|
ఈస్ట్‌కోస్ట్‌లో మంటలు: తప్పిన ప్రమాదంహైదరాబాద్నుంచి కోల్‌కతా వైపు వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా ఓ ఏసీ కోచ్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అయితే ఈ సమయంలో ఆ కోచ్‌లో ప్రయాణీకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది.Source: Yahoo! Telugu: News | 2 Apr 2009 | 11:36 am వరుణ్ కేసులో యూపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసుభారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీపై తనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన జాతీయ భద్రతా చట్టాన్ని (నాసా) తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ గురువారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, పిలిభిత్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.Source: జాతీయ | 2 Apr 2009 | 11:21 am లాహోర్‌లోకి చొరబడ్డ 14 మంది తీవ్రవాదులుమారువేషంలో సుమారు 14 మంది తీవ్రవాదులు దేశ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్ నగరాల్లోకి చొరబడ్డారని పాకిస్థాన్ నిఘా సంస్థలు హెచ్చరించాయి. కొన్ని లక్ష్యాలపై దాడులు చేసేందుకు వారు వచ్చారని పాకిస్థానీ నిఘా వర్గాలు అధికారికSource: Yahoo! Telugu: News | 2 Apr 2009 | 10:52 am వరుణ్‌పై నాసా ప్రయోగం: యూపీకి సుప్రీం నోటీసుభారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీపై తనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన జాతీయ భద్రతా చట్టాన్ని (నాసా) తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ గురువారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌నుSource: Yahoo! Telugu: News | 2 Apr 2009 | 10:30 am మూడో దశ లోక్‌సభ ఎన్నికలు: నోటిఫికేషన్ జారీలోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో 107 నియోజకవర్గాల్లో జరిగే ఈ మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జారీ చేశారు. ఈ దశ ఎన్నికలు ఏప్రిల్ 30న జరగనున్నాయి. గుజరాత్‌లోని 26 సీట్లు, మధ్యప్రదేశ్‌లోని 16 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లోని 15 సీట్లు, పశ్చిమబెంగాల్‌లోని 14 సీట్లు, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో చెరో 11 సీట్లు, మహారాష్ట్రలో 10, జమ్ము- కాశ్మీర్, సిక్కిం, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలోని ఒక్కో సీటుకు ఈ దశలో ఎన్నికలు నిర్వహిస్తారు.Source: జాతీయ | 2 Apr 2009 | 10:29 am ఎమ్మెల్సీ ఫలితాల్లో కాంగ్రెస్‌దే అగ్రస్థానంస్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగురవేసింది.Source: Yahoo! Telugu: News | 2 Apr 2009 | 9:59 am రాజుకు సత్య శోధన: పిటీషన్ వాయిదాసత్యం కంప్యూటర్స్ ఆర్థిక కుంభకోణం కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామలింగరాజు త్రయం కేసు విచారణను కోర్టు ఏప్రిల్ ఆరుకు వాయిదా వేసింది. రాజు త్రయంపై సత్యశోధన పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2009 | 9:58 am భాజపా విమర్శలను తిప్పికొట్టిన రాహుల్జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జాతీయ భద్రత విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ చేస్తున్న విమర్శలను రాహుల్ గాంధీ ఈ సందర్భంగా తిప్పికొట్టారు.Source: జాతీయ | 2 Apr 2009 | 9:43 am పప్పూ పోటీకి పాట్నా హైకోర్టు నిరాకరణత్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా లోక్‌సభకు పోటీ చేయడానికి అనుమతి కోరిన ఆర్జేడీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ కోరికను పాట్నా హైకోర్టు తిరస్కరించింది. అజిత్ సర్కార్ హత్యకేసులో శిక్షను ఎదుర్కొంటున్న పప్పూ...Source: Yahoo! Telugu: News | 2 Apr 2009 | 9:41 am మూడో దశ లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ జారీలోక్సభ ఎన్నికల మూడో దశ ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో 107 నియోజకవర్గాల్లో జరిగే ఈ మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జారీ చేశారు. ఈ దశ ఎన్నికలుSource: Yahoo! Telugu: News | 2 Apr 2009 | 9:27 am రాజు త్రయంపై విచారణ 6కు వాయిదాసత్యం కంప్యూటర్స్ ఆర్థిక కుంభకోణం కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామలింగరాజు త్రయం కేసు విచారణను కోర్టు ఏప్రిల్ ఆరుకు వాయిదా వేసింది. రాజు త్రయంపై సత్యశోధన పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ...Source: Yahoo! Telugu: News | 2 Apr 2009 | 9:12 am నామినేషన్ కుప్పంలో... ప్రమాణం రాజధానిలోఎన్నికల్లో పోటీచేసేందుకై చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్ వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రమాణాన్ని మాత్రం హైదరాబాద్‌లో చేయడం విశేషం. నామినేషన్ సందర్భంగా కుప్పం చేరుకోలేని కారణంగా బాబు ఈ ఈ విధంగా నామినేషన్Source: Yahoo! Telugu: News | 2 Apr 2009 | 8:09 am సిక్కుల అల్లర్ల కేసు: టైట్లర్‌కు సీబీఐ క్లీన్చిట్దేశంలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జగదీశ్ టైట్లర్‌కు గురువారం సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ అల్లర్ల కేసుకు సంబంధించిన సీబీఐ తుది నివేదిక బహిర్గతం కావడంతో, టైట్లర్‌కు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసింది. గురువారం కర్కాదూమా కోర్టులో సీబీఐ తుది నివేదికను బహిర్గతం చేశారు.Source: జాతీయ | 2 Apr 2009 | 8:07 am రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా: పవన్ కళ్యాణ్కలర్ టీవీలు పంచిపెడితే రాష్ట్రంలోని పేదరికం పోతుందా అంటూ యువరాజ్యం అధినేత పవన్‌కళ్యాణ్ ధ్వజమెత్తారు. నగదు బదిలీ పథకంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయిస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచాంలో భాగంగా బుధవారం విశాఖలో పర్యటించిన పవన్ ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2009 | 7:57 am ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా సంజయ్దత్ఎన్నికల్లో పోటీచేయడానికి వీలులేని పరిస్థితి ఏర్పడడంతో బాలీవుడ్ హీరో సంజయ్‌దత్‌కు సమాజ్‌వాదీ పార్టీ మరో పదవిని కట్టబెట్టింది. దత్‌ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఎస్పీ తన నిర్ణయాన్ని వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 2 Apr 2009 | 7:56 am పేదల సంక్షేమమే లక్ష్యంగా తెదేపా మేనిఫెస్టోపేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం లక్ష్యంగా తెలుగుదేశం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 64 పేజీలతో రూపొందించిన ఈ మేనిఫెస్టోలో రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం, వారికి ఆర్ధిక, ఆరోగ్య, ఆహార భద్రత కల్పించే దిశగా పార్టీ తీసుకోనున్న చర్యల్ని పొందుపరిచారు.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2009 | 7:53 am 1984 అల్లర్ల కేసు: జగదీశ్ టైట్లర్‌కు సీబీఐ క్లీన్చిట్సీనియర్ కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌కు గురువారం 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ అల్లర్ల కేసుకు సంబంధించిన సీబీఐ తుది నివేదిక బహిర్గతం కావడంతో, టైట్లర్‌కు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసింది. గురువారంSource: Yahoo! Telugu: News | 2 Apr 2009 | 7:35 am ఆ రెండింటి వల్లే ప్రధాని కాలేక పోయా: ప్రణబ్కమ్యునిస్టుల ప్రాబల్యం బలంగా ఉన్న రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించడం, హిందీ భాషపై పెద్దగా పట్టులేకపోవడం వల్లే ప్రధాని పదవి తనను వరించలేదని కాంగ్రెస్ కరువృద్ధుడు, కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆశీస్సులు ప్రధాని మన్మోహన్‌కు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనికితోడు మన్మోహన్ గొప్ప మేధావి, గొప్ప ఆర్థికవేత్త అని ప్రణబ్ కితాబిచ్చారు.Source: జాతీయ | 2 Apr 2009 | 6:51 am ఉచిత్ కరెంట్‌తో రైతులకు కష్టాలు: బాలకృష్ణరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి అధికారమిస్తే ప్రజా బ్రతుకులు అధోగతిపాలవుతాయని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు మరోసారి అధికారాన్ని కట్టబెడితే ప్రజల డబ్బును పూర్తిగా దోచుకోవడంతో పాటు భూములన్నింటిని కూడా మింగేసి చివరకు ఉత్తచేయి చూపిస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2009 | 6:42 am మన్మోహన్ అభ్యర్థిత్వంపై పవార్ కినుక!దేశ ప్రధాని అభ్యర్థిగా మన్మోహన్ సింగ్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం పట్ల ఎన్.సి.పి. అధ్యక్షుడు, కేంద్ర మంత్రి శరద్ పవార్ కినుకు వహించారు. ఫలితంగా ఆయన తృతీయ కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా, శుక్రవారం న్యూఢిల్లీలో జరుగనున్న తృతీయ కూటమి నేతల సమావేశానికి శరద్ పవార్ హాజరయ్యేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో కేంద్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.Source: జాతీయ | 2 Apr 2009 | 6:18 am కేజీ బేసిన్‌లో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్పిదేశంలోని పారిశ్రామిక రంగం ఇన్నాళ్లూ వేయి కళ్లతో ఎదురుచూస్తూ వచ్చిన రిలయన్స్ గ్యాస్ సరఫరా తాజాగా ప్రారంభమైంది. కృష్ణా - గోదావరి చమురు క్షేత్రం (కేజీ బేసిన్)లోని డీ6 క్షేత్రంలోని ఓ గ్యాస్ బావిని తాళ్లరేవు సమీపంలోని సెంట్రల్ కంట్రోల్ రూం (సీసీఆర్) నుంచి రిమోట్ ద్వారా తెరచి గ్యాస్ ఉత్పత్పి ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2009 | 4:54 am కాంగ్రెస్‌పై సంజయ్‌దత్ తీవ్ర విమర్శలుప్రముఖ బాలీవుడ్ నటుడు, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత సంజయ్‌దత్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తండ్రి సునీల్‌దత్ మరణానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపించారు. తన తండ్రి కోరికలకు విరుద్ధంగా శివసేన నేత సంజయ్ నిరుపమ్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ ఆయనను బాధపెట్టిందని పేర్కొన్నారు.Source: జాతీయ | 2 Apr 2009 | 4:12 am వరుణ్ హత్యకు కుట్ర: నిఘా వర్గాలుభారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి ఫలితంగా ఆయను పటిష్టమైన బందోబస్తు మధ్య బుధవారం పిలిభిత్ నుంచి ఎతావా జైలుకు తరలించారు. అయితే తనపట్ల జైలు అధికారిక యంత్రాంగం దురుసుగా వ్యవహరిస్తోందని వరుణ్ ఫిర్యాదు చేసినట్లు వినికిడి. జంతువులకు పెట్టే ఆహారాన్ని తనకు కూడా అందిస్తున్నారని వరుణ్ జైలు యంత్రాంగంపై ఆరోపణలు చేశారు. స్థానిక పార్టీ నేతలతో వరుణ్ గాంధీ మాట్లాడుతూ.. తనపట్ల జైలు యంత్రాంగం దురుసుగా వ్యవహరిస్తోందని, కుక్కులకు కూడా పెట్టని ఆహారాన్ని అందిస్తున్నారని చెప్పారు.Source: జాతీయ | 2 Apr 2009 | 4:09 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2009 | 4:05 am ఏప్రిల్ 02, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2009 | 4:03 am మాయాపై మండిపడ్డ మేనకాగాంధీతన కుమారుడు వరుణ్ గాంధీపై మాయావతి జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించటంపై భారతీయ జనతాపార్టీ నాయకురాలు మేనకా గాంధీ మండిపడ్డారు. తన కుమారునికి ఎటువంటి హాని జరిగినా మాయవతి, కాంగ్రెస్ పార్టీలు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వరుణ్‌ను ఉద్దేశ్యపూర్వకంగా కేసులో ఇరికించారన్నారు. వరుణ్ తన కుమారుడే కాదు అందరికీ కొడుకులాంటి వాడు. అతనికి గనుక ఏమైనా హాని జరిగినట్లయితే మాయవతితోపాటు కాంగ్రెస్ పార్టీ దేశానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.Source: జాతీయ | 1 Apr 2009 | 1:29 pm శ్రీవారిని దర్శించుకున్న సురేఖప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి సతీమణి శ్రీమతి సురేఖ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతికి చేరువలోని రేణిగుంట విమానాశ్రయంలో ప్రజారాజ్యం పార్టీ ప్రముఖులు, స్నేహితులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంనుంచి ఆమె నేరుగా చిత్తూరుకు సమీపంలోని కాణిపాకంలోని వినాయకుడిని దర్శించుకున్నారు. తదనంతరం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్ళి వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Apr 2009 | 12:34 pm నూతన దంపతుల స్వర్గధామం "పట్నీటాప్"నవ దంపతులకు బెస్ట్ హనీమూన్ స్పాట్‌లలో చెప్పుకోదగ్గది "పట్నీటాప్ హిల్ స్టేషన్". ప్రకృతి రమణీయతకు అద్దంపడుతూ, ఎన్నో ప్రత్యేకాంశాలను తనలో దాచుకున్న ఈ పర్యాటక ప్రాంతం... భారతదేశం సరిహద్దుల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో నెలకొని ఉంది. పట్నీటాప్ హిల్ స్టేషన్‌కు ఎలా వెళ్లాలంటే...Source: వినోదం | 1 Apr 2009 | 12:32 pm గూడీపై నాకెలాంటి ద్వేషం లేదు: శిల్పాశెట్టిదివంగత హాలీవుడ్ నటి జేడ్ గూడీపై తనకెలాంటి ద్వేషం లేదని బాలీవుడ్ సినీతార శిల్పాశెట్టి వెల్లడించింది. తనకు వ్యతిరేకంగా జాత్యంహంకార వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆమె పట్ల ద్వేషభావం లేదని శిల్ప చెప్పినట్లు "హలో" పత్రిక వెల్లడించింది. ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌తో తిరిగిరాని లోకానికి...Source: వినోదం | 1 Apr 2009 | 12:11 pm గురువారం నుంచి తెలంగాణలో కేసీఆర్ ప్రచారంమహాకూటమిలో ప్రముఖపాత్ర పోషిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని నుంచి కేసీఆర్ తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రచారంలో భాగంగా తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్న కేసీఆర్ మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీకి పట్టు తక్కువగా ఉండడం, కేసీఆర్ స్వయంగా అక్కడ పోటీ చేయనుండడంతో మహబూబ్‌నగర్‌ను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.Source: ఏపీ న్యూస్ | 1 Apr 2009 | 12:00 pm బాలకృష్ణ చెప్పింది ముమ్మాటికీ నిజం: చిరంజీవిఈ ఎన్నికలకు సంబంధించి తాము పూర్తిగా ప్రత్యేకమని, తమకు ఎవరూ పోటీకాబోరని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. టీడీపీకి పీఆర్పీ పోటీకాబోదని సినీనటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ చిరంజీవి పై వ్యాఖ్యలు చేయడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చిరంజీవి మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ మేనిఫెస్టోను ఈ నెల 5న విడుదల చేయనున్నట్టు తెలిపారు. దీనికి ముందు పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్ధుల మరో జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నకు సమాధానమిస్తూ టీడీపీకి పీఆర్పీ పోటీకాబోదని బాలకృష్ణ అన్న మాటలు నిజమేనని చిరంజీవి పేర్కొన్నారు. ఎందుకంటే ఎన్నేళ్లయినా ప్రజల గురించి తెలుసుకోలేని ఆ పార్టీతో తమకేం పోటీ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.Source: ఏపీ న్యూస్ | 1 Apr 2009 | 10:30 am
|