ఎన్టీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చాలాసేపు జూనియర్‌తో...
Source: Yahoo! Telugu: News | 24 Apr 2009 | 12:21 pm

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 194 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం లాభాల బాటలో నడిచింది. 15 పాయింట్ల వృద్ధితో 11,149 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం నష్టాల్లోకి జారుకుంది. ఒకానొక దశలో 11,070 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. కొనుగోళ్లు ఆదుకోవడంతో
Source: Yahoo! Telugu: News | 24 Apr 2009 | 12:20 pm

ఐఎంజీతో ఏఐబీఏ భాగస్వామ్య ఒప్పందం

ఐవోసీతో గుర్తింపు పొందిన ప్రపంచ బాక్సింగ్ నియంత్రణ సంస్థ ఏఐబీఏ, ప్రముఖ క్రీడల, వినోద, మీడియా కంపెనీ ఐఎంజీ మధ్య సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. వరల్డ్ సిరీస్ ఆఫ్ బాక్సింగ్ (డబ్ల్యూఎస్‌బీ) కోసం అంతర్జాతీయ బాక్సింగ్
Source: Yahoo! Telugu: News | 24 Apr 2009 | 12:08 pm

భవిష్యత్‌లో మోడీ ప్రధాని కాగలరు: శౌరీ

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ భవిష్యత్‌లో దేశ ప్రధాని కాగలరని భారతీయ జనతా పార్టీ నేత అరుణ్‌శౌరి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎల్‌కే అద్వానీనేనని ఆయన స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 24 Apr 2009 | 11:53 am

తెలుగుదేశంకు మెజారిటీ ఖాయం: ఎర్రబెల్లి

ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం పార్టీ కచ్చితంగా మెజారిటీ సాధిస్తుందని పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు జోస్యం చెప్పారు. అదేసమయంలో ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగితే తాను రాజకీయ...
Source: Yahoo! Telugu: News | 24 Apr 2009 | 11:36 am

అఫ్జల్‌ను ఉరితీస్తే మాకు సమస్య లేదు: కాంగ్రెస్

పార్లమెంట్‌పై దాడి కేసులో ఉరిశిక్ష విధించబడిన అఫ్జల్ గురుకు ఆ శిక్షను అమలు చేస్తే తమకు సమస్యేమీ లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. అఫ్జల్ గురు లేదా మరే ఇతర తీవ్రవాదిని కాపాడే పనులేవీ
Source: Yahoo! Telugu: News | 24 Apr 2009 | 11:32 am

అసహనంతోనే కాంగ్రెస్ దాడులు: టీడీపీ

ఎన్నికల్లో ఓటమి తప్పదన్న అసహనంతోనే కాంగ్రెస్ పార్టీ తమ వర్గీయులపై దాడులకు పాల్పడుతోందని తెలుగుదేశం నేతలు విమర్శించారు. తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నాగిరెడ్డి ఇంటిపై జరుగుతున్న దాడులు కాంగ్రెస్ సంస్కృతికి...
Source: Yahoo! Telugu: News | 24 Apr 2009 | 11:03 am

బీహార్: మావోయిస్టుల దాడిలో ఐదుగురి మృతి

బీహార్‌లో మావోయిస్టులు సాగించిన విధ్వంసంలో నలుగురు పోలీసులతో సహా ఐదుగురు మృతి చెందారు. పోలింగ్ కార్యక్రమాలు ముగించుకుని తిరిగివస్తున్న తరుణంలో పోలీసులపై మావోలు ఈ దాడికి తెగబడ్డారని అధికారులు శుక్రవారం తెలిపారు.
Source: జాతీయ | 24 Apr 2009 | 10:59 am

నా వయసింకా నిండా పదహారే: టెండూల్కర్

టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌‍మెన్ సచిన్ టెండూల్కర్ గురువారంతో 36 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అయితే తనకు మాత్రం 16 ఏళ్ల బాలుడిననే అనిపిస్తుందని సచిన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)
Source: Yahoo! Telugu: News | 24 Apr 2009 | 10:46 am

త్వరలో ప్రేక్షకుల ముందుకు మగధీర

మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌తేజ హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం మగధీర. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జంటగా కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2009 | 10:24 am

ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు మార్ష్ అనుమానం

ఆస్ట్రేలియా ఓపెనర్ షాన్ మార్ష్ గాయం కారణంగా ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అంతేకాకుండా త్వరలో ఇంగ్లాండ్‌లో జరిగే ట్వంటీ-20 ప్రపంచకప్‌కు షాన్ మార్ష్ అందుబాటులో ఉండటంపై అనుమానాలు వ్యక్తం
Source: Yahoo! Telugu: News | 24 Apr 2009 | 10:09 am

జలాంతర్గామిలో ప్రభాకరన్ తప్పించుకునే అవకాశం

శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ప్రభుత్వ సేనలతో జరుగుతున్న యుద్ధంలో ఎల్టీటీఈ ఓటమి అంచున నిలిచింది. తమిళ టైగర్ల ఆధీనంలోని అతితక్కువ భూభాగం ఏ క్షణంలోనైనా శ్రీలంక సేనల పరం కానుంది.
Source: Yahoo! Telugu: News | 24 Apr 2009 | 9:58 am

అస్వస్థతో విద్యార్ధిని మృతి: పాఠశాల మూసివేత

అస్వస్థత కారణంగా పాఠశాల పరిసరాల్లోనే విద్యార్ధిని మృతి చెందిన కారణంగా న్యూఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలను రెండు రోజులపాటు మూసివేశారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్ధిని మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి తల్లితండ్రులు, ఇతర విద్యార్ధులు ఆందోళనకు దిగారు.
Source: జాతీయ | 24 Apr 2009 | 9:53 am

రగులుతున్న తాడిపత్రి: కనిపిస్తే కాల్చివేత

మలివిడత ఎన్నికల సందర్భంగా గురువారం అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో తెలుగుదేశం, కాంగ్రెస్ వర్గీయుల మధ్య చెలరేగిన ఘర్షణ ఇప్పటికీ సద్దుమణగలేదు. దీంతో పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు రంగంలో దిగిన పోలీసు యంత్రాంగం తాడిపత్రిలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీచేసింది.
Source: ఏపీ న్యూస్ | 24 Apr 2009 | 9:48 am

బెంగాల్‌లో ఇద్దరు సీపీఎం నేతల దారుణ హత్య

పశ్చిమబెంగాల్ జిల్లాలో అధికార సీపీఎంకు చెందిన ఇద్దరు నేతలు హత్యకు గురయ్యారు. బాలరాంపూర్ ప్రాంతంలోని సుపుది గ్రామంలో అనుమానిత మావోయిస్టులు గురువారం రాత్రి ఇద్దరు స్థానిక సీపీఎం నేతలను హత్య చేశారు.
Source: జాతీయ | 24 Apr 2009 | 9:12 am

బెంగాల్‌లో లెఫ్ట్ కోటకు బీటలు: ప్రకాష్ కారత్

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికార లెఫ్ట్ ఫ్రంట్ గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూలేని పోటీని ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎదుర్కోబోతుంది. రాష్ట్రంలో 32 ఏళ్ల క్రితం అధికారాన్ని చేజిక్కించుకున్న సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్‌కు "ముందుంది.. మొసళ్ల పండగలాగే" కనిపిస్తోంది.
Source: జాతీయ | 24 Apr 2009 | 7:07 am

లోక్‌సత్తా నిజాయితీ అద్భుతం: జేపీ

ఎన్నికలవేళ ఓటర్లను ఏవిధంగానూ ప్రలోభపెట్టకుండా తమ పార్టీ నేతలు అద్భుతమైన నిజాయితీతో వ్యవహరించారని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ అభినందించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Apr 2009 | 6:48 am

జస్వంత్‌ సింగ్ ప్రకటనపై కాంగ్రెస్ మండిపాటు

కాందహార్ హైజాక్ ఉదంతంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. సంఘటన జరిగిన పది సంవత్సరాల తర్వాత ఆయన మనస్సులోని మాటను వెల్లడించడం ఆశ్చర్యంగా ఉందని ఆ పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 24 Apr 2009 | 6:42 am

మహాకూటమికి 200 స్థానాలు: బాబు

రాష్ట్రంలో రాజకీయ సునామీ వచ్చిందని రెండు విడతలుగా ముగిసిన ఎన్నికల్లో మహాకూటమికి 200 స్థానాలు తప్పక వస్తాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 24 Apr 2009 | 6:27 am

51 కేంద్రాల్లో రీపోలింగ్: ఈసీ నిర్ణయం

రాష్ట్రంలోని పది జిల్లాల్లో గురువారం ముగిసిన మలివిడత పోలింగ్ సందర్భంగా వివిధ కారణాలవల్ల ఓటింగ్ నిల్చిపోయిన మొత్తం 51 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది.
Source: ఏపీ న్యూస్ | 24 Apr 2009 | 6:10 am

నేడే ఇంటర్ సెకండియర్ ఫలితాల విడుదల

ఇంటర్మీడియట్ రెండో సంవత్సర ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు సంయుక్త కార్యదర్శి ఓ ప్రకటనలో వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Apr 2009 | 5:02 am

రెండోదశ ఎన్నికల్లో 55 శాతం పోలింగ్

దేశవ్యాప్తంగా గురువారం జరిగిన రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లో 55 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. ఎన్నికలు జరిగిన 12 రాష్ట్రాల్లోని 140 నియోజకవర్గాల్లో మొత్తం 200 మిలియన్ల మంది ఓటర్లు ఉన్నారు
Source: జాతీయ | 24 Apr 2009 | 4:21 am

ఎన్నికల బహిష్కరణకు హురియత్ పిలుపు

వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ జమ్ము- కాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఇప్పటివరకు ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇవ్వరాదని భావించిన హురియత్ గురువారం తన నిర్ణయాన్ని మార్చుకుంది
Source: జాతీయ | 24 Apr 2009 | 4:16 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2009 | 4:07 am

ఏప్రిల్ 24, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 ప్రేమలు- పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ ...
Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2009 | 4:05 am

యూపీఏతో చేతులు కలుపబోం: ప్రకాష్ కారత్

కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమితో తాము మళ్లీ చేతులు కలిపే ప్రసక్తే లేదని లెఫ్ట్ పార్టీల అగ్రనేత ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ గురువారం మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌తో తాము చేరబోమని తేల్చిచెప్పారు.
Source: జాతీయ | 23 Apr 2009 | 3:04 pm

కాంగ్రెస్-భాజపాలకు మద్దతివ్వం: నవీన్

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు మద్దతు ఇవ్వబోమని బీజేడీ అధినేత, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తమ పార్టీ ఈ రెండు పార్టీలకు మద్దతు ఇచ్చే అవకాశం లేదని వెల్లడించారు.
Source: జాతీయ | 23 Apr 2009 | 12:31 pm

టాకీ పూర్తి చేసుకున్న ఆ ఇంట్లో

నటుడు చిన్నా దర్శకత్వంలో యు9 ఎంటర్‌టైనర్స్ పతాకంపై రూపొందుతున్న ఆ ఇంట్లో చిత్రం ఇటీవల టాకీని పూర్తి చేసుకుంది. ఓ ఇంట్లో జరిగే సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిన్నా నటించడంతోపాటు...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2009 | 12:31 pm

తమిళనాడు రాష్ట్ర బంద్‌తో జనజీవన స్తంభన

శ్రీలంకలోని తమిళులకు మద్దతుగా తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకే పార్టీ పిలుపునిచ్చిన ఒకరోజు బంద్‌కు భారీగానే స్పందన కన్పిస్తోంది. అధికార పార్టీ పిలుపునిచ్చిన ఈ బంద్‌కు మరికొన్ని పార్టీలు సైతం మద్దతు పలకడంతో రాష్ట్రంలో బంద్ ప్రభావం భారీగానే ఉంది.
Source: జాతీయ | 23 Apr 2009 | 12:04 pm

రెగ్యులర్ షూటింగ్ కోసం రవితేజ చిత్రం

రవితేజ హీరోగా, నయనతార హీరోయిన్‌గా తాజాగా తెరకెక్కనున్న తాజా చిత్రం ఆంజనేయులు. యువత ఫేం పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2009 | 11:54 am

ప్రారంభంకానున్న రామరామ కృష్ణకృష్ణ

యాక్షన్ హీరో అర్జున్, దేవదాస్ ఫేమ్ రామ్ హీరోలుగా, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. మే 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ప్రముఖ...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Apr 2009 | 11:50 am