|
మా హయాంలోనే తెలంగాణా అభివృద్ధి: సోనియాకాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా భువనగిరిలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సోనియాగాంధీ, కాంగ్రెస్ పాలనలో మాత్రమే తెలంగాణ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందని అన్నారు. తమ పాలనలోనే తెలంగాణలో ఐఐటీ ఏర్పడిందని పేర్కొన్న ఆమె ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామని తెలిపారు. తెలంగాణ కోసం ఈ రోజు గొంతెత్తుతున్న టీడీపీ గతంలో ఈ ప్రాంతంకోసం ఏం చేసిందంటూ ఆమె ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 7 Apr 2009 | 1:03 pm పాలరాతి కావ్యం "స్వామి నారాయణ మందిరం""ఇంత అద్భుతమైన కట్టడాన్ని నేనెక్కడా చూడలేదు. చాలామంది చెబుతుంటే తెలియలేదుగానీ, కళ్లారా చూస్తేగానీ ఆ గొప్పదనం తెలియడంలేదు. వైకుంఠం ఎక్కడో లేదు. నా జీవితం ధన్యమైపోయింది" ఇలాంటి లెక్కలేనన్ని ప్రశంసలు బ్రిటన్‌లోని "స్వామి నారాయణ మందిరం" సొంతం.Source: వినోదం | 7 Apr 2009 | 12:59 pm పుట్టినరోజునాడే "ఆర్య" ప్రచారానికి శ్రీకారంగంగోత్రి, బన్ని, ఆర్య, దేశముదురు, పరుగు సినిమాల ద్వారా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో అల్లు అర్జున్. ఈ కథానాయకుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు మరియు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనువడు. అలాగే ఇతడు మెగాస్టార్, పద్మభూషణ్...Source: వినోదం | 7 Apr 2009 | 12:49 pm స్విస్ బ్యాంకు నల్లధనం: హైకోర్టులో పిటిషన్విదేశీ బ్యాంకుల్లో ఉన్న భారతీయులకు చెందిన నల్లధనంను తిరిగి దేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు స్వచ్ఛంద సంస్థలు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే విదేశీ బ్యాంకుల్లో ఉన్న భారతీయ సంపదను దేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 7 Apr 2009 | 11:56 am మూడో వన్డేలో పుంజుకుంటాం: పాంటింగ్ ధీమాదక్షిణాఫ్రికాలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తాము తిరిగి పుంజుకుంటామని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. మూడో వన్డేలో తమ ఓపెనర్లు బ్రాడ్ హాడిన్, మైకెల్ క్లార్క్ పుంజుకుంటారని చెప్పాడు. రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్Source: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 11:26 am తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: సోనియాతమ పార్టీ ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉందని, తెలంగాణ అంశాన్ని ప్రాధాన్యమున్న అంశంగానే పరిగణిస్తున్నామని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 11:24 am ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సరసన టీం ఇండియాన్యూజిలాండ్ గడ్డపై 41 ఏళ్ల తరువాత టెస్ట్ సిరీస్ విజయం సాధించిన టీం ఇండియా తాజాగా జరిగిన సిరీస్‌లో ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను 3-1తో గెలుచుకున్న టీం ఇండియా, తాజాగాSource: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 11:17 am వెల్లింగ్టన్ టెస్ట్ ఫలితంపై ధోనీ అసంతృప్తిటీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం డ్రాగా ముగిసిన వెల్లింగ్టన్ టెస్ట్ ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆతిథ్య దేశంతో వెల్లింగ్టన్‌లో జరిగిన కీలకమైన మూడో టెస్ట్ మ్యాచ్‌ను డ్రాగా ముగించడంతో టీం ఇండియా టెస్ట్ సిరీస్‌ను 0Source: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 11:09 am అనుష్క చేతుల మీదుగా టిక్ టిక్ టిక్ ఆడియోఅరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై అరుణకాంత్ దర్శకునిగా రూపొందుతోన్న చిత్రం టిక్ టిక్ టిక్. టాలీవుడ్ సెక్సీతార అనుష్క చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో విడుదలైంది. ఈ కార్యక్రమం సందర్భంగా అనుష్క మాట్లాడుతూ టిక్ టిక్ టిక్...Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2009 | 11:04 am షాయాజీ షిండే ప్రధాన పాత్రలో రాత్రి ఆడియోఅన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై బేబీ జోషిత సమర్పణలో రూపొందుతోన్న రాత్రి చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ కార్యక్రమం సందర్భంగా దర్శకుడు భానుకిరణ్ మాట్లాడుతూ రాత్రులన్నీ ఒకేలా ఉండవని, కొన్ని రాత్రులు చేదు అనుభవాలను...Source: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 11:01 am షాయాజీ షిండే ప్రధాన పాత్రలో రాత్రి ఆడియోఅన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై బేబీ జోషిత సమర్పణలో రూపొందుతోన్న రాత్రి చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ కార్యక్రమం సందర్భంగా దర్శకుడు భానుకిరణ్ మాట్లాడుతూ రాత్రులన్నీ ఒకేలా ఉండవని, కొన్ని రాత్రులు చేదు అనుభవాలను...Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2009 | 11:01 am రీరికార్డింగ్‌లో కార్యక్రమాల్లో రోమియోశ్రీహరి ప్రధాన పాత్రలో ఆర్యన్ రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రోమియో. ఈ చిత్రం ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అగస్త్య సంగీత దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ఐదు పాటలున్నాయి. ఈ సందర్భంగా గీత రచయిత...Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2009 | 10:58 am నెలాఖరున ప్రేక్షకుల ముందుకు అధినేతజగపతిబాబు హీరోగా, సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం అధినేత. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేసేందుకు...Source: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 10:57 am నెలాఖరున ప్రేక్షకుల ముందుకు అధినేతజగపతిబాబు హీరోగా, సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం అధినేత. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేసేందుకు...Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2009 | 10:57 am రవితేజ, ఇలియానాల కిక్ టాకీ పూర్తిరవితేజ, ఇలియానా జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం కిక్. వి. సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవ నాలుగు పాటలతో పాటు టాకీ పూర్తి చేసుకుంది.Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2009 | 10:54 am డీఎస్‌ను నాసా కింద అరెస్టు చేయాలి: వీహెచ్పీప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు విశ్వహిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీలు డిమాండ్ చేశాయి. ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనారిటీలకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. హిందూ సంస్థలకు ఆగ్రహం కలిగించగా, ఎన్నికల కమిషన్ విచారణకు దారితీశాయి.Source: ఏపీ న్యూస్ | 7 Apr 2009 | 10:39 am ఒక్కో ఆటగాడికి రూ.15 లక్షలు: బీసీసీఐ ప్రకటనన్యూజిలాండ్ పర్యటనలో 41 ఏళ్ల తరువాత టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న టీం ఇండియా సభ్యులకు బీసీసీఐ మంగళవారం ఒక్కొక్కరికి రూ.15 లక్షల బోనస్ ప్రకటించింది. విజయావకాశాలు పుష్కలంగా ఉన్న వెల్లింగ్టన్ టెస్ట్‌ను వర్షం కారణంగా టీంSource: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 10:33 am ఏ రోజు ఎక్కడ ఉంటామో తెలియదు: నితీష్ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీ(యు) చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ ప్రైవేట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాము ఈ రోజు ఎన్డీఏలో ఉన్నాం... రేపు ఎక్కడ ఉంటామో ఎవరికి తెలుసు? అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏలో కొనసాగడంపై నితీష్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.Source: జాతీయ | 7 Apr 2009 | 10:22 am తీవ్రవాదంపై పోరుకు బేషరతు మద్దతు కావాలితీవ్రవాదంపై పోరాడేందుకు పాకిస్థాన్‌కు బేషరతు మద్దతు కావాలని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తనతో సమావేశమైన ఇద్దరు అమెరికా రాయబారులతో చెప్పారు. తమ మనుగడ కోసమే తీవ్రవాదంపై పాకిస్థాన్ పోరాటం జరుపుతుందన్నారు.Source: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 10:21 am వరుణ్‌పై వ్యాఖ్యలు: లాలూపై ఎఫ్ఐఆర్ నమోదుబీజేపీ యువనేత వరుణ్‌గాంధీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. బీహార్‌లోని కిషాన్‌గంజ్‌లో ప్రచారం సందర్భంగా లాలూ మాట్లాడుతూ తానే హోం మంత్రినైతే వరుణ్ చేసిన ముస్లిం వ్యతిరేక...Source: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 9:45 am మంత్రి లాలూ అరెస్టుకు ఎస్పీ ఆదేశాలు జారీకేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టుకు కిషన్‌గంజ్ ఎస్పీ అరెస్టు చేశారు. బీజేపీ యువనేత వరుణ్‌గాంధీపై చేసిన వ్యాఖ్యల చేసినందుకు గాను ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెల్సిందే. బీహార్‌లోని కిషాన్‌గంజ్‌లో ప్రచారం సందర్భంగా లాలూ మాట్లాడుతూ తానే హోం మంత్రినైతే వరుణ్ చేసిన ముస్లిం వ్యతిరేక వార్తలకు అతన్ని రోడ్ రోలర్ కింద వేసి తొక్కించేసేవాడినంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని భాజపా నేతలు ఫిర్యాదు చేశారుSource: జాతీయ | 7 Apr 2009 | 9:06 am పీఆర్పీని వీడే ప్రసక్తేలేదు: మిత్రా స్పష్టంతాను ప్రజారాజ్యం పార్టీనుంచి వైదొలుగనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి మిత్రా స్పష్టం చేశారు. తాను పార్టీకి దూరమవుతున్నట్టు వస్తున్న వదంతులను ఈ సందర్భంగా ఆయన ఖండించారు.Source: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 7:52 am పోలీసులు అదుపులో సిక్కు జర్నలిస్టుకేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో అవమానకర సంఘటన ఎదుర్కొన్నారు. ఈ సమావేశానికి హాజరైన సిక్కు జర్నలిస్ట్ ఒకరు చిదంబరంపై బూటు విసిరాడు. బూటు చిదంబరంకు తగలకుండా పక్కనపడింది. అనంతరం ఆ జర్నలిస్ట్‌ను వెంటనే సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు.Source: జాతీయ | 7 Apr 2009 | 7:46 am చిదంబరంపై బూటు విసిరిన విలేకరిఇరాక్లో జరిగిన బూటు చరిత్ర భారత్‌లో పునరావృత్తమైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌పై బూటు విసిరిన తరహా సంఘటన న్యూఢిల్లీలోనూ చోటు చేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో తీవ్రవాదంపై పార్టీ యాక్షన్ ప్లాన్‌ను వెల్లడించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.Source: జాతీయ | 7 Apr 2009 | 7:39 am నాలుగో కూటమి కోసం చిరుకు అమర్ అహ్వానందేశ రాజకీయ చిత్రపటంలో నాలుగో కూటమి ఏర్పాటుకు సన్నాహాలు ఆరంభమయ్యాయి. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సమాజ్‌వాది పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ నాలుగో కూటమి ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఈ కూటమిలో చేరాల్సిందిగా ఆయన చిరంజీవిని ఆహ్వానించారు. ఎస్పీ ప్రధాన కార్యదర్శులు అమర్ సింగ్, సంజయ్‌దత్‌లు సోమవారం హైదరాబాద్, జూబ్లీ హిల్స్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లి, సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు.Source: జాతీయ | 7 Apr 2009 | 6:56 am జూనియర్ ఎన్టీఆర్ ధైర్యవంతుడు: చిరంజీవిరోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చాలా ధైర్యవంతుడని, ఆయన త్వరగా కోలుకోవాలంటూ చిరంజీవి ఆకాంక్షించారు.Source: ఏపీ న్యూస్ | 7 Apr 2009 | 6:56 am తెదేపా అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణరెండోదశ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తరపున బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్ధుల నామినేషన్లను వివిధ కారణాల వల్ల అధికారులు తిరస్కరించారు. నామినేషన్లు తిరస్కరణకు గురైన రెండు స్థానాల్లో ఒకచోట డమ్మీ అభ్యర్థి అందుబాటులో ఉండగా మరో చోట మాత్రం తెదేపా తరపున అభ్యర్థి కరువయ్యారు.Source: ఏపీ న్యూస్ | 7 Apr 2009 | 6:55 am కాంగ్రెస్సే తెలంగాణా ఇస్తుంది: రవితెలంగాణపై తమ పార్టీకి స్పష్టత ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమితులైన వయలార్ రవి పేర్కొన్నారు. అయితే తెలంగాణ అనేది అంత సులువైన విషయం కాదని, పెన్నుతో గీత గీసినంత సులభంగా ఆ సమస్య పరిష్కారం కాదని ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 7 Apr 2009 | 6:55 am నగదు బదిలీ పథక హామీని ఇచ్చిన జేడీఎస్కర్ణాటకలోని జేడీఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన నగదు బదలీ పథకాన్ని కర్ణాటకలో కూడా అమలు చేయనున్నట్టు జేడీ(ఎస్) చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడ వెల్లడించారు. అలాగే రైతుల వ్యవసాయ రుణాల రద్దు, దారిద్య రేఖకు దిగువన నివశిస్తున్న కుటుంబాలకు నేరుగా నగదు బదిలీ పథకం తదితర ఆకర్షణీయ హమీలను గుప్పించారు. నగదు బదిలీ పథకం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న లోపాలు, అవినీతిని అరికట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.Source: జాతీయ | 7 Apr 2009 | 5:28 am పాత కాషాయం రంగు చీర"నీతో కాపురం చేయడం కన్నా... సన్యాసం తీసుకోవాలనుందే...?" గయ్యాళి భార్యతో అన్నాడు భర్త "మంచిది.Source: వినోదం | 7 Apr 2009 | 5:27 am దొంగతనాలు చేస్తుంటాను"మిమ్మల్ని ఎక్కడో చూశాను... కానీ గుర్తు రావట్లేదే...?" అన్నాడు చిన్నారావు "చూసే ఉండొచ్చు" చెప్పాడుSource: వినోదం | 7 Apr 2009 | 5:25 am సమర్థవంతంగా అమలు చేస్తాం: తెదేపాఎన్నికల ఫలితాల అనంతరం తాము అధికారంలోకి వస్తే నగదు బదిలీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, అలాగే, పథకాన్ని ఎన్నటికీ విస్మరించబోమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తన చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేసి తీరుతామంటూ ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 7 Apr 2009 | 4:23 am గౌహతి పేలుడు: ఎనిమిదికి చేరిన మృతులుఅసోం రాష్ట్ర రాజధాని గౌహతిలోని మలిగావ్ ప్రాంతంలో సోమవారం ఐదు గంటల వ్యవధిలో మూడు బాంబు పేలుళ్లు సంభవించాయి. అంతేకాకుండా ఇదే ప్రాంతంలో గ్రెనెడ్ దాడి కూడా జరిగింది. ఈ వరుస పేలుళ్లలో 8 మంది మృతి చెందారు. మరో 62 మంది గాయపడ్డారు. ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం అసోం రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది.Source: జాతీయ | 7 Apr 2009 | 4:16 am అద్వానీ, మోడీలపై తీవ్రవాదుల గురి: కర్ణాటకత్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు దాడులు చేయాలనుకున్నట్లు కర్ణాటక పోలీసులు సోమవారం వెల్లడించారు. గత ఏడాది బెంగళూరు బాంబు పేలుళ్ల కేసులో అరెస్టు చేసిన టీ నజీర్, సైనుద్దీన్ అనే ఇద్దరు తీవ్రవాదులు ఈ దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించారని పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 7 Apr 2009 | 4:14 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2009 | 3:48 am ఏప్రిల్ 07, 2009 కార్యక్రమాలుఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు ...Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2009 | 3:46 am నాకు ఇంగ్లీషు అర్థమౌతుంది..కసాబ్నిరుడు ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడులలో ప్రాణాలతో పట్టుపడ్డ ఏకైక తీవ్రవాది అమీర్ కసాబ్ సోమవారంనాడు జరిగిన విచారణలో తనకు ఇంగ్లీషు అర్థమౌతుందని న్యాయమూర్తి సమక్షంలో పేర్కొన్నాడు. గతంలో తనకి ఇంగ్లీషు భాష అర్థమవదని చెప్పడం గమనార్హం. వీడియో కాన్ఫరెన్సింగ్ సహాయంతో కోర్టుముందు ప్రవేశ పెట్టిన కసాబ్‌ను న్యాయమూర్తి ఎమ్ఎల్ తహిలియానీ, జైలర్ స్వాతి సాఠేల మధ్య జరిగిన ఆంగ్ల సంభాషణను ఆసక్తిగా విన్నట్లు సమాచారం.Source: జాతీయ | 6 Apr 2009 | 1:20 pm
|