క్షమించమని వేలసార్లు అడుగుతున్నా: టైట్లర్

1984లో సిక్కులపై జరిగిన ఉచకోత వ్యవహారం వలన తాను వేల సార్లు క్షమాపణలు కోరనున్నట్లు టైట్లర్ తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పై సంఘటన జరిగిన కారణంగా తాను ఇప్పుడు సిక్కులను క్షమాపణలు కోరుతున్నట్లు, అదికూడా సిక్కుల సముదాయంలోనే తాను క్షమాపణలు కోరుకుంటానని ఆయన ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పుడు జరిగిన సంఘటన అతి నీచమైనదనికూడా ఆయన అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 10 Apr 2009 | 10:11 am

సమాచార హక్కు చట్టం తీసుకువచ్చింది మేమే :రాహుల్

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాగుల్ గాంధీ శుక్రవారం కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. మైలవరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ...అటు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వాలు పటిష్టవంతంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రజలకు సమర్థవంతమైన పాలనను అందించాయని ఆయన తెలిపారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలియడంకోసం తమ ప్రభుత్వం సమాచార హక్కు చ్టటం తీసుకువచ్చిందని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. దీనివలన ప్రభుత్వంలో జరిగే వ్యవహారాలు అన్నీకూడా తెలుసుకునే వీలును తాము కల్పించామని, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2009 | 9:09 am

ప్రజారాజ్యం పార్టీ కల్పవృక్షం..చిరు

ప్రజారాజ్యం పార్టీ విషవృక్షం కాదని ఎందరికో అవకాశాలిచ్చి, నీడనిస్తున్న కల్ప వృక్షమని శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రరాప మాజీ ప్రధానకార్యదర్శి పరకాల రాజీనామా అంశంపై స్పందిస్తూ అతను గురువారం మీడియాముందు అన్న మాటలకు ధీటుగా సమాధానమిచ్చారు
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2009 | 8:26 am

అరవింద్‌కు నా గురించి సరిగా తెలియదు: పరకాల

అల్లు అరవింద్‌కు నా గురించి, నా కుటుంబం గురించి సరిగా తెలియదని మాజీ ప్రరాప ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ అన్నారు. అల్లు అరవింద్‌ తనపై చేసిన పరుష వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ...తన గురించి, తమ కుటుంబం గురించి ఆయనకు స్పష్టంగా తెలియదని తమది దశాబ్దాలుగా రాజకీయ కుటుంబమని, తన తలిదండ్రులు గతంలో ఎమ్మెల్యేలుగా పని చేశారని, అలాగే తన తాత, మామ గార్లతోబాటు తనకు కూడా రాజకీయాలతో అవినాభావ సంబంధముందని, తమ కుటుంబం గతంలో ప్రజలకు సేవలు అందించామని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2009 | 7:01 am

నేడే రాష్ట్రంలో రాహుల్‌ పర్యటన

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధి రాష్ట్రంలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. శుక్రవారం, శనివారం రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాహుల్‌ పర్యటించనున్నారు. పర్యటన మొత్తం హెలికాప్టర్‌ ద్వారానే కొనసాగుతుంది. శుక్రవారం మధ్యాహ్నం 11.45 గం.కు రాహుల్‌ విజయవాడకు చేరుకుని అక్కడ ప్రసంగిస్తారు. తర్వాత 12.45 గం.కు మైలవరంలో రాహుల్‌ ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత 1.05 గం.లకు ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగించనున్నారు
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2009 | 6:46 am

ప్రధానమంత్రి పదవి నాకూ కావాలి: శరద్ పవార్

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తాను ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నట్లు తన సన్నిహితుల వద్ద తెలిపినట్లు సమాచారం. శరద్ అనుకున్నట్లు ఎన్సీపీ అత్యధిక స్థానాలలో విజయం సాధిస్తే, తృతీయ కూటమి మద్దతుతో ప్రధాని పదవి పీఠాన్ని అధిష్టించాలని ఉవ్విళూరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Source: జాతీయ | 10 Apr 2009 | 6:06 am

సిక్కుల మనోభావలను గుర్తించాం..చిదంబరం

సిక్కుల మనోభావలను గుర్తించామని కేంద్ర హోం శాఖ మంత్రి పి. చిదంబరం తెలిపారు. సిక్కులపై గతంలో జరిగిన ఊచకోత దాడులకు పాల్పడ్డ వారిని అధిక సంఖ్యలో శిక్షించలేదని, కాని చట్టం తన పని తాను చేసుకుపోతోందని దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందని ఆయన పేర్కొన్నారు. సిక్కుల మనోభావాలను అర్థం చేసుకుంటున్నాని, కాని అధిక మొత్తంలో నిందుతులకు శిక్ష పడలేదని ఆయన తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని అది కాస్త నెమ్మదిగా ఉండటం మూలాన సిక్కు సోదరులు అధైర్య పడుతున్నారని ఆయన వివరించారు.
Source: జాతీయ | 10 Apr 2009 | 6:00 am

ఎన్నికల నుంచి తప్పుకున్న టైట్లర్

కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ గురువారం లోక్‌సభ ఎన్నికల అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సీబీఐ జగదీష్ టైట్లర్, సజ్జన్ కుమార్‌లకు క్లీన్‌చిట్ ఇవ్వడంపై సిక్కు వర్గంలో వ్యతిరేకత వ్యక్తం అయింది. దీనికితోడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి వ్యతిరేకత ఏ పరిస్థితికి దారితీస్తుందోనని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Source: జాతీయ | 10 Apr 2009 | 5:42 am

పీఆర్పీలో సామాజిక న్యాయం లేదు: పరకాల

ప్రజారాజ్యం పార్టీ రాజకీయాల్లో మార్పు తెస్తుందని భావించానని, అయితే పీఆర్పీలో సామాజిక న్యాయం లేదని ఆ పార్టీ వ్యవస్థాపక అభ్యర్థులు పరకాల ప్రభాకర్ ఆరోపించారు. ప్రజారాజ్యం స్థాపించిన లక్ష్యం వేరు అని, దానికి పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం వ్యవహరిస్తోందని పరకాల ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీకి గురువారం రాజీనామా చేసిన అనంతరం మీడియాతో పరకాల మాట్లాడుతూ.. ప్రజారాజ్యం పార్టీకి ఆగ్రహంతో, ఆవేశంతో రాజీనామా చేయలేదని, ఆవేదనతోనే రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2009 | 2:13 pm

మంచు దుప్పటి కప్పుకున్న "గ్యాంగ్‌టక్" అందాలు

అందమైన మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, చూడముచ్చటైన కొండలు వీటితోపాటు సెలయేళ్లు, గడ్డిపూలు, పచ్చిక బయళ్లతో రారమ్మని స్వాగతం చెప్పే పర్యాటక ప్రాంతమే "గ్యాంగ్‌టక్". మనసుకు ఎంతగానో హాయినిచ్చే ఈ ప్రదేశంలోని మంచు పర్వతాలు, తీస్తానది ఒంపులు తనివితీరా...
Source: వినోదం | 9 Apr 2009 | 1:27 pm

అతివిశ్వాసం వద్దు: ఎల్‌కే అద్వానీ సూచన

త్వరలో జరగబోతున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై తమ కార్యకర్తల్లో అతి విశ్వాసం ఉన్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే అద్వానీ భావిస్తున్నారు. అయితే అతివిశ్వాసం తగదని హెచ్చరించారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పరాజయానికి అతివిశ్వాసం కూడా ఓ కారణమన్నారు. ఇదే పరిస్థితి మళ్లీ ఉత్పన్నం కాకుండా చూడాలని కార్యకర్తలకు సూచించారు
Source: జాతీయ | 9 Apr 2009 | 1:24 pm

యోచించి ఓటు వేయండి: జేపీ

ప్రజలు ఇప్పటికై మేలుకుని లోక్‌సత్తాకు ఓటు వేయకపోతే భావితరాలు మనల్ని క్షమించవని ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. ప్రజలకు లోక్‌సత్తాపై అభిమానం ఉన్నా, ఓటు విషయానికొస్తే ఇది గెలుస్తుందా అన్న భావనతో తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారని అయితే ఈ ఆలోచన మారాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2009 | 1:09 pm

పరకాల విమర్శలు అసంబద్ధం: శోభరాణి

ప్రజారాజ్యం పార్టీపై పరకాల ప్రభాకర్ విమర్శలు గుప్పించడం అసంబద్ధంగా ఉందని ఆ పార్టీ మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో కూర్చుని పరకాల పార్టీపై విమర్శలు చేయడాన్ని ఆమె ఈ సందర్భంగా ఆక్షేపించారు. పీఆర్పీకి రాజీనామా సమర్పిస్తూ ఆ పార్టీని విషవృక్షంగా పేర్కొన్న పరకాల విమర్శల అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్న శోభారాణి మాట్లాడుతూ రాజీనామా విషయంలో పరకాల పునరాలోచించుకోవాలని కోరారు
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2009 | 1:08 pm

పరకాల రాజీనామాతో ఎలాంటి నష్టంలేదు: ఉపేంద్ర

పరకాల ప్రభాకర్‌తో ప్రజారాజ్యం పార్టీకి ఎలాంటి నష్టం లేదని ప్రజారాజ్యం పార్టీ సీనియర్‌ నేత పర్వతనేని ఉపేంద్ర అన్నారు. ఆశించని ఫలితాలు దక్కని నేతలు రాజకీయ పార్టీలకు రాజీనామాలు చేయడం సర్వసాధారణమని ఉపేంద్ర కొట్టిపారేశారు. పరకాల ప్రభాకర్‌ రాజీనామా అనంతరం ఉపేంద్ర మీడియాతో మాట్లాడారు. పరకాల రాజీనామా విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2009 | 1:05 pm

టైట్లర్ కేసు: వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు

ఢిల్లీ కోర్టు గురువారం 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన జగదీష్ టైట్లర్ కేసుపై విచారణను ఏప్రిల్ 28 వరకు వాయిదా వేసింది. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాకేశ్ పండిట్ ఈ కేసు విచారణ ఏప్రిల్ 29, 29 తేదీల్లో జరుగుతుందని చెప్పారు. హత్యకు సంబంధించిన నేరాలపై విచారణ జరిపే విశేషాధికారం కలిగిన సెషన్స్ కోర్టుకు ఈ కేసును అప్పగించాలని, ఈ కోర్టుకు దీనిపై విచారణ జరిపే అధికారం లేదని సీబీఐ వాదన వినిపించింది. సీబీఐ తరపు న్యాయవాది హత్యకు సంబంధించిన నేరం కావడంతో, ఈ కేసుపై సెషన్స్ కోర్టులో విచారణ జరపాలని కోరారు.
Source: జాతీయ | 9 Apr 2009 | 1:04 pm

సిక్కు వ్యతిరేకత: ఎన్నికల నుంచి తప్పుకున్న టైట్లర్

కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ గురవారం లోక్‌సభ ఎన్నికల అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సీబీఐ జగదీష్ టైట్లర్, సజ్జన్ కుమార్‌లకు క్లీన్‌చిట్ ఇవ్వడంపై సిక్కు వర్గంలో వ్యతిరేకత వ్యక్తం అయింది. దీనికితోడు
Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 12:29 pm

టైట్లర్ కేసుపై విచారణ వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు

ఢిల్లీ కోర్టు గురువారం 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన జగదీష్ టైట్లర్ కేసుపై విచారణను ఏప్రిల్ 28 వరకు వాయిదా వేసింది. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాకేశ్ పండిట్ ఈ కేసు విచారణ ఏప్రిల్ 29, 29 తేదీల్లో జరుగుతుందని
Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 12:21 pm

డబ్బిస్తే కాంగ్రెస్‌ను నిలదీయండి: బాబు

ఎన్నికల్లో భాగంగా ఓట్ల కోసం డబ్బిస్తే కాంగ్రెస్ పార్టీని నిలదీయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అదేసమయంలో టీడీపీకి ఉన్న ప్రజాబలం ముందు కాంగ్రెస్‌కు ఉన్న ధనబలం నిలబడబోదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలు నోట్లతో ఓట్లు కొనాలని చూస్తున్నారని, ప్రజలు వారిపై తిరగబడాలంటూ ఆయన కోరారు.
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2009 | 12:20 pm

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 62 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) గురువారం లాభాల బాటలో పయనించింది. విదేశీ మార్కెట్‌ల సానుకూల ప్రభావంతో 134 పాయింట్ల వృద్ధి చెంది 10,876 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం కాసేపటికే 10,932 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 12:00 pm

డబ్బిస్తే కాంగ్రెస్‌ను నిలదీయండి: బాబు

ఎన్నికల్లో భాగంగా ఓట్ల కోసం డబ్బిస్తే కాంగ్రెస్ పార్టీని నిలదీయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అదేసమయంలో టీడీపీకి ఉన్న ప్రజాబలం ముందు కాంగ్రెస్‌కు ఉన్న ధనబలం నిలబడబోదని ఆయన వ్యాఖ్యానించారు.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 11:58 am

పరకాల విమర్శలు అసంబద్ధం: శోభరాణి

ప్రజారాజ్యం పార్టీపై పరకాల ప్రభాకర్ విమర్శలు గుప్పించడం అసంబద్ధంగా ఉందని ఆ పార్టీ మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో కూర్చుని పరకాల పార్టీపై విమర్శలు చేయడాన్ని ఆమె ఈ సందర్భంగా...
Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 11:48 am

దేశం మొత్తం మాకు అండగా నిలిచింది: సచిన్

న్యూజిలాండ్‌లో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించిన టీం ఇండియా సభ్యుల్లో ఐదుగురు గురువారం వేకువజామున ముంబయి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ విలేకరులతో మాట్లాడుతూ
Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 11:37 am

ఇప్పుడు పరిణితి సాధించా: ధావల్ కులకర్ణి

న్యూజిలాండ్‌లో టెస్ట్ క్రికెట్‌లో ఆడేందుకు అవకాశం లభించనప్పటికీ, తానిప్పుడు పరిణితి సాధించానని టీం ఇండియా ఆటగాడు ధావల్ కులకర్ణి చెప్పాడు. ముంబయికి చెందిన ఈ పేస్ బౌలర్ న్యూజిలాండ్‌లో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయం
Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 11:18 am

కాంగ్రెస్ పాలనలో అంతా అవినీతే: బాబు

కాంగ్రెస్ పాలనలో అంతా అవినీతి మయమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఇళ్లు, పింఛన్లు, ఉపాధి హామీలాంటి పథకాల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చంద్రబాబు మెదక్ జిల్లాలోని మెదక్, జోగిపేట, నర్సాపూర్, గజ్వేల్‌లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఇళ్లు కటిస్తామన్నారని, అయితే ప్రజలకు మాత్రం ఇళ్లు రాలేదని, కాంగ్రెస్ నేతలకు మాత్రమే ఇళ్లు దక్కిందని ఆయన విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2009 | 11:12 am

440 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ: జైరాం రమేష్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ 440 స్థానాల్లో పోటీ చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రామేష్ వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో గట్టిపోటీ నెలకొంటుందని చెప్పారు. అయితే తమ పార్టీ విజయం సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభలోని మొత్తం 543 సీట్లలో 440 సీట్లకు కాంగ్రెస్ పార్టీ ఈసారి పోటీ చేస్తుందని చెప్పారు.
Source: జాతీయ | 9 Apr 2009 | 11:08 am

మేలుకోకుంటే భావితరాలు క్షమించవు: జేపీ

ప్రజలు ఇప్పటికై మేలుకుని లోక్‌సత్తాకు ఓటు వేయకపోతే భావితరాలు మనల్ని క్షమించవని ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. ప్రజలకు లోక్‌సత్తాపై అభిమానం ఉన్నా, ఓటు విషయానికొస్తే ఇది గెలుస్తుందా అన్న భావనతో తర్వాత...
Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 11:07 am

రీరికార్డింగ్‌కు సిద్ధమైన నేరము-శిక్ష

పద్మభూషణ్ కృష్ణ, విజయనిర్మల, జయసుధ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న చిత్రం నేరము-శిక్ష. ఆకుల్, ధీరజ్, ఆకర్ష, రూపా జంటలు కొత్తగా పరిచయమవుతున్న ఈ చిత్రం విజయకృష్ణా మూవీస్ పతాకంపై విజయనిర్మల...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2009 | 10:50 am

త్వరలో కెమెరా ముందుకు ప్రవరాఖ్యుడు

జగపతిబాబు హీరోగా, ప్రియమణి హీరోయిన్‌గా ఆ నలుగురు వంటి ఉత్తమ చిత్రానికి రచన చేసిన మదన్ దర్శకత్వంలో ప్రవరాఖ్యుడు అనే సినిమా రూపొందనుంది. జగపతిబాబు, ప్రియమణిల కాంబినేషన్‌లో పెళ్లైన కొత్తలో చిత్రం...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2009 | 10:39 am

రవితేజ, ఇలియానా జంటగా కిక్ టాకీ పూర్తి

రవితేజ, ఇలియానా జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం కిక్. వి. సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల నాలుగు పాటలతో పాటు టాకీ పూర్తి చేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2009 | 10:37 am

బ్లాక్‌ క్యాట్ చిత్రం షూటింగ్ ప్రారంభం

పద్మావతి ప్రొడక్షన్స్ పతాకంపై బంగారు బయ్యారెడ్డి దర్శక నిర్మాతగా బ్లాక్ క్యాట్ అనే చిత్రం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లుగా కొత్తవారిని పరిచయం చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ బాచుపల్లిలోని జామతోటహౌస్‌లో ఇటీవల ప్రారంభమైంది. దేవుని పటాలపై...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2009 | 10:35 am

రవితేజ, ఇలియానాల కిక్ టాకీ పూర్తి

రవితేజ, ఇలియానా జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం కిక్. వి. సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవ నాలుగు పాటలతో పాటు టాకీ పూర్తి చేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2009 | 10:16 am

ప్రభుత్వ ఏర్పాటుకు ఫోర్త్ ఫ్రంట్ తప్పనిసరి: లాలూ

ఎస్పీ, ఎల్‌జేపీలతో కలిసి తాము కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రంట్ లేకుండా కేంద్రంలో ఏ కూటమీ అధికారాన్ని చేపట్టలేందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. అయితే ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టకుండా తమ ఫ్రంట్ యూపీఏకే మద్దతు ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 9 Apr 2009 | 10:02 am

మేం లేకుండా ప్రభుత్వం ఏర్పడదు: లాలూ

ఎస్పీ, ఎల్‌జేపీలతో కలిసి తాము కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రంట్ లేకుండా కేంద్రంలో ఏ కూటమీ అధికారాన్ని చేపట్టలేందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. అయితే ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టకుండా తమ ఫ్రంట్...
Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 9:55 am

440 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ: జైరాం రమేష్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ 440 స్థానాల్లో పోటీ చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రామేష్ వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో గట్టిపోటీ నెలకొంటుందని చెప్పారు. అయితే తమ పార్టీ విజయం సాధించగలదని ఆశాభావం వ్యక్తం
Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 9:35 am