మాధవన్ నాయర్‌కు జడ్ కేటగిరి భద్రత

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఛైర్మన్ జి.మాధవన్ నాయర్‌కు, మరో ఆరుగురు ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తలకు భద్రతను పటిష్ట పరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీరి ప్రాణాలకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ నుంచి ముప్పు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నాయర్‌కు హాని తలపెట్టేందుకు, వారిని కిడ్నాప్ చేసేందుకు లష్కరే తోయిబా ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా సమాచారం అందడంతో ఆయనకు ప్రభుత్వం జెడ్- కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించింది. అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న నాయర్ ప్రభుత్వం అంతరిక్ష విభాగ కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Source: జాతీయ | 5 Apr 2009 | 12:38 pm

లోక్‌సభ అభ్యర్థుల పేర్లను వెల్లడించిన డీఎంకే

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ ఆదివారం ప్రకటించింది. మొత్తం 39 స్థానాలకు గాను ఆ పార్టీ 21 సీట్లలో పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధ్యక్షుడు ఎం.కరుణానిధి వెల్లడించారు. తన కుమారుడు. దక్షిణ జిల్లాల పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంకే.అళగిరికి టిక్కెట్ కేటాయించారు. ఆలయాల నగరమైన ముదురై లోక్‌సభ స్థానం నుంచి అళగిరి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
Source: జాతీయ | 5 Apr 2009 | 12:31 pm

ఎన్నికల తర్వాత వామపక్షాల మద్దతు: ప్రణబ్

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వామపక్షాలు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ఖాయమని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ విశ్వాసం వ్యక్తం చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఎలాంటి ఎన్నికల పొత్తు లేదని, యూపీఏలోని పలు మిత్రపక్షాలు వేర్వేరుగానే పోటీ చేశాయని గుర్తు చేశారు. ఫలితాల అనంతరం ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని ఆయన గుర్తు చేశారు.
Source: జాతీయ | 5 Apr 2009 | 11:21 am

త్వరలో నిర్ణయం వెల్లడిస్తా: ఆంజనేయ రెడ్డి

ప్రజారాజ్యం పార్టీలో కొనసాగేది లేనిది మరో రెండు రోజుల్లో తన నిర్ణయం వెల్లడిస్తానని ఆ పార్టీ ఉపాధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పిన అంజనేయ రెడ్డి తెలిపారు. ఆదివారం చిరంజీవి బషీర్‌బాగ్‌లోని మీట్‌ది ప్రెస్‌లో మాట్లాడుతూ అంజనేయరెడ్డి రాజీనామా దురదృష్టకరమని, జరిగిన దానికి క్షమాపణ చెప్పి తిరిగి ఆహ్వానిస్తామని చెప్పారు. దీనిపై స్పందించిన అంజనేయరెడ్డి పార్టీలో జరిగిన పరిణామాలు తనకు మనస్తాపం కల్గించాయని, అందుకు పార్టీకి రాజీనామా చేశానని, ఈ పరిస్థితి రావడానికి అనేక మంది కారణమన్నారు. వీటిపై చిరంజీవి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2009 | 11:13 am

సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక: చిరు

తాము మూడు దఫాలుగా వేర్వేరు సంస్థలతో నిర్వహించిన సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసినట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. నియోజకవర్గాల సర్వేల ఆధారంగా, తగిన అర్హతను బట్టి టికెట్ల కేటాయింపు పారదర్శకంగా జరిగిందన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2009 | 11:07 am

ఎవరి అజెండా వారిది: నితీష్ కుమార్

తాము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పటికీ, తమకంటూ సొంత ఎజెండా ఉందని బీహార్ ముఖ్యమంత్రి, జేడీ (యు) అధినేతి నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం పాట్నాలో మాట్లాడుతూ ఎన్డీయే కూటమిలో ఉన్నా, తమ ఆలోచన, ప్రణాళికలు తమకు ఉన్నాయని చెప్పారు. మతతత్వ ఎజెండాకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. బీహార్‌లో అధికారంలో ఉన్న జనతాదళ్‌ (యు) ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో కొనసాగుతుంది.
Source: జాతీయ | 5 Apr 2009 | 10:14 am

ప్రొఫెసర్ జయశంకర్ రాజ్యసభ సీటు!

తెలంగాణా రాష్ట్ర సమితిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్‌ను రాజ్యసభకు పంపనున్నారు. ఈ మేరకు తెరాసకు తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు హామీ ఇచ్చినట్టు సమాచారం. గత ఎన్నికల్లో జయశంకర్‌కు హన్మకొండ సీటు కేటాయిస్తామని హామీ ఇచ్చినా తెరాస అధినేత మాట నిలబెట్టకోలేక పోయారు. దీంతో ఆయన కొంత కాలం పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2009 | 8:13 am

కడపలో గాడ్సే పాలన: బాలకృష్ణ ధ్వజం

జాతిపిత మహాత్మా గాంధీ నుంచి ప్రశంసలు అందుకని కడప గాంధీగా పేరొందిన దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి పుట్టిన గడ్డపై ప్రస్తుతం గాడ్సే పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ నేత, సినీనటుడు బాలకృష్ణ ఆరోపించారు. పులివెందుల గడ్డపై పాండురంగడు కొలువై ఉన్నాడు. వసుచరిత్ర రాసిన రామరాజభూషణుడులాంటి మహాకవులు పుట్టిన నేల ఉంది.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2009 | 8:00 am

పీఆర్పీ ఉపాధ్యక్ష పదవికి ఆంజనేయరెడ్డి గుడ్‌బై

ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుకు ఆదినుంచి అహర్నిశలు పాటుపడి, చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి, ఉపాధ్యక్షుడు ఆంజనేయరెడ్డి ఆ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆంజనేయరెడ్డి అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అగ్రనేతల వ్యవహార శైలితో ఆయన విసిగిపోయి, చివరకు రాజీనామా చేశారు.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2009 | 7:58 am

ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వం: శ్రీరామ్ సేన

వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని శ్రీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముథాలిక్ స్పష్టం చేశారు. కేవలం అధికారం కోసమే భారతీయ జనతా పార్టీ హిందూత్వ ఎజెండాను వాడుకుంటుందోని ఆయన శనివారం చెన్నైలో ఆరోపించారు. హిందూ మక్కల్ కట్చి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కర్ణాటక భాజపా ప్రభుత్వం మీకు మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించగా, తనను మంగుళూరుకు వెళ్లకుండా నిషేధం విధించారని, సంస్థ కార్యకర్తలు కొందరిని జైల్లో పెట్టారని సమాధానం ఇచ్చారు.
Source: జాతీయ | 5 Apr 2009 | 7:40 am

ఏప్రిల్ 05, 2009 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా 15.00 అభిరుచి 15.30 ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 5 Apr 2009 | 7:06 am

హోం మంత్రి చిదంబరంకు ఈసీ నోటీసు

కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర హోం మంత్రి పి.చిదంబరంకు నోటీసు జారీ చేసింది. సరిహద్దు రక్షణ చర్యల సమీక్ష కోసం ఆయన శనివారం రాజస్థాన్ రాష్ట్రంలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన పలు హామీలను గుప్పించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో చిదంబరం అలా హామీలు ఇవ్వడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.
Source: జాతీయ | 5 Apr 2009 | 7:05 am

ఈ వారం


Source: Yahoo! Telugu: Entertainment | 5 Apr 2009 | 7:05 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 5 Apr 2009 | 7:03 am

పరస్పర ఆరోపణల్లో మాయావతి.. మేనక గాంధీ

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి, భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీ తల్లి మేనకాగాంధీలు పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. యూపీ ప్రభుత్వం భాజపా లోక్‌సభ అభ్యర్థి వరుణ్ గాంధీపై జాతీయ భద్రతా చట్టాన్ని (నాసా) ప్రయోగించడంపై బీఎస్పీ అధినేత్రి, యూపీ ముఖ్యమంత్రి మాయావతి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీపై శనివారం తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. వరుణ్‌ను జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించడంపై ఇరువురు నేతలు మాటల తూటాలు పేల్చుకున్నారు.
Source: జాతీయ | 5 Apr 2009 | 5:46 am

బీజేపీకి ప్రచారం చేయనున్న నటుడు పరేష్ రావల్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ రాజకీయవేడిలో తామూ పాలుపంచుకోవడానికి సినీ నటులుకూడా చేరుతుండటం విశేషం. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ తాజాగా బీజేపీలో చేరారు. ఈయన గుజరాత్ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తరపున ప్రచారం చేయనున్నట్లు శనివారంనాడు న్యూఢిల్లీలో వెల్లడించారు.
Source: జాతీయ | 4 Apr 2009 | 2:54 pm

నందమూరి తారక రామారావు(జూ.)డిశ్చార్జ్

మార్చి నెల 26వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని హైదరాబాద్ పయనమైన జూనియర్ నందమూరి తారకరామారావు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన డిశ్చార్జ్ అయినప్పుడు ఆయన వెంట మిత్రులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటికి చేరుకున్నారు. చికిత్సానంతరం ఎవరి సహాయం లేకుండానే నడుస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు
Source: ఏపీ న్యూస్ | 4 Apr 2009 | 2:47 pm

రాజకీయ పార్టీలకు మద్దతివ్వం: శ్రీరామసేన

దేశవ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికలల భారతీయజనతా పార్టీతో సహా ఏ రాజకీయ పార్టీకి తాము మద్దతు ఇచ్చేది లేదని శ్రీరామ సేన ప్రకటించింది. ప్రస్తుతం అధికారమే పరమావధిగా బీజేపీ హిందూ మతాన్ని వాడుకుంటోందని శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ విమర్శించారు
Source: జాతీయ | 4 Apr 2009 | 2:03 pm