జమ్మూ బస్సు ప్రమాదంలో 21 మంది దుర్మరణం

జమ్మూకాశ్మీర్‌లో సోమవారం సంభవించిన బస్సు ప్రమాదంలో దాదాపు 20మంది మృతి చెందగా మరో 10మందివరకు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు నదిలో పడిపోయిన కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Source: జాతీయ | 4 May 2009 | 11:35 am

రీటైర్ అయ్యే ఆలోచనలేదు: నవోమి

ప్రస్తుతానికి ఫ్యాషన్ రంగం నుంచి విరమణ పొందే ఆలోచన లేదని సూపర్ మోడల్ నవోమి క్యాంప్‌బెల్ స్పష్టం చేసింది. ఇటీవల నవోమి ఫ్యాషన్ ఫీల్డుకు స్వస్తి చెప్పి కుటుంబ బాధ్యతలను మోయనుందని వార్తలు షికార్లు చేశాయి. ఈ వార్తలపై నవోమి మాట్లాడుతూ.. ఫ్యాషన్ రంగాన్ని ఎప్పటికీ వదిలి పెట్టనని వెల్లడించింది. కానీ, వచ్చే ఏడాదిలో జరిగే ఫ్యాషన్ షోలలో పాల్గొంటానని నవోమి వెల్లడించింది. ఫ్యాషన్ రంగాన్నే కాకుండా తన జీవితంపై కూడా తనకు శ్రద్ధ ఉందని, త్వరలో తల్లినవుతానని నవోమి చెప్పింది.
Source: వినోదం | 4 May 2009 | 10:41 am

దాసరిచే సావిత్రి జీవిత కథ పుస్తకం విడుదల

సావిత్రి పేరు చెబితేనే తెలుగు సినిమా చరిత్రలోని ఓ సువర్ణ అధ్యాయం గుర్తుకువస్తుంది. కాలచక్రంలో దశాబ్దాలు గడిచిపోయినా, ఎన్ని తరాలు మారినా ఆ మహానటి ప్రదర్శించిన అభినయ విన్యాసం తెలుగువారి గుండెల్లో నిత్య...
Source: Yahoo! Telugu: Entertainment | 4 May 2009 | 10:30 am

లిండ్సే లోహన్‌తో డేటింగా? నో ఛాన్స్..!

హాలీవుడ్ సుందరి లిండ్సే లోహన్‌తో ప్రేమాయణం కొనసాగించడంపై, ఆమె మాజీ ప్రియుడు హారీ మార్టన్ సిగ్గుపడ్డాడు. హార్డ్ రాక్ హెయిర్ స్టైల్‌తో యువతులను ఇట్టే ఆకర్షించే హారీ మార్టన్ ఇటీవల హాలీవుడ్ స్టార్ లిండ్సే లోహన్‌ను ప్రేమిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అంతేగాకుండా, లోహన్-మార్టిన్‌లు చెట్టాపట్టాలేసుకుని పార్టీలకు, క్లబ్‌లకు వెళ్లారని సినీ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. ఈ నేపథ్యంలో లిండ్సే లోహన్‌‌ను తాను ప్రేమించలేదని, ఆమెతో డేటింగ్ జరుపుతున్నానని వస్తున్న వార్తలు పచ్చి అబద్ధమని మార్టిన్ కొట్టిపారేశాడు.
Source: వినోదం | 4 May 2009 | 10:24 am

భవిష్యత్‌లో సంచలనాత్మక చిత్రం: దాసరి

దర్శకరత్నగా పేరు తెచ్చుకున్న దాసరి నారాయణరావు సోమవారం 63వ సంవత్సరంలో అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన మదిలోని భావాలను మనతో పంచుకునే ప్రయత్నం చేశారు. దాంతోపాటు తన భవిష్యత్...
Source: Yahoo! Telugu: Entertainment | 4 May 2009 | 10:22 am

రక్షణ దళాలను ఆధునీకరించాలి: ఏచూరి

ఉగ్రవాదాన్ని మట్టుబెట్టటానికి భారతదేశంలోని రక్షణ దళాలను ఆధునీకరించాలని సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి కోలకతాలో అభిప్రాయపడ్డారు
Source: జాతీయ | 4 May 2009 | 10:19 am

టెర్రరిస్టులను వదిలిపెట్టడమే భాజపా రికార్డు: పీఎం

ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తీవ్రవాదులను క్షేమంగా తీసుకెళ్లి వదిలిపెట్టడమే భాజపా నేతలు సాధించిన రికార్డు అని ప్రధానిమంత్రి మన్మోహన్ సింగ్ ఆరోపించారు. అంతేకాకుండా, తీవ్రవాదంపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రధానమంత్రి మన్మోమన్ సింగ్ సోమవారం ప్రశ్నించారు.
Source: జాతీయ | 4 May 2009 | 10:08 am

అర్థంకాని కథతో ఆకట్టుకోని 'మిత్రుడు'

చాలాకాలంగా హిట్స్ లేకుండా మొహం వాచిన బాలకృష్ణకు తాజా చిత్రం మిత్రుడు సినిమాతోనైనా విజయం మరోసారి తలుపు తడుతుందేమోనని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. అటు తెలుగుదేశం పార్టీ...
Source: Yahoo! Telugu: Entertainment | 4 May 2009 | 10:07 am

ఐసీఎల్‌ను వదిలిపెడితేనే సెలెక్షన్: పీసీబీ

ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో చేరిన ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్, పేస్‌బౌలర్ రాణా నావెద్, ఓపెనర్ ఇమ్రాన్ నజీర్‌లను త్వరలో జరగబోతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షరతు విధించింది.
Source: Yahoo! Telugu: News | 4 May 2009 | 9:58 am

"మోస్ట్ బ్యూటీఫుల్ పీపుల్" జాబితాలో దేవ్-పింటో

అమెరికా పీపుల్స్ మ్యాగజైన్ నిర్వహించిన "మోస్ట్ బ్యూటీఫుల్ పీపుల్" నిర్వహించిన సర్వేలో, స్లమ్‌డాగ్ మిలియనీర్ హీరోహీరోయిన్లు దేవ్ పటేల్- ఫ్రిడా పింటో వందో స్థానంలో నిలిచారు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆపిల్‌గేట్ స్టార్ సమంతా ఈ జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
Source: వినోదం | 4 May 2009 | 9:48 am

ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరిన సెన్సెక్స్

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సూచి సోమవారం ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతేకాకుండా బ్యాంకింగ్, లోహ రంగాల వాటాల కొనుగోళ్లు బీఎస్ఈ సూచిని 12 వేల పాయింట్లపైకి నడిపించాయి. మధ్యాహ్నం 1230 గంటల సమయంలో సెన్సెక్స్
Source: Yahoo! Telugu: News | 4 May 2009 | 9:45 am

7వ తేదీన పుట్టపర్తికి రానున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఈనెల ఏడో తేదీన పుట్టపర్తి పర్యటనకు రానున్నారు. ఈ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆదివారం సమీక్ష నిర్వహించారు. స్థానిక తహసిల్దార్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ చిరంజీవులు, జిల్లా ఎస్పీ ఎంకె.సింగ్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 May 2009 | 9:39 am

తీవ్రవాదంపై మీరేం చేశారు: మన్మోహన్

తీవ్రవాదంపై మీరేం కఠిన చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రధానమంత్రి మన్మోమన్ సింగ్ సోమవారం ప్రతిపక్ష బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ నేతలు మాట్లాడే మాటలు, వారు గతంలో చేపట్టిన చర్యలు భిన్నమైన రికార్డులు చూపుతాయని మన్మోహన్
Source: Yahoo! Telugu: News | 4 May 2009 | 9:36 am

స్వైన్‌ఫ్లూ వ్యాపించకుండా చర్యలు: మంత్రి

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న స్వైన్‌ఫ్లూ రాష్ట్రంలో విస్తరించకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్యవిధానపరిషత్ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. ఇందుకోసం ప్రతి జిల్లా కేంద్రంలో స్వైన్‌ఫ్లూ నివారణ మందులను...
Source: Yahoo! Telugu: News | 4 May 2009 | 9:26 am

ప్రపంచకప్ వరకు ఆస్ట్రేలియా కెప్టెన్ పాంటింగే

వచ్చే ప్రపంచకప్ వరకు అన్నిరకాల క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టుకు రికీ పాటింగ్ నేతృత్వం వహిస్తాడని ఆ దేశ చీఫ్ సెలెక్టర్ ఆండ్ర్యూ హిల్‌డిచ్ తెలిపారు. మూడు రకాల క్రికెట్‌లోనూ ఆస్ట్రేలియా జట్టుకు రికీ పాంటింగే కెప్టెనని ఆయన చెప్పారు. పరిమిత
Source: Yahoo! Telugu: News | 4 May 2009 | 9:21 am

సెల్‌ఫోన్‌పేలింది: 200 గుడిసెలు మంటకలిసాయి

నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం లింగోజీ గూడెంలో సెల్‌ఫోన్ పేలడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో 200 గుడిసెలు కాలిపోయాయి.
Source: ఏపీ న్యూస్ | 4 May 2009 | 9:19 am

ప్రజాకవిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: విమల

రాష్ట్రంలో ప్రజాకవిగా గుర్తింపు పొందిన విప్లవ కళాకారుడు గద్దర్‌పై ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన సతీమణి విమల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఐవీ.సుబ్బారావుకు సోమవారం వినతి పత్రం సమర్పించారు.
Source: ఏపీ న్యూస్ | 4 May 2009 | 9:01 am

స్వైన్ ఫ్లూపై హైపర్ కమిటీ ఏర్పాటు: పనమా

ప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పనమా వెంకటేశ్వరరావు వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 May 2009 | 8:50 am

మళ్లీ వాయిదా పడిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు సోమవారం ఢిల్లీ పర్యటన మళ్లీ వాయిదా పడింది. ఈనెల ఆరో తేదీన ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నట్టు పార్టీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ అంశంపై జాతీయ నాయకులతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 May 2009 | 8:38 am

అగ్నిగుండాన్ని తలపిస్తున్న రాష్ట్రం

రాష్ట్రం అగ్ని గుండాన్ని తలపిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ను మించిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 48 డిగ్రీల వరకూ పెరిగిపోయాయి. మొత్తం మీద రాష్ట్రంలో ఎక్కడా 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాకపోవడంతో ప్రజలంతా తల్లడిల్లి పోతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 May 2009 | 8:21 am

కోచిలో ఇద్దరు స్వైన్ ఫ్లూ అనుమానితులు

హెచ్1ఎన్1 ఫ్లూ అనుమానంతో కోచి విమానాశ్రయంలో సోమవారం ఇద్దరు వ్యక్తులపై వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బ్రిటన్, ఆస్ట్రియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను స్వైన్ ఫ్లూ అనుమానంతో పరీక్షలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు
Source: Yahoo! Telugu: News | 4 May 2009 | 8:13 am

గద్దర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయండి: విమల

ప్రజాగాయకుడు గద్దర్‌పై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ ఆయన సతీమణి విమల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవీ సుబ్బారావును కలిసి విజ్ఞప్తి చేశారు. గద్దర్‌లాంటి వ్యక్తిపై పోలీసులు కక్ష సాధింపుకు...
Source: Yahoo! Telugu: News | 4 May 2009 | 8:13 am

కేసీఆర్ ఢిల్లీ యాత్ర వాయిదా: టీఆర్ఎస్

పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని కారణాల రీత్యా ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్న కేసీఆర్ బుధవారం పర్యటనకు సిద్ధం కానున్నారని...
Source: Yahoo! Telugu: News | 4 May 2009 | 8:06 am

శుభారంభమే విజయాన్నందించింది: యువరాజ్

పోర్ట్ ఎలిజబెత్‌లో ఆదివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై తమ బ్యాట్స్‌మెన్ అందించిన శుభారంభమే జట్టుకు విజయాన్ని అందించిందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్
Source: Yahoo! Telugu: News | 4 May 2009 | 8:03 am

స్వైన్‌ఫ్లూ డౌట్: ఆస్పత్రిలో చేరిన ఎన్నారై

స్వైన్‌ఫ్లూ సందేహంతో హైదరాబాద్‌కు విచ్చేసిన మరో ఎన్నారై ఆస్పత్రిలో చేరారు. విదేశాలనుంచి గతవారం నగరానికి చేరుకున్న సదరు ఎన్నారై జ్వరం, ఒళ్లు నొప్పుల కారణంగా ఆదివారం సాయంత్రం ఆస్పత్రిలో చేరారు.
Source: Yahoo! Telugu: News | 4 May 2009 | 7:57 am

ఆ ముగ్గురు ప్రజలకు క్షమాపణ చెప్పాలి: వెంకయ్య

దేశ ఆర్థిక వ్యవస్థను తిరోగమన దిశలో నడిపిస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 4 May 2009 | 7:55 am

నల్ల ధనంపై పున: చర్చలకు సిద్ధం: స్విస్

ఇరుదేశాల మధ్య కుదిరిన ద్వంద్వ పన్నుల మినహాయింపు ఒప్పందం (డీటీఏఏ)పై తిరిగి చర్చలు జరిపేందుకు భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఇరుదేశాల మధ్య ఈ ఒప్పందం 1995లో అమల్లోకి వచ్చింది.
Source: జాతీయ | 4 May 2009 | 7:17 am

ఆయన్నే వదిలేశా!

"మీ పక్కింటావిడ కాశీకి వెళ్తూ, తన పిల్లల్ని వదిలి వచ్చిందటగా... మరి మీరు వెళ్లారు కదా...! దేన్ని వదిలి వచ్చారు...?" అడిగింది రమ్య "ఎంతైనా కన్నబిడ్డల్ని వదిలేసి...
Source: వినోదం | 4 May 2009 | 6:05 am

పేషెంట్ పారిపోతున్నాడు సర్..!

"ఆ పేషంట్‌తో ఏమన్నావ్.. ఆపరేషన్‌కు ముందే పారిపోతున్నాడు...?" నర్సుని అడిగాడు డాక్టర్...
Source: వినోదం | 4 May 2009 | 6:04 am

హైదరాబాదులో మరో రెండు స్వైన్ ఫ్లూ కేసులు

ప్రపంచంలోని పలు దేశాలను గడగడలాడిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి రాష్ట్ర రాజధానిలో వెలుగుచూసినట్లు మరోసారి గుప్పుమంది. హైదరాబాదులో స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇద్దరు వ్యక్తులను వైద్యులు గుర్తించినట్లు సమాచారం.
Source: జాతీయ | 4 May 2009 | 6:02 am

ప్రియాంకా.. షాహిద్‌ను వదిలిపెట్టు..!

తన ప్రేమికుడైన షాహిద్ కపూర్ జీవితం నుంచి ప్రియాంక చోప్రా దూరం కావాలని బాలీవుడ్ అందాల రాశి కరీనా కపూర్ అంటోంది. ఈ మధ్య ఫంక్షన్లకు, పార్టీలకు సైఫ్ అలీ ఖాన్‌తో దర్శనమిచ్చే కరీనా కపూర్, షాహిద్‌ను ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ప్రియాంక చోప్రా, షాహిద్‌తో డేటింగ్ జరుపుతోందని, ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని కరీనాకు తెలిసింది. దీంతో ఫైర్ అయిపోయిన కరీనా షాహిద్‌తో తన సంబంధాన్ని తెగతెంపులు చేసుకుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. అంతేగాకుండా తన బాయ్‌ఫ్రెండ్‌ను వదిలిపెట్టమ్మా... తల్లీ...! అంటూ కరీనా చోప్రాను వేడుకుంటున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
Source: వినోదం | 4 May 2009 | 5:55 am

మన్మోహన్ ఉత్తమ ప్రధాని అభ్యర్థి: రాహుల్

తమ పార్టీ ఉత్తమ ప్రధానమంత్రి అభ్యర్థి మన్మోహన్ సింగేనని కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ మరోమారు స్పష్టం చేశారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆయన నొక్కివక్కాణించారు. ప్రధాని అయ్యేందుకు అవసరమైన అన్ని లక్షణాలు రాహుల్ గాంధీకి ఉన్నాయని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 4 May 2009 | 5:16 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 4 May 2009 | 4:04 am

బెంగాల్‌లో పెను గాలులకు 11 మంది మృతి

పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని బలమైన పెను గాలులకు వివిధ ప్రాంతాల్లో 11 మంది మృతి చెందారు. ఈ శక్తివంతమైన వాయువ్యపవనాల తాకిడికి మరో 15 మంది గాయపడ్డారు. అంతేకాకుండా వీటి కారణంగా రాష్ట్రంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Source: జాతీయ | 4 May 2009 | 4:03 am

మే 04, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ ...
Source: Yahoo! Telugu: Entertainment | 4 May 2009 | 4:02 am

సవాళ్ళను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కే సొంతం: పీఎం

దేశం ఎదుర్కొంటున్న పెద్దపెద్ద సవాళ్లను ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఎదుర్కోగలదని, తమకే ఆ సామర్థ్యం ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఉద్ఘాటించారు. మతాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయాలు నడుపుతున్న పార్టీలు దేశాన్ని ముందుకుతీసుకెళ్లలేవని ఆయన వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 4 May 2009 | 4:00 am

కళామతల్లిని సత్కరిస్తున్నా..!: దాసరి

దర్శకరత్న దాసరి నారాయణరావు 63న సంవత్సరంలో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమా రంగంపై దృష్టి సారిస్తున్న దాసరికి (మే 4) పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా దాసరి చేపట్టనున్న బృహత్ కార్యక్రమాలను వెల్లడించారు. అందులో కొన్ని విశేషాలు మీ కోసం.. ప్రశ్న.. నటుడిగా మళ్ళీ కొనసాగుతారా? జ.. కథాపరంగా నాది ప్రధాన పాత్ర అయితే బయటి చిత్రాల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. ప్రశ్న.. మేస్త్రీ సినిమా ఏ మేరకు ప్రజలకు చేరువైందనుకుంటున్నారు? జ.. మేస్త్రీ చిత్రంలో చెప్పిన ఓటుహక్కు సందేశం జనాల్లో చేరింది. ప్రశ్న.. ఈ చిత్రాన్ని చూసి కొందరు భుజాలు తడుముకున్నారెందుకని? జ.. ఆ పాత్రలకు వారికి సంబంధం ఉండివుండవచ్చు. ప్రశ్న.. ఈ ఏడాది తీసుకోబోతున్న నిర్ణయాలు? జ.. 149వ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నా. అదీ సంచలనమైన కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా అందరి అంచనాలకు దగ్గరగా ఉంటుంది. అదే విధంగా ఈ ఏడాది స్వంత నిధితో "నీడ" అనే సేవా సంస్థను ప్రారంభిస్తున్నాను.
Source: వినోదం | 3 May 2009 | 1:23 pm

ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: కారత్

లౌకికవాద పార్టీలతో కొత్తగా ఏర్పాటు చేసిన తృతీయ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తెలిపారు. ప్రజలు రాజకీయ మార్పు కోసం చూస్తున్నారని కారత్ పేర్కొన్నారు.
Source: జాతీయ | 3 May 2009 | 12:36 pm

బాలకృష్ణ ఎవరికి "మిత్రుడు"?

నటీనటులు.. నందమూరి బాలకృష్ణ, ప్రియమణి సంగీతం.. మణివర్మ, నిర్మాత.. శివలెంక కృష్ణ ప్రసాద్, దర్శకుడు.. మహాదేవ్. పాయింట్.. జాతకం కన్నా విల్‌పవర్ గొప్పదనే చెప్పే అంశం. ఈ సినిమా చూశాక టైటిల్ "మిత్రుడు" అని పేరు పెట్టారో అర్థంకాదు. కథాబలంలేని సాగదీతగా సాగే ఈ చిత్రం అప్పట్లో ఎన్టీఆర్ నటించిన "కలియుగ పురుషుడు" ఛాయలు కన్పిస్తాయి. జాతక బలంపై చాలా చిత్రాలూ వచ్చాయి. కానీ నేటి ట్రెండ్‌కు తగినట్లుగా లేకపోవడం మైనస్సే. కథలోకి వెళితే.. మలేషియాలో ఉంటున్న ఆదిత్య (బాలకృష్ణ), తన వారినందరినీ పోగొట్టుకున్న దుఃఖంలో మందుకొట్టడమే పనిగా పెట్టుకుంటాడు. అలాంటి వ్యక్తిని అక్కడే చదువుతున్న ఇందు (ప్రియమణి) బలవంతంగా ప్రేమిస్తుంది. దానికీ ఓ కారణముంటుంది. తన జాతకచక్రం ప్రకారం మొదటి మొగుడు చనిపోతాడు. ఇందులో భాగంగా.. ప్రియమణి ఆదిత్యను పెళ్లాడుతుందా? తర్వాత జరిగే పరిణామాలేంటి అనేది మిగిలిన సినిమా.
Source: వినోదం | 3 May 2009 | 12:25 pm

రాష్ట్రంలో హంగ్ రాదు: కొణజేటి రోశయ్య

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం హంగ్ ఏర్పడే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మంత్రి రోశయ్య చెప్పారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల్లో ప్రకటించిన నగదు బదిలీ పథకం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మదిలోలేదని, అందుకే ఆయన ప్రవేశపెట్టలేదని రోశయ్య తెలిపారు
Source: ఏపీ న్యూస్ | 3 May 2009 | 11:39 am

ఫలితాలకు ఎన్నికల పరిశీలకుల ఆమోదం ఉండాలి: ఈసీ

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలు మే 16న తేలనున్నాయి. ఆ రోజున ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా జరిగే ఓట్ల లెక్కింపులో ఎన్నికల పరిశీలకులు ఆమోదం తెలిపిన తర్వాతే ఫలితాలను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐ.వీ. సుబ్బారావు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 3 May 2009 | 10:55 am