ఎఫ్‌డీఐ విధానంలో మార్పు కొనసాగుతుంది

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానంలో మార్పు ఎల్లప్పుడు కొనసాగే ప్రక్రియ అని కేంద్ర కేబినెట్ సీనియర్ మంత్రి కమల్ నాథ్ సోమవారం తెలిపారు. ఎఫ్‌డీఐ విధానంలో ఎప్పటికప్పుడు కొత్త అంశాలు వస్తూనే ఉంటాయని, ఇది ఎప్పటికీ కొనసాగే ప్రక్రియ అని ఆయన అన్నారు
Source: Yahoo! Telugu: News | 25 May 2009 | 6:23 pm

పార్టీని పటిష్టం చేయాలి: దత్తాత్రేయ

రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగ పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: Yahoo! Telugu: News | 25 May 2009 | 6:03 pm

బాత్రూమ్‌లో ఛార్మి కూల్ కూల్ స్నానం

తాజాగా రూపొందిస్తున్న ఓ చిత్రంలో ఛార్మి తన అందాలన్నిటినీ ఆరబోస్తూ ఓ బాత్రూం సన్నివేశంలో స్నానం చేస్తూ నటిస్తోందట. ఏవిటీ... బాత్రూం సన్నివేశంలో నటించారా..? అని అడిగితో... చిత్రంలోని సన్నివేశానుసారం తాను స్నానం చేస్తున్నట్లుగా నటించాల్సి ఉందని చిలుక పలుకలు పలుకుతోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2009 | 5:43 pm

బీఎస్ఎన్ఎల్ నుంచి హెచ్‌సీఎల్‌కు ఐటీ కాంట్రాక్ట్

హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) నుంచి రూ.240 కోట్ల విలువైన ఐటీ కాంట్రాక్టును పొందింది. సిస్టమ్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్టును అమలు చేసేందుకు హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్‌తో బీఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో బీఎస్ఎన్ఎల్‌కు చెందిన 60 వేల ఈఆర్‌పీ లైసెన్స్‌లను హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ అమల్లోకి తేనుంది.
Source: Yahoo! Telugu: News | 25 May 2009 | 5:22 pm

నాకు వైఎస్ సమాధానం చెప్పాలి: జేసీ

కొత్త ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రానందుకు తానేం బాధపడడం లేదని పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అదేసమయంలో ఈసారి తనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Source: Yahoo! Telugu: News | 25 May 2009 | 5:12 pm

స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సోమవారం లాభాల బాటలో నిలిచింది. 101 పాయింట్ల వృద్ధితో 13988 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం దాదాపుగా రోజు మొత్తం పడిలేస్తూ కొనసాగింది. మధ్యాహ్నం లావాదేవీల్లో 141 పాయింట్లు పెరిగి 14,028 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకున్న సూచి అనంతరం మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. ఒకానొక దశలో 209 పాయింట్ల పతనంతో 13,819 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. సాయంత్రం ముగింపు సమయానికి కోలుకున్న బీఎస్ఈ సూచి 26 పాయింట్ల స్వల్ప లాభంతో 13,913 వద్ద స్థిరపడింది. ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) ఈ రోజు దాదాపుగా క్రితం ముగింపు స్థాయికే పరిమితమైంది. నిఫ్టీ ముగింపు సమయానికి ఒక పాయింట్ కోల్పోయి 4238 పాయింట్ల వద్ద నిలిచింది.
Source: Yahoo! Telugu: News | 25 May 2009 | 5:10 pm

తుఫాన్ ధాటికి కష్టాల్లో పడిన కోల్‌కతా

తుఫాన్ ధాటికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రముఖంగా కోల్‌కతాలో జన జీవనం అస్తవ్యస్తమైంది. అక్కడ పెనుదుమారం లేపిన తుఫానుకు "ఐలా" అని వాతావరణ శాఖాధికారులు నామకరణం చేశారు.
Source: Yahoo! Telugu: News | 25 May 2009 | 5:06 pm

ఊహాచిత్రం ట్రైలర్ మీ కోసం..

పూనెలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం "ఊహాచిత్రం". వంశీకృష్ణ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి సత్య దర్శకునిగా పరిచయమవుతున్నారు. పైడిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాల్లో భాగంగా డీటీఎస్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2009 | 5:05 pm

"దమ్మున్నోడు"ను ట్రైలర్లో చూడండి

రిషి, సౌమ్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "దమ్మున్నోడు". ఈ చిత్రానికి బి.వి.వి. చౌదరి దర్శకునిగా పరిచయమవుతున్నారు. వందేమాతరం శ్రీనివాసరావు సమకూర్చిన పాటలు మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2009 | 4:59 pm

"అధినేత" ట్రైలర్‌ను వీక్షించండి

మాస్ హీరో సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో తెరకెక్కిన చిత్రం "అధినేత". జగపతిబాబు హీరోగా, కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తోందని నిర్మాత అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2009 | 4:53 pm

"నచ్చావ్ అల్లుడు" ట్రైలర్‌ మీ కోసం..

సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపై ఉష సింగంశెట్టి నిర్మిస్తున్న చిత్రం "నచ్చావ్ అల్లుడు". అలీ, సుప్రేన, రవిబాబు, మలిష్క ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఎం.ఎస్. శ్రీ చంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2009 | 4:48 pm

మింగోరాలో దాడులు నిలిపివేసిన తాలిబాన్లు

పాకిస్థాన్‌లోని సమస్యాత్మక స్వాత్ లోయ ప్రధాన పట్టణమైన మింగోరాలో మిలటరీపై దాడులు నిలిపివేయాలని తాలిబాన్లు నిర్ణయించారు. పట్టణంలో తాలిబాన్ తీవ్రవాదులకు, పాక్ సైన్యానికి మధ్య జరుగుతున్న పోరులో అమాయక పౌరులు బలవుతుండటంతోపాటు, పెద్దఎత్తున విధ్వంసం జరుగుతోంది.
Source: Yahoo! Telugu: News | 25 May 2009 | 4:40 pm

జామ్‌నగర్ వైమానిక స్థావరంలో ఇజ్రాయేల్ అవాక్స్

భారత్ సోమవారం ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (ఏడబ్ల్యూఏసీఎస్)ను పొందింది. ఆకాశ నేత్రంగా కీర్తించబడుతున్న ఈ అవాక్స్‌ను "ఫాల్కోన్" పేరుతో ఇజ్రాయేల్ తయారు చేసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్ వైమానిక స్థావరానికి అవాక్స్ చేరడంతో దక్షిణాసియా దీనిని పొందిన తొలి దేశంగా భారత్‌కు గుర్తింపు లభించింది.
Source: Yahoo! Telugu: News | 25 May 2009 | 4:04 pm

మంత్రి పదవి రాలేదని బాధలేదు: జానారెడ్డి

గత ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసినా కొత్త ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రానందుకు తానేం బాధపడడం లేదని మాజీ హోంమంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి రాకున్నా ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజల కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 25 May 2009 | 4:01 pm

అమ్మకాల ఒత్తిడి: నష్టాల్లో సెన్సెక్స్

అమ్మకాల ఒత్తిడితో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. పెట్టుబడిదారులు అమ్మకాలవైపు మొగ్గు చూపడం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో... బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 12 పాయింట్లు స్వల్పంగా క్షీణించి, 13899 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 8 పాయింట్ల కోల్పోయి, 4230 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 25 May 2009 | 3:49 pm

అంతర్జాతీయ వేదికపై ముచ్చటగా మూడోసారి..!

బాలీవుడ్ సినీజగత్తులో ఎప్పటికప్పుడు హాట్‌-హాట్‌ ఎఫైర్స్‌ నడుపుతూ, ఏదో ఒకరకంగా తన పేరు మీడియాలో నలిగేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ..బాలీవుడ్‌ ప్రపంచంలో తన హవా నడిపిస్తున్న కరీనా కపూర్‌ ముచ్చటగా మూడోసారి అంతర్జాతీయ వేదికపై తనదైన నృత్యంతో ఆహుతులను అలరించనున్నది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2009 | 12:53 pm

పార్టీని పటిష్టం చేయాలి: దత్తాత్రేయ

రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగ పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2009 | 12:34 pm

ఆ క్రిడిట్ నాకే దక్కుతుంది: హన్సిక

"దేశముదురు" చిత్రం ద్వారా టాలీవుడ్ చిత్ర సీమకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ హన్సిక. టాలీవుడ్‌లో తన అందచందాలతో ఓ వెలుగు వెలుగుతున్న హన్సిక ఏమంటుందంటే..? తాను ముదురు రంగుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని చెబుతోంది. గోళ్ళ రంగు, లిప్‌స్టిక్‌లు ముదురురంగువే వేసుకుంటానని హన్సిక అంటోంది. టాలీవుడ్‌లో అంతకుముందుకు ముదురు రంగులు వేసుకోవడానికి హీరోయిన్లు దూరంగా ఉండేవారట. కానీ ఈ మధ్య అందరూ ఇలాంటి రంగుల్ని వేసుకోడానికి ఇష్టపడుతున్నారని తన మేకప్ మేన్ చెబుతుంటే ఆ క్రిడిట్ తనదేనని హన్సిక మురిసిపోతుందట.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2009 | 12:29 pm

సిద్ధార్థ "ఓయ్" ఆడియో విడుదల

సిద్ధార్థ హీరోగా షామిలి కథానాయికగా నటిస్తోన్న చిత్రం "ఓయ్". డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్‌రంగ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఇటీవల రామానాయుడు స్టూడియోలో విడుదలైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2009 | 12:05 pm

నాకు వైఎస్ సమాధానం చెప్పాలి: జేసీ

కొత్త ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రానందుకు తానేం బాధపడడం లేదని పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అదేసమయంలో ఈసారి తనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2009 | 11:42 am

మూడో షెడ్యూల్లో "అబ్బో... వాడా..!"

బ్రహ్మాజీ, రేఖాశ్రీ హీరోహీరోయిన్లుగా, శ్రీ కుమారస్వామి ఫిలిమ్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న కొత్త సినిమాకు "అబ్బో.. వాడా" అనే పేరును ఖరారు చేశారు. రత్నం కె.వి.దర్శకత్వంలో ఎస్. బసవపున్నయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం, ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2009 | 11:41 am

తుఫాన్ ధాటికి కష్టాల్లో పడిన కోల్‌కతా

తుఫాన్ ధాటికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రముఖంగా కోల్‌కతాలో జన జీవనం అస్తవ్యస్తమైంది. అక్కడ పెనుదుమారం లేపిన తుఫానుకు "ఐలా" అని వాతావరణ శాఖాధికారులు నామకరణం చేశారు.
Source: జాతీయ | 25 May 2009 | 11:36 am

అర్థశతదినోత్సవ వేడుకల్లో "బిల్లా"

గోపీకృష్ణా మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా నటించిన "బిల్లా" చిత్రం అర్థశతదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ క్రాస్‌రోడ్‌లోని దేవి థియేటర్‌లో, రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఫ్యాన్స్ అధ్యక్షుడు గోవిందరావు సారథ్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 May 2009 | 11:20 am

జామ్‌నగర్ వైమానిక స్థావరంలో ఇజ్రాయేల్ అవాక్స్

భారత్ సోమవారం ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (ఏడబ్ల్యూఏసీఎస్)ను పొందింది. ఆకాశ నేత్రంగా కీర్తించబడుతున్న ఈ అవాక్స్‌ను "ఫాల్కోన్" పేరుతో ఇజ్రాయేల్ తయారు చేసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్ వైమానిక స్థావరానికి అవాక్స్ చేరడంతో దక్షిణాసియా దీనిని పొందిన తొలి దేశంగా భారత్‌కు గుర్తింపు లభించింది.
Source: జాతీయ | 25 May 2009 | 10:35 am

మంత్రి పదవి రాలేదని బాధలేదు: జానారెడ్డి

గత ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసినా కొత్త ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రానందుకు తానేం బాధపడడం లేదని మాజీ హోంమంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి రాకున్నా ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజల కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2009 | 10:31 am

ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు మృతి

నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మితిమీరిన వేగం కారణంగా బస్సు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం, మాడ్గులపల్లి వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది.
Source: ఏపీ న్యూస్ | 25 May 2009 | 9:24 am

డీఎంకే లోక్‌సభ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయన్

డీఎంకే లోక్‌సభ పార్లమెంటరీ పార్టీ నేతగా నాగపట్నం ఎంపీ ఏకేఎస్ విజయన్‌ను నియమితులయ్యారు. తొలిసారి ఎంపీగా ఎన్నికయిన టికేఎస్ ఇళంగోవన్‌ను విప్‌గా నియమిస్తున్నట్లు డీఎంకే సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Source: జాతీయ | 25 May 2009 | 9:21 am

మావోల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం పూర్తి

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్ర నేతలు పటేల్ సుధాకరరెడ్డి, వెంకటయ్య మృతదేహాలకు సోమవారం రీ పోస్టుమార్టం పూర్తయ్యింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 25 May 2009 | 7:58 am

దేరా అధిపతి హత్య: పంజాబ్‌లో ఉద్రిక్తత

వియన్నాలో జరిగిన దేరా గురువు హత్య సోమవారం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పంజాబ్, హర్యానాలోని చాలా ప్రాంతాలకు దేరా గురువు హత్యపై జరుగుతున్న ఆందోళన విస్తరించింది. ఆందోళనకారులు పెద్దఎత్తున విధ్వంస చర్యలకు దిగారు. దీంతో అధికారిక యంత్రాంగం జలంధర్ నగరం, పరిసర ప్రాంతాల్లోకి ఆర్మీని పిలిపించింది.
Source: జాతీయ | 25 May 2009 | 7:55 am

కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చిదంబరం

కేంద్ర హోంమంత్రిగా పళనియప్పన్. చిదంబరం రెండవసారి పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ నెల 22వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్‌తోబాటు 19మంది మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిన విషయం విదితమే. ఇందులో హోంమంత్రిగా ఆయన సోమవారం పదవీ బాధ్యతలను చేపట్టారు.
Source: జాతీయ | 25 May 2009 | 7:11 am

ఆ క్రిడిట్ నాకే దక్కుతుంది: హన్సిక

"దేశముదురు" చిత్రం ద్వారా టాలీవుడ్ చిత్ర సీమకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ హన్సిక. టాలీవుడ్‌లో తన అందచందాలతో ఓ వెలుగు వెలుగుతున్న హన్సిక ఏమంటుందంటే..? తాను ముదురు రంగుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని చెబుతోంది.
Source: వినోదం | 25 May 2009 | 7:00 am

వియన్నాలోని గురుద్వారలో దాడులు: ఒకరి మృతి

వియన్నాలోని గురుద్వారలో ప్రవచనాలు జరుగుతున్న సమయంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయుధాలతోకూడిన సిక్కు సమూహం దాడులకు పాల్పడింది. ఈ దాడిలో సిక్కు గురువు మృతి చెందగా దాదాపు 30మంది తీవ్రగాయాలుకు గురికాగా మరో తొమ్మిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Source: జాతీయ | 25 May 2009 | 6:29 am

ఉద్యమబాట వీడబోము: కేసీఆర్ స్పష్టం

ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలంగాణ సాధనకోసం తాము ఉద్యమబాట వీడబోమని తెలంగాణ రాష్ట్ర సమతి (టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక్క ఎదురుదెబ్బతో తాము గిలగిలలాడబోమని, ముందుకంటే కరుకుగా, మొండిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2009 | 6:12 am

మట్టి పెళ్లలు విరిగిపడి 12మంది మృతి

ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పని చేస్తున్న కూలీలపై హఠాత్తుగా మట్టి పెళ్లలు విరిగిపడిన ఘటనలో 12మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు ఈ ప్రమాదంనుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 May 2009 | 4:57 am

సమాజ్‌వాదీ నుంచి ఆరేళ్లపాటు ఖాన్ బహిష్కరణ

సమాజ్‌వాదీ (ఎస్పీ) సీనియర్ నేత మొహమ్మద్ అజం ఖాన్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగించినందుకు అజం ఖాన్‌ను ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నామని సమాజ్‌వాదీ ఆదివారం ప్రకటించింది.
Source: జాతీయ | 25 May 2009 | 4:41 am

పదవులపై కాంగ్రెస్- డీఎంకే వివాదానికి తెర

కేంద్రంలో కొత్తగా ఏర్పాటయిన యూపీఏ కూటమి మంత్రివర్గంలో పదవులపై కాంగ్రెస్, డీఎంకేల మధ్య ఏర్పడిన వివాదానికి పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలోకి ముగ్గురు ప్రతినిధులను చేర్చేందుకు ఆదివారం డీఎంకే అంగీకరించడంతో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు సద్దుమణగనున్నాయి.
Source: జాతీయ | 25 May 2009 | 3:53 am

చేయందుకున్న డీఎంకే

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు ఎట్టకేలకు ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా బెట్టు చూపిన ఆ పార్టీ ఆదివారం కేంద్రమంత్రివర్గంలో చేరేందుకు సయోధ్య కుదుర్చుకుంది
Source: జాతీయ | 24 May 2009 | 12:45 pm

బంగాళాఖాతంలో వాయుగుండం

బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చింది. దీంతో తమిళనాడులోని కడలూరు, తూత్తుకుడి ప్రాంతాలవద్ద తీరం దాటే అవకాశం ఉందని, దీంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 24 May 2009 | 11:56 am

నాసిక్‌నుంచి ఇక్కడకు తీసుకువచ్చి చంపారు: కూరరాజన్న

మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు పటేల్‌ సుధాకర్‌రెడ్డిని మహారాష్టల్రోని నాసిక్‌ మూడు రోజుల క్రితం పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి చంపారని జనశక్తి అగ్రనేత కూర రాజన్న అన్నారు
Source: ఏపీ న్యూస్ | 24 May 2009 | 11:19 am