తెదేపా వెన్నుపోటు వల్ల ఓటమి: కేసీఆర్

మహాకూటమిలోని తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు వల్ల తాము ఓటమి పాలైనట్టు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే.చంద్రశేఖర రావు ఆరోపించారు. ఆ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ చేసిన స్థానాల్లో తమ పార్టీ కార్యకర్తలు పూర్తిగా సహకరించారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 May 2009 | 11:56 am

యూపీఏకు షరతులు లేని మద్దతు: ఒమర్

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ షరతులు లేని మద్దతును ప్రకటిస్తున్నట్టు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్ర మంత్రి వర్గంలో తాము ఎలాంటి మంత్రిత్వ శాఖను కోరబోమని ఆయన స్పష్టం చేశారు.
Source: జాతీయ | 18 May 2009 | 11:43 am

"నచ్చావ్ అల్లుడు" ట్రైలర్‌ మీ కోసం..

సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపై అలీ, సుప్రేన, రవిబాబు, మలిష్క ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం "నచ్చావ్ అల్లుడు". ఉష సింగంశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రానికి ఎం.ఎస్. శ్రీ చంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: వినోదం | 18 May 2009 | 11:15 am

ఆకాశమంత ట్రైలర్ మీ కోసం...

ప్రకాష్‌రాజ్‌, త్రిష తండ్రీకూతుళ్లుగా నటించిన చిత్రం 'ఆకాశమంత'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రానికి రాధామోహన్‌ దర్శకుడు. జగపతిబాబు ఒక అతిథి పాత్రను పోషించడం ఈ సినిమాలోని విశేషం
Source: వినోదం | 18 May 2009 | 11:02 am

రవితేజ, ఇలియానాల "కిక్" ట్రైలర్

రవితేజ చిత్రమంటేనే అటు వినోదం, ఇటు యాక్షన్ కలగలసి ఉంటుందని ఊహించే ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన చిత్రం కిక్. రవితేజ, ఇలియానాలు కలిసి నటించిన ఈ కిక్ చిత్రం ఆద్యంతం సరదాగా సాగిపోతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వెంకట్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
Source: వినోదం | 18 May 2009 | 10:48 am

14వ లోక్‌సభను రద్దు చేసిన రాష్ట్రపతి

దేశంలో 14వ లోక్‌సభను రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ సోమవారం రద్దు చేశారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆమె కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన మంత్రివర్గం సోమవారంనాడు తమ పదవులకు రాజీనామా చేయడంతో రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Source: జాతీయ | 18 May 2009 | 10:10 am

లోక్‌‍సభ రద్దుకు సిఫార్సు చేసిన కేబినెట్

దేశ రాజధానిలో సోమవారం చివరిసారి సమావేశమైన ప్రస్తుత కేంద్ర మంత్రివర్గం 14వ లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేసింది. ప్రధానమంత్రి నివాసంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పార్లమెంట్ దిగువ సభ రద్దుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
Source: జాతీయ | 18 May 2009 | 9:49 am

ప్రజా వ్యతిరేక చర్యలను అడ్డుకుంటాం: చిరు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక చర్యలను అడ్డుకుంటామని ప్రజారాజ్యం పార్టీ శాసనసభాపక్ష నేత, ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. ఆయన పీఆర్ఎల్పీ నేతగా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 18 May 2009 | 9:45 am

ప్రధాని పదవికి మన్మోహన్ రాజీనామా

ప్రధాని మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. అంతకుముందు సమావేశమైన కేంద్ర మంత్రి మండలి 14వ లోక్‌సభ రద్దుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మాన ప్రతిని రాష్ట్రపతికి ప్రధాని అందేజేశారు.
Source: జాతీయ | 18 May 2009 | 7:44 am

నిజామాబాద్ జిల్లా: ఆర్మూరులో స్వైన్ ఫ్లూ రోగి!

ప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి ఖండాంతరాలను దాటి రాష్ట్ర రాజధానిలోకి ప్రవేశించింది. తాజాగా, జిల్లా సరిహద్దులను దాటింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పిప్రీ గ్రామ వాసికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్టు వార్తలు వస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 18 May 2009 | 7:42 am

పీఆర్పీ శాసనసభాపక్షనేతగా చిరు

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆధ్వర్యంలో సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభకు ఎన్నికైన వారు శాసనసభాపక్ష నేతగా చిరంజీవిని ఎన్నుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 May 2009 | 7:42 am

20న ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణ స్వీకారం!

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్.రాజశేఖర రెడ్డి మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 20వ తేదీన ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సొంతగా 157 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 18 May 2009 | 7:28 am

లోక్‌సభ కొత్త స్పీకర్.. కిషోర్ చంద్ర దేవ్!

15వ లోక్‌సభ సభాపతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ పార్లమెంటేరియన్, వివాద రహితుడు, గిరిజన రాజ వంశీయుడు వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ నియమితులు కానున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన కొత్తగా ఏర్పడిన అరకు లోక్‌సభ స్థానం విజయం సాధించారు.
Source: జాతీయ | 18 May 2009 | 7:26 am

మే 18, 2009 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం
Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2009 | 5:37 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 18 May 2009 | 5:35 am

మాకు అధికారం వద్దు.. మద్దతు ఇస్తాం: ఎస్పీ

తమకు అధికారం వద్దని, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు మాత్రం ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. కొత్త ప్రభుత్వంలో నాలుగో కూటమి పక్షాలు ఆర్జేడీ, ఎస్పీ, ఎల్జేపీలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విముఖత చూపుతోంది.
Source: జాతీయ | 18 May 2009 | 5:29 am

స్వానుభవంతోనే చెబుతున్నా..!

"సార్.. మీరెప్పుడూ చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అని చెబుతుంటారు కదా... మరి మీకు మాత్రం ఎనిమిదిమంది పిల్లలున్నారెందుకు..?"
Source: వినోదం | 18 May 2009 | 5:08 am

బాగా సాగదీసి చూడండి

"ఏమోవ్...? ఏదీ ప్లాస్టీకో, ఏది ఎలాస్టీకో తేడా బొత్తిగా తెలియటంలేదు.. ఏది కొనుక్కురమ్మంటావు..?" బజారుకెళ్లిన...
Source: వినోదం | 18 May 2009 | 5:06 am

బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం

నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ కథానాయకుడిగా యునైటెడ్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్.4గా మాస్టర్ పరుచూరి కిరీటి ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం అవుతుందని బాలకృష్ణ తెలిపారు.
Source: వినోదం | 18 May 2009 | 4:49 am

మద్దతిచ్చేందుకు సిద్ధం: అమర్ సింగ్

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి. ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ సిద్ధంగా ఉంది. దీనిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు షరతులు లేని మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధమేనని ప్రకటించారు.
Source: జాతీయ | 18 May 2009 | 4:24 am

తృతీయ కూటమి సమావేశం రద్దు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఖంగుతిన్న తృతీయ కూటమి.. సోమవారం జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసింది. కాంగ్రెస్‌, భాజపాయేతర పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన మూడో కూటమిలో ఎన్నికల ఫలితాల అనంతరం అయోమయం నెలకొంది. ప్రస్తుతం దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
Source: జాతీయ | 18 May 2009 | 3:25 am

బౌలర్ ఎవరైనా భయపడను: యూసఫ్

తాను బౌలర్ ఎవరైన భయపడనని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ చెప్పాడు. ప్రత్యర్థి విషయంలో ఉండే ఎటువంటి భయమైనా దూకుడుతో కూడిన తన బ్యాటింగ్‌ను ప్రభావితం చేస్తుందని తెలిపాడు. సవాళ్లను ఇష్టపడతాను
Source: Yahoo! Telugu: News | 17 May 2009 | 12:28 pm

మోడీని తెరపైకి తేవడంతో దెబ్బతిన్నాం: శరద్

బీజేపీ యువ నేత వరుణ్ గాంధీ మైనారిటీలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి తేవడం తదితర అంశాలు తాము నష్టపోవడానికి కారణమయ్యాయని ఎన్డీఏ కన్వీనర్ శరద్ యాదవ్ పేర్కొన్నారు.
Source: జాతీయ | 17 May 2009 | 12:23 pm

కాంగ్రెస్‌‍కు ఎస్పీ మద్దతు ఇస్తుంది: అమర్ సింగ్

తాజా లోక్‌సభ ఎన్నికల్లో 200లకుపైగా సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్‌కు తమ పార్టీ నిర్మాణాత్మక
Source: Yahoo! Telugu: News | 17 May 2009 | 12:06 pm

మోడీని తెరపైకి తేవడంతో దెబ్బతిన్నాం: ఎన్డీఏ

తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి తన వైఫల్యానికి కారణాలు వెతికేపనిలో పడింది. బీజేపీ యువ నేత వరుణ్ గాంధీ మైనారిటీలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, గుజరాత్ ముఖ్యమంత్రి
Source: Yahoo! Telugu: News | 17 May 2009 | 11:39 am

పొలిట్‌బ్యూరో భేటీకి బుద్ధదేవ్ గైర్హాజరు!

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య సోమవారం న్యూఢిల్లీలో జరిగే సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితిని సమీక్షించాల్సి ఉన్నందున ఈ పొలిట్‌‍బ్యూరో సమావేశానికి బుద్ధదేవ్ భట్టాచార్య హాజరయ్యే అవకాశం లేదని పార్టీలు పేర్కొన్నాయి.
Source: జాతీయ | 17 May 2009 | 11:22 am

యుద్ధ ప్రాంతంలో పౌరులెవరూ లేరు: శ్రీలంక

శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ఎల్టీటీఈతో యుద్ధం జరుగుతున్న ప్రదేశం నుంచి పౌరులందరూ బయటకు వచ్చారని ఆదివారం ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎల్టీటీఈ ఆధీనంలో ఉన్న అతికొద్ది ప్రదేశాన్ని హస్తగతం చేసుకునేందులు
Source: Yahoo! Telugu: News | 17 May 2009 | 11:21 am

ప్రజాసేవే అధికారానికి మార్గం: పొన్నాల

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేసిన సేవలే కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారాన్ని కట్టబట్టాయని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. తెలంగాణ వాదంతో ఎన్నిక్లలో లబ్దికి పొందేందుకు ప్రయత్నించినవారికి భంగపాటు ఎదురైందని పొన్నాల ఎద్దేవా చేశారు.
Source: ఏపీ న్యూస్ | 17 May 2009 | 11:15 am

రాహుల్‌ను ప్రశంసించిన యువ ఎంపీలు

లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్‌కు అనూకూలంగా రావడంతో ఆ పార్టీ యువ ఎంపీలు రాహుల్ గాంధీని ప్రశంసల్లో ముంచెత్తారు. తాజా ఎన్నికల్లో పార్టీ మెరుగైన ప్రదర్శనకు యువనేత రాహుల్ గాంధీయే కారణమని వారు కీర్తించారు.
Source: Yahoo! Telugu: News | 17 May 2009 | 11:13 am

మాడ్రిడ్ ఫైనల్స్‌లో రఫెల్ నాదల్, ఫెదరర్

ప్రపంచ నెంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారుడు రఫెల్ నాదల్ శనివారం మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. నాటకీయంగా జరిగిన సెమీస్ మ్యాచ్‌లో నాదల్ 3-6, 7-6, 7-6తో మరో అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు.
Source: Yahoo! Telugu: News | 17 May 2009 | 10:50 am

ఓట్లతో తెలంగాణా రాదు: ప్రజాగాయకుడు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యపడుతుందని ప్రజాగాయకుడు గద్దర్ పేర్కొన్నారు. ఓట్ల ద్వారా తెలంగాణ రాదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తానని ఆయన ఆదివారం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 17 May 2009 | 10:29 am

హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసు నమోదు

దేశంలోనే మొదటి స్వైన్ ఫ్లూ కేసు రాష్ట్ర రాజధానిలో వెలుగుచూసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ 23 ఏళ్ల యువకుడు అమెరికాలోని న్యూయార్క్ నుంచి దుబాయ్‌మీదగా ఈ నెల 13న ఇక్కడకు వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 17 May 2009 | 10:26 am

రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: వైఎస్ఆర్

రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉద్ఘాటించారు. దేశ రాజధానిలో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 17 May 2009 | 10:24 am