|
పొలిట్‌బ్యూరో భేటీకి బుద్ధదేవ్ గైర్హాజరు!పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య సోమవారం న్యూఢిల్లీలో జరిగే సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితిని సమీక్షించాల్సి ఉన్నందున ఈ పొలిట్‌బ్యూరో సమావేశానికి బుద్ధదేవ్ భట్టాచార్య హాజరయ్యే అవకాశం లేదని పార్టీలు పేర్కొన్నాయి.Source: జాతీయ | 17 May 2009 | 11:22 am ప్రజాసేవే అధికారానికి మార్గం: పొన్నాలరాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేసిన సేవలే కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారాన్ని కట్టబట్టాయని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. తెలంగాణ వాదంతో ఎన్నిక్లలో లబ్దికి పొందేందుకు ప్రయత్నించినవారికి భంగపాటు ఎదురైందని పొన్నాల ఎద్దేవా చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 May 2009 | 11:15 am కేంద్ర మంత్రివర్గంలోకి యువరక్తం?కేంద్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మంత్రివర్గంలో పలువురు యువకులకు మంత్రిపదవులు కల్పించే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.Source: జాతీయ | 17 May 2009 | 11:14 am ఓట్లతో తెలంగాణా రాదు: ప్రజాగాయకుడుప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యపడుతుందని ప్రజాగాయకుడు గద్దర్ పేర్కొన్నారు. ఓట్ల ద్వారా తెలంగాణ రాదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తానని ఆయన ఆదివారం వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 17 May 2009 | 10:29 am హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసు నమోదుదేశంలోనే మొదటి స్వైన్ ఫ్లూ కేసు రాష్ట్ర రాజధానిలో వెలుగుచూసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ 23 ఏళ్ల యువకుడు అమెరికాలోని న్యూయార్క్ నుంచి దుబాయ్‌మీదగా ఈ నెల 13న ఇక్కడకు వచ్చారు.Source: ఏపీ న్యూస్ | 17 May 2009 | 10:26 am రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: వైఎస్ఆర్రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉద్ఘాటించారు. దేశ రాజధానిలో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 17 May 2009 | 10:24 am ఎస్పీ ప్రధాన కార్యదర్శి అజంఖాన్ రాజీనామాసార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక రోజు కూడా పూర్తికాకముందే సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అజంఖాన్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే, ఎస్పీ పార్లమెంటరీ బోర్డు సభ్యత్వానికి కూడా గుడ్‌బై చెప్పారు.Source: జాతీయ | 17 May 2009 | 9:26 am చెదిరిన "ఉక్కు మనిషి" ప్రధాని కల?భారతీయ జనతా పార్టీలో ఉక్కుమనిషిగా పేరొందిన ఆ పార్టీ అగ్రనేత లాల్‌కృష్ణా అద్వానీ ప్రధాని కల.. కలగానే మిగిలిపోయాయి. 15వ లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ప్రధాని పీఠాన్ని అధిరోహించాలనే ఆశలు అడుగంటి పోయాయి.Source: జాతీయ | 17 May 2009 | 8:15 am చరిత్ర సృష్టించిన యూపీఏ కూటమి15వ లోక్‌సభ ఎన్నికల్లో అధికార యూపీఏ కూటమి అఖండ విజయం సాధించింది. సాధారణ మెజారిటీకి కూతవేటుదూరంలో నిలిచిన యూపీఏ మరోసారి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని నడిపించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.Source: జాతీయ | 17 May 2009 | 6:45 am మే 17, 2009 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా 15.00 అభిరుచి 15.30 ఈనాడు సినిమాSource: Yahoo! Telugu: Entertainment | 17 May 2009 | 6:15 am ఈ వారంSource: Yahoo! Telugu: Entertainment | 17 May 2009 | 6:11 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 17 May 2009 | 6:09 am కేంద్రంలో మరో రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వంకేంద్రంలో మరో రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. శనివారం వెల్లడైన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి విజయం విజయదుందుభి మోగించిన విషయం తెల్సిందే. ఈ కూటమి 257 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.Source: జాతీయ | 17 May 2009 | 5:30 am రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీఅసెంబ్లీ ఫలితాలకు సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రారంభంనుంచి 153 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ అందులో 73 స్థానాలను ఇప్పటికే చేజిక్కించుకుంది.Source: ఏపీ న్యూస్ | 16 May 2009 | 3:30 pm లోక్‌సభ పోరు: అధికార యూపీఏకి ఆధిక్యతలోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. అధికార యూపీఏ కూటమి ప్రత్యర్థులపై ఆధిక్యత కనబరుస్తోంది.Source: జాతీయ | 16 May 2009 | 2:21 pm కాంగ్రెస్ 'జయ హో': సింగ్ ఈజ్ 'కింగ్'కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి దేశంలో తిరిగి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అటు కేంద్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి.Source: జాతీయ | 16 May 2009 | 12:48 pm వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలుదేవదాసు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన యూత్ హీరో రామ్. రెడీ చిత్రం ద్వారా మాస్ హీరోగా ముద్రవేసుకున్న రామ్ స్రవంతి రవికిషోర్ సోదరి కుమారుడన్న సంగతి తెలిసిందే. రామ్ తన పుట్టినరోజు...Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2009 | 12:43 pm 22న ప్రేక్షకుల ముందుకు 'పిస్తా'పందెంకోడి, పొగరు, భరణి, భయ్యా, సెల్యూట్ వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా మాస్ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న విశాల్ తాజాగా 'పిస్తా'గా తెరపైకి రానున్నాడు.Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2009 | 12:27 pm అసెంబ్లీ ఫలితాలు: కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీఅసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలంగా వచ్చాయి. మొత్తం 294 సీట్లకు గాను కాంగ్రెస్ 155 స్థానాల్లో విజయభేరీ మోగించింది. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ సంఖ్య 148ను సొంతగానే సాధించింది.Source: ఏపీ న్యూస్ | 16 May 2009 | 12:14 pm ఇలాంటి ఫలితాలను ఉహించలేదు: బీజేపీతాజా లోక్‌సభ ఎన్నికల్లో తాము ఈ ఫలితాలు ఊహించలేదని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. శనివారం జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి ప్రదర్శన ఘోరంగా ఉండటంతో.. రాజ్‌నాథ్ పరాజయాన్ని అంగీకరించారు.Source: జాతీయ | 16 May 2009 | 11:51 am యూపీలో కాంగ్రెస్ హవా: బీఎస్పీకి ఆధిక్యతరాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీఎస్పీ 24 సీట్లలో ఆధిక్యతలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పరిస్థితి గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి బాగా మెరుగుపడింది. సమాజ్‌వాదీ పార్టీ 23 సీట్లలో ముందంజలో ఉంది. గత ఎన్నికల కంటే కాంగ్రెస్ రెట్టింపు సీట్లను కైవసం చేసుకునే దిశగా ముందుకు కదులుతోంది.Source: జాతీయ | 16 May 2009 | 11:45 am ఈ ఎన్నికల్లో డబ్బు పనిచేసింది: చిరంజీవితాజాగా ముగిసిన ఎన్నికల్లో డబ్బు బాగా పనిచేసిందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై తాను సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ పూర్తిగా వెనకబడిన తరుణంలో చిరంజీవి శనివారం మాట్లాడుతూ ఫలితాలపై స్పందించారు.Source: ఏపీ న్యూస్ | 16 May 2009 | 11:33 am అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ప్రముఖులురాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలవుతున్న తరుణంలో తాజా ఫలితాల ప్రకారం ఓటమిపాలైన వారిలో పలువురు ప్రముఖులు ఉండడం గమనార్హం. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కాక, తెలుగుదేశం పార్టీకి చెందిన మరి కొందరు ప్రముఖులు ఓటమి పాలయ్యారు.Source: ఏపీ న్యూస్ | 16 May 2009 | 11:30 am
|