ప్రశాంతంగా సాగుతున్న జమ్మూ బంద్

వాయువ్య పాకిస్థాన్‌లో నివాసముంటున్న సిక్కులపై తాలిబన్లు అమానుషంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ జమ్మూలో కొన్ని సంస్థలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. వీహెచ్‌పీతో సహా దాదాపు 20 సంస్థలు ఈ బంద్ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాయి.
Source: జాతీయ | 8 May 2009 | 9:04 am

భోలక్‌పూర్ మృతులకు పరిహారం: రోశయ్య

భోలక్‌పూర్‌లో కలుషిత నీటిని తాగడం వల్ల మృతి చెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం చెల్లించనున్నట్టు ఆర్థికశాఖ మంత్రి రోశయ్య ప్రకటించారు. భోలక్‌పూర్ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందినట్టు రోశయ్య పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 May 2009 | 7:47 am

వడగళ్లకు లక్షన్నర ఎకారాల్లో పంట నష్టం

రాష్ట్రంలో ఈవారం ప్రారంభంలో రెండు రోజులపాటు కురిసిన వడగళ్ల వర్షం కారణంగా దాదాపు 1.58 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ పేర్కొంది. ఈ వడగళ్ల కారణంగా వరి, మొక్కజొన్న, అరటి, మామిడి, కూరగాయల పంటలు ఎక్కువగా దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ వివరించింది.
Source: ఏపీ న్యూస్ | 8 May 2009 | 7:38 am

ముఖ్యమంత్రికి 145వ లేఖ రాసిన దత్తన్న

ఎన్నికల హడావిడిలో కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌కు లేఖలు రాయడాన్ని ఆపివేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తాజాగా మరో లేఖాస్త్రాన్ని సంధించారు. ఎన్నికలముందు వరకు వైఎస్‌కు 144 లేఖలు రాసిన దత్తాత్రేయ భోలక్‌పూర్ ఘటనకు సంబంధించి గురువారం 145వ లేఖాస్త్రాన్ని సంధించారు.
Source: ఏపీ న్యూస్ | 8 May 2009 | 7:33 am

ప్రమాదంలో ఫైళ్లు కాలిపోలేదు: మంత్రి శత్రుచర్ల

సచివాలయంలోని డి-బ్లాకులో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో అటవీశాఖకు సంబంధించిన ఎలాంటి ఫైళ్లు దగ్ధం కాలేదని రాష్ట్ర అటవీ శాఖామంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదంలో సర్వర్లు మాత్రమే కాలిపోయాయని, ఫైళ్లు మాత్రం సురక్షితంగానే ఉన్నాయని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 8 May 2009 | 7:29 am

విచ్ఛిన్నం చేసిన యూపీఏ విధానాలు: అద్వానీ

కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం దేశాన్ని నాశనం చేశాయని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే.అద్వానీ ఆరోపించారు.
Source: జాతీయ | 8 May 2009 | 7:10 am

మోడీ ప్రధాని అభ్యర్థిత్వానికి నితీష్ వ్యతిరేకత

భారతీయ జనతా పార్టీ తరపున 2014లో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును ఆ పార్టీ నేతలు ప్రచారం చేయడం పట్ల జనతాదళ్ (యు) సీనియర్ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యతిరేకించారు. గత 2002 సంవత్సరంలో జరిగిన గుజరాత్‌ అల్లర్లను దేశ ప్రజలు ఎవరూ మరచిపోలేదని, మరచి పోరని ఆయన వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 8 May 2009 | 6:12 am

సత్యసాయి బాబాను దర్శించుకున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గురువారం పుట్టపర్తి సాయిబాబాను దర్శించి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతోపాటు బాబా దర్శనానికి విచ్చేసిన పాటిల్‌కు బాబా ప్రత్యేక ఇంటర్వ్యూతోపాటు ప్రసాదాలను అందజేశారు.
Source: ఏపీ న్యూస్ | 8 May 2009 | 5:54 am

ఏజెన్సీ ప్రాంతాల్లో "ప్రజా" వైద్య శిబిరాలు: చిరు

మన్యం ప్రాంతాల్లో మంచాన పడిన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గిరిజన ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రజారాజ్యం పార్టీ నడుంబిగించింది. ప్రాణాంతక వ్యాధులతో అల్లాడుతున్న వారికి కొంతమేరకైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఈ ప్రాంతాల్లో ప్రజా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావించింది.
Source: ఏపీ న్యూస్ | 8 May 2009 | 5:14 am

నాలుగో దశ ఎన్నికలు: 57 శాతం పోలింగ్

దేశవ్యాప్తంగా గురువారం జరిగిన నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల్లో 57 శాతం పోలింగ్ జరిగింది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 85 నియోజకవర్గాల్లో ఈ దశలో ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నాలుగో దశ ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నారు.
Source: జాతీయ | 8 May 2009 | 4:18 am

జేడీయూ, ఏడీఎంకేలతో కాంగ్రెస్ పొత్తు: షీలా

బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీ(యు), తమిళనాడు ప్రతిపక్షమైన అన్నాడీఎంకే వంటి పార్టీలతో ఎన్నికల తరువాత పొత్తుపై కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎన్నికల తరువాత ఆ రెండు పార్టీలతో చెలిమి కుదురుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 8 May 2009 | 4:16 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 8 May 2009 | 3:53 am

మే 08, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 ప్రేమలు- పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ ...
Source: Yahoo! Telugu: Entertainment | 8 May 2009 | 3:51 am

ఓటింగ్ రోజున శెలవు ఎందుకు: కిరణ్ ప్రశ్న

దేశంలో జరిగిన నాలుగో దశ ఎన్నికలలో ఓటింగ్ శాతం చాలా తక్కువ నమోదు కావడంపై రాజకీయ శ్రేణులలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే అసలు ఓటింగ్ రోజున శెలవు ప్రకటించడం వల్లనే ఈ పరిస్థితి దాపురిస్తోందని తొలి మహిళా పోలీస్ అధికారి కిరణ్ బేడీ వెల్లడించారు.
Source: జాతీయ | 7 May 2009 | 2:16 pm

డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్

అబ్బాస్, గ్రేసీసింగ్, ఆకాశ్, అర్చన, సాయికిరణ్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం "రామ్‌దేవ్". రామ్- దేవ్‌లుగా అబ్బాస్, ఆకాష్‌లు నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.కె. బషీద్ దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.
Source: Yahoo! Telugu: Entertainment | 7 May 2009 | 12:13 pm

కాంగ్రెస్‌తో కలిసి పనిచేయక తప్పదు: అమర్ సింగ్

ఎన్నికల అనంతరం సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తుందని ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ వెల్లడించారు. లౌకిక వాదాన్ని పరిరక్షించడానికి తాము కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తృతీయ కూటమిలో మాయావతి ఉంది కనుక తాము ఆ కూటమితో కలిసి వెళ్లే అవకాశం లేదన్నారు.
Source: జాతీయ | 7 May 2009 | 12:11 pm

21 నుంచి "వరుడు" షెడ్యూల్ ప్రారంభం

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం "వరుడు" షూటింగ్ గండిపేటలో జరగనుంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న తాజా షెడ్యూల్‌లో షూటింగ్ కోసం గండికోటలో ప్రత్యేకంగా సెట్ వేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 May 2009 | 12:02 pm

డబ్బింగ్ కార్యక్రమాల్లో రామ్‌దేవ్!

అబ్బాస్, గ్రేసీసింగ్, ఆకాశ్, అర్చన, సాయికిరణ్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం "రామ్‌దేవ్". రామ్‌దేవ్‌లుగా అబ్బాస్, ఆకాష్‌లు నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.కె. బషీద్ నిర్మాత దర్శకత్వం వహించడం విశేషం.
Source: వినోదం | 7 May 2009 | 11:43 am

21 నుంచి "వరుడు" షెడ్యూల్ ప్రారంభం

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం "వరుడు" షూటింగ్ గండిపేటలో జరుగనుంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న తాజా షెడ్యూల్‌లో భాగంగా, ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకమైన సెట్‌ను గండికోటలో ఏర్పాటు చేశారు.
Source: వినోదం | 7 May 2009 | 11:17 am

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 164 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) గురువారం లాభాల బాటలో నడిచింది. 112 పాయింట్ల వృద్ధితో 12,064 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం లాభాలను నిలిపివుంచుకోలేక 11,981 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే కాసపటికే
Source: Yahoo! Telugu: News | 7 May 2009 | 11:12 am

భోలక్‌పూర్‌ నీటిలో 114రెట్లు ఎక్కువ బాక్టీరియా

భోలక్‌పూర్‌లో కలుషిత నీటిలో 114రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఇక్కడ సరఫరా అవుతున్న నీరు త్రాగి అస్వస్థకుగురై ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో రెండొందల మంది స్థానికులు ఆస్పత్రుల్లో
Source: Yahoo! Telugu: News | 7 May 2009 | 11:05 am

సచివాలయం ముట్టడికి ప్రజారాజ్యం యత్నం

భోలక్‌పుర్ ఘటనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గురువారం ఉదయం ప్రజరాజ్యం పార్టీ నేతలు సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. భోలక్‌పుర్ ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ప్రజలకు
Source: Yahoo! Telugu: News | 7 May 2009 | 11:01 am

తాలిబాన్లతో ఇకపై చర్చలు ఉండవు: గిలానీ

తాలిబాన్ తీవ్రవాదులతో ఇకపై చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్థాన్ అధ్యక్షుడు యూసఫ్ రజా గిలానీ స్పష్టం చేశారు. స్వాత్ శాంతి ఒప్పందం రద్దు అయిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తాలిబాన్లతో తదుపరి చర్చలు జరిపే అవకాశాన్ని
Source: Yahoo! Telugu: News | 7 May 2009 | 10:53 am

సచివాలయం డి-బ్లాకులో అగ్నిప్రమాదం

సచివాలయంలోని డి-బ్లాకులో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్- సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. డి-బ్లాకులోని రెండు, మూడు అంతస్తుల్లో మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక
Source: Yahoo! Telugu: News | 7 May 2009 | 10:39 am

ఆరోగ్యశ్రీ సర్వరోగనివారణి కాదు: చిరంజీవి

రాష్ట్రంలో జ్వరాలు, ఆంత్రాక్స్ బారినపడి వేలాది మంది గిరిజనులు మృతి చెందుతున్నారని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే, రాష్ట్రం జబ్బునపడినట్లు ఉందని చిరంజీవి పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 7 May 2009 | 10:32 am