|
కొలువుదీరిన మన్మోహనుడి కొత్త ప్రభుత్వంకేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా శుక్రవారం సాయంత్రం 6.35 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తర్వాత కేంద్ర మంత్రిగా పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేశారు.Source: Yahoo! Telugu: News | 22 May 2009 | 6:40 pm సెన్సార్ పూర్తి చేసుకున్న "లైఫ్ స్టైల్"యస్. ఎమ్. సినీ మ్యాక్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ మాధవ్ పట్నాయక్ నిర్మిస్తున్న "లైఫ్‌స్టైల్" చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. నిశ్చల్, మీనాక్షిదీక్షిత్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అభిరామ్, కార్తీక్, మోనాలి చౌదరి, అనన్య, బ్రహ్మానందం, గిరిబాబు, మేల్కొటే, అనంత్, శివపార్వతి, సన అంబటి శీను తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2009 | 6:27 pm విన్నూత ధర హామీ పథకాన్ని ప్రారంభించి దోషిచెన్నైకి చెందిన ప్రముఖ నివాస, వ్యాపార నిర్మాణాల సంస్థ దోషి హౌసింగ్ లిమిటెడ్ తొలిసారి నగరంలో విన్నూత్న ధర హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం దోషి ప్రస్తుతం కొనసాగిస్తున్న ప్రాజెక్టులకు కూడా వర్తింపజేసింది. చెన్నైలోని తాంబరం పరిసరాల్లో దోషి హౌసింగ్ నక్షత్రా 1, 2 ప్రాజెక్టులు నిర్మిస్తోంది.Source: Yahoo! Telugu: News | 22 May 2009 | 6:25 pm డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన యాదవ్రాష్ట్ర డీజీపీగా శుక్రవారం ఎస్ఎస్పీ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేశారన్న ఆరోపణలతో ఎన్నికల సంఘం యాదవ్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 22 May 2009 | 6:20 pm బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు 590 మిలియన్ డాలర్ల నష్టంబ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు మార్చి 2009తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 375 మిలియన్ పౌండ్ల (590 మిలియన్ డాలర్లు, 425 మిలియన్ యూరోలు) నష్టం వాటిల్లింది. అంతకుముందు ఏడాది బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు 712 మిలియన్ పౌండ్ల వార్షిక లాభాన్ని ఆర్జించింది.Source: Yahoo! Telugu: News | 22 May 2009 | 6:07 pm "పిస్తా" శ్రేయ.. ము..ము... ముద్దంటే చేదా..శ్రేయ హాలీవుడ్ రేంజ్‌ను దాటిపోయేటట్లు కనిపిస్తోంది. సొగసులు ఆరబోతలో అగ్రస్థానంలో నిలిచిన ఈ జాణ తాజాగా "పిస్తా" చిత్రంలో విశాల్ పెదవులతో తన పెదవులను బిగించింది. చిత్రంలో కథానుసారంగా, సన్నివేశం డిమాండ్‌ను అనుసరించి విశాల్ పెదవులతో ముడి వేయాల్సి వచ్చిందని ముద్దిచ్చిన హీరోయిన్ల మాదిరే శ్రేయ కూడా చెపుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదనుకోండి.Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2009 | 6:00 pm 'కరుణ'తో రాయబారానికి మధ్యవర్తిగా 'ఆజాద్'కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శనివారం చెన్నై పర్యటనకు రానున్నారు. మంత్రి పదవులపై డీఎంకే- కాంగ్రెస్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దేశ రాజధానిలో గురువారం జరిగిన చర్చల్లో డీఎంకే ప్రతిపాదనలకు కాంగ్రెస్ ససేమిరా అనడంతో ఆ పార్టీ అధినేత కరుణానిధి ఈ రోజు చెన్నై తిరిగివచ్చారు.Source: Yahoo! Telugu: News | 22 May 2009 | 5:48 pm ఎల్టీటీఈతో పోరు: 6,200 మంది సైనికుల మృతిఎల్టీటీఈతో జరిగిన చివరిదశ పోరులో 6,200 మంది సైనికులు మృతి చెందినట్టు శ్రీలంక రక్షణశాఖ ప్రకటించింది. దీంతో పాటు ఈ పోరు సందర్భంగా మరో 30,000మంది వరకు గాయపడినట్టు ఆశాఖ పేర్కొంది. గత 25 ఏళ్లుగా ఎల్టీటీఈతో లంక జరుపుతోన్న ఈ పోరులో చివరిదశ పోరు గత 2006 జులైలో ప్రారంభమైంది.Source: Yahoo! Telugu: News | 22 May 2009 | 5:40 pm 29న "ఏంజెల్స్ అండ్ డెమన్స్" విడుదలకొలంబియా పిక్టర్స్, ఇమాజిన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై థ్రిల్లర్ మూవీగా రూపుదిద్దుకుంటోన్న "ఏంజెల్స్ అండ్ డెమన్స్" చిత్రం ఈ నెల 29వ తేదీన భారత్‌లో విడుదల కానుంది. హాలీవుడ్ కథానాయకుడు టామ్ హాంక్స్ నటించిన ఈ చిత్రాన్ని బ్రియాన్ గ్రాజర్ మరియు జాన్ కల్లీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో వివాదాస్పదమయిన "ది డావిన్సీ కోడ్" చిత్రానికి ఏంజెల్స్ అండ్ డెమన్స్ ముందు భాగం (ప్రీక్వెల్). ప్రస్తుతం ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వేసవి కానుకగా ఈ నెల 29వ తేదీన సినిమాను భారత్‌లో విడుదల చేయనున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2009 | 5:34 pm 1.5 లక్షల కోట్ల వ్యాపారం మా లక్ష్యం: ఆంధ్రాబ్యాంక్రానున్న సంవత్సరం సెప్టెంబరుకు దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేయాలని ఆంధ్రాబ్యాంకు ప్రణాళికలు రూపొందించింది. ఆంధ్రాబ్యాంక్ 2010 సెప్టెంబర్ నెల చివరికి ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేయాలని, దీనికి సంబంధించి తాము ఎన్నో కొత్త ప్రణాళికలు రూపొందించామని బ్యాంక్ అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.ఎస్. రెడ్డి తెలిపారు.Source: Yahoo! Telugu: News | 22 May 2009 | 5:29 pm ఎట్టకేలకు వారాంతంలో లాభాలతో ముగిసిన సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు వారాంతంలో లాభాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 151 పాయింట్లు లాభపడి 13,887 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 28 పాయింట్లు పుంజుకుని 4,239 వద్ద ముగిసింది. ఈ రోజు ఉదయం 73 పాయింట్ల లాభంతో 13,664 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది.Source: Yahoo! Telugu: News | 22 May 2009 | 5:06 pm నిధుల ఆదాపై దృష్టి సారించిన ఏఐ దృష్టికొత్త ప్రభుత్వం నుంచి రూ.4300 కోట్ల ఆర్థిక ప్యాకేజీ పొందే అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తుండటంతో ఎయిర్ ఇండియా (ఏఐ) ఏడాదికి రూ.1000 కోట్ల నిధులు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా రాబోయే కాలంలో మార్కెట్ వాటాను పెంచుకోవడంపై దృష్టి పెట్టామని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 22 May 2009 | 4:15 pm సీబీఎస్ఈ: 16వేల మందికి 90శాతం పైగా మార్కులు12వ తరగతి విద్యార్థులకు సంబంధించి శుక్రవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) విడుదల చేసిన ఫలితాల్లో 15,839మంది విద్యార్థులు 90శాతం పైగా మార్కులు సాధించడం విశేషంSource: Yahoo! Telugu: News | 22 May 2009 | 3:54 pm అమీర్ ఖాన్ సరసన కేట్ విన్‌స్లెట్..!బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సరసన ఆస్కార్ నటి కేట్ విన్‌స్లెట్ నటించనుంది. "తోబా తెక్ సింగ్" ఆధారంగా ఈ అంతర్జాతీయ చిత్రం రూపొందుతున్నట్లు ఫిమేల్ ఫస్ట్ పత్రిక తెలిపింది. 1947లో జరిగిన దేశ విభజన ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్ మానసిక వైకల్యం గల వ్యక్తి పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీపా మెహతా దర్శకత్వంలోని "ఎర్త్-1947"లో అమీర్ మానసిక వైకల్యం గల పాత్రను పోషించాడు. ఈ నేపథ్యంలో కేట్ విన్‌స్లెట్‌తో జంటగా నటించబోతున్న ఈ సినిమాను భారత సంతతికి చెందిన పాన్ నళిన్ దర్శకత్వం వహించనున్నారని ఫిమేల్ ఫస్ట్ పత్రిక పేర్కొంది.Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2009 | 3:14 pm బెంగాల్‌కే కమలిని తిరుగుముఖం..!?ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల "ఆనంద్" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పశ్చిమ బెంగాల్ ముద్దుగుమ్మ కమలిని ముఖర్జీ. గోదావరి, మీనాక్షి, స్టైల్ వంటి చిత్రాల్లో నటించిన కమలినికి "గమ్యం" మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. తాజాగా గోపి గోపిక గోదావరి, పోలీస్ పోలీస్ సినిమాల్లో నటిస్తోన్న ఈ వాలు కనుల కమలినికి ఈ మధ్య ఛాన్సులు అంతగా రావడం లేదని సినీ వర్గాల్లో టాక్. తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో హోమ్లీ హీరోయిన్‌గా ముద్రవేసుకున్న ఈ భామ చేతిలో అంతగా సినిమాలు లేవని తెలిసింది. దీంతో కమలిని తన స్వస్థలమైన బెంగాల్‌కే తిరుగుముఖం పట్టనుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2009 | 2:25 pm ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్న అద్వానీమన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం శుక్రవారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఆ పార్టీ ప్రతిపక్ష నేత ఎల్‌కే.అద్వానీ హాజరుకానున్నారు.Source: జాతీయ | 22 May 2009 | 1:12 pm కొలువుదీరిన మన్మోహనుడి కొత్త ప్రభుత్వంకేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా శుక్రవారం సాయంత్రం 6.35 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తర్వాత కేంద్ర మంత్రిగా పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేశారు.Source: జాతీయ | 22 May 2009 | 1:11 pm సెన్సార్ పూర్తి చేసుకున్న "లైఫ్ స్టైల్"యస్. ఎమ్. సినీ మ్యాక్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ మాధవ్ పట్నాయక్ నిర్మిస్తున్న "లైఫ్‌స్టైల్" చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. నిశ్చల్, మీనాక్షిదీక్షిత్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అభిరామ్, కార్తీక్, మోనాలి చౌదరి, అనన్య, బ్రహ్మానందం, గిరిబాబు...Source: వినోదం | 22 May 2009 | 12:58 pm డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన యాదవ్రాష్ట్ర డీజీపీగా శుక్రవారం ఎస్ఎస్పీ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేశారన్న ఆరోపణలతో ఎన్నికల సంఘం యాదవ్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టిన సంగతి తెలిసిందే.Source: ఏపీ న్యూస్ | 22 May 2009 | 12:51 pm 'కరుణ'తో రాయబారానికి మధ్యవర్తిగా 'ఆజాద్'కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శనివారం చెన్నై పర్యటనకు రానున్నారు. మంత్రి పదవులపై డీఎంకే- కాంగ్రెస్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దేశ రాజధానిలో గురువారం జరిగిన చర్చల్లో డీఎంకే ప్రతిపాదనలకు కాంగ్రెస్ ససేమిరా అనడంతో ఆ పార్టీ అధినేత కరుణానిధి ఈ రోజు చెన్నై తిరిగివచ్చారు.Source: జాతీయ | 22 May 2009 | 12:18 pm 19 మందితో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంమన్మోహన్ సింగ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం 19 మందితో కొలువుదీరనుంది. మంత్రి పదవులపై మిత్రపక్షం డీఎంకే పెట్టిన పేచీని బేఖాతర్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం, ముందుగా నిర్ణయించినట్టుగా శుక్రవారం సాయంత్రం కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.Source: జాతీయ | 22 May 2009 | 11:54 am బాలీవుడ్‌లో అడుగెట్టనున్న మమత!హోమం, చింతకాయల రవి వంటి చిత్రాల ద్వారా టాలీవుడ్ అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న మమతా మోహన్ దాస్ త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. టాలీవుడ్‌లో నటీమణిగా, గాయనిగా గుర్తింపు సంపాదించిన ఈ మలయాళం సెక్సీ బ్యూటీ త్వరలో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించనుంది. మమతా మోహన్‌దాస్‌కు ఈ మధ్య బాలీవుడ్ ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయని, ఆమె కాల్షీట్ కోసం పలు హిందీ నిర్మాతలు వేచి ఉన్నారని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2009 | 10:31 am నెలాఖరులో రాష్ట్రానికి రానున్న రుతుపవనాలువాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల దృష్ట్యా ఈ నెలఖరులోగా రాష్ట్రంలో తొలకరి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు అనుకున్నదానికంటే వేగంగా కదులుతున్న కారణంగా ప్రస్తుతం ఈ పరిస్థితి సంభవించినట్టు వాతావరణం కేంద్రం తేల్చింది.Source: ఏపీ న్యూస్ | 22 May 2009 | 9:11 am రాజధాని నగరాన్ని వీడని స్వైన్‌ఫ్లూ భయంరాష్ట్ర రాజధాని నగరాన్ని స్వైన్‌ఫ్లూ భయం వీడిపోవడంలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వ్యక్తి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిలో చేరారు. ఇండోనేషియాకు వెళ్లి తిరిగి వచ్చిన సదరు వ్యక్తిలో గొంతునొప్పి, దగ్గు, జ్వరం రావడంతో ఆందోళనతో ఆస్పత్రిలో చేరారుSource: ఏపీ న్యూస్ | 22 May 2009 | 8:50 am యూపీఏకు వెలుపలి నుంచి మద్దతు: డీఎంకేకాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్న డీఎంకే ఇప్పుడు యూపీఏ కూటమికి బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. డీఎంకే, కాంగ్రెస్ మధ్య గురువారం మంత్రి పదవులపై జరిగిన చర్చలు ఫలించలేదు.Source: జాతీయ | 22 May 2009 | 8:23 am జర్నలిస్టులపై చేయి చేసుకున్న వరుణ్ గాంధీభారతీయ జనతా పార్టీ యువనేత, పిలిభిత్ లోక్‌సభ సభ్యుడు వరుణ్ గాంధీకి వివాదాల సుడిగుండం నుంచి ఇపుడే బయటపడేలా కనిపంచడం లేదు. ఎన్నికలకు ముందు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడారన్న ఆరోపణలపై వివాదంలో చిక్కుకున్న ఆయన, తాజాగా జర్నలిస్టులతో గొడవపడ్డారు.Source: జాతీయ | 22 May 2009 | 6:44 am విజయవాడలో రోడ్డుప్రమాదం: 4గురు మృతివిజయవాడలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. టాటా ఇండికా కారు లారీని ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.Source: ఏపీ న్యూస్ | 22 May 2009 | 6:04 am పదవులపై కాంగ్రెస్-డీఎంకేల మధ్య పీటముడికేంద్రంలో కొత్త ప్రభుత్వం మరికొన్ని గంటల్లో ఏర్పాటవుతుండగా, మంత్రి పదవులపై కాంగ్రెస్ డీఎంకే మధ్య చర్చలు విఫలమయ్యాయి. కాంగ్రెస్‌తో గురువారం మంత్రి పదవులపై జరిగిన చర్చలు విఫలం అవడంతో యూపీఏకి బయట నుంచి మద్దతు ఇవ్వాలని డీఎంకే నిర్ణయించుకుంది.Source: జాతీయ | 22 May 2009 | 5:38 am నన్ను కాదు, ప్రజల్ని అడగండి"మీ పార్టీ మ్యానిఫెస్టో గురించి చెప్పండి సార్..?" కొత్త పార్టీ అధ్యక్షుడిని ప్రశ్నించాడో విలేకరి "జనం ఆలోచనలు...Source: వినోదం | 22 May 2009 | 5:09 am నేను కూడా లెక్కపెట్టలేదు సార్...!"ఆఫీసుకు లేటుగా రావద్దని నీకెన్నిసార్లు చెప్పాలోయ్...?" నిలదీశాడు మేనేజర్ "అవును నిజమే సార్..Source: వినోదం | 22 May 2009 | 5:05 am ఎవరెస్ట్ అధిరోహణ: చరిత్ర సృష్టించిన భారతీయులుప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని ఒక్క రోజులోనే అధిరోహించి 11 మంది భారతీయుల బృందం చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల బాలిక, మరో మహిళతోపాటు 11 మంది భారతీయులు గురువారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.Source: జాతీయ | 22 May 2009 | 4:15 am మహారాష్ట్రలో నక్సల్స్ దాడి: 16మంది పోలీసుల మృతిమహారాష్ట్రలోని ధనోరా తాలూకాలోని గడ్చిరోలి ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులపై నక్సల్స్ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో 16మంది పోలీసులు మృతి చెందారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో పలుచోట్ల గత రెండురోజులుగా విధ్వంసాలకు పాల్పడుతున్న మావోయిస్టులు గురువారంనాడు మహారాష్ట్రలో దాడులకు పాల్పడ్డారు.Source: జాతీయ | 22 May 2009 | 3:52 am కేన్స్ చిత్రోత్సవంలో ఏంజెలీనా దంపతులుహాలీవుడ్ చిలకాగోరింకలు బ్రాడ్‌పిట్-ఏంజెలీనా జోలీలు కేన్స్ చిత్రోత్సవంలో మెరిశారు. జలుబుతో బాధపడుతున్న జోలీ, తన భర్త బ్రాడ్ పిట్‌తో కలిసి మూడునెలల తర్వాత కేన్స్ చిత్రోత్సవంలోనే కనిపించిందని మిర్రర్ పత్రిక వెల్లడించింది. ఫ్రాన్స్‌లో జరుగుతోన్న అంతర్జాతీయ కేన్స్ చిత్రోత్సవానికి ఈ నెల 19వ తేదీన బ్రాడ్‌పిట్-ఏంజెలీనాలు చేరుకున్నారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న జోలీ జంట చాలా హుషారుగా కనిపించిందని మిర్రర్ పేర్కొంది. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించిన ఓ సినిమాను జోలీ దంపతులు వీక్షించారని మిర్రర్ తెలిపింది.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2009 | 5:27 pm ముమైత్ "టార్గెట్" ఏమిటో ట్రైలర్లో వీక్షించండిరమేష్ రాజా దర్శకత్వంలో శివబాలాజీ, శ్రద్ధాదాస్ జంటగా నటించిన చిత్రం "టార్గెట్". ఈ చిత్రాన్ని ఆర్.కె.గౌడ్ సమర్పించారు. ఈ సినిమాలోని ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారని చిత్ర సమర్పకుడు గౌడ్ వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2009 | 5:10 pm "రాజా వారి చేపల చెరువు" ట్రైలర్ మీ కోసం..రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి నటిస్తూ రూపొందించిన చిత్రం 'రాజా వారి చేపల చెరువు'. ఈ సినిమా ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. లక్ష్మీగణపతి ఫిలిమ్స్ పతాకంపై సుబ్రమణ్యం. బి. రూపేష్. వై. ఈ చిత్రాన్ని నిర్మించారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2009 | 5:04 pm "పిస్తా"ను ట్రైలర్లో చూడండివిశాల్, శ్రియ జంటగా నటిస్తోన్న చిత్రం "పిస్తా". విక్రమ్‌కృష్ణ నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి సభా అయ్యప్ప దర్శకుడు. తెలుగు, తమిళభాషల్లో రూపొందుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2009 | 4:53 pm అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు : కలామ్లోక్సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ప్రగతికి పట్టం కట్టారని, ఇక్కడ రాజకీయాలకు తావివ్వకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ పేర్కొన్నారు.Source: జాతీయ | 21 May 2009 | 2:20 pm రాష్ట్ర డీజీపీగా ఎస్.ఎస్.పి.యాదవ్ నియామకంఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా కొంతకాలం పాటు పదవికి దూరమైన ఎస్ఎస్పీ యాదవ్ మళ్లీ రాష్ట్ర డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. యాదవ్‌ను డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.Source: ఏపీ న్యూస్ | 21 May 2009 | 2:03 pm డబ్బుకోసం రాజకీయాలలోకి రాలేదు: చిరుకొందరు ప్రచారం చేస్తున్నట్లుగా తాను, తన కుటుంబ సభ్యులు డబ్బులకోసం రాజకీయాలలోకి రాలేదని, పార్టీ టిక్కెట్ల కోసం అభ్యర్థులనుంచి తమ పార్టీ డబ్బు తీసుకోలేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, తిరుపతి నియోజకవర్గ ఎమ్మల్యే చిరంజీవి అన్నారు. ప్రజారాజ్యంపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం గురువారంనాడు ఆ పార్టీ కార్యాలయంలో జరిగిందిSource: ఏపీ న్యూస్ | 21 May 2009 | 2:01 pm తగ్గిన తెలంగాణా సెంటిమెంట్: వైఎస్రాష్ట్రంలో చాలా చోట్ల తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా లేదని ముఖ్యమంత్రి వైఎస్ స్పష్టం చేశారు. అదేసమయంలో ప్రత్యేక రాష్ట్రం అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సుస్పష్ట వైఖరి అవలంభిస్తుందని పేర్కొన్న వైఎస్ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రత్యేక రాష్ట్రం వస్తుందని పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 21 May 2009 | 11:51 am
|