బాబ్రీ కూల్చివేత నాకు తెలియదు: కళ్యాణ్

బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర తనకు తెలియకుండానే జరిగిందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తనకు తెలియకుండా దీనికి కుట్రపన్నిందని ఆరోపించారు
Source: జాతీయ | 3 May 2009 | 8:55 am

పోలీసుల అదుపులో మాజీ నక్సల్ జనగం శ్రీనివాస్

మాజీ నక్సలైట్ జనగం శ్రీనివాస్ రెడ్డిని ఆదివారం పోలీసులు తిరుపతిలో అరెస్ట్ చేశారు. పలు బెదిరింపు కేసుల్లో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ గత 15 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇతను అదిలాబాద్ జిల్లాకు చెందినవాడు.
Source: ఏపీ న్యూస్ | 3 May 2009 | 8:26 am

లెఫ్ట్‌తో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధమే: మన్మోహన్ సింగ్

కేంద్రంలో రానున్న రోజులలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్‌పార్టీల మద్దతు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉద్ఘాటించారు.
Source: జాతీయ | 3 May 2009 | 8:23 am

మాక్ కౌంటింగ్ ప్రారంభం

రాష్ట్రంలో గత నెలలో రెండు దశలుగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం మాక్ కౌంటింగ్ నిర్వహించింది
Source: ఏపీ న్యూస్ | 3 May 2009 | 8:06 am

రాజధాని ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ అనుమానితుడు

స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలతో ఓ వ్యక్తిని రాష్ట్ర రాజధాని ఆస్పత్రిలో చేర్చారు. అమెరికా నుంచి రాజధాని హైదరాబాద్‌కు వచ్చిన 28 ఏళ్ల వ్యక్తి స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు బయటపడ్డట్లు తెలుస్తోంది. అతని లాలాజలం, రక్తపరీక్షల శాంపిళ్లను న్యూఢిల్లీలోని జాతీయ అంటువ్యాధుల పరిశోధనా సంస్థ (ఎన్ఐసీడీ)కు పంపారు.
Source: ఏపీ న్యూస్ | 3 May 2009 | 6:18 am

మే 03, 2009 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా 15.00 అభిరుచి 15.30 ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 3 May 2009 | 5:40 am

ఈ వారం


Source: Yahoo! Telugu: Entertainment | 3 May 2009 | 5:40 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 3 May 2009 | 5:39 am

బీహార్‌లో రోడ్డుప్రమాదం: 8మంది సజీవ దహనం

బీహార్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు. బీహార్‌లోని సరేన్‌ జిల్లా సోనిపూర్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలైయ్యారని పోలీసులు వెల్లడించారు. వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ కారును లారీ ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అన్నారు.
Source: జాతీయ | 3 May 2009 | 5:33 am

ప్రియాంకాకు జరిమానా

ప్రముఖ నటి ప్రియాంకా చోప్రాకు ముంబయి పోలీసులు ఐదు వేల రూపాయల జరిమానా విధించారు. తన ఇంట్లో ఎక్కువ ధ్వనితో పాటలను పెట్టడంతో తమకు అసౌకర్యం కలిగిస్తున్నట్లు ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారించి జరిమానా విధించారు
Source: జాతీయ | 3 May 2009 | 5:13 am

ఆసుపత్రిలో చేరిన కరుణానిధి

తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఆదివారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సనిమిత్తం చేర్పించారు.
Source: జాతీయ | 3 May 2009 | 4:50 am

కసబ్ వయోజనుడే: ప్రత్యేక కోర్టు

ముంబయి ఉగ్రవాద దాడిలో ప్రాణాలతో పట్టుబడ్డ తీవ్రవాది అమీర్ అలియాస్ కసబ్ మేజరేనని, అతని వయసు కనీసం 21 సంవత్సరాలు ఉందనీ ప్రత్యేక కోర్టు తేల్చింది. కసబ్ వయసుపై విచారణ చేపట్టిన నేపథ్యంలో ప్రత్యేక కోర్టు జడ్జి ఎమ్ఎల్ తాహిల్యాని ఈ మేరకు తీర్పు వెలువరించారు.
Source: జాతీయ | 2 May 2009 | 2:51 pm

విద్యార్థినిపై కిరోసిన్‌పోసి నిప్పుపెట్టిన ప్రేమోన్మాది

నిరుడు వరంగల్‌లో జరిగిన యాసిడ్ దాడి ఘటన మరచిపోకముందే మరో ప్రేమోన్మాది ప్రకాశం జిల్లాలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థినిపై కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టాడు. తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థిని ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
Source: ఏపీ న్యూస్ | 2 May 2009 | 2:31 pm

భారత్‌లోని ఆరుగురికి స్వైన్ ఫ్లూ లేదు

విదేశాలనుంచి గత కొద్ది రోజుల క్రితం భారతదేశానికి వచ్చిన ఆరుగురికి స్వైన్ ఫ్లూకు సంబంధించిన పరీక్షలను జరిపినారు. ఇందులో భాగంగా వారికి అలాంటి వ్యాధి ఏదీ లేదని పరీక్షలలో తేలింది. అయినాకూడా వారిలో ఒకరిని పరీక్షల నిమిత్తం అత్యవసర చికిత్సా విభాగంలోనే ఉంచడం గమనార్హం.
Source: జాతీయ | 2 May 2009 | 1:16 pm

ఛార్జర్స్‌తో మ్యాచ్: రాయల్స్ విజయలక్ష్యం 142

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తద్వారా ఛార్జర్స్ జట్టు 142 పరుగుల...
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 12:16 pm

కేసీ కెనాల్‌ బ్రిడ్జిని సందర్శించిన అధికారులు

కర్నూలు నగర శివార్లలో గురువారం కూలిపోయిన కేసీ కెనాల్‌కు సంబంధించిన బ్రిడ్జిని శనివారం రహదారులు, రోడ్డు భద్రత విభాగపు అధికారుల బృందం పరిశీలించింది. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నిర్మాణంలో...
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 12:06 pm

తిరుమలలో పోటెత్తిన భక్తజనం

శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేసిన భక్తజనంతో శనివారం తిరుమల పోటెత్తింది. దీంతో రెండో క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో రెండు కిలోమీటర్లమేర భక్తుల క్యూలైను నిల్చిపోయింది.
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 11:58 am

కసబ్ వయసుపై నేడు ప్రత్యేక కోర్టు నిర్ణయం

గత ఏడాది ముంబయిపై తీవ్రవాదుల దాడి సందర్భంగా ప్రాణాలతో చిక్కిన మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ మైనరా కాదా అన్న విషయంపై శనివారం ప్రత్యేక కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ముంబయిపై దాడి చేసిన సమయంలో...
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 11:50 am

నేడు కసబ్ వయసుపై కోర్టు నిర్ణయం!

నిరుడు ముంబయిపై తీవ్రవాదుల దాడిలో ప్రాణాలతో పట్టుబడ్డ మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ మైనరా కాదా అన్న విషయంపై శనివారం ప్రత్యేక కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది
Source: జాతీయ | 2 May 2009 | 11:50 am

కరెంటు షాక్‌తో తండ్రీ కొడుకుల మృతి

కరెంటు షాక్ కారణంగా తండ్రీ, కుమారుడు ఒకేసారి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా పరకాల మండలంతో జరిగిన ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 11:39 am

కేశవయ్య హత్య: బందీలైన నిందితులు

తెలుగుదేశం పార్టీ నేత కేశవయ్యను శనివారం ఉదయం హత్య చేసి తప్పించుకోజూసిన ప్రధాన నిందితులను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 May 2009 | 11:11 am

భారత హాకీ జట్టు కోచ్‌గా బ్రాసా నియామకం

స్పెయిన్‌కు చెందిన జోస్ బ్రాసా భారత పురుషుల హాకీ జట్టుకు చీఫ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో బ్రాసా పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా పదవీబాధ్యతలు చేపట్టనున్నట్టు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సంయుక్త
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 10:49 am

మంటల్లో చిక్కుకున్న లఖానీ షూ ఫ్యాక్టరీ

ఫరీదాబాద్‌లోని చెప్పులు తయారు చేసే కంపెనీలో శుక్రవారంనాడు నిప్పు రాజుకోవడంతో దాదాపు 33మంది తీవ్రగాయాల పాలైనారు. లఖానీ షూ ఫ్యాక్టరీకి చెందిన భవంతిలో మంటలు ఉన్నట్టుండి చెలరేగడంతో భవనం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి దాదాపు 15 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపినట్లు ఫరీదాబాద్ పోలీసులు తెలిపారు.
Source: జాతీయ | 2 May 2009 | 10:39 am

రాయల్స్‌తో మ్యాచ్: ఛార్జర్స్ బ్యాటింగ్

ఐపీఎల్ రెండో సీజన్‌లో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఐదు మ్యాచులు ఆడి నాలుగు విజయాలు సాధించిన డెక్కన్ పాయింట్ల...
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 10:39 am

స్వైన్‌ఫ్లూ భయం: లండన్‌లో 13 కేసులు

ప్రపంచాన్ని భయపెడుతున్న స్వైన్ ఫ్లూ వ్యాధి బ్రిటన్‌వాసులనూ బెంబేలెత్తిస్తోంది. మెక్సికో తర్వాత అమెరికాకు చేరిన ఈ స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రస్తుతం బ్రిటన్‌లోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. అధికారుల వివరాల ప్రకారం లండన్‌లో...
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 10:29 am

బాబ్రీ కూల్చివేతలో కళ్యాణ్‌కూ పాత్ర: లాలూ

బాబ్రీ కూల్చివేతలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌కు సైతం పాత్ర ఉందని కేంద్ర రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కళ్యాణ్ సింగ్ సైతం దోషేనంటూ
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 10:19 am

"జీవీకే వన్" మాల్ ప్రారంభం

రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లో జీవీకే గ్రూప్ నుంచి రీటైల్ వాణిజ్య కేంద్రం "జీవీకే వన్" మాల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోనే అతిపెద్దదైన ఈ జీవీకే మాల్‌ను రోడ్డు నెం.1లో 3.5 లక్షల చదరపు అడుగుల స్థలంలో నిర్మించారు.
Source: వినోదం | 2 May 2009 | 10:11 am

త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు

రిషి, సౌమ్య హీరోహీరోయిన్లుగా నటించిన దమ్మున్నోడు చిత్రం విడుదలకు సిద్ధమైంది. బి.వి.వి. చౌదరి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ దమ్మున్నోడు చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. వందేమాతరం శ్రీనివాసరావు సంగీతాన్ని సమకూర్చిన...
Source: Yahoo! Telugu: Entertainment | 2 May 2009 | 10:07 am

లారెన్స్ హీరోగా రానున్న రాజాధిరాజా

డాన్స్ మాస్టర్ లారెన్స్ హీరోగా శ్రీదేవీ పిక్చర్స్ పతాకంపై డా.వి.నాగేశ్వర రెడ్డి సమర్పణలో రూపొందుతున్న చిత్రం రాజాధిరాజా. లారెన్స్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. లారెన్స్ సరసన...
Source: Yahoo! Telugu: Entertainment | 2 May 2009 | 10:05 am

ధర్మవరంలో టీడీపీ నేత హత్య

రాయలసీమ రతనాల సీమ అంటారు. మరి ఆ రతనాల సీమలోనే మరోసారి రాజకీయ హత్య జరిగింది. వివరాలలోకి వెళితే...అనంతపురం జిల్లా ధర్మవరంలో పట్టణంలోని సత్యసాయి నగర్‌లో నివాసం ఉంటున్న తెలుగుదేశంపార్టీ నేత అమర కేశవయ్య దారుణ హత్యకు గురయ్యాడు.
Source: ఏపీ న్యూస్ | 2 May 2009 | 9:41 am

బాబ్రీ కేసులో కళ్యాణ్ సింగ్ దోషి: మంత్రి లాలూ

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌పై కేంద్ర రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కళ్యాణ్ సింగే దోషేనని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో జరిగిన ఒక సభలో ఆయన ఘాటైన విమర్శలు చేశారు.
Source: జాతీయ | 2 May 2009 | 9:35 am

గజిబిజి కథతో...రొటీన్ చిత్రం వీడొక్కడే

గజని చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న తమిళ హీరో సూర్య హీరోగా తెలుగులో వచ్చిన చిత్రం వీడొక్కడే. తమిళంలో అయన్‌ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని వీడొక్కడే పేరుతో తెలుగుకు ప్రేక్షకులకు అందించారు నిర్మాతలు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 May 2009 | 8:51 am

ఏడాదికి మూడు చిత్రాలు: దిల్‌రాజు

తాను ఏడాదికి మూడు చిత్రాలను నిర్మించనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు వెల్లడించారు. శుక్రవారం తన గత చిత్రాలకు పనిచేసిన దర్శకులను దిల్‌రాజు సన్మానించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. గత ఏడాది మూడు హిట్ చిత్రాలను నెలకొల్పామన్నారు.
Source: వినోదం | 2 May 2009 | 8:35 am

ప్రధానిగా మన్మోహన్‌కు మద్దతు: మమత

ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధానమంత్రి అభ్యర్థిగా మన్మోహన్ సింగ్‌కు తాము మద్దతు ఇస్తామంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మమత ప్రకటనతో ప్రధాని అభ్యర్థిత్వంపై తృణమూల్‌ కాంగ్రెస్...
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 8:18 am

ఫ్రెంచ్ అరిస్టోక్రాట్‌తో దితా డేటింగ్!

హాలీవుడ్ నటి దితా వోన్ టీస్ ఈ మధ్య తనకంటే 11 సంవత్సరాలు చిన్నవాడైన ఫ్రెంచ్ అరిస్టోక్రాట్‌తో ప్రేమాయణం కొనసాగిస్తోందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఈ 36 ఏళ్ల హాలీవుడ్ తార దితా వోన్ అరిస్టోక్రాట్‌తో రొమాన్స్ చేస్తుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన కొచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్‌లో దితా తన బాయ్‌ఫ్రెండ్‌తో చాలాసేపు గడిపిందని న్యూయార్క్ పోస్ట్ తన ప్రచురణలో తెలిపింది. అంతేకాదు.. ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌తో దితా నడుచుకున్న విధానం చూసి ప్రేక్షకులంతా షాక్‌ తిన్నారని క్యాస్టెల్‌బాజెక్ న్యూయార్క్ పోస్ట్‌తో చెప్పింది.
Source: వినోదం | 2 May 2009 | 8:15 am