శ్రీవారిని దర్శించుకున్న సురేఖ

ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి సతీమణి శ్రీమతి సురేఖ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతికి చేరువలోని రేణిగుంట విమానాశ్రయంలో ప్రజారాజ్యం పార్టీ ప్రముఖులు, స్నేహితులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంనుంచి ఆమె నేరుగా చిత్తూరుకు సమీపంలోని కాణిపాకంలోని వినాయకుడిని దర్శించుకున్నారు. తదనంతరం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్ళి వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Apr 2009 | 12:34 pm

నూతన దంపతుల స్వర్గధామం "పట్నీటాప్"

నవ దంపతులకు బెస్ట్ హనీమూన్ స్పాట్‌లలో చెప్పుకోదగ్గది "పట్నీటాప్ హిల్ స్టేషన్". ప్రకృతి రమణీయతకు అద్దంపడుతూ, ఎన్నో ప్రత్యేకాంశాలను తనలో దాచుకున్న ఈ పర్యాటక ప్రాంతం... భారతదేశం సరిహద్దుల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో నెలకొని ఉంది. పట్నీటాప్ హిల్ స్టేషన్‌కు ఎలా వెళ్లాలంటే...
Source: వినోదం | 1 Apr 2009 | 12:32 pm

గూడీపై నాకెలాంటి ద్వేషం లేదు: శిల్పాశెట్టి

దివంగత హాలీవుడ్ నటి జేడ్‌ గూడీపై తనకెలాంటి ద్వేషం లేదని బాలీవుడ్ సినీతార శిల్పాశెట్టి వెల్లడించింది. తనకు వ్యతిరేకంగా జాత్యంహంకార వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆమె పట్ల ద్వేషభావం లేదని శిల్ప చెప్పినట్లు "హలో" పత్రిక వెల్లడించింది. ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌తో తిరిగిరాని లోకానికి...
Source: వినోదం | 1 Apr 2009 | 12:11 pm

గురువారం నుంచి తెలంగాణలో కేసీఆర్ ప్రచారం

మహాకూటమిలో ప్రముఖపాత్ర పోషిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని నుంచి కేసీఆర్ తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రచారంలో భాగంగా తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్న కేసీఆర్ మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీకి పట్టు తక్కువగా ఉండడం, కేసీఆర్ స్వయంగా అక్కడ పోటీ చేయనుండడంతో మహబూబ్‌నగర్‌ను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 1 Apr 2009 | 12:00 pm

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 193 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో పయనించింది. 37 పాయింట్ల వృద్ధితో 9,746 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం కాసేపటికే 200 పాయింట్లు పతనమై 9,546 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది.
Source: Yahoo! Telugu: News | 1 Apr 2009 | 11:36 am

ఆర్మీ దాడిలో ప్రభాకరన్ కుమారుడికి గాయాలు

ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ కుమారుడు చార్లస్ ఆంథోనీకి ప్రభుత్వ దళాలు జరిపిన దాడిలో గాయాలయినట్లు తెలుస్తోంది. శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో తాజాగా ప్రభుత్వ దళాలకు, ఎల్టీటీఈ తీవ్రవాదులకు మధ్య జరిగిన పోరులో
Source: Yahoo! Telugu: News | 1 Apr 2009 | 11:31 am

బిజీగా ఉన్నందునే సీఎంతో వెళ్లలేదు: డీఎస్

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో తలమునకలయ్యే పనుల్లో ఉండడం వల్లే తాను ముఖ్యమంత్రి వైఎస్‌తో పాటు ప్రచారానికి వెళ్లలేదని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు తాను ప్రచారానికి వెళ్లకపోవడం పార్టీ శ్రేణులకు...
Source: Yahoo! Telugu: News | 1 Apr 2009 | 11:07 am

భారత్‌లో పరాభవం తరువాతే పీటర్సన్‌కు చికాకు

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌కు ఇటీవల భారత పర్యటనలో ఎదురైన ఘోర పరాజయాలే చికాకు పుట్టించాయి. ఈ పర్యటన నుంచే తనకు చికాకు మొదలైందని పీటర్సన్ వెల్లడించాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు
Source: Yahoo! Telugu: News | 1 Apr 2009 | 11:06 am

మూడో టెస్ట్ పిచ్‌తో ఇబ్బంది లేదు: కిర్‌స్టన్

భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగబోతున్న కీలకమైన మూడో టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధం చేసిన సీమింగ్ పిచ్‌తో తమకు ఇబ్బంది లేదని టీం ఇండియా కోచ్ గ్యారీ కిర్‌స్టన్ స్పష్టం చేశారు. సీమ్‌కు సహకరించే బేసిన్ రిజర్వ్ ట్రాకుకు అలవాటు పడటంతో
Source: Yahoo! Telugu: News | 1 Apr 2009 | 10:53 am

రాజీనామా చేసే ఆలోచన లేదు: పీసీబీ చీఫ్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదని ఇజాజ్ బట్ బుధవారం స్పష్టం చేశారు. అనారోగ్యం కారణంగా ఆయన పీసీబీ చీఫ్ పదవికి రాజీనామా చేయనున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ప్రస్తుతానికి పీసీబీ ఛైర్మన్
Source: Yahoo! Telugu: News | 1 Apr 2009 | 10:34 am

బాలకృష్ణ చెప్పింది ముమ్మాటికీ నిజం: చిరంజీవి

ఈ ఎన్నికలకు సంబంధించి తాము పూర్తిగా ప్రత్యేకమని, తమకు ఎవరూ పోటీకాబోరని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. టీడీపీకి పీఆర్పీ పోటీకాబోదని సినీనటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ చిరంజీవి పై వ్యాఖ్యలు చేయడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చిరంజీవి మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ మేనిఫెస్టోను ఈ నెల 5న విడుదల చేయనున్నట్టు తెలిపారు. దీనికి ముందు పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్ధుల మరో జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నకు సమాధానమిస్తూ టీడీపీకి పీఆర్పీ పోటీకాబోదని బాలకృష్ణ అన్న మాటలు నిజమేనని చిరంజీవి పేర్కొన్నారు. ఎందుకంటే ఎన్నేళ్లయినా ప్రజల గురించి తెలుసుకోలేని ఆ పార్టీతో తమకేం పోటీ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
Source: ఏపీ న్యూస్ | 1 Apr 2009 | 10:30 am

మార్కెట్లోకి విడుదలైన లైఫ్‌స్టైల్ ఆడియో

ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం లైఫ్‌స్టైల్. మాధవ్ పట్నాయక్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది. ఆదిత్యామ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో కేసెట్‌ను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: News | 1 Apr 2009 | 10:14 am

మార్కెట్లోకి విడుదలైన లైఫ్‌స్టైల్ ఆడియో

ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం లైఫ్‌స్టైల్. మాధవ్ పట్నాయక్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది. ఆదిత్యామ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో కేసెట్‌ను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2009 | 10:14 am

రేపు యువరత్న 'మిత్రుడు' పాటలు విడుదల

యువరత్న బాలకృష్ణ, ప్రియమణి జంటగా నటిస్తోన్న చిత్రం మిత్రుడు. వైష్ణవి సినిమా పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ద్వారా మహాదేవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఒకపాట మినహా ఈ చిత్రం షూటింగ్...
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2009 | 10:12 am

అజ్మల్ కసబ్ తరపున వాదిస్తా: అంజలీ వాగ్మారే

ముంబయి ఉగ్రవాద దాడుల కేసులో భద్రతా దళాలకు పట్టుబడిన ప్రధాన నిందితుడు అజ్మల్ అమీర్ కసబ్ కేసును వాదించేందుకు న్యాయవాది అంజలీ వాగ్మారే అంగీకరించారు. తన ఈ నిర్ణయాన్ని బుధవారం న్యాయమూర్తి తహిలియానీకి అంజలీ
Source: Yahoo! Telugu: News | 1 Apr 2009 | 10:12 am

పాటల చిత్రీకరణలో రాజుమహారాజు

డా. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో శర్వానంద్, సుర్విన్ చావ్లా, తషు కౌశిక్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం రాజు మహారాజు. భాను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కుమారస్వామి పత్తికొండ నిర్మిస్తున్నారు. ఇటీవలే టాకీని పూర్తి చేసుకున్న ఈ చిత్రం...
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2009 | 10:11 am

ఏప్రిల్ నెలాఖరున రానున్న పోలీస్ పోలీస్

శ్రీరామ్, పృథ్వీరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం పోలీస్ పోలీస్. చందు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మన్మోహన్ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల మూడున విడుదల కావాల్సిఉంది. అయితే...
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2009 | 10:09 am

నేనింకా ప్రేమలో పడలేదు: విమలారామన్

ఎవరైనా ఎప్పుడైనా ప్రేమలో పడవచ్చునని, అయితే తానుమాత్రం ఇంకా ప్రేమలో పడలేదని నటి విమలారామన్ చెబుతోంది. తనకు నచ్చేంత మంచి వ్యక్తి తనకింకా తారసపడలేదని ఈ సందర్భంగా ఈ అమ్మడు ముక్తాయించింది. తమిళ చిత్రం "పొయ్" ద్వారా...
Source: Yahoo! Telugu: News | 1 Apr 2009 | 10:08 am

నేనింకా ప్రేమలో పడలేదు: విమలారామన్

ఎవరైనా ఎప్పుడైనా ప్రేమలో పడవచ్చునని, అయితే తానుమాత్రం ఇంకా ప్రేమలో పడలేదని నటి విమలారామన్ చెబుతోంది. తనకు నచ్చేంత మంచి వ్యక్తి తనకింకా తారసపడలేదని ఈ సందర్భంగా ఈ అమ్మడు ముక్తాయించింది. తమిళ చిత్రం "పొయ్" ద్వారా...
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2009 | 10:08 am

ద డిజైర్‌లో శిల్పాశెట్టి తల్లి పాత్రలో జయప్రద

కమల్ హాసన్ హీరోగా వచ్చిన దశావతారం చిత్రంలో ఇటీవల తెరమీద తళుక్కుమన్న అలనాటి అందాల తార జయప్రద ఓ అంతర్జాతీయ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, నటించేందుకు...
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2009 | 10:06 am

ఆర్థిక ఉద్దీపన చర్యలు కొనసాగించండి: మన్మోహన్

ప్రపంచ దేశాలు 2010 వరకు ఉద్దీపన చర్యలు కొనసాగించాలని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం జి- 20 దేశాలకు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక రంగంలో, మిగిలినవాటిలోనూ అన్నిరకాల రక్షణాత్మక ధోరణులను విడిచిపెట్టాలని ప్రధాని కోరారు.
Source: జాతీయ | 1 Apr 2009 | 10:04 am

కసాబ్ కేసును నేనే వాదిస్తా : అంజలీ

నిరుడు ముంబై దాడులకు పాల్పడి ప్రాణాలతో పట్టుబడ్డ ఏకైక తీవ్రవాది అజ్మల్ అమీర్ కసాబ్ తరపున కేసును వాదించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రముఖ న్యాయవాది అంజలీ వాఘ్‌మారే బుధవారం కోర్టులో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమెకు పటిష్టమైన భద్రత కల్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Source: జాతీయ | 1 Apr 2009 | 9:57 am

నాపై సోనియా పెత్తనం చెలాయించలేదు: ప్రధాని

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనపై పెత్తనం చెలాయించారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఖండించారు. తాను ప్రభుత్వ కార్యకలాపాలపై దృష్టిపెట్టేందుకు వీలుగా, సోనియా గాంధీ పార్టీ భారం మొత్తాన్ని
Source: Yahoo! Telugu: News | 1 Apr 2009 | 9:24 am

లైఫ్‌స్టైల్ ఆడియో విడుదల

ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "లైఫ్‌స్టైల్". మాధవ్ పట్నాయక్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది. ఆదిత్యామ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో కేసెట్‌ను ముఖ్య అతిథి, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేశారు. సీడీని దిల్‌రాజు విడుదల చేశారు. రమేష్ ప్రసాద్ లైఫ్‌స్టైల్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.
Source: వినోదం | 1 Apr 2009 | 8:42 am

దేశంలో ఉన్నవారంతా హిందువులే: ఆర్ఎస్ఎస్

దేశంలో నివసిస్తున్న అన్నిమతాల వారూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానించింది. ప్రజలందరి సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందేనని పేర్కొంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, పాల సహకార ఉద్యమానికి నేతృత్వం వహించిన వార్గేస్ కురియన్‌లను ఉదహరిస్తూ.. ప్రజల సంక్షేమాన్ని నమ్ముకున్న వారందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 1 Apr 2009 | 8:28 am

మహేష్‌బాబుతో త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, స్టార్ రైటర్, డైరక్టర్ త్రివిక్రమ్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన అతడు తర్వాత చేస్తోన్న మరో భారీ చిత్రంగా ఇది తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల...
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2009 | 7:56 am

ప్రారంభమైన ప్రభాస్-పూరీల కొత్త చిత్రం

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న భారీ చిత్రం తాజాగా ప్రారంభమైంది. ఆదిత్యారామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆదిత్యరామ్, ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ...
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2009 | 7:55 am

త్వరలో ప్రారంభం కానున్న అర్చన 'సివంగి'

అచ్చ తెలుగు హీరోయిన్ అర్చన ప్రధాన పాత్రలో టి. కృష్ణ దర్శకత్వంలో వి.ఆర్.బాబు నిర్మించనున్న కొత్త చిత్రం సివంగి. తెలుగు క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం షూటింగ్‌ ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభంకానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2009 | 7:54 am

శ్రీవారి సన్నిధిలో తెదేపా మేనిఫెస్టోకు పూజలు

తెలుగుదేశం మేనిఫెస్టోను బుధవారం విడుదల చేయనున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆ ప్రతిని తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకోసం చంద్రాబాబు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల విచ్చేసిన చంద్రబాబు స్వామివారిని దర్శించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Apr 2009 | 7:43 am

ప్రధాని పదవా..? వద్దనే వద్దు: ములాయం

తాను ప్రధాని పదవి రేసులో లేనని సమజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే కేంద్రంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మజ్‌గవాన్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ములాయం ప్రజలనుద్దేశించి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
Source: జాతీయ | 1 Apr 2009 | 7:24 am

పాటల చిత్రీకరణలో "రాజుమహారాజు"

శర్వానంద్, సుర్విన్ చావ్లా, తషు కౌశిక్ హీరోహీరోయిన్లుగా, డా. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం "రాజు మహారాజు". కుమారస్వామి పత్తికొండ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి భాను దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం టాకీని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కులుమనాలిలో పాటలను చిత్రీకరించుకుంటోంది.
Source: వినోదం | 1 Apr 2009 | 7:06 am

కోనసీమకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం: చిరు

కోనసీమ అందాలు చూచి ముగ్ధుడైన ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తాము అధికారంలోకి వస్తే ఆ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భగవంతుని సొంత స్థలం కేరళ అంటారని, కానీ కోనసీమే దేవుని సొంత స్థలమనే విధంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 1 Apr 2009 | 6:14 am

ఆడవాళ్లు చేసిన ఉప్మా

"ఉప్మాలో ఇంత పొడవాటి వెంట్రుక వచ్చింది. అంటే దీనర్ధం" కోపంగా అడిగాడు కస్టమర్ "ఆమాత్రం తెలీదా సార్‌...! అది...
Source: వినోదం | 1 Apr 2009 | 5:58 am

ఊటీ వెళ్లొచ్చారు కదా...!

"ఏమడీ... వారం రోజులు ఊటీ వెళ్లొచ్చారు కదా...! నాకేం తెచ్చారు?" గారంగా అడిగింది భార్య "దగ్గు, జలుబు, జ్వరం..." బాధగా...
Source: వినోదం | 1 Apr 2009 | 5:54 am

ఒరిస్సాలో పెను తుఫాను: 12 మంది మృతి

ఒరిస్సాలో సంభవించిన తుఫానుకు 12 మంది బలైయ్యారు. ఒరిస్సాలోని కేంద్రపారా జిల్లా సంభవించిన ఈ ప్రకృతీ వైపరీత్యానికి 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం ఆకస్మాత్తుగా కేంద్రపారా జిల్లాలోని రాజ్‌కనిక గ్రామంలో భీకర తుఫాను సంభవించింది. ఈ తుఫాను ధాటికి 11 గ్రామాలు నేలమట్టమయ్యాయని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని అడిషనల్ సూపరిటెండెంట్ పోలీస్ కుమార్‌మణి మెహర్ వెల్లడించారు.
Source: జాతీయ | 1 Apr 2009 | 5:51 am

వరుణ్‌ హత్యకు అండర్ వరల్డ్ పన్నాగం: భగ్నం చేసిన ఐబీ

భారతీయ జనతాపార్టీ యువనేత వరుణ్‌గాంధీపై హత్యాయత్నాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) భగ్నం చేసింది. గత మూడు రోజులుగా పిలిభిత్ జైలులో ఉంటున్న వరుణ్‌గాంధీని సెక్యురిటీ కారణాల రీత్యా బుధవారం ఈటా జైలుకు తరలించారు. ఈ విషయమై పిలిభిత్ జిల్లా జైలు అధికారి ముఖేష్ అరోరా మాట్లాడుతూ వరుణ్‌గాంధీని ఈటా జైలుకు తరలించిన సంగతిని నిర్ధారించారు. బుధవారం తెల్లవారు జామున 1.30 గంటలకు వరుణ్‌ను పిలిభిత్ నుంచి ఈటా జైలుకు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు.
Source: జాతీయ | 1 Apr 2009 | 5:42 am

శిల్పాశెట్టి తల్లిగా జయప్రద..!

పద్మభూషణ్ కమల్ హాసన్ "దశావతారం"లో ప్రత్యక్షమైన అందాల ముద్దుగుమ్మ జయప్రద మళ్లీ అంతర్జాతీయ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. ఒకవైపు రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నప్పటికీ, నటించేందుకు సమయం కేటాయించడంలో తనకెలాంటి కష్టం లేదని ఆమె అంటోంది. "ద డిజైర్" అనే పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో జయప్రద ఓ నాట్య గురువుగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించింది. ఒక ఒడిస్సీ నాట్యకారిణిగా ఈ సినిమాలో కన్పిస్తానని, ఇలాంటి పాత్ర కోసమే చాలా రోజులు ఎదురుచూస్తున్నానని, ఇందులో శిల్పాశెట్టి తల్లిగా నటిస్తోంది.
Source: వినోదం | 1 Apr 2009 | 5:17 am

రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారాల ప్రధానం

వివిధ రంగాల్లో సేవలందించిన 67మంది ప్రముఖులకు గతంలో ప్రకటించిన పురస్కారాలను రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సోమవారం ప్రధానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా 16మందికి పద్మభూషణ్, 45మందికి పద్మశ్రీ, ఆరుగురికి పద్మవిభూషణ్ అవార్డులను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అందజేశారు. రాష్ట్రపతి చేతులమీదుగా పద్మవిభూషణ్ అందుకున్న వారిలో అణుశక్తి కమిషన్ అధ్యక్షుడు అనిల్ కకోద్కర్, అశోక్‌ శేఖర్ గంగూలీ, గోవింద్‌ నారాయణ్, చంద్రికా ప్రసాద్ శ్రీవాత్సవ, జస్బీర్‌సింగ్ బజాజ్‌లు ఉన్నారు. అలాగే పద్మభూషణ్ అందుకున్న వారిలో సినీనటుడు కృష్ణ, జపాన్‌కు చెందిన ప్రొఫెసర్ మినోరు హర ఉన్నారు.
Source: జాతీయ | 1 Apr 2009 | 4:53 am

నా అభ్యర్థిత్వాన్ని ప్రభుత్వం తిరస్కరించింది: సంజయ్ దత్

దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనను అనుమతించకపోవడంపై బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగాలనుకున్న సంజయ్ దత్‌కు మంగళవారం సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు సంజయ్ దత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించలేదు. తాజా పరిణామంపై సంజయ్ దత్ మాట్లాడుతూ.. తన అభ్యర్థిత్వాన్ని ప్రభుత్వం ప్రత్యక్షంగానే తిరస్కరించిందని ఆరోపించారు.
Source: జాతీయ | 1 Apr 2009 | 4:26 am

ఏప్రిల్ 01, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 సుహాసిని కథలు 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం
Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2009 | 3:56 am

టైమ్స్ జాబితాలో సోనియా, రతన్, ముఖేష్

టైమ్స్ మ్యాగజైన్ ప్రస్తుత ఏడాది 2009కి గాను అత్యంత ప్రభావితమైన వ్యక్తుల జాబితాలో ఏఐసీసీఅధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ, టాటా సంస్థల అధినేత రతన్ టాటా, రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ, పెప్సీకో సీఈఓ ఇంద్రానూయీ, బాలీవుడ్ మూవీ మొఘల్ యూటీవీ అధినేత రూనీ స్క్రూవాలా యూఎస్ సహయ ప్యాకేజీ సూపర్‌వైజరీగానున్న నీల్ కాశ్‌కరీలున్నారు.
Source: జాతీయ | 1 Apr 2009 | 3:09 am

భారత్-పాక్‌ల మధ్య చర్చల ప్రసక్తే లేదు: ప్రధాని

ముంబయి దాడులకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టేవరకూ పాకిస్తాన్‌తో చర్చల ప్రశక్తే లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ తేల్చి చెప్పారు. ఇటీవల అసిఫ్ అలీ జార్దారీ భారత్-పాక్‌ల మధ్య చర్చలు పునరుద్ధరణకు చొరవ చూపాలని చేసిన విజ్ఞప్తిని ప్రధాని నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అమాయక ప్రజలను బలితీసుకున్న ముంబయి ఉగ్రవాదుల పూర్తి ఆధారాలను తమ చేతిలో పెట్టేవరకూ పాకిస్తాన్‌తో ఎటువంటి చర్చలకు తావు లేదని స్పష్టం చేశారు. తీవ్రవాదంపై పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని భారతదేశం భావించినప్పుడే ఇరు దేశాల మధ్య చర్చలకు ఆస్కారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Source: జాతీయ | 31 Mar 2009 | 3:29 pm

ఐక్యంగా ముందుకు సాగుతాం: కేటీఆర్

మహాకూటమిలోని నాలుగు పార్టీల నేతలు ఐక్యంగా ఉంటూ ముందుకు సాగుతాయని తెలంగాణా రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి కె.తారక రామారావు వెల్లడించారు. తామంతా మహాకూటమిగానే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళుతున్నట్టు చెప్పారు. నాలుగు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినపుడు కొన్ని అభిప్రాయభేదాలు సహజమని, అంతమాత్రాన మహాకూటమి విచ్ఛిన్నమవుతుందని భావించాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 31 Mar 2009 | 12:42 pm