|
భాజపా శాసనసభాపక్ష నేతగా కిషన్రెడ్డిభారతీయ జనతా పార్టీ తరపున శాసనసభాపక్ష నేతగా అంబర్‌పేట ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఎంపికయ్యారు. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున ఇద్దరు నేతలు ఎమ్మెల్యేలుగా ఎంపికకాగా వారితో సమావేశమైన సీనియర్ నేతల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 21 May 2009 | 5:04 pm "రాజా వారి చేపల చెరువు" ట్రైలర్ మీ కోసం..రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి నటిస్తూ రూపొందించిన చిత్రం 'రాజా వారి చేపల చెరువు'. ఈ సినిమా ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. లక్ష్మీగణపతి ఫిలిమ్స్ పతాకంపై సుబ్రమణ్యం. బి. రూపేష్. వై. ఈ చిత్రాన్ని నిర్మించారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2009 | 5:04 pm రాష్ట్ర డీజీపీగా ఎస్.ఎస్.పి.యాదవ్ నియామకంఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా కొంతకాలం పాటు పదవికి దూరమైన ఎస్ఎస్పీ యాదవ్ మళ్లీ రాష్ట్ర డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. యాదవ్‌ను డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.Source: Yahoo! Telugu: News | 21 May 2009 | 5:02 pm చంద్రబాబుకు బుద్ధి చెప్పిన ఓటర్లు: కాంగ్రెస్ప్రజలను మోసం చేయాలనుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తాజా ఎన్నికల్లో మంచి గుణపాఠం లభించిందని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే తెలంగాణ నినాదాన్ని వాడుకున్న చంద్రబాబుకు ప్రజలు బాగానే బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 21 May 2009 | 4:59 pm పదవులపై ఫలించిన కాంగ్రెస్-డీఎంకే చర్చలు!కేంద్రంలో కొత్తగా కొలువుదీరబోతున్న యూపీఏ కూటమి ప్రభుత్వంలో తాము ఆశిస్తున్న స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే గురువారం చర్చలు జరుపుతోంది. ఈ రెండు పార్టీల మధ్య మంత్రి పదవులపై చర్చలు చివరిదశలో ఉన్నట్లు తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 21 May 2009 | 4:56 pm "పిస్తా"ను ట్రైలర్లో చూడండివిశాల్, శ్రియ జంటగా నటిస్తోన్న చిత్రం "పిస్తా". విక్రమ్‌కృష్ణ నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి సభా అయ్యప్ప దర్శకుడు. తెలుగు, తమిళభాషల్లో రూపొందుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2009 | 4:53 pm ఇండోనేషియా విమాన ప్రమాదంపై దర్యాప్తుఇండోనేషియా వైమానిక దళానికి చెందిన పరిశోధకులు గురువారం ముందురోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇండోనేషియాలో బుధవారం నివాస ప్రాంతాలపై మిలటరీ రవాణా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు వంద మంది ప్రయాణికులు మరణించారు.Source: Yahoo! Telugu: News | 21 May 2009 | 4:46 pm "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" సినిమా ట్రైలర్ఔటాఫ్ కాలింగ్ ఏరియాలో ఉన్న ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య జరిగే ఆసక్తికరమైన ప్రేమకథతో "ఒక అమ్మాయి ఒక అబ్బాయి" అనే చిత్రం రూపొందుతోంది. గతంలో ఖాకీ చొక్కా, అశోకచక్రంవంటి చిత్రాలను నిర్మించిన వై.అలెక్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2009 | 4:44 pm ముస్తాబవుతోన్న "ఎవరైనా ఎప్పుడైనా"ఏవీఎం ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ సందేశ్, విమలరామన్ జంటగా నటిస్తోన్న చిత్రం "ఎవరైనా ఎప్పుడైనా". మార్తాండ్ కె. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇదొక ప్రేమకథా చిత్రమని, వినోదభరితంగా సకుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. చదువు పూర్తిచేసిన యువకుడిగా కనిపించే కథానాయకుడు వరుణ్ సందేశ్ పాత్ర స్వరూప స్వభావాలు వైవిధ్యంగా కన్పిస్తాయని చెప్పారు. దీనికి అనుగుణంగానే సన్నివేశాలు కొత్తగా ఉంటాయని దర్శకుడు వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2009 | 4:12 pm భారీగా క్షీణిస్తోన్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ భారీగా క్షీణిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 328 పాయింట్లు కోల్పోయి 13,733 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 4,211 వద్ద పయనిస్తోంది. బీఎస్ పెట్టుబడి ఉత్పత్తుల ఇండెక్స్ 5.2 శాతం మేరకు నష్టపోయింది.Source: Yahoo! Telugu: News | 21 May 2009 | 3:50 pm డబ్బింగ్ కార్యక్రమాల్లో "వ్యాపారి"ఖుషి, పులి చిత్రాల దర్శకుడు యస్.జె. సూర్య ద్విపాత్రాభినయంలో తమన్నా, నమిత, మాళవిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "వ్యాపారి". శక్తి చిదంబరం దర్శకత్వంలో తమిళంలో "వ్యాబారి" పేరుతో రూపొంది ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో "వ్యాపారి" పేరిట ప్రణతి క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ అనువదిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2009 | 3:43 pm రొమాన్స్ చేయడం చాలా కష్టం: అజయ్చిన్న పాత్రైనా డైలాగ్ ఉంటే చాలనుకుని ఇండస్ట్రీకి వచ్చిన డిగ్రీ హోల్డర్ అజయ్. అనుకున్నట్లుగానే తొలుత ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. ఖుషీలో సూర్య ఇచ్చిన అవకాశంతో 35 చిత్రాల్లో అజయ్ విలన్‌గా నటించాడు. "లక్ష్మీ కళ్యాణం"లో అజయ్ పాత్రను చూసిన కణ్ణన్ అనే దర్శకుడు సారాయి వీర్రాజు చిత్రంలో హీరోగా అవకాశం కల్పించాడు. అంతకుముందే మూర్తి అనే దర్శకుడు "ఆ ఒక్కడు" చిత్రంతో అజయ్‌ను తెరపైకి తెచ్చాడు. ఈ చిత్రం పూర్తయి ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ సందర్భంగా అజయ్‌తో కాసేపు..ప్రశ్న... విలన్, హీరోగా ఎటువంటి తేడా గమనించారు?జ.. నెగటివ్ రోల్స్ చేయడం చాలా ఈజీ. కానీ హీరోగా చేయడం, అందులో హీరోయిన్లతో రొమాన్స్ చేయడం చాలా కష్టం.ప్రశ్న... హీరోగా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందనను ఆశిస్తున్నారు?జ.. నాక్కూడా టెన్షన్‌గా ఉంది. ఇప్పటిదాకా విలన్‌గా చేసిన అజయ్ హీరోగా ఏం చేస్తాడో? చూడాలని క్యూరియాసిటీ ఉంటుంది.ప్రశ్న.. ఇకపై విలన్‌పాత్రలకు ఫుల్‌స్టాప్ పెడతారా?జ.. లేదు. నెగటివ్ పాత్రలుకూడా చేస్తాను.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2009 | 3:19 pm రేపు మన్మోహన్ సింగ్ పట్టాభిషేకంప్రధానిగా మన్మోహన్ సింగ్ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రమాణం చేయిస్తారు.Source: Yahoo! Telugu: News | 21 May 2009 | 3:16 pm ధరలు పెరిగిన పెసలపప్పు, గోధుమగురువారం నాడు హోల్ సేల్ మార్కెట్ రంగంలో పెసల పప్పు, గోధుమల ధరలు పెరిగాయి. మిగిలిన ఆహార ధాన్యాల ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. పెసల పప్పు, గోధుమల ధరలు ప్రతి క్వింటాలుకు సరాసరి రూ. 50లు పెరిగి రూ. 5,400 మరియు రూ. 1,550లుగా ఉన్నాయి. ఇదిలావుండగా కందిపప్పు, ఉద్దిపప్పు, శెనగపప్పు, చక్కెర, మైదా, రవ్వ తదితర వస్తువుల ధరలు మాత్రం పెరగలేదని మార్కెట్ వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 21 May 2009 | 2:54 pm చర్చల పునరుద్ధరణపై క్లింటన్ ఆశాభావంభారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య చర్చల పునరుద్ధరణపై అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య నిలిపివేసిన శాంతి ప్రక్రియ చర్చలు పునరుద్ధరించబడతాయనే నమ్మకం తనకుందని చెప్పారు. ఈ చర్చలు పునరుద్ధరించబడితే ఈ రెండు అణు రాజ్యాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయని తెలిపారు.Source: Yahoo! Telugu: News | 21 May 2009 | 2:44 pm బ్రెట్‌లీతో ప్రీతి జింటా డేటింగ్?బాలీవుడ్ అందాల రాశి, పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా ఈ మధ్య సింగిల్‌గానే తిరుగుతోందట. తన ప్రేమికుడైన నెస్ వాడియాతో కాస్త దూరంగానే కన్పిస్తున్న జింటా.. ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్‌లీ డేటింగ్ జరుపుతోందని సినీ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఐపీఎల్ రెండో సీజన్‌తో తెగ బిజీబిజీగా ఉంటోన్న జింటా.. కనీసం వాడియా పక్కన కూడా కూర్చోనంటోందట. ఎప్పుడూ జట్టు సభ్యులతో ఉంటూ చిందులేస్తూ కన్పిస్తోన్న జింటాకు వాడియా దూరమవుతున్నాడని సినీ వర్గాల సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2009 | 2:33 pm స్టాక్ మార్కెట్ 109 పాయింట్లు నష్టంస్టాక్ మార్కెట్ 109 పాయింట్లు కోల్పోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 13,952 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 4,277 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.77 శాతం, నిఫ్టీ 0.13 శాతం చొప్పున క్షీణించాయి. ఇప్పటి వరకు మొత్తం 2,651 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 2,303 కంపెనీల వాటాలు లాభాల్లో ఉన్నాయి. అలాగే 301 కంపెనీల వాటాలు నష్టాల్లో ఉన్నాయి.Source: Yahoo! Telugu: News | 21 May 2009 | 1:49 pm "వెంగమాంబ" లోగో ఆవిష్కరణమీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవలే ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, కీరవాణిలు లోగోను ఆవిష్కరించారు. వి.ఎం.సి. ప్రొడక్షన్ పతాకంపై వి. దొరస్వామిరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి, పి. ఉదయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2009 | 1:24 pm మళ్లీ తెరపైకి బ్రహ్మానందం తనయుడు!"హాస్యబ్రహ్మ" బ్రహ్మానందం కుమారుడు మళ్లీ తెరపైకి రానున్నారు. గౌతమ్ హీరోగా గతంలో "పల్లకిలో పెండ్లికూతురు" చిత్రం విడుదలైంది. కె. రాఘవేంద్రరావు ఆశీస్సులతో సుచిత్ర చంద్రబోస్ ఈ చిత్రానికి దర్శకురాలిగా పరిచయమైంది. ఆ తర్వాత ఈ చిత్రం పాటలపరంగా మంచి ఆదరణ పొందినా సక్సెస్ సాధించలేకపోయింది.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2009 | 11:59 am తగ్గిన తెలంగాణా సెంటిమెంట్: వైఎస్రాష్ట్రంలో చాలా చోట్ల తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా లేదని ముఖ్యమంత్రి వైఎస్ స్పష్టం చేశారు. అదేసమయంలో ప్రత్యేక రాష్ట్రం అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సుస్పష్ట వైఖరి అవలంభిస్తుందని పేర్కొన్న వైఎస్ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రత్యేక రాష్ట్రం వస్తుందని పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 21 May 2009 | 11:51 am పూరీ తనయుడితో "లోటస్ పాండ్"ప్రముఖ దర్శక నిర్మాత పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ ప్రధాన పాత్రలో త్రిపాదయా ఇన్నేవేషన్ మార్కెటింగ్ లిమిటెడ్ పతాకంపై కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. పి.జి. విందా దర్శకత్వంలో "లోటస్‌పాండ్" అనే పేరిట అంతర్జాతీయ చిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 May 2009 | 11:40 am భాజపా శాసనసభాపక్ష నేతగా కిషన్రెడ్డిభారతీయ జనతా పార్టీ తరపున శాసనసభాపక్ష నేతగా అంబర్‌పేట ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఎంపికయ్యారు. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున ఇద్దరు నేతలు ఎమ్మెల్యేలుగా ఎంపికకాగా వారితో సమావేశమైన సీనియర్ నేతల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 21 May 2009 | 11:34 am రాష్ట్ర డీజీపీగా ఎస్.ఎస్.పి.యాదవ్ నియామకంఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా కొంతకాలం పాటు పదవికి దూరమైన ఎస్ఎస్పీ యాదవ్ మళ్లీ రాష్ట్ర డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. యాదవ్‌ను డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.Source: ఏపీ న్యూస్ | 21 May 2009 | 11:32 am చంద్రబాబుకు బుద్ధి చెప్పిన ఓటర్లు: కాంగ్రెస్ప్రజలను మోసం చేయాలనుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తాజా ఎన్నికల్లో మంచి గుణపాఠం లభించిందని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే తెలంగాణ నినాదాన్ని వాడుకున్న చంద్రబాబుకు ప్రజలు బాగానే బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 21 May 2009 | 11:30 am పదవులపై ఫలించిన కాంగ్రెస్-డీఎంకే చర్చలు!కేంద్రంలో కొత్తగా కొలువుదీరబోతున్న యూపీఏ కూటమి ప్రభుత్వంలో తాము ఆశిస్తున్న స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే గురువారం చర్చలు జరుపుతోంది. ఈ రెండు పార్టీల మధ్య మంత్రి పదవులపై చర్చలు చివరిదశలో ఉన్నట్లు తెలుస్తోంది.Source: జాతీయ | 21 May 2009 | 11:27 am రేపు మన్మోహన్ సింగ్ పట్టాభిషేకంప్రధానిగా మన్మోహన్ సింగ్ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రమాణం చేయిస్తారు.Source: జాతీయ | 21 May 2009 | 9:47 am బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనకు తృణమూల్ డిమాండ్పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని అధికార లెఫ్ట్ ఫ్రంట్‌పై స్పష్టమైన ఆధిక్యం సాధించిన ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది.Source: జాతీయ | 21 May 2009 | 8:14 am ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నవీన్ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిజూ జనతాదళ్ (బీజేడీ) చీఫ్ నవీన్ పట్నాయక్ గురువారం వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 103 సీట్లు గెలుచుకుని బీజేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఒరిస్సా అసెంబ్లీలో మొత్తం 147 స్థానాలు ఉన్నాయి.Source: జాతీయ | 21 May 2009 | 6:45 am జేఎంఎం చీఫ్ శిబూ సొరేన్‌కు పుత్ర వియోగంజార్ఖండ్ ముక్తి మోర్ఛా చీఫ్, మాజీ ముఖ్యమంత్రి శిబూ సొరేన్ పెద్ద కుమారుడు దుర్గా సొరేన్ గురువారం మృతి చెందాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వచ్చిన దుర్గా సొరేన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.Source: జాతీయ | 21 May 2009 | 6:22 am రేపు కొలువుదీరనున్న మన్మోహన్ ప్రభుత్వంకేంద్రంలో కొత్తగా ఏర్పాటుకానున్న యూపీఏ కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గ స్థానాల కోసం దాని భాగస్వామ్య పక్షాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. యూపీఏ భాగస్వామ్య పక్షాల చర్చలు బుధవారం పదవుల చుట్టూనే తిరిగాయి. కాగా, మన్మోహన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది.Source: జాతీయ | 21 May 2009 | 4:44 am నేడు మాజీ ప్రధాని రాజీవ్ 18వ వర్థంతిమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 18వ వర్థంతి వేడుకలు గురువారం దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన స్మృతి చిహ్నమైన "వీర భూమి" వద్ద దేశాధినేతలు అంజలి ఘటించనున్నారు.Source: జాతీయ | 21 May 2009 | 4:35 am భాజపాపై ఎన్డీయే మిత్రపక్షాల ఎదురుదాడి!తాజా ఎన్నికల్లో పరాజయంపై ఎన్డీఏ భాగస్వాములు కూటమికి నేతృత్వం వహించిన బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ఎన్డీఏలోని రాజకీయ పార్టీలు మంగళవారం 15వ లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి బీజేపీయే కారణమని ఎదురుదాడి చేయడం ప్రారంభించాయి.Source: జాతీయ | 20 May 2009 | 3:14 pm యూపీఏ ఛైర్‌పర్సన్‌గా సోనియా ఏకగ్రీవ ఎన్నికయూపీఏ భాగస్వామ్య పార్టీల ఉమ్మడి సమావేశం బుధవారం ముగిసింది. ఈ సమావేశంలో యూపీఏ ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.Source: జాతీయ | 20 May 2009 | 3:10 pm విద్యుత్, రేషన్ బియ్యం ఫైళ్లపై వైఎస్ సంతకాలురాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే రెండు ఫైళ్ళపై సంతకాలు చేశారు. వాటిలో ఒకటి ఉచిత విద్యుత్, రెండోది రేషన్ బియ్యం పైల్ కావడం గమనార్హం. ప్రస్తుతం రైతులకు ఇస్తున్న ఏడుగంటల ఉచిత విద్యుత్‌ను ఇకపై తొమ్మిది గంటల పాటు అందజేస్తారు.Source: ఏపీ న్యూస్ | 20 May 2009 | 2:22 pm ప్రభుత్వ ఏర్పాటుకు మన్మోహన్‌కు ఆహ్వానంకేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించారు. దీంతో మన్మోహన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఈనెల 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనుంది.Source: జాతీయ | 20 May 2009 | 1:03 pm రేపు టీడీఎల్పీ సమావేశం: బాబు హాజరుఎన్టీఆర్ ట్రస్టుభవన్ వేదికగా గురువారం జరగనున్న టీడీఎల్పీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో టీడీపీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు.Source: ఏపీ న్యూస్ | 20 May 2009 | 12:26 pm అక్రమ ప్రమోషన్లపై తగిన చర్యలు: ప్రభుత్వంరాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాధికారులు సిద్ధమయ్యారు. నకిలీ సర్టిఫికేట్ల ద్వారా ప్రమోషన్లు పొందారన్న ఆరోపణల్లో భాగంగా సదరు అభ్యర్థులపై అధికారులు చర్య తీసుకోనున్నారు.Source: ఏపీ న్యూస్ | 20 May 2009 | 11:29 am విడుదల కోరుతూ ఖైదీల ఆందోళనఆరేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న రాజకీయ ఖైదీలను విడుల చేయాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు మద్దతుగా మిగిలిన ఖైదీలు సైతం నిరాహార దీక్షలు చేపట్టడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.Source: ఏపీ న్యూస్ | 20 May 2009 | 11:26 am అభిమానులు ధైర్యంగా ఉండాలి: చిరుఇటీవల ముగిసిన ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకున్నా అభిమానులు ధైర్యం కోల్పోరాదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలిపారు. చిరంజీవి ముఖ్యమంత్రి కాలేదని కొందరు అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారుSource: ఏపీ న్యూస్ | 20 May 2009 | 11:24 am ఊహాచిత్రం ట్రైలర్ మీ కోసం..వంశీకృష్ణ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ఊహాచిత్రం. పూనెలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఊహాచిత్రం రూపొందిందని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్న సత్య తెలియజేశారు. పైడిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో భాగంగా డీటీఎస్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.Source: వినోదం | 20 May 2009 | 11:09 am "దమ్మున్నోడు"ను ట్రైలర్లో చూడండిరిషి, సౌమ్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "దమ్మున్నోడు". ఈ చిత్రానికి బి.వి.వి. చౌదరి దర్శకునిగా పరిచయమవుతున్నారు. వందేమాతరం శ్రీనివాసరావు సమకూర్చిన పాటలు మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి.Source: వినోదం | 20 May 2009 | 10:54 am
|