|
పరకాల రాజీనామాతో ఎలాంటి నష్టంలేదు: ఉపేంద్రపరకాల ప్రభాకర్‌తో ప్రజారాజ్యం పార్టీకి ఎలాంటి నష్టం లేదని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత పర్వతనేని ఉపేంద్ర అన్నారు. ఆశించని ఫలితాలు దక్కని నేతలు రాజకీయ పార్టీలకు రాజీనామాలు చేయడం సర్వసాధారణమని ఉపేంద్ర కొట్టిపారేశారు. పరకాల ప్రభాకర్ రాజీనామా అనంతరం ఉపేంద్ర మీడియాతో మాట్లాడారు. పరకాల రాజీనామా విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 9 Apr 2009 | 12:46 pm సిక్కు వ్యతిరేకత: ఎన్నికల నుంచి తప్పుకున్న టైట్లర్కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ గురవారం లోక్‌సభ ఎన్నికల అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సీబీఐ జగదీష్ టైట్లర్, సజ్జన్ కుమార్‌లకు క్లీన్‌చిట్ ఇవ్వడంపై సిక్కు వర్గంలో వ్యతిరేకత వ్యక్తం అయింది. దీనికితోడుSource: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 12:29 pm టైట్లర్ కేసుపై విచారణ వాయిదా వేసిన ఢిల్లీ కోర్టుఢిల్లీ కోర్టు గురువారం 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన జగదీష్ టైట్లర్ కేసుపై విచారణను ఏప్రిల్ 28 వరకు వాయిదా వేసింది. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాకేశ్ పండిట్ ఈ కేసు విచారణ ఏప్రిల్ 29, 29 తేదీల్లో జరుగుతుందనిSource: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 12:21 pm డబ్బిస్తే కాంగ్రెస్‌ను నిలదీయండి: బాబుఎన్నికల్లో భాగంగా ఓట్ల కోసం డబ్బిస్తే కాంగ్రెస్ పార్టీని నిలదీయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అదేసమయంలో టీడీపీకి ఉన్న ప్రజాబలం ముందు కాంగ్రెస్‌కు ఉన్న ధనబలం నిలబడబోదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలు నోట్లతో ఓట్లు కొనాలని చూస్తున్నారని, ప్రజలు వారిపై తిరగబడాలంటూ ఆయన కోరారు.Source: ఏపీ న్యూస్ | 9 Apr 2009 | 12:20 pm పీఆర్పీలో సామాజిక న్యాయం లేదు: పరకాలప్రజారాజ్యం పార్టీ రాజకీయాల్లో మార్పు తెస్తుందని భావించానని, అయితే పీఆర్పీలో సామాజిక న్యాయం లేదని ఆ పార్టీ వ్యవస్థాపక అభ్యర్థులు పరకాల ప్రభాకర్ ఆరోపించారు. ప్రజారాజ్యం స్థాపించిన లక్ష్యం వేరు అని, దానికి పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం వ్యవహరిస్తోందని పరకాల ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీకి గురువారం రాజీనామా చేసిన అనంతరం మీడియాతో పరకాల మాట్లాడుతూ.. ప్రజారాజ్యం పార్టీకి ఆగ్రహంతో, ఆవేశంతో రాజీనామా చేయలేదని, ఆవేదనతోనే రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 9 Apr 2009 | 12:10 pm మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 62 పాయింట్ల వృద్ధిబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) గురువారం లాభాల బాటలో పయనించింది. విదేశీ మార్కెట్‌ల సానుకూల ప్రభావంతో 134 పాయింట్ల వృద్ధి చెంది 10,876 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం కాసేపటికే 10,932 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 12:00 pm డబ్బిస్తే కాంగ్రెస్‌ను నిలదీయండి: బాబుఎన్నికల్లో భాగంగా ఓట్ల కోసం డబ్బిస్తే కాంగ్రెస్ పార్టీని నిలదీయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అదేసమయంలో టీడీపీకి ఉన్న ప్రజాబలం ముందు కాంగ్రెస్‌కు ఉన్న ధనబలం నిలబడబోదని ఆయన వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 11:58 am పరకాల విమర్శలు అసంబద్ధం: శోభరాణిప్రజారాజ్యం పార్టీపై పరకాల ప్రభాకర్ విమర్శలు గుప్పించడం అసంబద్ధంగా ఉందని ఆ పార్టీ మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో కూర్చుని పరకాల పార్టీపై విమర్శలు చేయడాన్ని ఆమె ఈ సందర్భంగా...Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 11:48 am దేశం మొత్తం మాకు అండగా నిలిచింది: సచిన్న్యూజిలాండ్లో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించిన టీం ఇండియా సభ్యుల్లో ఐదుగురు గురువారం వేకువజామున ముంబయి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ విలేకరులతో మాట్లాడుతూSource: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 11:37 am ఇప్పుడు పరిణితి సాధించా: ధావల్ కులకర్ణిన్యూజిలాండ్లో టెస్ట్ క్రికెట్‌లో ఆడేందుకు అవకాశం లభించనప్పటికీ, తానిప్పుడు పరిణితి సాధించానని టీం ఇండియా ఆటగాడు ధావల్ కులకర్ణి చెప్పాడు. ముంబయికి చెందిన ఈ పేస్ బౌలర్ న్యూజిలాండ్‌లో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయంSource: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 11:18 am కాంగ్రెస్ పాలనలో అంతా అవినీతే: బాబుకాంగ్రెస్ పాలనలో అంతా అవినీతి మయమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఇళ్లు, పింఛన్లు, ఉపాధి హామీలాంటి పథకాల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చంద్రబాబు మెదక్ జిల్లాలోని మెదక్, జోగిపేట, నర్సాపూర్, గజ్వేల్‌లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఇళ్లు కటిస్తామన్నారని, అయితే ప్రజలకు మాత్రం ఇళ్లు రాలేదని, కాంగ్రెస్ నేతలకు మాత్రమే ఇళ్లు దక్కిందని ఆయన విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 9 Apr 2009 | 11:12 am 440 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ: జైరాం రమేష్వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ 440 స్థానాల్లో పోటీ చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రామేష్ వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో గట్టిపోటీ నెలకొంటుందని చెప్పారు. అయితే తమ పార్టీ విజయం సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభలోని మొత్తం 543 సీట్లలో 440 సీట్లకు కాంగ్రెస్ పార్టీ ఈసారి పోటీ చేస్తుందని చెప్పారు.Source: జాతీయ | 9 Apr 2009 | 11:08 am పీఆర్పీ "రైలింజన్" గుర్తు కేసు: 13వ తేదీకి వాయిదారానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి గుర్తు విషయంలో సందిగ్ధత వీడలేదు. ఎన్నికల్లో పీఆర్పీ ఉమ్మడి గుర్తుతో పోటీ చేస్తుందా? లేదా అనే విషయానికి ఇంకా తెరపడలేదు. పీఆర్పీకి రైలింజన్ గుర్తు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో దాఖలైన పిటిషన్ ఏప్రిల్ 13వ తేదీకి వాయిదా పడింది.Source: ఏపీ న్యూస్ | 9 Apr 2009 | 11:08 am మేలుకోకుంటే భావితరాలు క్షమించవు: జేపీప్రజలు ఇప్పటికై మేలుకుని లోక్‌సత్తాకు ఓటు వేయకపోతే భావితరాలు మనల్ని క్షమించవని ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. ప్రజలకు లోక్‌సత్తాపై అభిమానం ఉన్నా, ఓటు విషయానికొస్తే ఇది గెలుస్తుందా అన్న భావనతో తర్వాత...Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 11:07 am ప్రభుత్వ ఏర్పాటుకు ఫోర్త్ ఫ్రంట్ తప్పనిసరి: లాలూఎస్పీ, ఎల్‌జేపీలతో కలిసి తాము కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రంట్ లేకుండా కేంద్రంలో ఏ కూటమీ అధికారాన్ని చేపట్టలేందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. అయితే ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టకుండా తమ ఫ్రంట్ యూపీఏకే మద్దతు ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.Source: జాతీయ | 9 Apr 2009 | 10:02 am మేం లేకుండా ప్రభుత్వం ఏర్పడదు: లాలూఎస్పీ, ఎల్‌జేపీలతో కలిసి తాము కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రంట్ లేకుండా కేంద్రంలో ఏ కూటమీ అధికారాన్ని చేపట్టలేందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. అయితే ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టకుండా తమ ఫ్రంట్...Source: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 9:55 am 440 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ: జైరాం రమేష్వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ 440 స్థానాల్లో పోటీ చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రామేష్ వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో గట్టిపోటీ నెలకొంటుందని చెప్పారు. అయితే తమ పార్టీ విజయం సాధించగలదని ఆశాభావం వ్యక్తంSource: Yahoo! Telugu: News | 9 Apr 2009 | 9:35 am ప్రజారాజ్యం పార్టీకి పరకాల గుడ్‌బై!ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు పరకాల ప్రభాకర్ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. లోక్‌సభ టికెట్ లభించలేదన్న అసంతృప్తితో పాటు, పార్టీ నాయకుడు వెంకట రమణారెడ్డి (దాము) భార్యకు పార్టీ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో తీవ్ర మనస్థాపానికి గురైన పరకాల పార్టీకి స్వస్తి పలికారని పార్టీశ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.Source: ఏపీ న్యూస్ | 9 Apr 2009 | 9:00 am పెద్దపులికి చిన్న గాయమైనా ఊరుకోం: వైగోఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్‌కు శ్రీలంక సైన్యం వల్ల చిన్న గాయమైనా తమిళనాట ఉండే తమిళులు రెచ్చిపోతారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తీవ్రంగా హెచ్చరించారు. ప్రభాకరన్ ప్రాణాలకు ముప్పు అని తెలిస్తే తమిళనాట ఉన్న ప్రతి యువకుడు తుపాకీ చేబూని లంకపై తిరగబడతారని, ఆ విషయంలో తానే ముందుంటానని ఆయన పేర్కొన్నారుSource: జాతీయ | 9 Apr 2009 | 6:50 am ప్రజారాజ్యానికి పరకాల రాజీనామా...?చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో అసమ్మతి సెగ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఎన్నికలకు సంబంధించి టికెట్లు ఇవ్వలేదని కొందరు పార్టీని వీడిపోతుంటే, పార్టీలో తమ మాటకు విలువ ఇవ్వడం లేదంటూ కొందరు సీనియర్లు సైతం పార్టీకి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ స్థాపించడానికి ముందునుంచే చేదోడు వాదోడుగా ఉన్న సీనియర్ నేత పరకాల ప్రభాకర్ సైతం ప్రజారాజ్యం వీడిపోయేందుకు నిర్ణయించారని సమాచారం. ఈ విషయమై ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకున్న పరకాల ప్రభాకర్ గురువారం ప్రజారాజ్యంను వీడడానికి సంబంధించి అధికార ప్రకటన చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 9 Apr 2009 | 6:12 am సౌమ్య హత్యకేసు నిందితులపై మోకా ప్రయోగంఇద్దరు మహిళా ఉద్యోగినిల హత్య కేసులో అరెస్టు అయిన ఐదుగురు నిందితులపై బుధవారం ఢిల్లీ పోలీసులు మోకా ప్రయోగించారు. సౌమ్య విశ్వనాథన్, జిగీషా ఘోష్‌లు అనే ఇద్దరు ఉద్యోగినిలు దేశ రాజధానిలో హత్యకు గురికావడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వీరి హత్యల మిస్టరీని ఇటీవల ఢిల్లీ పోలీసులు ఛేదించారుSource: జాతీయ | 9 Apr 2009 | 6:07 am సోనియా, రాహుల్‌లకు ఎల్టీటీఈ నుంచి ముప్పుశ్రీలంకకు చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ భారత్ వీవీఐపీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీలతోపాటు పలువురు వీవీఐపీలను ఎల్టీటీఈ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 9 Apr 2009 | 5:47 am ఏప్రిల్ 09, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2009 | 3:54 am భారత్ పూర్తి సహకారానికి అమెరికా విజ్ఞప్తిదక్షిణాసియా నుంచి వ్యాప్తి చెందుతున్న తీవ్రవాదంతో ఇరుదేశాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా ప్రత్యేక రాయబారి రిచర్డ్ హోల్‌బ్రూక్ పేర్కొన్నారు. ఆయన భారత పర్యటనలో భాగంగా బుధవారం విదేశాంగ కార్యదర్శి శివశంకర్ మీనన్, జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణాసియా తీవ్రవాదాన్ని ఉమ్మడి ముప్పుగా పరిగణించాలన్నారు. అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త ఆఫ్ఘన్- పాకిస్థాన్ విధానంలో భారత్ పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారుSource: జాతీయ | 9 Apr 2009 | 3:46 am లాలూను అరెస్టు చేయండి...మేనకా గాంధీభారతీయ జనతా పార్టీకి చెందిన నేత మేనకా గాంధీ తన కుమారుడు వరుణ్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆర్జేడీ అధినేత, కేంద్ర రైల్వేశాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఆమె బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనకా గాంధీ బుధవారంనాడు ప్రముఖ పోలీసు అధికారికి లేఖ రాసి అందులో లాలూను అరెస్టు చేయాలని కోరుతూ...వేలాదిమంది ప్రజలముందు తన కుమారుడ్ని రోడ్డు రోలర్ క్రింద తొక్కించి చంపేస్తానని లాలూ బెదిరించినట్లు అందులో పేర్కొన్నారుSource: జాతీయ | 9 Apr 2009 | 3:06 am అద్వానీ కోటీశ్వరుడుభారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేయనున్న లాల్ కృష్ణ అద్వానీ బుధవారం మధ్యాహ్నం గాంధీనగర్ లోక్‌సభకు నామినేషన్ వేశారు. అతను దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనకున్న స్థిర, చరాస్తులు 3 కోట్ల 4 లక్షల రూపాయల విలువ కలిగినవిగా ఆయన ఎన్నికల అధికారికి దాఖలు చేశారు.Source: జాతీయ | 8 Apr 2009 | 2:50 pm ఫిక్సింగ్ అంశం ఎన్నికల్లో ఇబ్బంది కాదు: అజార్భారత మాజీ కెప్టెన్, కాంగ్రెస్ ఎన్నికల అభ్యర్థి అజారుద్దీన్ గతంలో తానను చుట్టుముట్టిన మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఇబ్బంది కాబోదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అజారుద్దీన్‌ను ఇబ్బందిపెట్టేందుకు మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాన్ని మరోసారి తెరపైకి తెస్తున్న సంగతి తెలిసిందే.Source: జాతీయ | 8 Apr 2009 | 12:55 pm నల్లధనాన్ని వెనక్కి రప్పించాలి: అద్వానీభారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్కే అద్వానీ స్విస్ బ్యాంకు నల్ల ధనం గురించి మరోసారి ప్రస్తావించారు. కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో మూలుగుతోందనీ, ఆ ధనాన్ని మొత్తం తిరిగి దేశానికి తీసుకురాగలిగితే భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుందని ఆయన అన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ప్రదర్శనగా వెళుతూ మధ్యలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.Source: జాతీయ | 8 Apr 2009 | 11:46 am
|