|
బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు 590 మిలియన్ డాలర్ల నష్టంబ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు మార్చి 2009తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 375 మిలియన్ పౌండ్ల (590 మిలియన్ డాలర్లు, 425 మిలియన్ యూరోలు) నష్టం వాటిల్లింది. అంతకుముందు ఏడాది బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు 712 మిలియన్ పౌండ్ల వార్షిక లాభాన్ని ఆర్జించింది.Source: Yahoo! Telugu: News | 23 May 2009 | 4:30 pm మంత్రి పదవులపై త్వరలో నిర్ణయం: కరుణానిధికేంద్రంలో కొత్తగా కొలువుతీరిన యూపీఏ కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్‌తో తలెత్తిన విభేదాలను పరిష్కరించే దిశగా డీఎంకే ఉన్నతస్థాయి కమిటీ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు.Source: Yahoo! Telugu: News | 23 May 2009 | 4:26 pm కృష్ణకు విదేశాంగ శాఖ: మమత చేతిలో రైల్వేస్కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన యూపీఏ కూటమి ప్రభుత్వంలో విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఎస్ఎం కృష్ణను శనివారం విదేశాంగ శాఖ మంత్రిగా నియమించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ బాధ్యతలను ప్రణబ్ ముఖర్జీకి ఇవ్వాలని నిర్ణయించడంతో, గత ప్రభుత్వ హయాంలో ఆయన నిర్వహించిన విదేశాంగ శాఖను ఎస్ఎం కృష్ణకు అప్పగించారు.Source: Yahoo! Telugu: News | 23 May 2009 | 3:23 pm అదనపు సిబ్బందిని తొలగించనున్న సత్యం...!సత్యం కంప్యూటర్స్ సంస్థలో దాదాపు 10వేల మంది ఉద్యోగులు(బెంచ్ పై) అధికంగా ఉన్నారని కంపెనీ బాధ్యతలను చేపట్టిన నూతన యజమాని టెక్ మహీంద్రా ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 23 May 2009 | 3:18 pm ముఖ్యమంత్రిని కలిసిన డీజీపీ యాదవ్డీజీపీగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ఎస్ఎస్పీ యాదవ్ శనివారం ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో డీజీపీ యాదవ్‌ను ఎన్నికల సంఘం తాత్కాలికంగా పదవినుంచి తొలగించిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 23 May 2009 | 3:15 pm నేడు సొంత నియోజకవర్గాలకు వైఎస్, బాబుముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులు శనివారం తమ సొంత నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.Source: Yahoo! Telugu: News | 23 May 2009 | 2:49 pm బ్రెజిల్‌లో విమాన ప్రమాదం: 11 మంది మృతిబ్రెజిల్ వాయువ్య తీర ప్రాంతంలో శుక్రవారం రాత్రి రెండు ఇంజిన్ల విమానం ఒకటి ప్రైవేట్ ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారని బ్రెజిల్ అధికారులు వెల్లడించినట్లుగా ప్రభుత్వ మీడియా పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 23 May 2009 | 2:42 pm సెన్సెక్స్ 14.1 శాతం వృద్ధి: 17 ఏళ్లలో ఇదే బెస్ట్బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం నాటి ముగింపులో 1.1 శాతం లాభపడింది. వారం మొత్తంపై తీసుకుంటే 14.1 శాతం మేరకు సెన్సెక్స్ వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. 17 సంవత్సరాల్లో ఈ వృద్ధే ఉత్తమమైనదిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 23 May 2009 | 1:26 pm పదిశాతం లాభాలు పెంచుకున్న ఐటీసీప్రస్తుతం ఆర్థికమాంద్యంతో అతలాకుతలమౌతున్న మార్కెట్లో ఐటీసీ పదిశాతం లాభాలను పెంచుకుంది. నిరుడు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికాంతానికి పది శాతం లాభాలను పెంచుకుందని కంపెనీ ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 23 May 2009 | 1:26 pm జూన్ 1 నుంచి పార్లమెంట్ తొలి సమావేశాలుప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో శనివారం జరిగిన తొలి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జూన్ 1 నుంచి పార్లమెంట్ మొదటి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పార్లమెంట్ సమావేశాలు వారం రోజులపాటు జరుగుతాయని కేబినెట్ భేటి అనంతరం కాంగ్రెస్ నేత పి.చిదంబరం విలేకరులతో చెప్పారు.Source: Yahoo! Telugu: News | 23 May 2009 | 1:18 pm కాజల్ సిస్టర్ వచ్చేస్తుందోచ్..!టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. చందమామ, సరోజ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు సంపాదించిన కాజల్, తన సోదరి నిషాను, మెగాస్టార్ తనయుడు, చిరుత హీరో రామ్ చరణ్ తేజ సరసన నటింపజేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోసెషన్ కూడా పూర్తయిందని, త్వరలో నిషా అగర్వాల్ "మగధీర"తో కలిసి సన్నివేశాల చిత్రీకరణకు సై అంటోందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 23 May 2009 | 12:17 pm స్పైడర్ మ్యాన్-3 హీరోయిన్ లూసీ గోర్డెన్ మృతిహాలీవుడ్ సూపర్ హిట్ మూవీ స్పైడర్ మ్యాన్-3లో రిపోర్టర్ జెన్నీఫర్ డుగాన్ పాత్రను పోషించిన బ్రిటీష్ నటి లూసీ గోర్డెన్ కన్నుమూశారు. ఈ నెల 20వ తేదీన లూసీ ఆత్మహత్యకు పాల్పడినట్లు బ్రిటన్ పత్రికలు వెల్లడించాయి. ప్యారిస్‌లోని లూసీ స్వగృహంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. లూసీ తన ఫ్లాట్‌లోనే ఉరివేసుకుందని ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి తగిన కారణాలేంటి? అనే అంశంపై దర్యాప్తు జరుపుతున్నామని ప్యారిస్ పోలీసులు వివరించారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 May 2009 | 11:51 am జూన్ 5న వస్తోన్న "కావ్యాస్ డైరీ"మంజుల, ఛార్మీ, శశాంక్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న "కావ్యాస్ డైరీ" చిత్రం జూన్ ఐదో తేదీన విడుదల కానుంది. వి.కె. ప్రకాష్ దర్శకత్వంలో, ఇందిర ప్రొడక్షన్స్‌పై సంజయ్ స్వరూప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మంజుల మాట్లాడుతూ.. విభిన్నమైన టైటిల్‌తో "కావ్యాస్ డైరీ" ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. ఛార్మీకి ఈ చిత్రంలోని పాత్ర మంచి గుర్తింపును సంపాదించిపెడుతుందని మంజుల నమ్మకం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 May 2009 | 11:07 am మంత్రి పదవులపై త్వరలో నిర్ణయం: కరుణానిధికేంద్రంలో కొత్తగా కొలువుతీరిన యూపీఏ కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్‌తో తలెత్తిన విభేదాలను పరిష్కరించే దిశగా డీఎంకే ఉన్నతస్థాయి కమిటీ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు.Source: జాతీయ | 23 May 2009 | 10:56 am "విక్రమ్ రాథోడ్"గా శరత్ కుమార్శరత్కుమార్ తమిళంలో నటించిన ఓ చిత్రాన్ని "విక్రమ్ రాథోడ్"గా స్నేహలత ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఎస్. యువరాణి, ఎస్. రాజేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ. వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 May 2009 | 10:47 am కృష్ణకు విదేశాంగ శాఖ: మమత చేతిలో రైల్వేస్కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన యూపీఏ కూటమి ప్రభుత్వంలో విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఎస్ఎం కృష్ణను శనివారం విదేశాంగ శాఖ మంత్రిగా నియమించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ బాధ్యతలను ప్రణబ్ ముఖర్జీకి ఇవ్వాలని నిర్ణయించడంతో, గత ప్రభుత్వ హయాంలో ఆయన నిర్వహించిన విదేశాంగ శాఖను ఎస్ఎం కృష్ణకు అప్పగించారు.Source: జాతీయ | 23 May 2009 | 10:16 am జూన్ 1 నుంచి పార్లమెంట్ తొలి సమావేశాలుప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో శనివారం జరిగిన తొలి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జూన్ 1 నుంచి పార్లమెంట్ మొదటి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పార్లమెంట్ సమావేశాలు వారం రోజులపాటు జరుగుతాయని కేబినెట్ భేటి అనంతరం కాంగ్రెస్ నేత పి.చిదంబరం విలేకరులతో చెప్పారు.Source: జాతీయ | 23 May 2009 | 7:49 am కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాని పిలుపుకేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వాధినేతగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శనివారం ఉదయం కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పాటయిన యూపీఏ కూటమి ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ వరుసగా రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 23 May 2009 | 6:21 am డీఎంకే తిరిగి వస్తుంది: ప్రధాని ఆశాభావంమంత్రి పదవులపై ఇరుపార్టీల మధ్య ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవతాయని, కేంద్ర మంత్రివర్గంలోకి తిరిగి డీఎంకే అడుగుపెడుతుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పదవుల సర్దుబాటులో కాంగ్రెస్, డీఎంకే మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.Source: జాతీయ | 23 May 2009 | 4:56 am ఆర్థిక వ్యవస్థ, పాక్‌లే కొత్త ప్రభుత్వానికి సవాళ్లుకేంద్రంలో తిరిగి ఏర్పాటయిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ, పాకిస్తాన్‌లే ప్రధాన సవాళ్లని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. మన్మోహన్ సింగ్ శుక్రవారం వరుసగా రెండోసారి దేశ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 23 May 2009 | 4:55 am సెన్సార్ పూర్తి చేసుకున్న "లైఫ్ స్టైల్"యస్. ఎమ్. సినీ మ్యాక్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ మాధవ్ పట్నాయక్ నిర్మిస్తున్న "లైఫ్‌స్టైల్" చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. నిశ్చల్, మీనాక్షిదీక్షిత్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అభిరామ్, కార్తీక్, మోనాలి చౌదరి, అనన్య, బ్రహ్మానందం, గిరిబాబు, మేల్కొటే, అనంత్, శివపార్వతి, సన అంబటి శీను తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2009 | 6:27 pm "పిస్తా" శ్రేయ.. ము..ము... ముద్దంటే చేదా..శ్రేయ హాలీవుడ్ రేంజ్‌ను దాటిపోయేటట్లు కనిపిస్తోంది. సొగసులు ఆరబోతలో అగ్రస్థానంలో నిలిచిన ఈ జాణ తాజాగా "పిస్తా" చిత్రంలో విశాల్ పెదవులతో తన పెదవులను బిగించింది. చిత్రంలో కథానుసారంగా, సన్నివేశం డిమాండ్‌ను అనుసరించి విశాల్ పెదవులతో ముడి వేయాల్సి వచ్చిందని ముద్దిచ్చిన హీరోయిన్ల మాదిరే శ్రేయ కూడా చెపుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదనుకోండి.Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2009 | 6:00 pm 29న "ఏంజెల్స్ అండ్ డెమన్స్" విడుదలకొలంబియా పిక్టర్స్, ఇమాజిన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై థ్రిల్లర్ మూవీగా రూపుదిద్దుకుంటోన్న "ఏంజెల్స్ అండ్ డెమన్స్" చిత్రం ఈ నెల 29వ తేదీన భారత్‌లో విడుదల కానుంది. హాలీవుడ్ కథానాయకుడు టామ్ హాంక్స్ నటించిన ఈ చిత్రాన్ని బ్రియాన్ గ్రాజర్ మరియు జాన్ కల్లీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో వివాదాస్పదమయిన "ది డావిన్సీ కోడ్" చిత్రానికి ఏంజెల్స్ అండ్ డెమన్స్ ముందు భాగం (ప్రీక్వెల్). ప్రస్తుతం ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వేసవి కానుకగా ఈ నెల 29వ తేదీన సినిమాను భారత్‌లో విడుదల చేయనున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2009 | 5:34 pm అమీర్ ఖాన్ సరసన కేట్ విన్‌స్లెట్..!బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సరసన ఆస్కార్ నటి కేట్ విన్‌స్లెట్ నటించనుంది. "తోబా తెక్ సింగ్" ఆధారంగా ఈ అంతర్జాతీయ చిత్రం రూపొందుతున్నట్లు ఫిమేల్ ఫస్ట్ పత్రిక తెలిపింది. 1947లో జరిగిన దేశ విభజన ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్ మానసిక వైకల్యం గల వ్యక్తి పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీపా మెహతా దర్శకత్వంలోని "ఎర్త్-1947"లో అమీర్ మానసిక వైకల్యం గల పాత్రను పోషించాడు. ఈ నేపథ్యంలో కేట్ విన్‌స్లెట్‌తో జంటగా నటించబోతున్న ఈ సినిమాను భారత సంతతికి చెందిన పాన్ నళిన్ దర్శకత్వం వహించనున్నారని ఫిమేల్ ఫస్ట్ పత్రిక పేర్కొంది.Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2009 | 3:14 pm బెంగాల్‌కే కమలిని తిరుగుముఖం..!?ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల "ఆనంద్" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పశ్చిమ బెంగాల్ ముద్దుగుమ్మ కమలిని ముఖర్జీ. గోదావరి, మీనాక్షి, స్టైల్ వంటి చిత్రాల్లో నటించిన కమలినికి "గమ్యం" మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. తాజాగా గోపి గోపిక గోదావరి, పోలీస్ పోలీస్ సినిమాల్లో నటిస్తోన్న ఈ వాలు కనుల కమలినికి ఈ మధ్య ఛాన్సులు అంతగా రావడం లేదని సినీ వర్గాల్లో టాక్. తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో హోమ్లీ హీరోయిన్‌గా ముద్రవేసుకున్న ఈ భామ చేతిలో అంతగా సినిమాలు లేవని తెలిసింది. దీంతో కమలిని తన స్వస్థలమైన బెంగాల్‌కే తిరుగుముఖం పట్టనుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2009 | 2:25 pm కొలువుదీరిన మన్మోహనుడి కొత్త ప్రభుత్వంకేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా శుక్రవారం సాయంత్రం 6.35 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తర్వాత కేంద్ర మంత్రిగా పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేశారు.Source: జాతీయ | 22 May 2009 | 2:07 pm ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్న అద్వానీమన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం శుక్రవారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఆ పార్టీ ప్రతిపక్ష నేత ఎల్‌కే.అద్వానీ హాజరుకానున్నారు.Source: జాతీయ | 22 May 2009 | 1:12 pm సెన్సార్ పూర్తి చేసుకున్న "లైఫ్ స్టైల్"యస్. ఎమ్. సినీ మ్యాక్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ మాధవ్ పట్నాయక్ నిర్మిస్తున్న "లైఫ్‌స్టైల్" చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. నిశ్చల్, మీనాక్షిదీక్షిత్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అభిరామ్, కార్తీక్, మోనాలి చౌదరి, అనన్య, బ్రహ్మానందం, గిరిబాబు...Source: వినోదం | 22 May 2009 | 12:58 pm డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన యాదవ్రాష్ట్ర డీజీపీగా శుక్రవారం ఎస్ఎస్పీ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేశారన్న ఆరోపణలతో ఎన్నికల సంఘం యాదవ్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టిన సంగతి తెలిసిందే.Source: ఏపీ న్యూస్ | 22 May 2009 | 12:51 pm 'కరుణ'తో రాయబారానికి మధ్యవర్తిగా 'ఆజాద్'కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శనివారం చెన్నై పర్యటనకు రానున్నారు. మంత్రి పదవులపై డీఎంకే- కాంగ్రెస్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దేశ రాజధానిలో గురువారం జరిగిన చర్చల్లో డీఎంకే ప్రతిపాదనలకు కాంగ్రెస్ ససేమిరా అనడంతో ఆ పార్టీ అధినేత కరుణానిధి ఈ రోజు చెన్నై తిరిగివచ్చారు.Source: జాతీయ | 22 May 2009 | 12:18 pm బాదామి చాళుక్యులు ఏలిన "ఆలంపూర్"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామం పేరే "ఆలంపూర్". ఇదే పేరుతోనే గల ఓ మండలానికి ఆలంపూర్ కేంద్రం కూడా. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాంతాన్ని... సుమారు ఆరవ శతాబ్ద మధ్య కాలం నుండి రెండువందల సంవత్సరాలపాటు బాదామి చాళుక్యులు పరిపాలించారు.Source: వినోదం | 22 May 2009 | 12:02 pm 19 మందితో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంమన్మోహన్ సింగ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం 19 మందితో కొలువుదీరనుంది. మంత్రి పదవులపై మిత్రపక్షం డీఎంకే పెట్టిన పేచీని బేఖాతర్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం, ముందుగా నిర్ణయించినట్టుగా శుక్రవారం సాయంత్రం కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.Source: జాతీయ | 22 May 2009 | 11:54 am
|