|
మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 178 పాయింట్ల పతనంబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం నష్టాల్లో నడిచింది. 30 పాయింట్ల పతనంతో 12,101 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే కొనసాగింది. ఆపై లాభాల బాటలోకి వచ్చిన బీఎస్ఈ సూచి ఒకానొక దశలో 12,272Source: Yahoo! Telugu: News | 6 May 2009 | 11:38 am అద్వానీ విమర్శలకు రాహుల్ గాంధీ చెక్!కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. గడిచిన ఐదేళ్ల పాలనలో మన్మోహన్ సింగ్‌ను పదేపదే బలహీన ప్రధానిగా పిలుస్తూ వస్తున్న భాజపాకి చెక్ పెట్టే విధంగా "తానింతవరకు బలహీనమైన సిక్కు"ను చూడలేదన్నారు.Source: జాతీయ | 6 May 2009 | 11:29 am అనిల్ కుంబ్లేను కెప్టెన్ చేయాలనుకున్నా: మల్యాఅనిల్ కుంబ్లేకు జట్టు పగ్గాలు అప్పగించాలనే నిర్ణయం తీసుకుంది తానేనని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ యజమాని విజయ్ మల్యా చెప్పారు. ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉండేందుకు కెవిన్ పీటర్సన్Source: Yahoo! Telugu: News | 6 May 2009 | 10:55 am ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడి: 10మంది మృతిఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి దాడులకు పాల్పడ్డారు. దీంతో పదిమంది మృతి చెందారు. దంతెవాడ జిల్లాలోని కుంట పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోని ఇంజరం బెజ్జి రహదారిపై నక్సల్స్ మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు సల్వాజుడుం కార్యకర్తలు ఉండగా, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, నలుగురు గ్రామస్తులు ఉన్నట్లు సమాచారం.Source: జాతీయ | 6 May 2009 | 10:46 am భోలక్‌పూర్ దుర్ఘటనపై భాజపా ఆగ్రహంహైదరాబాద్లోని భోలక్‌పూర్‌లో కలుషిత నీరు తాగి ఏడుగురు మృతి చెందిన ఘటనపై భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లే భోలక్‌పూర్ ఘటన చోటు చేసుకుందని ఆయన ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 6 May 2009 | 10:06 am బలహీనమైన సిక్కును నేను చూడలేదు: రాహుల్కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. గడిచిన ఐదేళ్ల పాలనలో మన్మోహన్ సింగ్‌ను పదేపదే బలహీన ప్రధానిగా పిలుస్తూ వస్తున్న బీజేపీకి చెక్ పెట్టే విధంగాSource: Yahoo! Telugu: News | 6 May 2009 | 9:44 am భోలక్‌పూర్ ఘటనపై సీపీఐ నిరసనహైదరాబాద్లోని భోలక్‌పూర్‌లో మంగళవారం కలుషిత నీరు తాగి కొందరు మృతి చెందిన నేపథ్యంలో ఈ అంశంపై సీపీఐ నిరసన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా ఆ పార్టీ నేతలు బుధవారం వాటర్‌వర్క్స్, సీవేరేజ్ బోర్డు కార్యాలయం...Source: Yahoo! Telugu: News | 6 May 2009 | 9:39 am మే 13 తర్వాతే వేర్పాటువాద నేతల విడుదల!సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ముందస్తుగా అరెస్టు చేసిన వేర్పాటువాద పార్టీల నేతలు ఈనెల 13వ తేదీన తర్వాతే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. హురియత్ కాన్ఫరెన్స్ (హెచ్‌సి), జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్) ఛైర్మన్‌లతో సహా డజను మంది నేతలను ఆ రాష్ట్ర భద్రతా బలగాలు గృహ నిర్బంధంలో ఉంచాయి.Source: జాతీయ | 6 May 2009 | 9:33 am నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలుదేశవ్యాప్తంగా గురువారం జరగనున్న నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలకు అధికారిక యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఈ దశ ఎన్నికల్లో సుమారు 9.49 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.Source: Yahoo! Telugu: News | 6 May 2009 | 9:28 am పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక గుర్తులుమే నెల 31నుంచి పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక గుర్తులను ముద్రించే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. సిగరెట్లు, బీడీలు ఇతర పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక గుర్తులతో కూడిన చిత్రాలను ముద్రించనున్నారుSource: జాతీయ | 6 May 2009 | 9:17 am భోలక్‌పూర్ ఘటనపై మండిపడ్డ దత్తన్నహైదరాబాద్లోని భోలక్‌పూర్‌లో కలుషిత నీరు తాగి కొందరు మృతి చెందిన ఘటనపై భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతవల్లే భోలక్‌పూర్ ఘటన చోటు చేసుకుందని...Source: Yahoo! Telugu: News | 6 May 2009 | 9:07 am పొగాకు నిబంధనలు అమలు చేయనున్న కేంద్రంసిగరెట్లు, పొగాకు ఉత్పుత్తులపై బొమ్మలతో కూడిన హెచ్చరికలు ఉంచేందుకు సంబంధించిన నిబంధనలను అమలు చేస్తామని దేశ అత్యున్నత న్యాయస్థానంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ బాధ్యతలను భుజానికొత్తుకున్నSource: Yahoo! Telugu: News | 6 May 2009 | 8:08 am భోలక్‌పూర్ ఘటనపై స్పందించిన చిరుహైదరాబాద్లోని భోలక్‌పూర్‌లో మంగళవారం కలుషిత నీరు త్రాగడం వల్ల కొందరు మరణించిన ఘటనపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తీవ్రంగా స్పందించారు. భోలక్‌పూర్ బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలంటూ...Source: Yahoo! Telugu: News | 6 May 2009 | 8:06 am డెక్కన్ ఛార్జర్స్‌తో మ్యాచ్‌కు జహీర్ ఖాన్ దూరంభుజం గాయంతో బాధపడుతున్న ముంబయి ఇండియన్స్ పేస్‌బౌలర్ జహీర్ ఖాన్ బుధవారం డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జహీర్ ఖాన్‌కు ఈ గాయమైంది.Source: Yahoo! Telugu: News | 6 May 2009 | 7:59 am నిత్యావసర ధరలకు కళ్ళెం వేయండి: వైఎస్సార్రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపులోకి తేవాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారులును ఆదేశించారు. ఈ విషయంలో తనిఖీలు చేయడం ద్వారా అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ కోరారు.Source: ఏపీ న్యూస్ | 6 May 2009 | 7:55 am వ్యూహాత్మక విరామాన్ని తగ్గించే ఆలోచనఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో అమలు చేస్తున్న వ్యూహాత్మక విరామాన్ని పునఃసమీక్షించే అవకాశం ఉందని టోర్నీ కమిషనర్ లలిత్ మోడీ సూచనప్రాయంగా చెప్పారు. ఈ వ్యూహాత్మక విరామాలపై ఇప్పటికే తీవ్రస్థాయిSource: Yahoo! Telugu: News | 6 May 2009 | 7:51 am లాభాల బాటలో ఆర్టీసీ: దినేష్ రెడ్డిగత రెండేళ్లుగా వరుసగా లాభాలను ఆర్జిస్తోన్న ఆర్టీసీ ఈ ఏడాది కూడా రూ.100 కోట్ల లాభాన్ని ఆర్జించిందని సంస్థ ఎండీ దినేశ్‌రెడ్డి తెలిపారు. 2008-09 సంవత్సరానికిగాను ఫిబ్రవరి వరకు సంస్థ ఈ లాభాన్ని ఆర్జించినట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 6 May 2009 | 7:51 am గుజరాత్ హైకోర్టు సీజేతో సిట్ చీఫ్ సమావేశంసుప్రీంకోర్టు ఆదేశానుసారం ఏర్పాటైన ప్రత్యేక విచారణ బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్) అధిపతి మంగళవారం గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయ్యారు. గుజరాత్ అల్లర్ల కేసు విచారణను వేగవంతం చేసే అంశంపై వీరిద్దరు చర్చించారు.Source: జాతీయ | 6 May 2009 | 7:39 am ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషిరాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన మీశ్రేయోభిలాషి చిత్రం దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ నెల 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగనున్న హెబిటాట్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికయ్యింది. రాజేంద్రప్రసాద్ నటించిన ఈ చిత్రాన్ని సి.సి. రెడ్డి సమర్పించారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 May 2009 | 7:11 am కొత్తపాటతో సరికొత్తగా రానున్న మిత్రుడుబాలకృష్ణ, ప్రియమణి జంటగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోన్న మిత్రుడు చిత్రం కొత్త పాటతో సరికొత్తగా ముస్తాబైంది. హీరో బాలకృష్ణ, హీరోయిన్ ప్రియమణిలపై చిత్రీకరించిన మరోపాటను జతచేయడం ద్వారా...Source: Yahoo! Telugu: Entertainment | 6 May 2009 | 7:09 am నాయుడు దర్శకత్వంలో యశోసాగర్ చిత్రంఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన యశోసాగర్ మరో కొత్త చిత్రంలో కథానాయకుడుగా నటించనున్నాడు. సుకుమార్, తులసిరామ్ వద్ద పనిచేసిన ఎన్.ఎస్. నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 May 2009 | 7:08 am నేడు విశాఖ ఏజెన్సీలో చిరు బృందం పర్యటనప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా బుధవారం ఆయన డాక్టర్ మిత్ర బృందంతో కలిసి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించిన చిరంజీవి బుధవారం పార్టీ డాక్టర్ల బృందంతో కలిసి ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తారు.Source: ఏపీ న్యూస్ | 6 May 2009 | 6:22 am రాజారెడ్డి హత్యకేసులో 11మందికి జీవిత ఖైదురాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్య కేసుతో సంబంధమున్న 11మందికి సుప్రీం కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ 11 మందిలో నలుగురు ఇప్పటికే జంట హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్నారుSource: ఏపీ న్యూస్ | 6 May 2009 | 6:14 am విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతివిశాఖపట్నంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 12 మంది మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు గాయపడగా, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.Source: ఏపీ న్యూస్ | 6 May 2009 | 6:14 am నాలుగో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధంసార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుంది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలలో 85 లోక్‌సభ సీట్లకు రేపు పోలింగ్ జరగుతుంది. మొత్తం 119 మంది మహిళలతో సహా 1315 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ఈ పోలింగ్‌లో మొత్తం 9.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.Source: జాతీయ | 6 May 2009 | 5:54 am అధికార పీఠం మాదే: రాహుల్ గాంధీ ధీమాకేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమే ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి ఎన్నికల తరువాత లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇస్తాయని పేర్కొన్నారు.Source: జాతీయ | 6 May 2009 | 4:19 am ప్రధాని పీఠంపై యూపీ సీఎం మాయావతి ప్రశ్న?తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరో రెండు వారాల్లో వస్తున్న నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. తనకు ప్రధానమంత్రి అయ్యేందుకు కావాల్సిన సామర్థ్యం ఉందని వ్యాఖ్యానించారు. తానెందుకు ప్రధాని కాకూడదని ప్రశ్నించారు.Source: జాతీయ | 6 May 2009 | 4:15 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 6 May 2009 | 4:09 am మే 06, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 సుహాసిని కథలు 14:30 జై హనుమాన్ ..Source: Yahoo! Telugu: Entertainment | 6 May 2009 | 4:07 am భోలక్‌పూర్ బాధితులకు నష్ట పరిహారం 2లక్షలురాష్ట్ర రాజధానివద్దనున్న భోలక్‌పూర్‌లో కలుషిత నీరు త్రాగి మృతి చెందిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.Source: ఏపీ న్యూస్ | 5 May 2009 | 3:00 pm ఓటుకు నోటిచ్చిన యూపీఏను శిక్షించండి: అద్వానీపార్లమెంటులో బల నిరూపణ సమయంలో ఓటుకు నోటు ఇచ్చి ఎంపీలను కొనుగోలు చేసిన యూపీఎను శిక్షించాలని భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్కే అద్వానీ ప్రజలను కోరారు. జైపూర్‌లో ఎన్నికల పర్యటనలో భాగంగా అద్వానీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.Source: జాతీయ | 5 May 2009 | 2:11 pm ఏఐ విమానం ఎయిరో బ్రిడ్జ్‌ను ఢీకొందిముంబైనుంచి మంగళూరు వెళ్ళనున్న ఎయిర్ ఇండియా విమానం మంగళవారం ఎయిరో బ్రిడ్జిని ఢీకొనడంతో విమానం తలుపు విరిగిపోయింది. ఈ దుర్ఘటన కారణంగా విమానం దాదాపు ఒకటిన్నర గంట ఆలస్యంగా నడిచిందిSource: జాతీయ | 5 May 2009 | 1:41 pm భోలక్‌పూర్ ఘటనపై తెదేపా అధినేత విచారంహైదరాబాద్లోని భోలక్‌పూర్‌లో కలుషిత నీరు తాగి నలుగురు మృతి చెందిన ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 5 May 2009 | 12:33 pm భోలక్‌పూర్ ఘటనపై విచారణకు సీఎం ఆదేశంకలుషిత నీరు తాగిన కారణంగా భోలక్‌పూర్‌లో నలుగురు మృతి చెందిన విషయమై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విశ్రాంతి కోసం సిమ్లాలో ఉంటున్న ముఖ్యమంత్రి అక్కడినుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు.Source: ఏపీ న్యూస్ | 5 May 2009 | 12:26 pm
|