ప్రధానిపై బూటు విసిరిన నిరసనకారుడు

అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌పై ఓ వ్యక్తి బూటు విసిరాడు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిరసనకారుడిని వెంటనే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని ఏలిస్‌బ్రిడ్జ్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Source: జాతీయ | 26 Apr 2009 | 12:55 pm

మహాకూటమికే అధికారం: తెదేపా

రాష్ట్రంలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని మహాకూటమికి భారీ మెజార్టీ వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రంనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్, చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 26 Apr 2009 | 12:50 pm

ఒరిస్సా నాల్కో గనిపై మావోల దాడి: ఒకరి అరెస్ట్

జాతీయ అల్యూమినియం కంపెనీ (నాల్కో)కు చెందిన గనిపై ఈ నెల 12న మావోయిస్టులు జరిపిన అనూహ్య దాడికి సంబంధించి ఓ మావోయిస్టు గెరిల్లాను అరెస్టు చేసినట్లు ఆదివారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. నాల్కో గనిపై జరిగిన దాడిలో అరెస్టు చేసిన వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Source: జాతీయ | 26 Apr 2009 | 10:28 am

ప్రభాకరన్ తీవ్రవాది కాదు: రామదాస్

శ్రీలంక వేర్పాటు వాద సంస్థగా పేరొందిన ఎల్టీటీఈకి నాయకత్వం వహిస్తున్న వేలుపిళ్ళై ప్రభాకరన్ తీవ్రవాది కాదని పాట్టాలీ మక్కల్ కట్చి (పీఎంకే) వ్యవస్థాపకుడు డాక్టర్ రామదాస్ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 26 Apr 2009 | 10:04 am

లడక్‌లో రైలు మార్గం నిర్మించనున్న భారత్

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో పర్వతాల్లో బందీగా ఉన్న లడక్ ప్రాంతాన్ని మిగిలిన భూభాగాన్ని కలిపేందుకు ప్రతిష్టాత్మకమైన, వ్యూహాత్మకంగా కీలకమైన రైల్వే ప్రాజెక్టు రంగం సిద్ధం అవుతుంది. ఈ ప్రాంతంలో రైల్వే లైను నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదికను రైల్వే శాఖ ఖరారు చేసింది.
Source: జాతీయ | 26 Apr 2009 | 8:33 am

మహాకూటమికే మెజారిటీ: సీపీఎం

రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు స్పష్టం చేశారు. మహాకూటమికి పూర్తి మెజారిటీ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క తెలుగుదేశం పార్టీకే అత్యధిక స్థానాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు మహాకూటమి సొంతం చేసుకుంటుందని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 26 Apr 2009 | 8:29 am

ముఖ్యమంత్రి మాటల్లో తప్పులేదు: డీఎస్

రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఏర్పాటయిన మహాకూటమితో ప్రత్యేక తెలంగాణ వస్తే లేనిపోని ఇబ్బందులు ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారని డీఎస్ చెప్పారు. మహాకూటమి ద్వారా తెలంగాణ వస్తే, అందులోని శక్తుల వలన ఆంక్షల జీవితం గడపాల్సి వస్తుందని, లేనిపోని ఇబ్బందులు వస్తాయి.
Source: ఏపీ న్యూస్ | 26 Apr 2009 | 8:24 am

ఏ పార్టీతోనైనా చేతులు కలుపుతాం: కేసీఆర్

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేంద్రంలో ఎవరితోనైనా జట్టు కట్టేందుకు, ఏదైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. దీనిని సాధించుకునేందుకు ఏ పార్టీతోనైనా చేతులు కలుపుతామని స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 26 Apr 2009 | 8:20 am

జయలలితకు లీగల్ నోటీసు పంపిన మారన్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ లీగల్ నోటీసు పంపారు. సన్‌ టెలివిజన్‌ ఛానల్‌ కార్యక్రమాల కోసం తన ఫోన్‌ను దుర్వినియోగం చేశారని జయ ఆరోపించారు. దీనిపై మారన్‌ లీగల్‌ నోటీసును పంపించారు.
Source: జాతీయ | 26 Apr 2009 | 6:33 am

ప్రత్యేక తమిళ ఈలానికి జయలలిత మద్దతు

శ్రీలంకలో వేర్పాటువాద ఉద్యమం నడుపుతున్న ఎల్టీటీఈకి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి బహిరంగ మద్దతు ప్రకటించారు. ప్రత్యేక తమిళ దేశం కోసం ఎల్టీటీఈ గత కొన్ని దశాబ్దాలుగా శ్రీలంకలో ఉద్యమం నడుపుతున్న సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 26 Apr 2009 | 5:39 am

ఏప్రిల్ 26, 2009 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా 15.00 అభిరుచి 15.30 ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2009 | 5:33 am

ఈ వారం


Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2009 | 5:31 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2009 | 5:30 am

దిగ్విజయ్ సింగ్‌కు ఎన్నికల సంఘం నోటీసు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిని బెదిరించినట్టు ప్రసంగించినందుకు గాను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై ఎన్నికల సంఘం మండిపడింది. చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది.
Source: జాతీయ | 26 Apr 2009 | 5:17 am

వరుణ్‌పై నాసా తొలగింపునకు కేంద్రం తిరస్కృతి

భారతీయ జనతా పార్టీ యువనేత రాహుల్ గాంధీపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగించిన జాతీయ భద్రతా చట్టం (నాసా)ను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఫిలిబిత్ పార్లమెంట్ స్థానం నుంచి భాజపా తరపున బరిలోకి దిగుతున్న వరుణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 25 Apr 2009 | 2:54 pm

యదార్థ సంఘటన ఆధారంగా ఊహాచిత్రం

వంశీకృష్ణ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ఊహాచిత్రం. పూనెలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఊహాచిత్రం రూపొందిందని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్న సత్య తెలియజేశారు. పైడిబాబు...
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 1:26 pm

యదార్థ సంఘటన ఆధారంగా ఊహాచిత్రం

వంశీకృష్ణ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ఊహాచిత్రం. పూనెలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఊహాచిత్రం రూపొందిందని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్న సత్య తెలియజేశారు. పైడిబాబు...
Source: Yahoo! Telugu: Entertainment | 25 Apr 2009 | 1:26 pm

కాంగ్రెస్‌కు మద్దతివ్వం: బృందా కారత్

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ శనివారం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము మద్దతు ఇచ్చేందుకు ఎటువంటి అవకాశం లేదని, కనీస ఉమ్మడి కార్యక్రమంతో పనిచేయలేని డీఎన్ఏను కాంగ్రెస్ కలిగివుందని ఎద్దేవా చేశారు.
Source: జాతీయ | 25 Apr 2009 | 1:14 pm

మాంద్యంతో మిట్టల్‌కు 23.5 బిలియన్ పౌండ్ల నష్టం

ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఎన్ఆర్ఐ స్టీలు దిగ్గజం లక్ష్మీమిట్టల్‌కు గడిచిన ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం కారణంగా 23.5 బిలియన్ పౌండ్ల నష్టం వాటిల్లింది. ఆదివారం ప్రచురితం కానున్న సండేటైమ్స్ రిచ్ లిస్ట్ వివరాలను
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 1:12 pm

హంగ్ పరిస్థితి రాబోదు: రాఘవులు జోస్యం

రాష్ట్రంలో హంగ్ ఏర్పడే పరిస్థితి లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు జోస్యం చెప్పారు. అదేసమయంలో ఈసారి ఎన్నికల్లో మహాకూటమి మంచి ఫలితాలను సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 12:55 pm

ప్రపంచకప్ నిర్ణయంలో తొందరపాటు లేదు: ఐసీసీ

వచ్చే ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ నుంచి ఉపసంహరించడంలో తామేమీ తొందరపడలేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పష్టం చే్సింది. పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు, క్రికెట్ యంత్రాంగం తమ దేశం నుంచి ప్రపంచకప్‌ను ఐసీసీ
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 12:54 pm

గిబ్స్ అర్ధ సెంచరీ: ముంబయి లక్ష్యం 169

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం ముంబయి ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ గిబ్స్ (58) అర్ధ సెంచరీ సాధించడంతో ఛార్జర్స్ జట్టు...
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 12:53 pm

మాయవతికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతికి వ్యతిరేకంగా అలహాబాద్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అనేక నేరాల్లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మాయావతి రాజకీయంగా క్లీన్‌చీట్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఈ పిటిషన్ దాఖలు కావడం విశేషం.
Source: జాతీయ | 25 Apr 2009 | 12:07 pm

కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు: సీపీఎం

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ శనివారం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము మద్దతు ఇచ్చేందుకు ఎటువంటి అవకాశం లేదని, కనీస ఉమ్మడి
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 12:06 pm

బాలలకోసం రాష్ట్రస్థాయి రంగస్థల పోటీలు

బాలల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకై జవహర్ బాలభవన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి రంగస్థల పోటీలు నిర్వహించనున్నారు. చిన్నారుల మనోవిజ్ఞానాన్ని పెంచేందుకై ఉద్దేశించిన ఈ పోటీలను ఈనెల 27నుంచి 30వరకు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 25 Apr 2009 | 12:02 pm

కాశ్మీర్‌లోకి 31 మంది తీవ్రవాదుల చొరబాటు

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోకి 31 మంది తీవ్రవాదులతో సహా 100- 200 మంది పురుషులు చొరబడ్డారని ఆర్మీ శనివారం వెల్లడించింది. ఉత్తర కాశ్మీర్‌లోని గురెజ్ సెక్టార్‌లో వీరు భారత భూభాగంలోకి ప్రవేశించారని ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ గుర్‌మీత్
Source: Yahoo! Telugu: News | 25 Apr 2009 | 11:52 am