తెలంగాణకు కట్టుబడి ఉన్న తెలుగుదేశం: బాబు

తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా తాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మరోసారి స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 27 Apr 2009 | 11:39 am

ఫ్రిడాను పటేల్ ప్రేమిస్తున్నాడు: అనిత

ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకుని, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన "స్లమ్‌డాగ్‌ మిలియనీర్" సినిమాలో నటించిన యువజంట దేవ్‌పటేల్-ఫ్రిడాలు ప్రేమించుకుంటున్నారని ఇటీవల సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఫ్రిడా-పటేల్‌ల మధ్య ప్రేమాయణం కొనసాగుతుందనే వార్తలన్ని నిజమేనని అనిత (పటేల్ తల్లి) స్పష్టం చేసింది. ఈ వార్తలన్ని ఏ మాత్రం వదంతులు కావని, తన కుమారుడు దేవ్‌పటేల్ ఫ్రిడాను నిజాయితీగా ప్రేమిస్తున్నాడని ఆమె వెల్లడించింది. దేవ్‌పటేల్-ఫ్రిడా జంటను చూస్తుంటే తనకెంతో సంతోషంగా ఉంటుందని, వాళ్లిద్దరూ చూడముచ్చటగా ఉంటారని అనిత తెలిపినట్లు మిర్రర్ పత్రిక తెలిపింది.
Source: వినోదం | 27 Apr 2009 | 10:38 am

ప్రధాని పదవి ఆశించడం ఫ్యాషన్‌గా మారింది: సోనియా

కొంత మంది వ్యక్తులకు ఇప్పుడు ప్రధాని పదవి ఆశించడం ఫ్యాషన్‌గా మారిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పునరుద్ఘాటించారు. అయితే, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాత్రం.. తన లక్ష్యం మాత్రం ప్రధాని కావడం కాదని, పేదల సంక్షేమం కోసం కృషి చేయడమని చెప్పారని ఆమె గుర్తు చేశారు.
Source: జాతీయ | 27 Apr 2009 | 10:23 am

పథకాల కొనసాగింపునకు ఈసీ గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఇకపై ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపింది. అయితే ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను కొనసాగించాలే తప్ప కొత్త పథకాలను మాత్రం ప్రకటించకూడదని ఈసీ స్పష్టం చేసింది.
Source: ఏపీ న్యూస్ | 27 Apr 2009 | 10:18 am

ఫలితాలపై వ్యాఖ్యానించలేను: నారాయణ

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాతే తమ భవిష్యత్ నిర్ణయం ఉంటుందని సీపీఐ కార్యదర్శి నారాయణ తెలిపారు. అలాగే ఫలితాల గురించి తాము ఇపుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Apr 2009 | 10:14 am

ప్రధాని అభ్యర్థిగా లోక్‌సభ సభ్యుడే: కారత్

ప్రధానమంత్రి పదవిని చేపట్టే అభ్యర్థి లోక్‌సభ నుంచి ప్రాతినిథ్యం వహించే నేతగా ఉండాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ప్రధాని మన్మోహన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 27 Apr 2009 | 10:05 am

దీక్ష విరమించిన డీఎంకే చీఫ్

శ్రీలంక ప్రభుత్వం కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి చేపట్టిన నిరాహారదీక్షను విమరించుకున్నారు. తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపుతున్నట్టు శ్రీలంక ప్రభుత్వం కేంద్రానికి సమాచారం తెలిపింది. ఫలితంగా ఆయన నిరాహార దీక్షను విరమించుకున్నారు.
Source: జాతీయ | 27 Apr 2009 | 10:00 am

నాగబాబు ప్రధాన పాత్రలో 'కలువ' పూర్తి

నాగబాబు ప్రధాన పాత్రలో, శుభలక్ష్మి ఎంటర్‌టైనర్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం కలువ. ఎం. శ్రీధర్ దర్శకత్వంలో, ఎస్. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Apr 2009 | 9:33 am

ఈ ఏడాదిలోపే తల్లినవుతా..!: క్యాటీ

ఈ సంవత్సరం చివరి కల్లా తప్పకుండా తల్లినవుతానని హాలీవుడ్ సెలబ్రిటీ క్యాటీ ప్రైస్ జోర్డాన్ వెల్లడించింది. తన భర్త పీటర్ ఆండ్రూకు తనకు పిల్లలంటే చాలా ఇష్టమని త్వరలో తామిద్దరం తల్లిదండ్రులవుతామని జోర్డాన్ తెలిపింది. తమకు కలిగే సంతానానికి ఇప్పుడే తగిన పేర్ల జాబితాను సిద్ధం చేసుకుంటామని క్యాటీ నవ్వుతూ చెప్పింది. ఇటీవల జరిగిన లండన్ మారథాన్‌లో పాల్గొన్నారని మిర్రర్ తెలిపింది. అంతేకాదు.. జోర్డాన్, పీటర్ జంట లండన్ మారథాన్‌ను సెక్స్‌తో ఎంజాయ్ చేశారని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట..!
Source: వినోదం | 27 Apr 2009 | 9:33 am

సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: వైఎస్

రాష్ట్రంలో ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని అదికూడా సొంతబలంతోనే తాము అధికార పీఠాన్ని చేపడుతామని ముఖ్యమంత్రి వైఎస్ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ ఈ ఎన్నికల్లో 230 అసెంబ్లీ, 36 లోక్‌సభ స్థానాలను తప్పకుండా కైవసం చేసుకుంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 27 Apr 2009 | 9:19 am

లంక యుద్ధాన్ని ఆపాలి: దీక్షకు దిగిన కరుణ

ఎల్టీటీఈ తీవ్రవాదుల ఏరివేత పేరుతో శ్రీలంక ప్రభుత్వం సాగిస్తున్న యుద్ధాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కరుణానిధి సోమవారం ఆకస్మికంగా నిరాహార దీక్షకు దిగారు. డీఎంకే కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలకు దిగారు.
Source: జాతీయ | 27 Apr 2009 | 7:29 am

బెంగాల్‌లో లెఫ్ట్ కోటకు బీటలు: ప్రకాష్ కారత్

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికార లెఫ్ట్ ఫ్రంట్ గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూలేని పోటీని ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎదుర్కోబోతుంది. రాష్ట్రంలో 32 ఏళ్ల క్రితం అధికారాన్ని చేజిక్కించుకున్న సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్‌కు "ముందుంది.. మొసళ్ల పండగలాగే" కనిపిస్తోంది.
Source: జాతీయ | 27 Apr 2009 | 7:26 am

బాలీవుడ్ నటుడు ఫిరోజ్‌ఖాన్ మృతి

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫిరోజ్‌ఖాన్ ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొన్ని సంవత్సరాలుగా ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఫిరోజ్ ఖాన్, బెంగళూరులోని ఆయన ఫాంహౌస్‌లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు వెల్లడించారు. క్యాన్సర్‌ వ్యాధికి ముంబైలో చికిత్స పొందిన అనంతరం పుట్టి పెరిగిన తన ఫాంహౌస్‌లో ఉంటున్నారు.
Source: వినోదం | 27 Apr 2009 | 7:23 am

రాష్ట్రానికి మంచి చేయాలనుకునే అధినేత

జగపతిబాబు హీరోగా, శ్రద్ధాదాస్, హంసానందినిలు జంటగా తాజాగా తెరమీదకు వచ్చిన చిత్రం అధినేత. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కి వివిధ కారణాల రీత్యా ఎన్నికలముందు విడుదల కాకుండా ఆలస్యమైన ఈ చిత్రం ఎన్నికలు...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Apr 2009 | 6:43 am

లారాదత్త స్థానంలో కత్రీనా కైఫ్..?

బాలీవుడ్ మూవీ "బ్లూ"లో సెక్సీతార లారాదత్త హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే లారాదత్త స్థానాన్ని ఆసియా అందగత్తె కత్రీనా కైఫ్ కైవసం చేసుకోనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. లారాదత్త ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో లారాకు బదులు కత్రీనాను ఎంపిక చేస్తే...
Source: వినోదం | 27 Apr 2009 | 6:42 am

లెఫ్ట్ పార్టీలతో పొత్తుకు నో ఛాన్సెస్: ములాయం

తృతీయ కూటమితో లేదా లెఫ్ట్ పార్టీలతో పొత్తును ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ తోసిపుచ్చింది. ఎన్నికల తరువాత తృతీయ కూటమితో పొత్తుకు తాము ప్రయత్నించబోమని స్పష్టం చేసింది.
Source: జాతీయ | 27 Apr 2009 | 6:14 am

ఆరు నెలల్లో మధ్యంతరం తథ్యం: జేపీ జోస్యం

ప్రస్తుత ఎన్నికల తీరుతెన్నులు చూస్తుంటే అటు లోక్‌సభకు, రాష్ట్రంలో అసెంబ్లీకి మధ్యంతరం తప్పకపోవచ్చని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం దృష్ట్యా పార్టీ శ్రేణులు మధ్యంతరాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 27 Apr 2009 | 6:05 am

పెళ్లవుతుంది కాబట్టి...!

"రేపటి నుంచి నీకు రెండు చిప్పలు అన్నం ఎక్కువ పెట్టాలా...? ఎందుకు...?" అడిగింది మునెమ్మ. "రేపు నా పెళ్ళి అమ్మగోరూ....
Source: వినోదం | 27 Apr 2009 | 5:17 am

మా ఆవిడకు నేనంటే చాలా ప్రేమ

"రాత్రిపూట ఎంత లేటుగా వెళ్లినా మా ఆవిడ ఏమీ అనదు, వెళ్లగానే వేడి వేడి కాఫీ ఇస్తుంది... స్నానానికి వేడినీళ్లు పెడుతుంది, బట్టలు విప్పి స్వెట్టరు వేస్తుంది...
Source: వినోదం | 27 Apr 2009 | 5:13 am

నా పనికి గుర్తింపు ఇవ్వండి: వరుణ్ గాంధీ

భారతీయ జనతా పార్టీ తరపున యూపీలోని పిలిభిత్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న వరుణ్ గాంధీ తాను పేరు ద్వారా వచ్చే గుర్తింపును కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. తాను చేసిన పనుల ద్వారా గుర్తింపును కోరుకుంటున్నానని చెప్పారు.
Source: జాతీయ | 27 Apr 2009 | 4:19 am

స్వతంత్ర అభ్యర్థులకు ఓట్లు వేయొద్దు: సోనియా

ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు ఓట్లు వేయరాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. వీరికి ఓటు వేయడం ఎలాంటి ప్రయోజనం చేకూరబోదన్నారు. వీరు గెలవకపోయినా గెలిచే అభ్యర్థుల ఓట్లను స్వంతత్రులు ప్రభావితం చేస్తుంటారని పేర్కొన్నారు.
Source: జాతీయ | 27 Apr 2009 | 4:14 am

ఏప్రిల్ 27, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ ...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Apr 2009 | 3:51 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 27 Apr 2009 | 3:49 am

ప్రధానిపై బూటు విసిరిన నిరసనకారుడు

అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌పై ఓ వ్యక్తి బూటు విసిరాడు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిరసనకారుడిని వెంటనే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని ఏలిస్‌బ్రిడ్జ్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Source: జాతీయ | 26 Apr 2009 | 12:55 pm

మహాకూటమికే అధికారం: తెదేపా

రాష్ట్రంలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని మహాకూటమికి భారీ మెజార్టీ వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రంనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్, చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 26 Apr 2009 | 12:50 pm