ఆంధ్రాలో మహాకూటమికే అధికారం: ఏచూరీ

రాష్ట్రంలో ఈ ఎన్నికల తర్వాత అధికారం మహాకూటమినే వరించనుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ధీమా వ్యక్తం చేశారు. అదేసమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాభవం పూర్తిగా పతనమవుతోందని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2009 | 12:38 pm

అంజలీ వాఘ్మేరా తొలగించిన ముంబై కోర్టు

ముంబై ఉగ్రవాద దాడుల కేసు విచారణలో ప్రధాని నిందితుడు అజ్మల్ అమీర్ కసబ్ తరపున వాదించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయవాది అంజలీ వాఘ్మేరాను ఆ బాధ్యతల నుంచి ముంబై ప్రత్యేక కోర్టు బుధవారం తొలగించింది.
Source: జాతీయ | 15 Apr 2009 | 12:33 pm

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 318 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం భారీస్థాయిలో లాభాలు చవిచూసింది. 162 పాయింట్ల పతనంతో 10,805 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం కాసేపటికే అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రతికూల ప్రభావంతో 10,719 పాయింట్ల కనిష్ట
Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 11:32 am

దేశ అభివృద్ధికి ప్రాంతీయ పార్టీలే అడ్డంకి: పీఎం

దేశ అభివృద్ధికి ప్రాంతీయవాదం, ప్రాంతీయ పార్టీలు ప్రధాన ప్రతిబంధకాలుగా మారుతున్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. దేశానికి జాతీయ భావాలు కలిగిన రాజకీయ పార్టీ, బలమైన, సుస్థిర ప్రభుత్వం ఎంతో అవసరమని ప్రధాని ఉద్ఘాటించారు.
Source: జాతీయ | 15 Apr 2009 | 11:20 am

రెండు రోజుల్లో గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ ఫలితాలు

గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఈ నెల 17న వెల్లడించనున్నట్టు ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. దీంతో ఈ ఫలితాల విడుదలకోసం కొద్దిరోజులుగా ఎదురు చూస్తున్న అభ్యర్ధుల ఎదురుచూపులు ఫలించినట్టైంది.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 11:17 am

కామన్వెల్త్ క్రీడల అనంతరం టర్కీ రిటైర్మెంట్

భారత హాకీ గోడగా పేరొందిన దిలీప్ టర్కీ వచ్చే ఏడాది ప్రపంచకప్, కామన్వెల్త్ క్రీడల అనంతరం రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఒరిస్సాలోని సుందర్‌గఢ్ గిరిజన ప్రాంతానికి చెందిన ఈ డిఫెండర్ ఇప్పటివరకు 404 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి రికార్డు సృష్టించాడు.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 11:06 am

వైఎస్‌కోసం నాలుక కోసుకున్న అభిమాని

మరోసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతోపాటు వైఎస్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓ వ్యక్తి తన నాలుక కోసుకున్న ఘటన హైదరాబాద్‌లో సంచలనం సృష్టించింది. నాలుక కోసుకోవడంతో రక్తస్రావమై అపస్మారక...
Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 10:52 am

సందేశాత్మక చిత్రంగా ఆనందతాండవం

హ్యాపీడేస్ ఫేమ్ తమన్నా, సిద్ధార్థ (కొత్తనటుడు) జంటగా రూపొందిన చిత్రం ఆనందతాండవం. చెన్నైలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం. ఈ చిత్ర విశేషాల గురించి తెలుగులో ఈ చిత్రాన్ని...
Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 10:51 am

సందేశాత్మక చిత్రంగా ఆనందతాండవం

హ్యాపీడేస్ ఫేమ్ తమన్నా, సిద్ధార్థ (కొత్తనటుడు) జంటగా రూపొందిన చిత్రం ఆనందతాండవం. చెన్నైలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం. ఈ చిత్ర విశేషాల గురించి తెలుగులో ఈ చిత్రాన్ని...
Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2009 | 10:51 am

రియాజ్‌ను అప్పగించేందుకు పాకిస్థాన్ విముఖత

ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి తాజాగా అరెస్టు చేసిన ఐదో నిందితుడు షాహిద్ జమీల్ రియాజ్‌ను భారత్‌కు అప్పగించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నిరాకరించింది. ముంబయి దాడుల దర్యాప్తులో ప్రశ్నించేందుకు భారత్‌కు రియాజ్‌ను
Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 10:49 am

అలీ హీరోగా నచ్చావ్ అల్లుడు ఆడియో

అలీ, సుప్రేన, రవిబాబు, మలిష్క ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం నచ్చావ్ అల్లుడు. సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపై ఎం.ఎస్. శ్రీ చంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉష సింగంశెట్టి నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 10:49 am

అలీ హీరోగా నచ్చావ్ అల్లుడు ఆడియో

అలీ, సుప్రేన, రవిబాబు, మలిష్క ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం నచ్చావ్ అల్లుడు. సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపై ఎం.ఎస్. శ్రీ చంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉష సింగంశెట్టి నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2009 | 10:49 am

విడుదలకు సిద్ధమైన బంగారు బాబు

డా. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లేతో జగపతిబాబు హీరోగా, సౌభాగ్యమీడియా లిమిటెడ్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం బంగారుబాబు. ఈ చిత్రం ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు...
Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2009 | 10:48 am

విడుదలకు సిద్ధమైన బంగారు బాబు

డా. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లేతో జగపతిబాబు హీరోగా, సౌభాగ్యమీడియా లిమిటెడ్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం బంగారుబాబు. ఈ చిత్రం ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు...
Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 10:48 am

మే 1న ప్రేక్షకుల ముందుకు మిత్రుడు

బాలకృష్ణ హీరోగా, ప్రియమణి హీరోయిన్‌గా రూపొందుతోన్న మిత్రుడు చిత్రం ఈ నెల 30 లేదా మే ఒకటిన విడుదలకానుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో మిక్సింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. వైష్ణవి ఫిలింస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్...
Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2009 | 10:46 am

గగన్ నారంగ్‌కు రెండు ప్రపంచకప్ పతకాలు

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ గగన్ నారంగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఇప్పటికే పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో నారంగ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 10:38 am

ఆస్పత్రి పాలైన కాంగ్రెస్ వీరాభిమాని

మరోసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతోపాటు వైఎస్.రాజశేఖర రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓ వ్యక్తి తన నాలుక కోసుకున్న ఘటన హైదరాబాద్‌లో సంచలనం సృష్టించింది. నాలుక కోసుకోవడంతో రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్న సదరు వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2009 | 10:33 am

ఫ్యామిలీ సర్కిల్ కప్‌లో సానియా ముందంజ

భారత మహిళా టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ఇక్కడ జరుగుతున్న 1 మిలియన్ డాలర్ల ఫ్యామిలీ సర్కిల్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ రెండో రౌండులోకి అడుగుపెట్టింది. రెండో రౌండులో సానియా మీర్జా రెండో సీడ్ వీనస్ విలియమ్స్‌తో తలపడనుంది.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2009 | 10:04 am

"మున్నాభాయ్‌"పై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ దత్‌పై మంగళవారం కేసు నమోదైంది. మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దాఖిన్ తోలా పోలీస్ స్టేషన్‌లో సంజయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
Source: జాతీయ | 15 Apr 2009 | 9:47 am

దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు

ప్రముఖ దర్శకుడు మణిరత్నం బుధవారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిగా చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మణిరత్నం ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మణిరత్నంకు గుండెపోటు...
Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2009 | 8:43 am

ఫృథ్వీ-2 ప్రయోగం విజయవంతం

అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఫృథ్వీ- 2 క్షిపణి పరీక్షను భారత్ బుధవారం విజయవంతంగా నిర్వహించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగలిగే ఈ క్షిపణి పరీక్షను ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న ఛాందీపూర్ టెస్ట్ రేంజ్‌లో నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి.
Source: జాతీయ | 15 Apr 2009 | 8:23 am

అవినీతి రహిత పాలన అందిస్తాం: జేపీ

రాష్ట్రంలో అవినీతి రహిత పాలన ఒక్క లోక్‌సత్తాతోనే సాధ్యమని ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారయణ్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్టీల్లో తమకు తప్ప దేనికి ఓటు వేసినా అది బూడిదలో పోసిన పన్నీరులా మారుతుందని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2009 | 8:15 am

ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్: వైఎస్

రాష్ట్రంలోని పేదల అవసరాలను తీర్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదల అవసరాలు తీర్చేందుకై రేషన్ కార్డులు ఇచ్చామని, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు అందించామని, ఇళ్లు నిర్మించామని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2009 | 8:12 am

జార్ఖండ్‌లో మావోల భీభత్సం: ఏడుగురి మృతి

జార్ఖండ్ రాజధాని రాంచీలో భద్రతా సిబ్బందిపై మావోయిస్టులు జరిపిన దాడిలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. మృతి చెందినవారిలో ఇద్దరు భద్రతా సిబ్బందితో సహా ఐదుగురు మావోయిస్టులు ఉన్నారు. ఎన్నికల విధులకోసం వెళ్తున్న భద్రతా సిబ్బందిపై మావోలు విరుచుకుపడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
Source: జాతీయ | 15 Apr 2009 | 7:44 am

యదార్థ సంఘటన ఆధారంగా "ఆనందతాండవం"

హ్యాపీడేస్ ఫేమ్ తమన్నా, సిద్ధార్థ (కొత్తనటుడు) హీరోహీరోయిన్లుగా నటించిన "ఆనందతాండవం" చెన్నైలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంది. రచయిత్రి సుజాత రాసిన ధారావాహికను ఆస్కార్ ఫిలింస్ చిత్రంగా నిర్మించింది.
Source: వినోదం | 15 Apr 2009 | 7:36 am

కాంగ్రెస్‌వి విభజన రాజకీయాలు: భాజపా

సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఇలాంటి పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా మతప్రాతిపదికన దేశం విచ్ఛిన్నమయ్యే అవకాశముందని ఆ పార్టీ ఆరోపించింది.
Source: జాతీయ | 15 Apr 2009 | 7:04 am

బీఎస్‌ఎఫ్ క్యాంపుపై మావోయిస్టుల దాడి

తొలిదశ పోలింగ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో మావోయిస్టులు బీహార్‌లో బీఎస్‌ఎఫ్ కేంద్రంపై దాడికి పాల్పడ్డారు. రోటాస్ జిల్లా జిల్లాలో ఎన్నికల బందోబస్తు కోసం ఏర్పాటు చేసిన బీఎస్‌ఎఫ్ క్యాంపుపై సీపీఐ (మావోయిస్టు) గెరిల్లా దళానికి చెందిన కొంతమంది రాకెట్ లాంఛర్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఒక జవాను గాయపడ్డారు. బుధవారం తెల్లవారు జామున 1.40 నిమిషాల ప్రాంతంలో సుమారు వంద మంది మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారని జిల్లా ఎస్పీ వికాస్ వైభవ్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.
Source: జాతీయ | 15 Apr 2009 | 5:52 am

శ్రమలేకుండా చేసింది

"రాత్రి అంత ఆలస్యంగా ఇంటికెళ్లావు కదా.. మీ ఆవిడ ఏమీ అనలేదా..?" అడిగాడు సుబ్బారావు "లేదు పైగా నేను..
Source: వినోదం | 15 Apr 2009 | 5:00 am

నిమ్మకాయల తాజాదనం

"అదేంటే కూర సోపు వాసన వస్తోంది...?!" కోపంగా అడిగాడు పరమేశం "ఇంట్లో నిమ్మకాయలు...
Source: వినోదం | 15 Apr 2009 | 4:59 am

హంగ్‌ రాదు.. విజయం మాదే: చిరంజీవి ధీమా

ఈ ఎన్నికల్లో తాము విజయం సాధించి అధికారం చేపట్టి తీరుతామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు విజ్ఞులని, స్పష్టమైన తీర్పు ఇస్తారే తప్ప హంగ్ ఏర్పడే ప్రసక్తే ఉండబోదని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి కావల్సిన సీట్లను తమ పార్టీ తప్పక సాధిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2009 | 4:38 am

నగదు బదిలీ పథకంపైనే తొలి సంతకం: బాబు

తమ మేనిఫెస్టోలో పేర్కొన్న నగదు బదిలీ పథకం గొప్ప పథకమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం ఈ పథకంపైనే పెడతామని ఆయన ప్రకటించారు. ఈ పథకం గురించి ప్రస్తుతం దేశం మొత్తం మీద చర్చ జరుగుతోందంటే ఇదెంత గొప్ప పథకమో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2009 | 4:36 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2009 | 4:03 am

ఏప్రిల్ 15, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 సుహాసిని కథలు 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2009 | 4:01 am

తీవ్రవాదులకు 5 కోట్ల డాలర్ల చెల్లించిన ఎన్‌డీఏ

కాందహార్ హైజాక్ వ్యవహారంలో అప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీవ్రవాదుల చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలోని ప్రయాణికులను విడిపించేందుకు ఐదు కోట్ల డాలర్లు చెల్లించిందని కాంగ్రెస్ ఆరోపించింది. 1999లో తీవ్రవాదులు ఖాట్మండు నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 15 Apr 2009 | 3:26 am

కావలసిన ఆధారాలు ఇచ్చేశాం: ప్రధాని

గత ఏడాది ముంబయి మహానగరంలో జరిగిన ఉగ్రవాద దాడులపై భారత్ ఇప్పటివరకు ఇచ్చిన సాక్ష్యాధారాలు సరిపోవని పాక్ అధికారిక యంత్రాంగం చేసిన ప్రకటనను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తోసిపుచ్చారు. పాకిస్థాన్ ప్రభుత్వం దాడులకు సంబంధించి చర్యలు తీసుకునేందుకు అవసరమైన ఆధారాలను ఇప్పటికే అందించడం జరిగిందని ప్రధాని స్పష్టం చేశారు.
Source: జాతీయ | 15 Apr 2009 | 3:21 am

తేజం చిత్రం కోసం ప్రీతిజింగ్యానీ పాట

నూతన చిత్ర నిర్మాణ సంస్థ సన్‌రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజ్ కె.ఎస్. గోపి దర్శకత్వంలో ఎస్. రాజశేఖర్ రూపొందిస్తున్న చిత్రం తేజం. ఈ చిత్రం ద్వారా 9మంది హీరోలు ఒక హీరోయిన్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Apr 2009 | 12:27 pm

ప్రధాని పీఠంపై ఆశ లేదు: జయలలిత

దేశ ప్రధానమంత్రి కావాలనే ఆశ తనకు లేదని అన్నాడీఎంకే అధినేత్ర జయలలిత స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత ఎండీఎంకే, పీఎంకే, లెఫ్ట్‌ వంటి ఇతర భావసారూప్యత కలిగిన ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని ఆయన చెప్పారు. ఆమె మంగళవారం ఒక ప్రైవేట్ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు వ్యక్తిగత కక్షలు లేవన్నారు.
Source: జాతీయ | 14 Apr 2009 | 12:24 pm