|
కాశ్మీర్‌లో ముగిసిన 50 గంటల సమ్మెకాశ్మీర్ లోయలోని చాలా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వేర్పాటువాదులు తలపెట్టిన 50 గంటల సమ్మె శుక్రవారంతో ముగిసింది. అయితే వరుసగా మూడో రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.Source: జాతీయ | 1 May 2009 | 11:48 am 4 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులురాష్ట్ర హైకోర్టుకు ఈనెల నాలుగో తేదీ నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నుంచి 29వ తేదీ వరకు సెలవులు దినాలుగా ప్రకటించారు. అయితే అత్యవసర కేసులకు సంబంధించి వాదనలు వినడానికి మే 6, 13, 20, 28 తేదీల్లో ఎంపిక చేసిన జడ్జీలు హాజరవుతారు.Source: ఏపీ న్యూస్ | 1 May 2009 | 11:43 am వన్య ప్రాణుల కేసు: ఆరుగురి అరెస్టునల్లమల అడవుల్లో వన్య ప్రాణులను వేటాడిన కేసులో ఒక అటవీశాఖ అధికారితో సహా ఓ ఇంజనీర్, ఇద్దరు ఏ.ఆర్. కానిస్టేబుళ్ళు, మరో ఇద్దరు నిర్మాణ సంస్థకు చెందిన వారితో సహా మొత్తం ఆరుగురు వేటగాళ్ళను అటవీ శాఖ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.Source: ఏపీ న్యూస్ | 1 May 2009 | 11:22 am వరుణ్‌కు ఊరట: పెరోల్ 14 వరకు పొడగింపుభారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీకి ఊరట లభించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం తనకు మంజూరు చేసిన పెరోల్‌ను ఈనెల 14వ తేదీ వరకు పొడగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం వరుణ్ కేసుపై విచారణ జరిపింది.Source: జాతీయ | 1 May 2009 | 10:43 am ఓట్ల లెక్కింపునకు 25 వేల మందికి శిక్షణ: ఐవీఈనెల 16వ తేదీన చేపట్టనున్న ఓట్ల లెక్కింపు కోసం 25 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావు తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను చర్చించేందుకు ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 1 May 2009 | 10:09 am ముఖ్యమంత్రి పదవి రేసులో లేను: ధర్మపురితాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ శుక్రవారం స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి మరోమారు ఆ బాధ్యతలను చేపడుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 1 May 2009 | 10:02 am గుజరాత్ అల్లర్ల కేసుపై స్టే తొలగించిన సుప్రీం కోర్టుగుజరాత్ అల్లర్ల కేసులపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఎత్తివేసింది. అంతేకాకుండా 2002నాటి గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులపై విచారణ జరిపేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.Source: జాతీయ | 1 May 2009 | 8:18 am అవినీతిలో యూపీఏ సరికొత్త రికార్డు: కారత్కేంద్రంలోని అధికార యూపీఏ కూటమి ప్రభుత్వం అవినీతిలో సరికొత్త రికార్డు సృష్టించిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ఆరోపించారు. తమిళనాడు రాష్ట్రం, కాంచీపురంలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.Source: జాతీయ | 1 May 2009 | 7:13 am మూడో దశలో యాభై శాతం పోలింగ్: సీఈసీదేశ వ్యాప్తంగా గురువారం జరిగిన మూడో దశ ఎన్నికల్లో యాభై శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో 107 లోక్‌సభ స్థానాలకు ఈ పోలింగ్ జరిగింది. ఈ దశ పోలింగ్ ప్రక్రియ 1.65 వేల పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.Source: జాతీయ | 1 May 2009 | 5:39 am నేటితో పూర్తికానున్న వరుణ్ పెరోల్ గడువుభారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీకి సుప్రీంకోర్టు మంజూరు చేసిన రెండు వారాల పెరోల్ గడువు శుక్రవారంతో పూర్తికానుంది. దీంతో వరుణ్ గాంధీ శుక్రవారం పెరోల్ పొడిగింపునకు సుప్రీంకోర్టును మరోమారు ఆశ్రయించనున్నారు.Source: జాతీయ | 1 May 2009 | 5:30 am మే 01, 2009 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 ప్రేమలు- పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరంSource: Yahoo! Telugu: Entertainment | 1 May 2009 | 5:05 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 1 May 2009 | 5:03 am అద్వానీ బలమైన నేత కాదు: రాహుల్ గాంధీభారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ బలమైన నేత కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, అమేథీ లోక్‌సభ అభ్యర్థి రాహుల్ గాంధీ అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్.. అద్వానీపై మరో మారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాందహార్ విమాన హైజాక్ కేసులో తీవ్రవాదులతో రాయబారానికి కేంద్ర మంత్రిని పంపిన ఘనత అద్వానీకే దక్కుతుందన్నారు.Source: జాతీయ | 30 Apr 2009 | 3:20 pm ప్రశాంతంగా ముగిసిన మూడో దశ పోలింగ్సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం జరిగిన మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సూర్యతాపం ధాటికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా 40 నుంచి 45 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు అభిప్రాయపడుతున్నారు.Source: జాతీయ | 30 Apr 2009 | 2:37 pm నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు తనయుడు నారా రోహిత్ హీరోగా సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. రాజకీయ నాయకుడిగా ఎన్నో రికార్డులు సాధించిన నారా చంద్రబాబుSource: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2009 | 12:55 pm దాసరి జన్మదినం: కార్మికులకు సన్మానందర్శకరత్న దాసరి నారాయణరావు 63వ జన్మదినాన్ని పురస్కరించుకుని వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సినీ రంగంలోని 24 శాఖలకు చెందిన 134 మంది సీనియర్ కార్మికులకు సత్కారం జరుగనుంది. మే నాలుగో తేదీ సాయంత్రం (దాసరి పుట్టిన రోజుSource: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2009 | 12:50 pm ప్రధాని పదవిపై భాజపాలో పోటీలేదు: రాజ్నాథ్భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి పదవికోసం పోటీపడుతున్నవారు ఎల్కే అద్వానీ ఒక్కరేననీ, మరెవరూ తమ పార్టీలో ఆ పదవికోసం పోటీ పడటం లేదని భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. భాజపా నేతలు అరుణ్ శౌరి, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు వంటివారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవిని అలంకరిస్తే తాము ఎంతో సంతోషిస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాజ్ నాథ్ పై విధంగా స్పందించినట్లు సమాచారం.Source: జాతీయ | 30 Apr 2009 | 12:11 pm కర్నూలులో కూలిన కేసీ కెనాల్ వంతెనతుంగభద్రా నదిపై నిర్మాణంలో ఉన్న కేసీ కెనాల్ వంతెన గురువారం అకస్మాతుగా కూలిపోయింది. కర్నూలు-బెంగుళూరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తుంగభద్ర నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ ఘటనలో సైట్ ఇంజనీర్ సతీష్‌తో సహా ముగ్గురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 30 Apr 2009 | 11:08 am పాక్ ఉగ్రవాదికి యావజ్జీవ కారాగార శిక్షభారతదేశానికి సంబంధించిన అతి విలువైన సమాచారాన్ని పాకిస్థాన్ దేశానికి చేరవేసేందుకు చేసే ప్రయాత్నలలో భాగంగా దొరికిపోయిన పాకిస్థాన్ ఉగ్రవాది అర్షద్ ముహమ్మద్‌కు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.Source: ఏపీ న్యూస్ | 30 Apr 2009 | 10:47 am
|