ప్రధాని పదవిపై భాజపాలో పోటీలేదు: రాజ్‌నాథ్

భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి పదవికోసం పోటీపడుతున్నవారు ఎల్కే అద్వానీ ఒక్కరేననీ, మరెవరూ తమ పార్టీలో ఆ పదవికోసం పోటీ పడటం లేదని భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. భాజపా నేతలు అరుణ్ శౌరి, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు వంటివారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవిని అలంకరిస్తే తాము ఎంతో సంతోషిస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాజ్ నాథ్ పై విధంగా స్పందించినట్లు సమాచారం.
Source: జాతీయ | 30 Apr 2009 | 12:11 pm

కర్నూలులో కూలిన కేసీ కెనాల్ వంతెన

తుంగభద్రా నదిపై నిర్మాణంలో ఉన్న కేసీ కెనాల్ వంతెన గురువారం అకస్మాతుగా కూలిపోయింది. కర్నూలు-బెంగుళూరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తుంగభద్ర నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ ఘటనలో సైట్‌ ఇంజనీర్‌ సతీష్‌తో సహా ముగ్గురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2009 | 11:08 am

పాక్ ఉగ్రవాదికి యావజ్జీవ కారాగార శిక్ష

భారతదేశానికి సంబంధించిన అతి విలువైన సమాచారాన్ని పాకిస్థాన్ దేశానికి చేరవేసేందుకు చేసే ప్రయాత్నలలో భాగంగా దొరికిపోయిన పాకిస్థాన్ ఉగ్రవాది అర్షద్ ముహమ్మద్‌కు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2009 | 10:47 am

ప్రజారాజ్యంలో నా పాత్ర చిన్నదే: డాక్టర్ మిత్రా

సినీ నటుడు చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో తన పాత్ర అతి చిన్నదేనని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మిత్రా స్పష్టం చేశారు. తమ పార్టీ ఏ ఒక్క వ్యక్తిపైన ఆధారపడి లేదని, పార్టీలో తమవన్నీ చిన్న చిన్న పాత్రలేనని ఆయన వివరించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2009 | 9:25 am

ఖత్రోచీ వ్యవహారంపై సమయం కోరిన సీబీఐ

ఇటలీ పారిశ్రామికవేత్త ఒట్టావియో ఖత్రోచీకి సంబంధించిన బోఫోర్స్ ముడుపుల కేసుపై తదుపరి విచారణను ఢిల్లీ కోర్టు గురువారం సెప్టెంబరుకు వాయిదా వేసింది. సీబీఐ వాంటెడ్ వ్యక్తుల జాబితా నుంచి ఖత్రోచీ పేరును ఇటీవల సీబీఐ తొలగించింది.
Source: జాతీయ | 30 Apr 2009 | 9:25 am

స్విన్ ఫ్లూతో హైదరాబాదుకు వచ్చిన ఎన్నారై

అమెరికాలోని టెక్సాస్ నగరం నుంచి స్విన్ ఫ్లూతో బాధపడుతున్న ఎన్నారై ఒకరు రాష్ట్రరాజధాని హైదరాబాదు నగరానికి వచ్చినట్లు వైద్యులు కనుగొన్నారు. టెక్సాస్ నుంచి హైదరాబాదుకు వచ్చిన సదరు ఎన్నారైను పరీక్షించిన వైద్యులు అతనిలో స్విన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు కనుగొన్నారు.
Source: జాతీయ | 30 Apr 2009 | 9:21 am

రైలు ప్రమాదంపై సీబీసీఐడీ దర్యాప్తుకు ఆదేశం

తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంపై సీబీ-సీఐడీ విభాగం దర్యాప్తు జరపనుంది. అనేక అనుమానాలకు దారితీసిన ఈ రైలు ప్రమాదంపై తమిళనాడు పోలీసు శాఖకు చెందిన సీబీసీఐడీ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతుందని రాష్ట్ర ఉన్నతాధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 30 Apr 2009 | 8:23 am

లంక శరణార్థులను రక్షించిన తూ.గో జిల్లా జాలర్లు

శ్రీలంకలో సాగుతున్న అంతర్యుద్ధం కారణంగా లంక తమిళులు భారత్‌లోకి శరణార్థులుగా వస్తున్నారు. తాజాగా రాష్ట్ర సముద్ర జలాల్లో తచ్చాడుతున్న కొంతమంది శరణార్థులను తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన మత్య్సుకారులు రక్షించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2009 | 7:47 am

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం తథ్యం: అద్వానీ ధీమా

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్కే.అద్వానీ విశ్వాసం వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 30 Apr 2009 | 7:17 am

పీఆర్పీ నాయకత్వంపై శివశంకర్ ఆగ్రహం!

ప్రజారాజ్యం పార్టీ నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ పి.శివశంకర్ మండిపడ్డారు. శల్య సారథ్యంతో పార్టీని అధోగతి పాలు చేయవద్దని ఆయన ముక్కుసూటిగా చెప్పినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2009 | 6:51 am

రాజీవ్‌ హత్యకేసులో నిందితుల విడుదలకు నో

రాజీవ్‌గాంధీ హత్య కేసులో మరణదండన, జీవిత ఖైదు శిక్షలను అనుభవిస్తున్న ఏడుగురు నిందితులను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టేసింది
Source: జాతీయ | 30 Apr 2009 | 6:50 am

రాష్ట్ర రాజధానిలో స్వైన్ ఫ్లూ బాధితుడు!

విశ్వాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి రాష్ట్ర హైదరాబాద్‌కు వ్యాపించింది. టెక్సాస్ నుంచి రాజధానికి వచ్చిన ప్రవాస భారతీయుడికి ఈ వ్యాధి సోకిన విషయాన్ని వైద్యులు ధృవీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ బాధితునికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2009 | 6:19 am

ప్రధాని పదవికి శరద్ పవార్ అర్హుడు: చిరంజీవి

నాలుగో కూటమి తరపున దేశ ప్రధానమంత్రి పదవికి కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత శరద్ పవార్ తగిన వ్యక్తి అని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. తాము అనుకున్నట్టు అన్నీ జరిగితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం నాలుగో కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2009 | 6:11 am

కుమ్మక్కైన అభ్యర్థులపై చిరంజీవి ఆగ్రహం

ముగిసిన ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో కుమ్మక్కైన అభ్యర్థుల పట్ల ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్పీ విజయావకాశాలపై జరిగిన సమీక్షా సమావేశాల్లో అభ్యర్థుల తీరు పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 30 Apr 2009 | 6:03 am

మూడో దశ పోలింగ్: బరిలో ఉన్న కీలక నేతలు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం జరుగుతున్న మూడో దశ ఎన్నికల ప్రక్రియలో పలువురు నేతలు బరిలో ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని 26 పార్లమెంట్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో గాంధీ నగర్ నుంచి అద్వానీ (భాజపా), సురేష్ పటేల్ (కాంగ్రెస్), మల్లికా షరాభాయ్ (ఇండిపెండెంట్)లు పోటీ పడుతున్నారు.
Source: జాతీయ | 30 Apr 2009 | 5:40 am

ఏప్రిల్ 30, 2009 కార్యక్రమాలు

06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం
Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2009 | 4:39 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 30 Apr 2009 | 4:38 am

సోనియా చేతిలో ప్రధాని కీలుబొమ్మ: అద్వానీ

దేశంలో అతి పెద్దదైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌.కె. అద్వానీ పశ్చిమబెంగాల్‌లో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు
Source: జాతీయ | 30 Apr 2009 | 4:29 am

సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

భారతదేశపు సరిహద్దుల్లో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. దీంతో ఇతరులెవ్వరూ భారతదేశం సరిహద్దులు దాటి లోపలకు రావడానికి వీలు లేకుండా సరిహద్దుల వెంబడి సైనికులు మొహరించి ఉన్నారు.
Source: జాతీయ | 29 Apr 2009 | 2:57 pm

అది మమత ఛాయిస్: అద్వానీ వ్యాఖ్య

తమ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలోకి రావాలా లేదా కాంగ్రెస్‌తో ఉండిపోవాలా అనేది మమతా బెనర్జీ నేతృత్వంలోని తృతమూల్ కాంగ్రెస్ ఇష్టమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి ఎల్‌కే.అద్వానీ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 29 Apr 2009 | 2:09 pm

సస్పెన్స్ థ్రిల్లర్‌గా నేనున్నా.. నీకోసం

సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో "నేనున్నా.. నీకోసం" అనే చిత్రం ప్రారంభమైంది.బోరబండలోని శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో బుధవారం ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఎస్ఎస్ ఫిల్మ్‌ఫ్యాక్టరీ పతాకంపై నందకిషోర్
Source: Yahoo! Telugu: Entertainment | 29 Apr 2009 | 12:24 pm

ముఖ్యమంత్రి పీఠంపై డి.శ్రీనివాస్ కన్ను

రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నేసినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన అటు ప్రజారాజ్యం, ఇటు తెలంగాణా రాష్ట్ర సమితి నేతలతో సంప్రదింపులు జరుపుతూ మచ్చిక చేసుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 11:55 am

కేసీఆర్ స్పీడుకు మహాకూటమి బ్రేకులు

తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు స్పీడుకు మహాకూటమి నేతలు బ్రేకులు వేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీకి వెళ్లి.. భాజపా అగ్రనేత అద్వానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
Source: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 11:53 am

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 402 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో పయనించింది. ఆసియా మార్కెట్‌ల సానుకూల ప్రభావంతో 90 పాయింట్ల వృద్ధి చెంది 11,092 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్..
Source: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 11:52 am

ఎవరిని ఎంచుకోవాలనేది మమత ఇష్టం: అద్వానీ

తమ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలోకి రావాలా లేదా కాంగ్రెస్‌తో ఉండిపోవాలా అనేది మమతా బెనర్జీ నేతృత్వంలోని తృతమూల్ కాంగ్రెస్ పార్టీ ఇష్టమని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. గతంలో తృణమూల్ కాంగ్సెస్
Source: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 11:51 am

యూపీఏతోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యం: కేకే

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమితో సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో
Source: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 11:16 am

సమస్యలపై లోక్‌సత్తా కాల్ సెంటర్ ఏర్పాటు

స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు గాను లోక్‌సత్తా పార్టీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. స్థానికంగా ఎవరికైనా సమస్యలు ఉంటే ఆ నంబరుకు ఫోన్ చేసి తెలుపవచ్చు. అంతకుముందు ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్
Source: Yahoo! Telugu: News | 29 Apr 2009 | 11:15 am