|
"మున్నాభాయ్" విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంలోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ చేసుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆయుధాలు అక్రమంగా కలిగివున్నందుకు గాను సంజయ్ దోషిగా తేలిన విషయం తెల్సిందే. ఈ కేసులో సంజయ్‌కు బెయిల్ మాత్రమే మంజూరు చేశామని, విధించిన శిక్షను నిలుపుదల చేయలేదంటూ వివరణ ఇస్తూ సంజయ్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తోసిపుచ్చింది.Source: జాతీయ | 31 Mar 2009 | 1:00 pm ఐక్యంగా ముందుకు సాగుతాం: కేటీఆర్మహాకూటమిలోని నాలుగు పార్టీల నేతలు ఐక్యంగా ఉంటూ ముందుకు సాగుతాయని తెలంగాణా రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి కె.తారక రామారావు వెల్లడించారు. తామంతా మహాకూటమిగానే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళుతున్నట్టు చెప్పారు. నాలుగు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినపుడు కొన్ని అభిప్రాయభేదాలు సహజమని, అంతమాత్రాన మహాకూటమి విచ్ఛిన్నమవుతుందని భావించాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 31 Mar 2009 | 12:42 pm పేదల కోసం పాటుపడిన యూపీఏ: రాహుల్గత ఐదేళ్లల్లో ఇచ్చిన హామీలన్నింటిని కేంద్రంలోని అధికార యూపీఏ ప్రభుత్వం దాదాపుగా నెరవేర్చిందని కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఐదేళ్ళూ పేదల అభ్యున్నతికే పెద్దపీట వేసిందని, అందుకే తాజా ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కే పట్టం కట్టాలంటూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లానుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో దేశం చాలా అభివృద్ధిని సాధించిందని పేర్కొన్నారు.Source: జాతీయ | 31 Mar 2009 | 12:38 pm ఫలితాలు పాక్ బహిర్గతం చేయాలి: ప్రధానిభారత్- పాకిస్థాన్‌ల మధ్య సంక్లిష్ట చర్చల ప్రక్రియను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గత ఏడాది జరిగిన ముంబై ఉగ్రవాద దాడితో ముడిపెట్టారు. గత ఏడాది నవంబరులో జరిగిన ఈ దాడిపై పాకిస్థాన్ ప్రభుత్వం కూడా దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తులో తేలిన ఫలితాలను పాక్ బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.Source: జాతీయ | 31 Mar 2009 | 12:29 pm హృదయానికి హత్తుకునే 'ఆకాశమంత': నిర్మాతతాను నిర్మించిన ఆకాశమంత చిత్రం అందరి హృదయాలను హత్తుకుంటుందని నిర్మాత దిల్‌రాజు పేర్కొన్నారు. ప్రకాష్‌రాజ్, త్రిష తండ్రీకూతుళ్లుగా నటించిన ఈ చిత్రం తమకు చాలా బాగా నచ్చిందని చిత్ర సక్సెస్ మీట్‌కు హాజరైన వక్తలు సైతం వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2009 | 12:12 pm 'మనోరమ'ను ఆదరిస్తున్నారు: ఈశ్వర్రెడ్డిఛార్మి ప్రధాన పాత్రలో తాజాగా విడుదలైన చిత్రం మనోరమ. ఉగాదికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోందని చిత్ర దర్శకుడు ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఫిలింఛాంబర్‌లో నిర్వహించిన చిత్ర సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఈశ్వర్‌రెడ్డి...Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2009 | 12:10 pm ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ 'బిల్లా'ప్రభాస్ హీరోగా గోపీకృష్ణా మూవీస్ బేనర్‌పై నిర్మించబడ్డ చిత్రం బిల్లా. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెబల్‌స్టార్ కృష్ణంరాజు ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క...Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2009 | 12:09 pm మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 140 పాయింట్ల వృద్ధిబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) మంగళవారం లాభాల బాటలో పయనించింది. 65 పాయింట్ల వృద్ధితో 9,633 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం లాభాలను నిలిపివుంచుకోలేక నష్టాల్లోకి జారుకుంది. ఒకానొక దశలో 9,547 పాయింట్ల కనిష్ట స్థాయికిSource: Yahoo! Telugu: News | 31 Mar 2009 | 11:46 am గంగూలీ లేకుండా కేకేఆర్ లేదు: షారుఖ్ ఖాన్బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ లేకుండా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) లేదని ఆ జట్టు యజమాని, ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో గంగూలీని పక్కనబెట్టాలనిSource: Yahoo! Telugu: News | 31 Mar 2009 | 11:40 am ఐపీఎల్‌కు దూరం కావాలనుకుంటున్న ఓరమ్న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జాకబ్ ఓరమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌కు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 6న జరిగే దేశీయ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడేందుకు శరీరం సహకరించని పక్షంలో.. ఆపై జరిగే ఇండియన్Source: Yahoo! Telugu: News | 31 Mar 2009 | 11:24 am ఈసీ నోటీసు జారీ: చిక్కుల్లో ములాయంసమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు సోమవారం మహిళా కలెక్టర్‌ను బెదిరించిన కేసుపై ఎన్నికల సంఘం సోమవారం నోటీసు జారీ చేసింది. మెయిన్‌పురి జిల్లా కలెక్టర్ మినిస్తీ దిలీప్‌పట్ల దురుసుగా వ్యవహరించినట్లు, ఆమెను బెదిరించినట్టు ములాయం సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఎన్నికల సంఘం యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌ను వివరణ కోరింది. స్వేచ్ఛ, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఇటువంటి దురుసు చర్యలు ఆటంకం కలిగిస్తాయని ఎన్నికల సంఘం నోటీసు జారీ చేస్తున్న సందర్భంగా వ్యాఖ్యానించింది.Source: జాతీయ | 31 Mar 2009 | 11:19 am 26/11: చూడదగ్గ ఫలితాలు కావాలన్న ప్రధానిభారత్- పాకిస్థాన్‌ల మధ్య సంక్లిష్ట చర్చల ప్రక్రియను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గత ఏడాది జరిగిన ముంబయి ఉగ్రవాద దాడితో ముడిపెట్టారు. గత ఏడాది నవంబరులో జరిగిన ఈ దాడిపై పాకిస్థాన్ ప్రభుత్వం కూడా దర్యాప్తు జరుపుతున్నSource: Yahoo! Telugu: News | 31 Mar 2009 | 10:57 am మహాకూటమిగానే ఎన్నికలకు: రామారావుతామంతా మహాకూటమిగానే వచ్చే ఎన్నికలకు వెళ్తామని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. నాలుగు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినపుడు కొన్ని అభిప్రాయభేదాలు సహజమని, అంతమాత్రాన మహాకూటమి...Source: Yahoo! Telugu: News | 31 Mar 2009 | 10:29 am మహాకూటమిలో మళ్లీ సీట్ల ముసలంమహాకూటమిలో మళ్లీ సీట్ల ముసలం తలెత్తింది. సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకునేందుకు వీలుగా మహాకూటమి మంగళవారం సమావేశమైంది. ఈ భేటీకి సీపీఎం గైర్హాజరైంది. మహాకూటమిలో సీట్ల పంపకాన్ని తేల్చాలని సీపీఎం పట్టుబట్టారు. దీంతో మహాకూటమి నేతల సమావేశానికి సీపీఎం నేతలు గైర్హాజరయ్యారు.Source: ఏపీ న్యూస్ | 31 Mar 2009 | 10:19 am లాహోర్ దాడికి బాధ్యత వహించిన మెహసూద్తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాద సంస్థ చీఫ్ బైతుల్లా మెహసూద్ సోమవారం లాహోర్ నగరంలోని పోలీసు శిక్షణా కేంద్రంపై జరిగిన ఉగ్రవాద దాడికి బాధ్యత వహించాడు. లాహోర్‌లోని మానవర్ పోలీసు శిక్షణా కేంద్రంపై దాడి చేసింది తామేననిSource: Yahoo! Telugu: News | 31 Mar 2009 | 10:11 am తృతీయ కూటమి అదృశ్యం: అద్వానీ జోస్యంఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో మూడో కూటమి అదృశ్యం కావడం ఖాయమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి ఎల్.కె.అద్వానీ జోస్యం చెప్పారు. కొన్ని పార్టీలు యూపీఏకు, ఎన్డీఏకు దూరంగా ఉన్నంతమాత్రాన అవి మూడో కూటమిగా ఏర్పడబోవని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభిస్తే మూడో కూటమిలో భాగస్వాములుగా ఉంటున్న చాలా ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏలో చేరుతాయని ఆయన వ్యాఖ్యానించారు.Source: జాతీయ | 31 Mar 2009 | 10:10 am అవినీతికే పీఆర్పీ వ్యతిరేకం: చిరంజీవి స్పష్టంఅవినీతికి మాత్రమే ప్రజారాజ్యం వ్యతిరేకమని అభివృద్ధికి కాదని ఆ పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. అంతేతప్ప ముఖ్యమంత్రి వైఎస్ చెబుతున్నట్టు ఆరోగ్యశ్రీని, ప్రాజెక్టులను అడ్డుకోవాలని తామెపుడూ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 31 Mar 2009 | 10:06 am మహిళా కలెక్టర్ కేసు: ములాయంకు ఈసీ నోటీసుసమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు సోమవారం మహిళా కలెక్టర్‌ను బెదిరించిన కేసుపై ఎన్నికల సంఘం సోమవారం నోటీసు జారీ చేసింది. మెయిన్‌పురి జిల్లా కలెక్టర్ మినిస్తీ దిలీప్‌పట్ల దురుసుగా వ్యవహరించినట్లు, ఆమెనుSource: Yahoo! Telugu: News | 31 Mar 2009 | 9:55 am ప్రజాక్షేమం కోరే కాంగ్రెస్‌కు పట్టం కట్టండి: వైఎస్ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లోనూ పట్టం కట్టాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ విజ్ఞప్తి చేశారు. అధికారం కోసం గడ్డికరుస్తున్న మహాకూటమిని, ఇతరపార్టీలను నమ్మవద్దంటూ ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 31 Mar 2009 | 9:51 am ఎన్నికల్లో సంజయ్‌దత్ పోటీకి సుప్రీం ససేమిరాలోక్సభ ఎన్నికల్లో పోటీచేయాలని భావించిన బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కోరికపై దేశ అత్యున్నత న్యాయస్థానం నీళ్లు చల్లింది. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న సంజయ్‌దత్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయరాదంటూ కోర్టు ఆదేశించింది.Source: Yahoo! Telugu: News | 31 Mar 2009 | 9:37 am మళ్లీ తెరమీదకు వచ్చేందుకు 'ఆర్తీ' రెడీనువ్వు నాకు నచ్చావ్ అంటూ మెప్పించి అందాలరాముడుతో అలరించిన బొద్దుగుమ్మ ఆర్తీ అగర్వాల్ దాదాపు రెండేళ్లుగా తెలుగు తెరనుంచి మాయమైన సంగతి తెలిసిందే. ఎవో తెలియని కారణాలతో ఆత్మహత్యా ప్రయత్నం చేసి అటుపై అమెరికాకు...Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2009 | 7:31 am పంజాబ్ వద్ద రోడ్డు ప్రమాదం: 24 మంది మృతిపంజాబ్ వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 24 మంది మృతి చెందగా, మరో 65 మంది భక్తులు గాయపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నైనాదేవి ఆలయాన్ని సందర్శించి తిరిగి వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. అనేక మంది భక్తులు ట్రక్కులో వెళుతుండగా, పంజాబ్ పట్టణానికి సమీపంలోని అనందపూర్ సాహెబ్ వద్ద ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది.Source: జాతీయ | 31 Mar 2009 | 6:30 am వరుణ్‌కు బెయిల్ మంజూరైనా వీడని జైలు జీవితంభారతీయ జనతా పార్టీ తరపున పిలిభిత్ లోక్‌సభ స్థానం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్న వరుణ్ గాంధీకి రెండు కేసుల్లో స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆయనపై యూపీ ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టాన్ని (నాసా) ప్రయోగించడంతో ఇంకా జైలులోనే గడపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తనపై నాసా ప్రయోగించడాన్ని సవాల్ చేస్తూ ఆయన తరపు న్యాయవాదులు మంగళవారం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారు. మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వరుణ్ తీవ్ర సమస్యల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.Source: జాతీయ | 31 Mar 2009 | 6:13 am ఆచరణలో సామాజిక న్యాయం: చిరంజీవితమ పార్టీ సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపించామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాలవారి సంక్షేమానికి కృషి చేయడమే కాకుండా, సామాజిక పాలన అందిస్తామని ప్రకటించారు. సామాజికన్యాయాన్ని మిగతావారు మాటలకే పరిమితం చేస్తుంటే తాము మాత్రం దాన్ని అమలులో చూపామని ఆయన గుర్తుచేశారు. ఇప్పటివరకు ప్రజారాజ్యం ప్రకటించిన అభ్యర్ధుల జాబితాల్లో ఎక్కువశాతం బీసీలకు కేటాయించామని ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Mar 2009 | 6:08 am తెలంగాణాకు ప్రథమ శత్రువు వైఎస్: కేసీఆర్ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ప్రథమ శత్రువు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డేనని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్.. రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చేయాల్సిందంతా తాను చేశానని ఇక కొత్తగా వచ్చే పార్టీలు ఏం చేస్తాయంటూ వైఎస్ ప్రశ్నించడం హాస్యాస్పదం అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్ చేసినదానికంటే మేసిందే ఎక్కువంటూ ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 31 Mar 2009 | 6:04 am పాక్‌తో ద్వైపాక్షిక చర్చలు అసాధ్యం: మీనన్పొరుగు దేశం పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్యలు అసాధ్యమని కేంద్ర విదేశాగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ తెల్చి చెప్పారు. భారత్ డిమాండ్లపై పాక్ సానుకూలంగా స్పందించనంత వరకు ఆ దేశంతో ద్వైపాక్షిక చర్యలు అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ముంబై దాడులకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవడం.. ఈ దాడులకు, ఇంతకుముందటి దాడులకు కారకులైన పాక్‌లోని టెర్రరిస్టుల వ్యవస్థను నిర్మూలించనంత వరకు పాకిస్థాన్‌తో బహుళ ప్రయోజన చర్చలను పునఃప్రారంభించడం సాధ్యం కాదని ఆయన తెల్చి చెప్పారు.Source: జాతీయ | 31 Mar 2009 | 6:00 am ఉగ్రవాది కసబ్ న్యాయవాది నివాసంపై దాడిముంబై మారణహోమంలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ తరపున వాదించేందుకు కోర్టు నియమించిన న్యాయవాది అంజలీ వాఘ్మరే నివాసంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఫలితంగా ఆమె కసబ్ తరపు న్యాయవాది నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రజాభీష్టం మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంజలీ మంగళవారం వెల్లడించారు.Source: జాతీయ | 31 Mar 2009 | 5:12 am మోసగాళ్ళను నమ్మొద్దు: ముఖ్యమంత్రి విజ్ఞప్తివిపక్షాలవి మోసపూరితమైన వాగ్ధానాలని, అలాంటి మోసగాళ్లను నమ్మొద్దని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే సదరు పార్టీలను, వారి హామీలను తుంగలో తొక్కాలంటూ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌కు పట్టం కట్టకపోతే 108 వాహనాలు, రూ.2కే కిలో బియ్యం, ఉచిత విద్యుత్‌లాంటి సంక్షేమ పథకాలేవీ ఉండవంటూ ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Mar 2009 | 4:58 am కేరళలో తమిళ పులుల సంచారం: హై అలెర్ట్కేరళ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎల్టీటీఈ తీవ్రవాదులు సంచరిస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. తమిళ టైగర్లు రాష్ట్రంలోకి చొరబడ్డారని వార్తలు రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కేరళలో హై అలెర్ట్ ప్రకటించింది. ఎల్టీటీఈ తీవ్రవాదుల గ్రూపు ఒకటి రాష్ట్రంలోకి ప్రవేశించారనే అనుమానంతో సోమవారం పోలీసులు, నేవీ, తీరప్రాంత రక్షణ దళం సంయుక్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహించాయి.Source: జాతీయ | 31 Mar 2009 | 4:28 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2009 | 3:51 am మార్చి 31, 2009 కార్యక్రమాలుఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరం ...Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2009 | 3:49 am
|