|
బంధువుల చేతికి బాలస్వామి మృతదేహంహైదరాబాద్లో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన హోంగార్డు బాలస్వామి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు.Source: Yahoo! Telugu: News | 19 May 2009 | 12:28 pm ఎగిసిపడిన సెన్సెక్స్: స్వల్ప లాభంతో ముగింపుబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) మంగళవారం లాభాల బాటలో నడిచింది. అమెరికా మార్కెట్‌ల సానుకూల ప్రభావంతో 474 పాయింట్ల భారీ వృద్ధితో 14,758 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సూచి అనంతరం నష్టాల్లోకి జారుకుంది. ఒకానొక దశలో 13,834Source: Yahoo! Telugu: News | 19 May 2009 | 12:24 pm మావల్లే కేసీఆర్ గెలిచారు: నాగంతమ పార్టీతో పొత్తువల్లే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబ్‌నగర్‌లో గెలవగలిగారంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నాగం జనార్థనరెడ్డి పేర్కొన్నారు. అసలు తాము సహకరించకుంటే ఆయన గెలిచేవారా అంటూ ఈ సందర్భంగా...Source: Yahoo! Telugu: News | 19 May 2009 | 12:19 pm పేలవమైన ఫీల్డింగ్, బౌలింగే కారణం: మెక్కలమ్చెన్నై సూపర్ కింగ్స్‌పై ఏడు వికెట్ల తేడాతో సంచలన విజయం అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో తమ జట్టు విఫలమవడానికి పేలవమైన ఫీల్డింగ్, బౌలింగ్Source: Yahoo! Telugu: News | 19 May 2009 | 12:16 pm సోమనాథ్‌కు ఆ అర్హతలేదు: రాఘవులులెఫ్ట్ పార్టీల ఓటమికి బాధ్యత వహిస్తూ సీపీఎం నేత ప్రకాశ్‌కారత్ రాజీనామా చేయాలంటూ లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ చేసిన వ్యాఖ్యలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కొట్టిపారేశారు. పార్టీనుంచి బహిష్కరించబడినవారి...Source: Yahoo! Telugu: News | 19 May 2009 | 12:12 pm మరో జట్టు (రాజస్థాన్)కు కేకేఆర్ షాకివ్వనుందా?చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే వరుస పరాజయాలతో సెమీస్ అవకాశాలు కోల్పోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంకాSource: Yahoo! Telugu: News | 19 May 2009 | 12:07 pm సెమీస్ అర్హత కోసం చెన్నై, పంజాబ్ హోరాహోరీఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో ఓ రసవత్తరమైన మ్యాచ్‌కు డర్బన్ వేదిక కానుంది. బుధవారం ఇక్కడ జరిగే ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో సెమీస్‌లో చోటు కోసం చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ హోరాహోరీగా పోరాడనున్నాయి.Source: Yahoo! Telugu: News | 19 May 2009 | 11:56 am నా ఫామ్‌కు కారణం జలక్రీడలే: హేడెన్ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో చెలరేగి ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ మాథ్యూ హేడెన్ తన విజయరహస్యానికి జలక్రీడలే కారణమని చెప్పాడు. తన ఫామ్‌ను కాపాడుకునేందుకు ఇవి బాగా ఉపయోగపడ్డాయనిSource: Yahoo! Telugu: News | 19 May 2009 | 11:49 am రేపటినుంచి ఇంటర్ అడ్వాన్స్ సఫ్లిమెంటరీఇంటర్ అడ్వాన్స్‌డ్ సఫ్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వరకు జరగనున్న ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం జరగనున్నాయి. ఉదయం 8 గంటలనుంచి 11 గంటలవరకు ఫస్టియర్ విద్యార్ధులకు...Source: Yahoo! Telugu: News | 19 May 2009 | 11:28 am ఐపీఎల్‌లో మా బౌలింగ్ చెత్తగా ఉంది: ధోనీఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో తమ బౌలింగ్ చెత్తగా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఏడు వికెట్ల తేడాతోSource: Yahoo! Telugu: News | 19 May 2009 | 11:17 am భారత నౌకాదళంలో మరో యుద్ధ నౌకభారత నౌకా దళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక విశాఖపట్నం నౌకాశ్రయానికి వచ్చి చేరింది. అత్యాధునిక యుద్ధ నౌకను భారత నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ సురేష్ మెహతా మంగళవారంనాడు ప్రారంభించారు. ఈ యుద్ధ నౌకను కొల్‌కతాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ నిర్మించిందని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 19 May 2009 | 7:57 am చిరుకు అభినందనలు తెలిపిన "మా"ప్రజారాజ్యం పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని మంగళవారంనాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అభినందనలతో ముంచెత్తింది. గత నెలలో జరిగిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నియోజక వర్గంనుంచి పోటీ చేసిన చిరంజీవి గెలుపొందడంతో 'మా' సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 19 May 2009 | 7:31 am ముఖ్యమంత్రిగా వైఎస్సార్ రేపు ప్రమాణంరాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్.రాజశేఖర రెడ్డి రెండోసారి బుదవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో భాగంగా వైఎస్ పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.Source: ఏపీ న్యూస్ | 19 May 2009 | 7:27 am అనుమానితులకు స్వైన్‌ఫ్లూ లేదు: అధికారులుహైదరాబాద్లోని ఛాతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వైన్ ఫ్లూ రోగి ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అలాగే, స్వైన్ ఫ్లూ ఉన్నట్టు అనుమానిస్తున్న ఇద్దరిలో ఆ రకమైన లక్షణాలేవీ లేవని వైద్యాధికారులు స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 19 May 2009 | 7:20 am రాజధానిలో ఉగ్రవాదదాడి: హోంగార్డు మృతిరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రవాదులు దాడికి తెగించారు. నిరంతరం రద్దీగా ఉండే ఫల్‌క్‌నుమా సబ్‌స్టేషన్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఓ హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందగా మరో కానిస్టేబుల్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు.Source: ఏపీ న్యూస్ | 19 May 2009 | 7:08 am అగ్ని-2 మిస్సైల్ పరీక్షా ప్రయోగం సక్సెస్భారత రక్షణ పరిశోధనా రంగం మరోమారు తన సత్తా చాటింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అగ్ని-2 క్షిపణి ప్రయోగాన్ని మంగళవారం మరోమారు విజయవంతంగా ప్రయోగించింది. ఒరిస్సా రాష్ట్రం నుంచి క్షిపణి ప్రయోగం విజయంతంగా పూర్తిచేసినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 19 May 2009 | 6:47 am సీపీపీ ఛైర్‌పర్సన్‌గా సోనియా మళ్లీ ఎన్నికకాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్‌గా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా మన్మోహన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం పది గంటలకు జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు.Source: జాతీయ | 19 May 2009 | 6:27 am కేంద్రంలో త్వరలో కొత్త యూపీఏ ప్రభుత్వంకేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు అందజేశారు. ఆయనతోపాటు, ఇతర కేంద్ర మంత్రివర్గ సభ్యులు కూడా రాజీనామాలు చేశారు. కేంద్ర మంత్రివర్గ సిఫార్సుపై రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 14వ లోక్‌సభను రద్దు చేశారు.Source: జాతీయ | 19 May 2009 | 4:39 am అవమానపరుస్తున్న కాంగ్రెస్ నేతలు: ఆర్జేడీకొత్త మంత్రివర్గం ఆర్జేడీ, ఎస్పీలకు చోటు దక్కే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. మమ్మల్ని కాంగ్రెస్ నేతలు అవమానపరుస్తున్నారని ఆయా పార్టీలు ఆరోపించాయి.Source: జాతీయ | 19 May 2009 | 4:27 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 19 May 2009 | 3:54 am మే 19, 2009 కార్యక్రమాలుఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరం ...Source: Yahoo! Telugu: Entertainment | 19 May 2009 | 3:53 am మంత్రుల ప్రమాణ స్వీకారం మేనెల 22నరాష్ట్ర అసెంబ్లీకి ఘనవిజయం సాధించి పెట్టిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా వై.ఎస్. రాజశేఖరరెడ్డి మే నెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు ఈ నెల 22న రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.Source: ఏపీ న్యూస్ | 18 May 2009 | 3:34 pm పాతబస్తీలో పోలీసులపై కాల్పులు: ఒకరి మృతిరాష్ట్రరాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న పోలీసులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపటంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాల్పుల్లో హోం గార్డ్ బాలాస్వామి మృతిచెందగా రాజేంద్రప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. ఫలక్‌నూమా బస్టాండ్‌కు సమీపంలోని ఓ హోటల్ ఎదుట విధులు నిర్వర్తిస్తుండగా మోటార్ బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి శరవేగంతో దూసుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 18 May 2009 | 3:11 pm లాలూ మద్దతు మాటను పట్టించుకోని సోనియాకేంద్ర రైల్వే మాజీమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం జరిగిన యూపీఎ మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం తాను యూపీఎకు భేషరతుగా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అయితే లాలూ మద్దతు మాటను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పట్టించుకోలేదు.Source: జాతీయ | 18 May 2009 | 1:55 pm అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. మీనా, శరత్‌బాబు, రాగిణి, సుధ, సుబ్బరాయ శర్మతో పాటు పలువురు జూనియర్ ఆర్టిస్టులపై సోమవారం నాడు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2009 | 1:50 pm విడుదలకు సిద్ధమైన సుమంత్ "బోణీ"యూత్ హీరో సుమంత్ కథానాయకుడిగా కృతికరబంద కథానాయికగా నటిస్తోన్న చిత్రం "బోణీ". గ్రీన్ మ్యాంగోస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాజా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను సంగీత దర్శకుడు రమణ గోగులSource: Yahoo! Telugu: Entertainment | 18 May 2009 | 1:46 pm పోసాని "చేపల చెరువు"పోసాని కృష్ణ మురళీ, బ్రహ్మాజీ, చలపతిరావు, గిరిబాబు, బ్రహ్మానందం, కొండవలస, గౌతంరాజు, సన, వేణుమాధవ్ తదితరులు నటించిన చిత్రం "రాజావారి చేపల చెరువు". ఈ సినిమాకు నిర్మాత: సుబ్రహ్మణ్యం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పోసాని కృష్ణ మురళీ.Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2009 | 1:39 pm తెదేపా వెన్నుపోటు వల్ల ఓటమి: కేసీఆర్మహాకూటమిలోని తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు వల్ల తాము ఓటమి పాలైనట్టు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే.చంద్రశేఖర రావు ఆరోపించారు. ఆ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ చేసిన స్థానాల్లో తమ పార్టీ కార్యకర్తలు పూర్తిగా సహకరించారన్నారు.Source: ఏపీ న్యూస్ | 18 May 2009 | 11:56 am యూపీఏకు షరతులు లేని మద్దతు: ఒమర్కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ షరతులు లేని మద్దతును ప్రకటిస్తున్నట్టు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్ర మంత్రి వర్గంలో తాము ఎలాంటి మంత్రిత్వ శాఖను కోరబోమని ఆయన స్పష్టం చేశారు.Source: జాతీయ | 18 May 2009 | 11:43 am
|