాన్ మిలటరీ సైనిక చర్య చేపట్టిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 26 May 2009 | 4:40 pm 2011 నాటికి 'బహుళ ప్రయోజన కార్డు'లు: పీసీవచ్చే 2011 నాటికి 'జాతీయ జనాభా పట్టిక' (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) సిద్ధమవుతుందన్నారు. దీనితో పాటు 'మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డు' (ఎంఎన్ఐసీ-బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు)ను కూడా 2011 నాటికి ప్రతి పౌరునికి అందజేస్తామని మంత్రి చిదంబరం తెలిపారు.Source: Yahoo! Telugu: News | 26 May 2009 | 4:31 pm ఐసెట్ ఫలితాలను విడుదల చేసిన ఆంధ్ర వర్శిటీరాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్-2009 ఫలితాలను సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్‌హాలులో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య కేసీ.రెడ్డి విడుదల చేశారు. మొత్తం పరీక్షకు హాజరైన వారిలో 93.61 శాతం మంది అర్హత సాధించినట్టు ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 26 May 2009 | 4:06 pm అధినేతను ట్రైలర్లో తిలకించండిజగపతిబాబు హీరోగా, సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం "అధినేత". కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2009 | 3:56 pm "దమ్మున్నోడు" ట్రైలర్ మీ కోసం..రిషి, సౌమ్య హీరోహీరోయిన్లుగా నటించిన "దమ్మున్నోడు" చిత్రం విడుదలకు సిద్ధమైంది. బి.వి.వి. చౌదరి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2009 | 3:46 pm ఊహాచిత్రం ట్రైలర్‌ను వీక్షించండివంశీకృష్ణ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా, పూనెలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం "ఊహాచిత్రం". సత్య దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు పైడిబాబు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2009 | 3:38 pm ప్యారిస్ హిల్టన్‌ను పెళ్లాడనున్న రీన్ హార్డ్..!హాలీవుడ్ సెక్సీతార ప్యారిస్ హిల్టన్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. ప్యారిస్ హిల్టన్‌ను డగ్ రీన్ హార్డ్ (హిల్టన్ బాయ్ ఫ్రెండ్) ప్రేమిస్తున్నాడని, త్వరలో ఆమెతో తన ప్రేమను వెల్లడించనున్నాడని బ్రిటిష్ న్యూస్ పేపర్ మెయిల్ వెల్లడించింది. తప్పకుండా తన ప్రేమను హిల్టన్ అంగీకరిస్తుందని, ఆమె ఒప్పుకుంటే త్వరలో ఇద్దరం ఒక ఇంటివాళ్లమవుతామని రీన్ హార్డ్ తెలిపినట్లు ఆ పత్రిక పేర్కొంది. హిల్టన్ సమాధానం కోసమే ఇన్నాళ్లు వేచి ఉన్నానని, ప్యారిస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలో పెళ్లి చేసుకుంటానని రీన్ హార్డ్ తెలిపినట్లు మెయిల్ తన ప్రచురణలో వెల్లడించింది.Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2009 | 2:22 pm "రెండు పెగ్గులు" చాలంటున్న మత్తుకళ్ళ రోజా!ఆ మధ్య ఎన్నికల ప్రచారంలో ఒకనాటి సినీ నటి, తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా సాటి హీరో పవన్ కళ్యాణ్‌పై లేనిపోని విమర్శలు గుప్పించి, ప్రజల దృష్టిని బాగానే ఆకర్షించారు. పవన్ కళ్యాణ్‌ను 'కల్లు తాగే కోతి'తో పోల్చిన రోజాకు..Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2009 | 2:19 pm మేడం ఓ దమ్ము లాగండి ప్లీజ్...రాజాధిరాజా తమిళ చిత్రంలో సెక్సీ బాంబ్ ముంతాజ్ సిగార్ వెలిగించి గుండెల నిండా గట్టిగా పొగపీల్చి ముక్కులు నుంచి వదులుతుంది. ఆ సీన్ కుర్రాళ్లకు యమ కిక్కెంచేదిగా ఉందని కోడంబాక్కం సినీ వర్గాలు అంటున్నాయి. తాను సినిమాలో దమ్ము ఎలా కొట్టానో థియేటర్‌లో ప్రేక్షకుల నడుమ చూడాలని చెన్నైలోని ఓ హాలుకు వెళ్లింది ముంతాజ్. అయితే డేగ కళ్ల తమిళ తంబీలు ముంతాజ్ వెనుక కూర్చున్న విషయాన్ని పసిగట్టేశారు. చూసిందే తడవుగా, "మేడమ్... ఏది మాకోసం ఒక్కసారి దమ్ము కొట్టరూ..." అని సిగరెట్లు తీసి ముంతాజ్‌పైకి ఎగబడ్డారట. ఒక ఆకతాయి అయితే నేరుగా సిగరెట్ వెలిగించి ముంతాజ్ నోటికి అందివ్వబోయాడట. దీంతో బిత్తరపోయిన తాజ్ తనకు అలాంటి అలవాట్లు లేవనీ, సినిమా కోసం దమ్ము లాగానని వివరణలిచ్చుకుందట.Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2009 | 12:48 pm ఆనిస్టన్ మాజీ ప్రియుల మెసేజ్‌లు భద్రం!సెలబ్రిటీలకు, సినీ తారలకు చాలా మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉండటం సహజం. ఒక బాయ్‌ఫ్రెండ్‌తో కొద్ది రోజులు చెట్టాపట్టాలేసుకుని తిరిగి, బోర్‌కొడితే మరో బాయ్‌ఫ్రెండ్‌తో తిరిగే స్టార్స్ మధ్య ఆనిస్టన్ కాస్త డిఫరెంట్‌గా వ్యవహరిస్తోంది. కొత్త బాయ్‌ఫ్రెండ్ దొరికితే మాజీ ప్రియులను పట్టించుకోని ప్రస్తుత ట్రెండ్‌లో, ఆనిస్టన్ మాత్రం మాజీ ప్రియులు తనకు పంపిన మెసేజ్‌లను అలాగే భద్రపరుచుకుంటోందని కాంటాక్ట్ మ్యూజిక్ పత్రిక వెల్లడించింది. హాలీవుడ్ సూపర్ హీరో, ఏంజెలీనా భర్త బ్రాడ్‌పిట్ ఆనిస్టన్‌కు పంపిన మెసేజ్‌తో పాటు, గాయకుడు జాన్ మేయర్, మోడల్ పాల్, నటుడు విన్స్ వాగన్‌లు పంపిన మెసేజ్‌లను కూడా ఈ హాలీవుడ్ భామ ఆనిస్టన్ అలాగే సేవ్ చేసి పెట్టిందని కాంటాక్ట్ మ్యూజిక్ వెల్లడించింది.Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2009 | 12:45 pm భారీ ఆఫర్‌తో తెలుగు తెరకు దీపిక!"ఓంశాంతి.. ఓం" చిత్రంతో బాలీవుడ్ వెండితెర ప్రవేశం చేసిన ముద్దుగుమ్మ దీపికా పదుకొనే. ఈ చిత్రంలో తన నటనతో సంపాదించుకున్న పేరు అంతంతమాత్రమే అయినప్పటికీ.. భారత క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్‌లతో నడిపిన "డబుల్ గేమ్" ప్రేమ వ్యవహారం ఆమెకు మంచి పబ్లిసిటీనే తెచ్చిపెట్టింది.Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2009 | 11:34 am ప్రజా సమస్యలే అజెండాగా మహానాడు: టీడీపీప్రజా సమస్యలే అజెండాగా ఈసారి మహానాడు నిర్వహించనున్నట్టు తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు తెలిపారు. దీంతోపాటు ఈసారి ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణమైన అంశాల గురించి కూడా విస్తృతంగా చర్చించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 26 May 2009 | 11:25 am నితిన్ పర్సనల్ టచ్టాలీవుడ్ మాస్ హీరోగా "జయం" నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతున్న నటుడు నితిన్. "హీరో" చిత్రంతో డాన్స్‌తో పాటు తన ఫిజిక్‌ను 6 ప్యాక్‌గా మార్చుకున్నాడు. ఓ మాదిరిగా ఆడుతున్న తన చిత్రాలను చూసి ఈసారి రెచ్చిపోయే సక్సెస్ ఇచ్చే దిశగా కొత్త సినిమాలో నటించేందుకు నితిన్ సిద్ధమయ్యాడని సినీ వర్గాల సమాచారం. అంతేకాదు... తన తాజా చిత్రానికి "రెచ్చిపో" అనే పేరును నితిన్ పరిశీలనలో పెట్టాడని తెలిసింది. ఇకపోతే.. నితిన్ నటించిన సినిమాలు.. శ్రీ ఆంజనేయం, సై, దిల్, జయం, అల్లరి బుల్లోడు, సత్యం శివం సుందరం, టక్కరి, ఆటాడిస్తా, విక్టరీ, హీరో, ద్రోణ.పుట్టిన రోజు.. మార్చి 30,తండ్రి.. నిజాం ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఎన్. సుధాకర్ రెడ్డి.Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2009 | 11:23 am 2011 నాటికి 'బహుళ ప్రయోజన కార్డు'లు: పీసీవచ్చే 2011 నాటికి 'జాతీయ జనాభా పట్టిక' (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) సిద్ధమవుతుందన్నారు. దీనితో పాటు 'మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డు' (ఎంఎన్ఐసీ-బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు)ను కూడా 2011 నాటికి ప్రతి పౌరునికి అందజేస్తామని మంత్రి చిదంబరం తెలిపారు.Source: జాతీయ | 26 May 2009 | 11:04 am ఉగ్రవాదాన్ని ఉపేక్షించం: సబితా ఇంద్రారెడ్డిరాష్ట్రంలో ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. దీంతోపాటు మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 26 May 2009 | 10:43 am అధినేతను ట్రైలర్లో తిలకించండిజగపతిబాబు హీరోగా, సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం "అధినేత". కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.Source: వినోదం | 26 May 2009 | 10:28 am "దమ్మున్నోడు" ట్రైలర్ మీ కోసం..రిషి, సౌమ్య హీరోహీరోయిన్లుగా నటించిన "దమ్మున్నోడు" చిత్రం విడుదలకు సిద్ధమైంది. బి.వి.వి. చౌదరి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.Source: వినోదం | 26 May 2009 | 10:18 am 45కు చేరిన "ఐలా" తుఫాను మృతుల సంఖ్యపశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని ఐలా తుఫాను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారానికి 45కు చేరుకుంది. వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ప్రచండ గాలులు బెంగాల్‌లో పెను విధ్వంసాన్ని సృష్టించిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 26 May 2009 | 10:16 am ఊహాచిత్రం ట్రైలర్‌ను వీక్షించండివంశీకృష్ణ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా, పూనెలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం "ఊహాచిత్రం". సత్య దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు పైడిబాబు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.Source: వినోదం | 26 May 2009 | 10:10 am 28కి వాయిదా పడిన మంత్రివర్గ విస్తరణకేంద్ర మంత్రివర్గ విస్తరణ గురువారానికి వాయిదా పడింది. మంగళవారం సాయంత్రం జరగాల్సిన కేబినెట్ విస్తరణను తొలుత బుధవారానికి వాయిదా వేశారు. అయితే, ఈనెల 27వ తేదీ మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్థంతి కావడంతో మంత్రివర్గ విస్తరణను గురువారానికి వాయిదా వేసినట్టు పీఎంవో కార్యాలయ వర్గాలు మంగళవారం వెల్లడించాయి.Source: జాతీయ | 26 May 2009 | 9:20 am ముఖ్యమంత్రి విదేశీ పర్యటన వాయిదాముఖ్యమంత్రి వైఎస్ విదేశీ పర్యటన వాయిదా పడింది. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఇజ్రాయిల్‌కు పయనం కావాల్సిన ముఖ్యమంత్రి అనివార్య కారణాల వల్ల తన పర్యటనను బుధవారానికి వాయిదా వేసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 26 May 2009 | 9:06 am ప్రజలపై పన్నుల భారం వేయబోం: రోశయ్యప్రస్తుతం ఆర్థిక మాంద్యం తీవ్ర ప్రభావం చూపుతున్నా రాష్ట్రంలోని ప్రజలపై ఎలాంటి పన్నులభారం వేయబోమని ఆర్థికమంత్రి రోశయ్య తెలిపారు. అదేసమయంలో ఆర్థికమాంద్యం ప్రభావం కారణంగా మరికొద్దిరోజులు ఒత్తిళ్లు తప్పవని ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 26 May 2009 | 7:41 am బహిష్కరణ చర్యపై పునఃపరిశీలించాలి: అజమ్ ఖాన్‌పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడి, ఆరేళ్ళ పాటు బహిష్కరణకు గురైన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక నేత అజమ్ ఖాన్ చేసిన తప్పుకు ప్రాధేయపడుతున్నారు. పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయంపై అధిష్టానం పునఃపరిశీలన చేయాలని ఆయన తాజాగా విజ్ఞప్తి చేశారు.Source: జాతీయ | 26 May 2009 | 7:40 am మేడం ఓ దమ్ము లాగండి ప్లీజ్...రాజాధిరాజా తమిళ చిత్రంలో సెక్సీ బాంబ్ ముంతాజ్ సిగార్ వెలిగించి గుండెల నిండా గట్టిగా పొగపీల్చి ముక్కులు నుంచి వదులుతుంది. ఆ సీన్ కుర్రాళ్లకు యమ కిక్కెంచేదిగా ఉందని కోడంబాక్కం సినీ వర్గాలు అంటున్నాయి. తాను సినిమాలో దమ్ము ఎలా కొట్టానో థియేటర్‌లో ప్రేక్షకుల నడుమ...Source: వినోదం | 26 May 2009 | 7:19 am స్వైన్‌ఫ్లూ బాధితుడికి పూర్తి ఆరోగ్యంరాష్ట్రంలో తొలి స్వైన్‌ఫ్లూ కేసుగా నమోదైన వ్యక్తి వ్యాధిని హైదరాబాద్ ఛాతీ ఆసుపత్రి వైద్యులు పూర్తిగా నయం చేశారు. విదేశాలనుంచి రాష్ట్రానికి చేరుకున్న ఈ 23ఏళ్ల విద్యార్థిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు కన్పించడంతో అతడిని పరీక్షించిన వైద్యులు అతనికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టుగా నిర్థారించిన సంగతి తెలిసిందే.Source: ఏపీ న్యూస్ | 26 May 2009 | 6:54 am పంజాబ్‌లో కర్ఫ్యూ సడలింపు: తొలగని ఉద్రిక్తతవియన్నాలో చెలరేగిన ఘర్షణల కారణంగా పంజాబ్‌లో సోమవారం నుంచి విధించిన అప్రకటిత కర్ఫ్యూను మంగళవారం సడలించారు. అయితే, పలు పట్టణాల్లో పరిస్థితి మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు సాహసం చేయడం లేదు.Source: జాతీయ | 26 May 2009 | 6:32 am మంత్రులకు శాఖలు కేటాయింపు ప్రక్రియ పూర్తిరాష్ట్ర మంత్రిమండలికి సంబంధించి తొలివిడతగా ఎంపిక చేసిన 35మంది మంత్రులకు సంబంధించిన శాఖలను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంగళవారం ఖరారు చేశారు. రాష్ట్ర హోంమంత్రి పదవి తొలిసారిగా మహిళకు కేటాయించడం ఈ మంత్రిమండలికి సంబంధించి విశేషం.Source: ఏపీ న్యూస్ | 26 May 2009 | 5:51 am వేలి ముద్రలు"యువరానర్...! ఈ ముద్దాయి సుబ్బరాజును పొడిచి చంపాడనడానికి తిరుగులేని సాక్ష్యం ఈ చాకుపై ఉన్న అతని వేలిముద్రలే...!"...Source: వినోదం | 26 May 2009 | 5:26 am దొంగ మొగుడు"సాయంత్రం మా ఫ్రెండ్స్ భోజనానికొస్తారు. వెంటనే ఆ మినీ టేప్ రికార్డర్, క్యాసెట్స్, ఆ అలమారలోని పుస్తకాలన్నీ దాచేయ్..!"..Source: వినోదం | 26 May 2009 | 5:24 am శాఖల కేటాయింపులో అస్పష్టత: విస్తరణలో జాప్యం!కేంద్ర కేబినెట్ విస్తరణలో జాప్యం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ముందుగా నిర్ణయించినట్టుగా కేబినెట్ విస్తరణ మంగళవారం సాయంత్రం జరగాల్సి వుంది. అయితే, మిత్రులతో పాటు పార్టీ సభ్యులకు కేటాయించాల్సిన శాఖలపై అస్పష్టత నెలకొంది. ఫలితంగా కేబినెట్ విస్తరణను బుధవారానికి వాయిదా వేయాలని నిర్ణయించినట్టు సమాచారం.Source: జాతీయ | 26 May 2009 | 5:13 am ప్రజలు హర్షించేలా పనిచేయండి: వైఎస్కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవులు సాధించినవారు ప్రజలు హర్షించేలా పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ కోరారు. గత ప్రభుత్వంలో 14మంది మంత్రులు ఓడిపోయారని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి లోపాలకు తావివ్వకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు అభినందించేలా మంత్రులు నడుచుకోవాలని ఆయన సూచించారు.Source: ఏపీ న్యూస్ | 26 May 2009 | 4:46 am అఫ్జల్ క్షమాభిక్ష పిటిషన్‌ను పరిశీలిస్తాం: కేంద్రంపార్లమెంట్పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురు, మరణ శిక్ష ఎదుర్కొంటున్న మరో 27 మంది వ్యక్తుల క్షమాభిక్ష పిటిషన్‌ను కేంద్రం పరిశీలించనుందని హోంశాఖ మంత్రి పి.చిదంబరం తెలిపారు. చిదంబరం సోమవారం విలేకరులతో మాట్లాడుతూ అఫ్జల్, ఇతర ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలా వద్దా అనేదానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.Source: జాతీయ | 26 May 2009 | 3:44 am బెంగాల్‌లో ఐలా భీభత్సం: 23 మంది మృతిపశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఐలా తుపాను సృష్టించిన భీభత్సంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షమందిగాపైగా తుపాను బాధితులుగా మిగిలారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను, ఒరిస్సా తీర ప్రాంతాన్ని ఐలా తుఫాను అతలాకుతలం చేసింది.Source: జాతీయ | 26 May 2009 | 3:19 am ఐలా తుఫాన్: బెంగాల్‌లో 17మంది మృతిఐలా తుఫాను కోల్‌కతాను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 17మంది మృత్యువాత పడ్డారు. వందమందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు. తుఫాను తీవ్రతకు కోల్‌కతా నగరంతో సాల్ట్ లేక్ సిటీ సంబంధాలు తెగిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు నేలకూలడంతో విద్యుత్తు స్తంభించింది. నగరం గాఢాంధకారంలో మగ్గుతోంది. వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.Source: జాతీయ | 25 May 2009 | 3:08 pm పంజాబ్, హర్యానాలలో హింసాకాండ: ఇద్దరి మృతివియాన్నాలో దేరా నేత హత్య పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలకు దారితీసింది. ఈ రెండు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు కొన్ని ప్రదేశాల్లో కాల్పులు కూడా జరిపారు. దేరా నేత హత్య కారణంగా చెలరేగిన ఈ హింసాకాండలో ఇద్దరు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయిSource: జాతీయ | 25 May 2009 | 1:10 pm పార్టీని పటిష్టం చేయాలి: దత్తాత్రేయరాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగ పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 25 May 2009 | 12:34 pm నాకు వైఎస్ సమాధానం చెప్పాలి: జేసీకొత్త ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రానందుకు తానేం బాధపడడం లేదని పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అదేసమయంలో ఈసారి తనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 25 May 2009 | 11:42 am "నచ్చావ్ అల్లుడు" ట్రైలర్ మీ కోసం..సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపై ఉష సింగంశెట్టి నిర్మిస్తున్న చిత్రం "నచ్చావ్ అల్లుడు". అలీ, సుప్రేన, రవిబాబు, మలిష్క ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఎం.ఎస్. శ్రీ చంద్ దర్శకత్వం వహిస్తున్నారు.Source: వినోదం | 25 May 2009 | 11:21 am
|