కాంగ్రెస్ 'జయ హో': సింగ్ ఈజ్ 'కింగ్'

కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి దేశంలో తిరిగి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అటు కేంద్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి.
Source: జాతీయ | 16 May 2009 | 12:48 pm

వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు

దేవదాసు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన యూత్ హీరో రామ్. రెడీ చిత్రం ద్వారా మాస్ హీరోగా ముద్రవేసుకున్న రామ్ స్రవంతి రవికిషోర్ సోదరి కుమారుడన్న సంగతి తెలిసిందే. రామ్ తన పుట్టినరోజు...
Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2009 | 12:43 pm

22న ప్రేక్షకుల ముందుకు 'పిస్తా'

పందెంకోడి, పొగరు, భరణి, భయ్యా, సెల్యూట్ వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా మాస్ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న విశాల్ తాజాగా 'పిస్తా'గా తెరపైకి రానున్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2009 | 12:27 pm

అసెంబ్లీ ఫలితాలు: కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలంగా వచ్చాయి. మొత్తం 294 సీట్లకు గాను కాంగ్రెస్ 155 స్థానాల్లో విజయభేరీ మోగించింది. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ సంఖ్య 148ను సొంతగానే సాధించింది.
Source: ఏపీ న్యూస్ | 16 May 2009 | 12:14 pm

ఇలాంటి ఫలితాలను ఉహించలేదు: బీజేపీ

తాజా లోక్‌సభ ఎన్నికల్లో తాము ఈ ఫలితాలు ఊహించలేదని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. శనివారం జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి ప్రదర్శన ఘోరంగా ఉండటంతో.. రాజ్‌నాథ్ పరాజయాన్ని అంగీకరించారు.
Source: జాతీయ | 16 May 2009 | 11:51 am

యూపీలో కాంగ్రెస్ హవా: బీఎస్పీకి ఆధిక్యత

రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీఎస్పీ 24 సీట్లలో ఆధిక్యతలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పరిస్థితి గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి బాగా మెరుగుపడింది. సమాజ్‌వాదీ పార్టీ 23 సీట్లలో ముందంజలో ఉంది. గత ఎన్నికల కంటే కాంగ్రెస్ రెట్టింపు సీట్లను కైవసం చేసుకునే దిశగా ముందుకు కదులుతోంది.
Source: జాతీయ | 16 May 2009 | 11:45 am

మన్మోహనే ప్రధాని అభ్యర్థి: కాంగ్రెస్

తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అధికార యూపీఏ కూటమికి అనుకూలంగా వస్తుండటంతో... మన్మోహన్ సింగే తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని, ఆయనే ప్రధానిగా కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ తేల్చిచెప్పింది. ప్రస్తుతానికి ప్రధానమంత్రి మన్మోహన్‌నేనని, భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది తెలిపారు.
Source: జాతీయ | 16 May 2009 | 11:43 am

రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా

అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రారంభంనుంచి 153 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ అందులో 73 స్థానాలను ఇప్పటికే చేజిక్కించుకుంది.
Source: ఏపీ న్యూస్ | 16 May 2009 | 11:37 am

ఈ ఎన్నికల్లో డబ్బు పనిచేసింది: చిరంజీవి

తాజాగా ముగిసిన ఎన్నికల్లో డబ్బు బాగా పనిచేసిందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై తాను సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ పూర్తిగా వెనకబడిన తరుణంలో చిరంజీవి శనివారం మాట్లాడుతూ ఫలితాలపై స్పందించారు.
Source: ఏపీ న్యూస్ | 16 May 2009 | 11:33 am

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ప్రముఖులు

రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలవుతున్న తరుణంలో తాజా ఫలితాల ప్రకారం ఓటమిపాలైన వారిలో పలువురు ప్రముఖులు ఉండడం గమనార్హం. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కాక, తెలుగుదేశం పార్టీకి చెందిన మరి కొందరు ప్రముఖులు ఓటమి పాలయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 16 May 2009 | 11:30 am

కేంద్రంలో మరోసారి అధికార పీఠం దిశగా కాంగ్రెస్

కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యూపీఏ కూటమి 15వ లోక్‌సభ సభ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. దేశవ్యాప్తంగా శనివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటివరకు అందిన 529 నియోజకవర్గాల ట్రెండ్స్ ప్రకారం.. అధికార యూపీఏ పక్షాలు 230 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా, ప్రతిపక్ష ఎన్డీఏ 159 స్థానాల్లో ముందంజలో ఉంది.
Source: జాతీయ | 16 May 2009 | 11:24 am

యూపీఏ ఆధిక్యం: కార్యకర్తల పండుగ

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి భారీ ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. దీంతో దేశరాజధాని ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. యూపీఏ కూటమి ముందంజలో దూసుకు పోతున్న నేపథ్యంలో.. టెన్‌ జనపథ్‌లోని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా ఇంటి ముందు ఆ పార్టీ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు.
Source: జాతీయ | 16 May 2009 | 8:55 am

పీఆర్పీ‌తో తెలుగుదేశం మంతనాలు..?

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో.. ప్రజారాజ్యం పార్టీ కీలకమైన శక్తిగా అవతరిస్తోంది. ఇప్పటివరకూ విడుదలైన ఎన్నికల ఫలితాల్లో అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు మహాకూటమి ప్రజారాజ్యం పార్టీ మద్దతు లేనిదే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితి నెలకొనేటట్లు కనబడుతోంది.
Source: ఏపీ న్యూస్ | 16 May 2009 | 8:03 am

వామపక్షాల మద్దతు లభిస్తుంది: కాంగ్రెస్ ఆశాభావం

బీజేపీ మతతత్వ, విభజన రాజకీయాలకు అడ్డుకట్ట వేసేందుకు వామపక్షాలు తమకు మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బీకే హరిప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రమాదకర రాజకీయాలను అడ్డుకోవాలని అందరూ అర్థం చేసుకున్నారన్నారు.
Source: జాతీయ | 16 May 2009 | 7:26 am

ఓటమిని అంగీకరించిన భాజపా

15వ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎదురైన అనూహ్య పరాజయాన్ని భారతీయ జనతా పార్టీ అంగీకరించింది. దీంతో భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం సాయంత్రం ఐదు గంటలకు భేటీ కానున్నట్టు భాజపా అధిష్టానం ప్రకటించింది.
Source: జాతీయ | 16 May 2009 | 6:32 am

లోక్‌సభ పోరు: అధికార యూపీఏకి ఆధిక్యత

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. అధికార యూపీఏ కూటమి ప్రత్యర్థులపై ఆధిక్యత కనబరుస్తోంది.
Source: జాతీయ | 16 May 2009 | 6:28 am

ప్రధాని అభ్యర్థిత్వానికి మాయ లేదా పవార్ ఓకే!

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ లేదా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒరిస్సా అధికార బీజేడీ తెలిపింది.
Source: జాతీయ | 16 May 2009 | 5:29 am

2013లో చంద్రయాన్-2 ప్రయోగం: నాయర్

చంద్రయాన్-2 కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ తెలిపారు. ఈ ప్రయోగం 2013లో జరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం శుక్రవారం కుటుంబ సమేతంగా మాధవన్ నాయర్ తిరుమల విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకున్న మాధవన్ నాయర్‌కు అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Source: ఏపీ న్యూస్ | 16 May 2009 | 5:23 am

టెన్షన్.. టెన్షన్.. నేతలకు ముచ్చెమటలు

ప్రాంతీయ, వార్తలు, ఎన్నికలు, ఫలితాలు, ఎన్డీయే, యూపీఏ, లెఫ్ట్ ఫ్రంట్, భాజపా, కాంగ్రెస్, పార్లమెంట్, ఎలక్షన్, వోట్, కౌంటింగ్, నేతలు, ఎన్నికలు, పోలింగ్, కౌంటింగ్, రాష్ట్రం, అసెంబ్లీ, చిరంజీవి, తెదేపా,
Source: ఏపీ న్యూస్ | 16 May 2009 | 2:42 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2009 | 2:02 am

మే 16, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 న్యూ సినిమా స్పెషల్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 నీపేరేనా ప్రేమ 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమా ...
Source: Yahoo! Telugu: Entertainment | 16 May 2009 | 1:58 am

మళ్లీ వైఎస్సే ముఖ్యమంత్రి: మంత్రి కన్నా

ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మళ్లీ వైఎస్సే ముఖ్యమంత్రి అవుతారని రవాణాశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు మళ్లీ అధికారాన్ని కట్టబెడతాయని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2009 | 12:25 pm

తెలంగాణలో కూటమికే ఆధిక్యం: మధుయాష్కీ

తెలంగాణ జిల్లాలకు సంబంధించి మహాకూటమికే ఎక్కువ స్థానాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసిన కారణంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున నష్టపోనుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 15 May 2009 | 11:56 am

జంట పేలుళ్ల కేసులో ఛార్జిషీటు దాఖలు

హైదరాబాద్‌లో గత ఏడాది సంభవించిన జంట పేలుళ్ల కేసులో ఆక్టోపస్ అధికారులు ఎట్టకేలకు ఛార్జిషీటును దాఖలు చేశారు. మొత్తం ఏడుగురిపై అభియోగాలు మోపుతూ 1207 పేజీల ఛార్జిషీటును అధికారులు నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. ఈ ఛార్జిషీటును దాఖలు చేసేముందు అధికారులు మొత్తం 159 మందిని విచారించడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 15 May 2009 | 11:47 am

మార్కెట్లో లాభాలు: సెన్సెక్స్ 301 పాయింట్లు వృద్ధి

మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో దేశమంతా ఉత్కంఠ నెలకొని ఉండగా దాని ప్రభావం మాత్రం శుక్రవారం స్టాక్ మార్కెట్‌పై కనిపించలేదు. ఇందుకు నిదర్శనంగానే శుక్రవారం లాభాలబాట పట్టిన సెన్సెక్స్...
Source: Yahoo! Telugu: News | 15 May 2009 | 11:46 am