|
కటకటాల్లో సాయిలత చిట్‌ఫండ్ నిర్వాహకులువిజయవాడలో ఇటీవల మూతపడ్డ సాయిలత చిట్‌ఫండ్ నిర్వాహకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. సాయిలత చిట్‌ఫండ్‌లో పెట్టుబడులు పెట్టినవారు సాగించిన ఆందోళన నేపథ్యంలో రంగంలో దిగిన పోలీసులు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 13 Apr 2009 | 12:46 pm వరుణ్ గాంధీకి అండగా నిలుస్తాం: అద్వానీముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పిలిభిత్ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వరుణ్ గాంధీ నిజంగా ఆ అలా వ్యాఖ్యానించి ఉన్నా ఆయనకు తాము ఒంటరిని చేయబోమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కే.అద్వానీ స్పష్టం చేశారు. వరుణ్ గాంధీ నిజంగా మైనారిటీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసివుంటే, ఆయనను సరైన దారిలో పెడతామని, ఒంటరిని మాత్రం చేయమన్నారు.Source: జాతీయ | 13 Apr 2009 | 12:29 pm మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 163 పాయింట్ల వృద్ధిబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సోమవారం లాభాల బాటలో పయనించింది. 112 పాయింట్ల వృద్ధితో 10,916 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, ప్రారంభ లావాదేవీల్లో 10,801 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. బ్యాంకింగ్ రంగాల వాటాల కొనుగోళ్లు సెన్సెక్స్‌నుSource: Yahoo! Telugu: News | 13 Apr 2009 | 11:43 am దమ్ముంటే నిరూపించండి: మాయావతి సవాల్విదేశీ బ్యాంకుల్లో మాయావతికి ఖాతాలున్నాయనీ, వాటిలో కోటానుకోట్లు డబ్బును ఆమె దాచుకున్నారనీ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మాయ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీపై ధ్వజమెత్తారు. తనకు విదేశీ బ్యాంకుల్లో డబ్బు సంచులు ఉన్నట్లు దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.Source: జాతీయ | 13 Apr 2009 | 11:40 am సాయిలత చిట్‌ఫండ్ నిర్వాహకుల అరెస్ట్విజయవాడలో ఇటీవల మూతపడ్డ సాయిలత చిట్‌ఫండ్ నిర్వాహకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. సాయిలత చిట్‌ఫండ్‌లో పెట్టుబడులు పెట్టినవారు సాగించిన ఆందోళన నేపథ్యంలో రంగంలో దిగిన పోలీసులు సదరు వ్యక్తులను...Source: Yahoo! Telugu: News | 13 Apr 2009 | 11:39 am మాంటే కార్లో రెండో రౌండులో పేస్, భూపతిభారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారులు మహేష్ భూపతి, లియాండర్ పేస్ జోడీలు సులభంగా మాంటేకార్లో మాస్టర్స్ పురుషుల డబుల్స్ రెండో రౌండులోకి అడుగుపెట్టారు. వీరిద్దరికీ ఈ టోర్నీలో తొలి రౌండు బై లభించింది.Source: Yahoo! Telugu: News | 13 Apr 2009 | 11:12 am నిరంతర ప్రక్రియగా ఓటర్ల నమోదు: ఐవీఈ ఎన్నికల అనంతరం ఓటర్ల నమోదును నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు. అదేసమయంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే ప్రజా చైతన్యం చాలా ముఖ్యమని...Source: Yahoo! Telugu: News | 13 Apr 2009 | 11:12 am కాంధహార్ ఎపిసోడ్‌లో ఉక్కుమనిషి కరిగిపోయారుభారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఎల్‌కే అద్వానీని లక్ష్యంగా చేసుకొని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఉక్కుమనిషిగా పేరొందిన ఎల్‌కే అద్వానీ ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండగాSource: Yahoo! Telugu: News | 13 Apr 2009 | 11:02 am వరుణ్ పిటిషన్‌పై విచారణ 16కు వాయిదాఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తనపై పెట్టిన నాసా కేసును సవాల్ చేస్తూ భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్‌గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. అదేసమయంలో ప్రజా జీవితాన్ని కల్లోల పరిచే ఎలాంటి...Source: Yahoo! Telugu: News | 13 Apr 2009 | 10:50 am చివరిదశ షూటింగ్‌లో జగన్మోహినిరాజా, నమిత, మీరాచోప్రా, నరసింహరాజు, జ్యోతిలక్ష్మి ప్రధాన తారాగణంగా మురళీ సినీ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం జగన్మోహిని. ఎన్.కె. విశ్వనాథన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి మురళీ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2009 | 10:06 am అర్జున్ హీరోగా 17న రానున్న జై సాంబశివయాక్షన్ కింగ్ అర్జున్ ద్విపాత్రాభినయం చేయగా తమిళంలో విజయం సాధించిన "తిరువణ్ణామలై" చిత్రం తెలుగులో "జై సాంబశివ" పేరుతో అనువాదమైంది. సాయి బాలాజీ ఫిలింస్ పతాకంపై గంగవరపు శ్రీనివాసులు నాయుడు, కె. హజరత్ రెడ్డిలు...Source: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2009 | 10:05 am అర్జున్ హీరోగా 17న రానున్న జై సాంబశివయాక్షన్ కింగ్ అర్జున్ ద్విపాత్రాభినయం చేయగా తమిళంలో విజయం సాధించిన "తిరువణ్ణామలై" చిత్రం తెలుగులో "జై సాంబశివ" పేరుతో అనువాదమైంది. సాయి బాలాజీ ఫిలింస్ పతాకంపై గంగవరపు శ్రీనివాసులు నాయుడు, కె. హజరత్ రెడ్డిలు...Source: Yahoo! Telugu: News | 13 Apr 2009 | 10:05 am రాజకీయ ప్రవేశం చేస్తా: ప్రియాంకా గాంధీఇప్పటివరకు రాజకీయాల్లోకి తాను రానని అనేక సందర్భాల్లో చెప్పిన సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక తాజాగా రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు తాను వ్యతిరేకం కాదని తెలిపారు. ఇదిలా ఉంటే తన సోదరుడు రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యేందుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని పేర్కొన్నారు. ఏదో ఒకరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవతారని జోస్యం చెప్పారు.Source: జాతీయ | 13 Apr 2009 | 10:03 am ఎన్నికల తర్వాత ప్రేక్షకుల ముందుకు అధినేతజగపతిబాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించిన అధినేత చిత్రం సాంకేతిక కారణాల వల్ల ఎన్నికల తర్వాతే విడుదల కానుంది. ఈ విషయమై దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ చిత్రం విడుదల ఆలస్యమయినా తప్పకుండా ప్రేక్షకులు...Source: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2009 | 10:02 am వరుణ్‌ను ఒంటరిని చేయం: అద్వానీ స్పష్టంముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వరుణ్ గాంధీ నిజంగా ఆ పని చేసివున్నా ఆయనను తాము ఒంటరిని చేయబోమని బీజేపీ ప్రధానమంత్రి ఎల్‌కే అద్వానీ స్పష్టం చేశారు. వరుణ్ గాంధీSource: Yahoo! Telugu: News | 13 Apr 2009 | 10:01 am నమిత ప్రధాన పాత్రలో దేశద్రోహిశ్రీదేవి సినీ చిత్ర పతాకంపై, జి.వి.హెచ్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం దేశద్రోహి. కె. ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో, ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నమిత పోలీస్ అధికారిగా నటిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2009 | 9:52 am నమిత ప్రధాన పాత్రలో దేశద్రోహిశ్రీదేవి సినీ చిత్ర పతాకంపై, జి.వి.హెచ్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం దేశద్రోహి. కె. ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో, ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నమిత పోలీస్ అధికారిగా నటిస్తోంది.Source: Yahoo! Telugu: News | 13 Apr 2009 | 9:52 am మన్మోహన్ సింగ్ బలహీన ప్రధాని: అరుణ్ జెట్లీఎన్నికల అంశాలపై చర్చను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తప్పించుకొని తిరుగుతున్నారని ప్రతిపక్ష ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉపయోగంలేదని, ఆయన బలహీనSource: Yahoo! Telugu: News | 13 Apr 2009 | 9:49 am మహాకూటమి విజయాన్ని అడ్డుకోలేరు: కేసీఆర్ఎంతమంది వచ్చినా మహాకూటమి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తాము ఏర్పాటు చేసిన మహాకూటమితో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 13 Apr 2009 | 8:58 am ప్రజలకు సోనియా క్షమాపణ చెప్పాలి: అద్వానీవిదేశీ తీవ్రవాదుల కంటే దేశంలోని మతతత్వ శక్తులతోనే ప్రజలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలపై సోనియా తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సోనియాగాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా తమ పార్టీని ఉద్దేశించి చేసినవేనంటూ పేర్కొన్నారు. అందువల్లే సోనియా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.Source: జాతీయ | 13 Apr 2009 | 8:49 am అవినీతికి చిరునామా.. వైఎస్-బాబు: చిరంజీవిఅవినీతి విషయంలో ముఖ్యమంత్రి వైఎస్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులు దొందూదొందేనని, వీరిద్దరు అవినీతికి చిరునామా మారారని ప్రజారాజ్యం అధినేత చంద్రబాబు ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కిటికీలోంచి దోచుకుంటే ప్రస్తుతం వైఎస్ మాత్రం ఏకంగా తలుపులు బార్లా తెరిచి దోచుకున్నారని ఆయన విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 13 Apr 2009 | 8:29 am పథకాల లబ్దిదారులే రియల్ స్టార్స్: వైఎస్తమ ప్రచారంలో పెద్ద స్టార్స్ ఎవరూ లేరని అయితే ప్రజలే తమ రియల్‌స్టార్స్ అని ముఖ్యమంత్రి వైఎస్ తెలిపారు. గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు మరోసారి అధికారాన్ని సంపాదించి పెడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Apr 2009 | 7:18 am నేడు వరుణ్ గాంధీ పిటీషన్‌పై సుప్రీం విచారణఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తనపై ప్రయోగించిన జాతీయ భద్రతా చట్టం (నాసా)ను సవాలు భాతీయ జనతా పార్టీ యువనేత వరుణ్‌గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. చీఫ్ జస్టీస్ కేజీ.బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం వరుణ్ పిటిషన్‌పై విచారణ చేపడుతుంది.Source: జాతీయ | 13 Apr 2009 | 6:51 am రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన కాంగ్రెస్: రాఘవులురాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్‌కు అధికారమిస్తే అధోగతి తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు హెచ్చరించారు. జలయజ్ఞం పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన రూ.40 వేల కోట్లలో రూ.10 వేల కోట్ల వరకు కాంగ్రెస్ నేతలు స్వాహా చేశారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 13 Apr 2009 | 6:47 am ఐదేళ్ళలో అవినీతికి వైఎస్ పెద్దపీట: చంద్రబాబుముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అవినీతిలో పెద్దపీట వేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలోని సహజ సంపదను దోచుకోవడానికే వైఎస్ అధికారం చేపట్టారంటూ ఆయన నిప్పులు చెరిగారు.Source: ఏపీ న్యూస్ | 13 Apr 2009 | 6:44 am అధికారం కోసమే భాజపా రామభజన: పవార్భారతీయ జనతా పార్టీపై కేంద్ర మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తీవ్రస్థాయిలో విమర్శల వర్షం గుప్పించారు. భారతీయ జనతా పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతున్నపుడు, అధికారంలో లేనపుడు మాత్రమే రామ మందిర అంశాన్ని తెరపైకి తెస్తోందని ఆయన విమర్శించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నపుడు రాముడిని వనవాసానికి (రామ మందిర అంశాన్ని విస్మరించారు) పంపారు. ప్రస్తుతం భాజపా కోల్పోతున్న ప్రాభవాన్ని నిలుపుకునేందుకు అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామని ప్రకటనలు చేస్తున్నారని నాసిక్ జిల్లాలో జరిగిన పలు బహిరంగ సభల్లో మంత్రి శరద్ పవార్ ఆరోపించారు.Source: జాతీయ | 13 Apr 2009 | 5:53 am ప్రిసాలో మావోల దాడి: 7గురు జవాన్ల మృతిఒరిస్సాలోని కోరపుత్ జిల్లాలో ప్రభుత్వ రంగ నాల్కోకు చెందిన బాక్సైట్ గనిపై మావోయిస్టులు ఆదివారం రాత్రి దాడి చేశారు. పటిష్ట భద్రత ఉన్న ఈ గనిపై మావోలు జరిపిన అనూహ్య దాడిలో ఏడుగురు సీఐఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు కూడా హతమయ్యారుSource: జాతీయ | 13 Apr 2009 | 4:22 am ఏప్రిల్ 13, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ ...Source: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2009 | 4:00 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2009 | 3:58 am రాహుల్‌కు పెళ్ళి చేయాలి : ప్రియాంకజాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీని తన వివాహం గురించి ప్రస్తావించినప్పుడు నవ్వుతూ మాటలను దాటేస్తుంటాడు. కాని తన సోదరి ప్రియాంకా వధేరామాత్రం అతని వివాహం కోసం ఆశగా ఎదురు చూస్తోంది. రాహుల్‌ను పెళ్ళి కొడుకుగా చూడాలని తనకుచాలా రోజులునుంచి ఆశగా ఉందని ప్రియాంకా వధేరా తన కోరికను వెలిబుచ్చారు. 38 సంవత్సరాలు కలిగిన తన సోదరుడు రాహుల్ ఇక వెంటనే వివాహమాడితే బాగుంటుందని, దీంతో చిన్న చిన్న గృహావసరాలు తొలగిపోతాయని అలాగే ఇంటి బాధ్యతకూడా పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.Source: జాతీయ | 13 Apr 2009 | 3:30 am 14తో ఎన్నికల ప్రచారం ముగించాలి: ఈసీ ఆదేశంరాష్ట్రంలో ఎన్నికల హడావుడి వేడెక్కుతోన్న నేపథ్యంలో.. ఈ నెల 14వ తేదీ సాయంత్రం నాలుగు గంటలతో రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచారానికి స్వస్తి పలకాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్ర రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సందర్భంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీమంగళవారం (ఏప్రిల్ 14వతేదీ)తో ప్రచారం సమాప్తం చేయాలని ఎన్నికల కమిషన్ ఆయా పార్టీలను ఆదేశించింది.Source: ఏపీ న్యూస్ | 12 Apr 2009 | 12:52 pm కాంగ్రెస్ పార్టీ ఓ 125 యేళ్ళ బొమ్మ: నరేంద్ర మోడీరెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీని ఓ ముసలమ్మగా అభివర్ణించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రస్తుతం తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కాంగ్రెస్ ముసలమ్మ కాదని, అది ఓ బొమ్మ అని తాజాగా మరోసారి ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని శర్వస్తీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన నరేంద్రమోడీ మాట్లాడుతూ 125 ఏళ్ల వయసు కలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు ఓ బొమ్మ అని అన్నారు.Source: జాతీయ | 12 Apr 2009 | 12:16 pm తిరుపతిలో చిరు కుటుంబ సభ్యుల సందడితిరుపతి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తరపున ప్రచారం నిర్వహించడానికి ఆయన కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. మూడు రోజులపాటు చిరంజీవికి మద్దతుగా వీరు తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Apr 2009 | 11:22 am ప్రజారాజ్యంపై పరకాల ఘాటు విమర్శలుప్రజారాజ్యం పార్టీకి డబ్బే లక్ష్యమని అందుకే డబ్బున్నవారికే ఆ పార్టీ టికెట్లు కేటాయించిందని ఆ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన పరకాల ప్రభాకర్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీ ఓ కంపెనీ అని అది ఆ కంపెనీ ఓనర్లకు మాత్రమే కల్పవృక్షమని ఆయన విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 12 Apr 2009 | 11:20 am జమ్మూలో ఎన్‌కౌంటర్: తీవ్రవాది హతంజమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ తీవ్రవాది హతమయ్యాడు. ఓ ఇంట్లో తీవ్రవాదులు ఉంటున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టిన భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి. ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగుతున్నాయి. రక్షణశాఖ అధికార ప్రతినిధి వివరాల ప్రకారం పుల్వామా జిల్లాలోని అల్గార్ గ్రామంలోని ఓ ఇంటివద్ద ఆదివారం ఉదయం 6.45 గంటల ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఓ తీవ్రవాదిని మట్టుబెట్టినట్టు ఆయన తెలిపారు.Source: జాతీయ | 12 Apr 2009 | 11:17 am మరో విడత ప్రచారానికి రానున్న సోనియాకాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరో విడత రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నెల 17వ తేదీన రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని పంగిడి గ్రామంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. రాజమండ్రి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ నియోజకవర్గంలో ఎదురుగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో సోనియా, రాహుల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించి అలరిస్తున్న అరుణ్ కుమార్ తన నియోజకవర్గంలో తగినంతగా ప్రచారంలో పాల్గొనలేక పోతున్నారని తెలిసింది.Source: ఏపీ న్యూస్ | 12 Apr 2009 | 11:00 am
|