|
పవార్, లాలూతో సోనియా మంతనాలుకాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఎన్సీపీ నేత శరద్ పవార్, ఆర్జేడీ చీఫ్ లాలూ, ఎల్జేపీ అధినేత పాశ్వాన్‌తో సంప్రదింపులు జరిపారు. శరద్ పవార్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై యూపీఏ భాగస్వామ్య పక్షాలు సోనియాగాంధీ వద్ద లేవనెత్తినట్లు సమాచారం. ఇదే అంశంపై పార్టీలు సుమారు అరగంటపాటు చర్చించుకున్నట్లు సమాచారం.Source: జాతీయ | 14 May 2009 | 12:20 pm ర్యాలీలకు అనుమతి తప్పనిసరి : ఈసీగత నెల రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలను పటిష్టవంతంగా నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐ.వీ. సుబ్బారావు ప్రస్తుతం ఎన్నికలలో గెలుపొందే నాయకులకు మరిన్ని సూచనలు చేశారు. ఇందులో భాగంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవాలనుకునేవారు ప్రత్యేక అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని ఆయన అభ్యర్థులకు సూచించారుSource: ఏపీ న్యూస్ | 14 May 2009 | 12:15 pm నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ఎన్నికల ఫలితాల భయంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. దీంతో సెన్సెక్స్ 147 పాయింట్ల నష్టంతో 11,873 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద గురువారం 2,554 సంస్థల వాటాలకు ట్రేడింగ్ జరుగగా 1,263 సంస్థల...Source: Yahoo! Telugu: News | 14 May 2009 | 11:19 am ఫలితాల తర్వాత విజయయాత్రలకు ఈసీ ఓకేఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థులు విజయయాత్రలకు ఎన్నికల సంఘం సరేనంది. అయితే ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలదే తుది నిర్ణయమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.Source: Yahoo! Telugu: News | 14 May 2009 | 11:07 am భారత్ రాజకీయాల్లో అమెరికా జోక్యాన్ని ఒప్పుకోం: లెఫ్ట్భారతదేశ తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో అమెరికా పాత్ర పోషించడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు పీటర్ బర్లీగ్ సమావేశాలు రుజువు చేస్తున్నాయని సీపీఐ ఆరోపించింది. ఎటువంటి కారణం లేకుండా భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి అద్వానీతో పీటర్ ఎందుకు సమావేశమయ్యారో తేల్చాలంది. పీటర్ ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, పీఆర్పీ అధినేత చిరంజీవితో సమావేశమయ్యారు. కేంద్రంలో రూపుదిద్దుకుంటున్న తృతీయ కూటమికి మద్దతు ఇవ్వవద్దని చంద్రబాబును, చిరంజీవిని పీటర్ కోరారనే ఆరోపణలు వినవస్తున్నాయి.Source: జాతీయ | 14 May 2009 | 10:52 am టాస్ గెలిచిన కింగ్స్: బ్యాటింగ్ ఎంపికఐపీఎల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో ప్రారంభమైన టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్న చెన్నై జట్టు సెమీస్‌లో...Source: Yahoo! Telugu: News | 14 May 2009 | 10:48 am తీవ్రవాదంపై పోరులో పాక్‌కు సాయం: బ్రిటన్తీవ్రవాదంపై పోరాడే విషయంలో తాము పాకిస్థాన్‌కు ఆర్థికంగా సాయపడుతామని బ్రిటన్ తెలిపింది. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ బ్రిటన్ పర్యటన సందర్భంగా ప్రధాని గార్డన్ బ్రౌన్ ఈ మేరకు హామీ ఇచ్చారు.Source: Yahoo! Telugu: News | 14 May 2009 | 10:22 am మహాకూటమికి అధికారం ఖాయం: బాబుఎన్నికల ఫలితాల అనంతరం మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అదేసమయంలో సర్వేల పేరుతో వస్తున్న వార్తలను పట్టించుకోవాల్సిన...Source: Yahoo! Telugu: News | 14 May 2009 | 10:06 am ప్రజారాజ్యంకు మద్దతుగా రక్తదానంఎన్నికల ఫలితాల తర్వాత ప్రజారాజ్యం అధికారంలోకి రావాలని కోరుతూ కొందరు అభిమానులు గురువారం రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారానికి అవసరమైన 148 సీట్లు ప్రజారాజ్యానికి రావాలని కోరుకుంటూ...Source: Yahoo! Telugu: News | 14 May 2009 | 9:26 am ధరల అదుపునకు ముఖ్యమంత్రి ఆదేశంరాష్ట్రంలో ఆకాశాన్ని అంటుతున్న అధిక ధరలను తగ్గించేందుకు కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశాలు జారీ చేశారు. ధరల పెరుగుదలకు బ్లాక్ మార్కెట్టే కారణమని పేర్కొంటుండగా, వీటిపై పూర్తి స్వేచ్ఛతో దాడులు నిర్వహించాలని విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.Source: ఏపీ న్యూస్ | 14 May 2009 | 9:18 am బీజేపీ రాకుండా అడ్డుకుంటాం: కారత్ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అడ్డుకుంటామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ పేర్కొన్నారు. బీజేపీ అధికారం చేపట్టకుండా ఉండేందుకై...Source: Yahoo! Telugu: News | 14 May 2009 | 9:17 am మెజారిటీని అనుసరించే క్యాంపు శిబిరం: అల్లుఫలితాల అనంతరం మెజారిటీని అనుసరించే ప్రజారాజ్యం పార్టీ క్యాంపు శిబిరాన్ని నిర్వహించే అవకాశం ఉందని, ఇందుకోసం అభ్యర్థులందరూ సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ కోరారు. శనివారం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల్లోనే ఉండాలన్నారు.Source: ఏపీ న్యూస్ | 14 May 2009 | 9:13 am భాజపాను అధికారంలోకి రానివ్వం: కారత్ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు చేసే ప్రతి పనిని అడ్డుకుంటామని, అసలు ఆ పార్టీని అధికారంలోకి రానివ్వబోమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ స్పష్టం చేశారు.Source: జాతీయ | 14 May 2009 | 9:03 am వైద్య సేవలో నిర్లక్ష్యం: నిమ్స్‌కు జరిమానావైద్య సేవలో నిర్లక్ష్యం ప్రదర్శించి ఓ వ్యక్తి జీవితంతో చెలగాటం ఆడుకున్న హైదరాబాద్‌కు చెందిన నిజాం వైద్య కళాశాల (నిమ్స్)పై సుప్రీం కోర్టు కన్నెర్రజేసింది. వైద్య సేవలో నిర్లక్ష్యం వహించడం ద్వారా బాధితుడు జీవితాంతం కష్టపడేలా...Source: Yahoo! Telugu: News | 14 May 2009 | 8:21 am వరుణ్‌గాంధీపై నాసా చెల్లదు: సుప్రీంకోర్టుభారతీయ జనతా పార్టీ యువనేత, ఫిలిబిత్ లోక్‌సభ అభ్యర్థి వరుణ్‌గాంధీపై మాయావతి సర్కారు ప్రయోగించిన జాతీయ భద్రతా చట్టం (నాసా) చెల్లదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం...Source: Yahoo! Telugu: News | 14 May 2009 | 8:00 am భాజపాను అడ్డుకుంటాం: నాలుగో కూటమిభారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టకుండా నాలుగో కూటమి అడ్డుకుంటుందని కేంద్ర మంత్రి, ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏకు తగినంత మెజారిటీ రానిపక్షంలో కేంద్రంలో ఏర్పడే ప్రత్యామ్నాయ లౌకికవాద ప్రభుత్వానికి నాలుగో కూటమి మద్దతు ఇస్తుందన్నారు.Source: జాతీయ | 14 May 2009 | 7:29 am అందుకే ఐపీఎల్‌లో రాణిస్తున్నా: హేడెన్అంతర్జాతీయ క్రికెట్ కేరీర్‌కు స్వస్తి చెప్పడం వల్లే తాను ఐపీఎల్-2లో చక్కగా రాణించగలుగుతున్నానని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మ్యాథ్యూ హేడెన్ చెప్పాడు. ఐపీఎల్ రెండో సీజన్ పోటీల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున...Source: Yahoo! Telugu: News | 14 May 2009 | 7:21 am "రాజు"గారి పాలనకు ఐదు సంవత్సరాలువైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి గురువారంతో ఐదేళ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని లాల్ బహుదూర్ స్టేడియంలో 2004 మే 14వ తేదీన జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.Source: ఏపీ న్యూస్ | 14 May 2009 | 7:05 am భాజపాకు అందలం ఖాయం: రాజ్‌నాథ్ సింగ్సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత భాజపా అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, తమకు మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు ముందుకు వస్తున్నాయని జోస్యం చెప్పారు.Source: జాతీయ | 14 May 2009 | 6:19 am ఎగ్జిట్ పోల్స్ అంతా ట్రాష్: కాంగ్రెస్, భాజపా, లెఫ్ట్బుధవారం ఐదో దశ ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయా టీవీ ఛానళ్లు ప్రకటించిన ఎగ్జిట్ ఫలితాలన్నీ బూటకమని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ, వామపక్షాలు కొట్టిపారేశాయి. యూపీఏ కూటమికి 272 స్థానాలకంటే తక్కువ వస్తాయని ఎగ్జిట్ ఫలితాల్లో వెల్లడించడాన్ని తాము అంగీకరించడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా అన్నారు.Source: జాతీయ | 14 May 2009 | 6:08 am 18వ తేదీన తృతీయ కూటమి నేతల భేటీ!సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన 48 గంటల తర్వాత తర్వాత తృతీయ కూటమి నేతలు దేశ రాజధానిలో భేటీ కానున్నారు. ఈనెల 18వ తేదీన జరిగే ఈ సమావేశానికి వామపక్ష నేతలైన ప్రకాష్ కారత్, ఏబీ బర్ధన్‌ను నాయకత్వం వహిస్తారు. ఇందులో కాంగ్రెస్, భాజపాయేతర పార్టీల నేతలు పాల్గొనున్నారు.Source: జాతీయ | 14 May 2009 | 5:13 am ముగిసి పోలింగ్: ఫలితాల కోసం నిరీక్షణదేశ వ్యాప్తంగా ఐదు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసింది. చివరిదశ పోలింగ్‌లో సరాసరిగా 62 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, మొత్తం ఐదు దశల్లో కలిపి సగటున 60 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలిపింది.Source: జాతీయ | 14 May 2009 | 4:14 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 14 May 2009 | 3:36 am మే 14, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...Source: Yahoo! Telugu: Entertainment | 14 May 2009 | 3:34 am ఎగ్జిట్ పోల్ ఫలితాలు: ఆధిక్యంలో కాంగ్రెస్ కూటమిఐదో దశ ముగిసిన ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ ఛానల్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కేంద్రంలో యూపీఏ కూటమి ముందంజలో ఉంది. అన్ని ప్రధాన ఛానళ్లు నిర్వహించిన సర్వే ఫలితాల్లో యూపీఏకు 199 సీట్లు, ఎన్డీయేకు 180 నుంచి 195, తృతీయ కూటమికి 105 మిగిలిన స్థానాల్లో ఇతరులు పాగా వేస్తారని ఈ ఫలితాలు వెల్లడించాయి.Source: జాతీయ | 13 May 2009 | 2:47 pm ఫలితాల తర్వాతే తదుపరి నిర్ణయం: జయఈనెల 16వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలు తర్వాతే తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నట్టు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ పార్టీ నిర్ణయాల గురించి తానేమీ వ్యాఖ్యానించదల్చుకోలేదని, మే 16 తర్వాతే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు.Source: జాతీయ | 13 May 2009 | 12:23 pm సత్యం రాజు సోదరులకు రిమాండ్ పొడిగింపుసత్యం సంస్థ ఆర్థిక కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజు, ఆయన సోదరుడికి విధించిన రిమాండ్‌ను ఈనెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన రిమాండ్ కాలపరిమితి పూర్తయిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.Source: ఏపీ న్యూస్ | 13 May 2009 | 12:21 pm రాజధానిలో సూట్‌కేసులో మృతదేహంహైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో బుధవారం ఓ సూట్‌కేసులో ఉంచిన శవం బయటపడడం కలకలం సృష్టించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శవం గురించి మిగిలిన వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 13 May 2009 | 12:14 pm
|