వైట్‌హౌస్‌లో ప్రవేశించనున్న చిరు

ప్రముఖ సినీ నటుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వైట్‌హౌస్‌లోకి గృహప్రవేశం చేయనున్నారు. వివరాలలోకి వెళితే... రానున్న సార్వత్రిక ఎన్నికలలో చిరు తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అక్కడి ప్రజలకు అందుబాటులో ఉండడానికిగాను తిరుపతిలోని ఖాదీ కాలనీలో అధునాతన సౌకర్యాలు కలిగిన ఓ ఇంటిని బాడుగకు తీసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2009 | 11:48 am

పాక్ టెర్రర్‌కు 26/11తో పొంతన లేదు: హోం మంత్రి

పాకిస్థాన్‌లోని పోలీసు శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు జరిపిన దాడికి, ముంబై మారణహోమానికి ఎలాంటి సారూప్యత లేదని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు. లాహోర్ దాడికి, ముంబై దాడులకు సారూప్యం ఉందంటూ పాక్ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి రెహ్మాన్ మాలిక్ అన్నారు. దీనిపై చిదంబరం పైవ్యాఖ్యలు స్పందించారు.
Source: జాతీయ | 30 Mar 2009 | 11:44 am

పూర్తికావచ్చిన రోమియో షూటింగ్

రియల్‌స్టార్ శ్రీహరి ప్రధాన పాత్రలో, ఆర్యన్ రాజేష్, శ్రద్ధాఆర్య హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం రోమియో. సుధా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రామకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం...
Source: Yahoo! Telugu: Entertainment | 30 Mar 2009 | 11:35 am

ఏలేటి దర్శకత్వంలో 'ప్రయాణం' పూర్తి

ఐతే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. ఈయన ప్రస్తుతం ప్రయాణం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మనోజ్ కుమార్ హీరోగా, హారికను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న ఈ చిత్రాన్ని ఏలేటి స్వయంగా...
Source: Yahoo! Telugu: Entertainment | 30 Mar 2009 | 11:33 am

అర్చన ప్రధాన పాత్రలో తెరమీదకు 'సివంగి'

అచ్చ తెలుగు నటి అర్చన ప్రధాన పాత్రలో టి. కృష్ణ దర్శకత్వంలో వి.ఆర్.బాబు నిర్మించనున్న కొత్త చిత్రం సివంగి. తెలుగు క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం షూటింగ్‌ను ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించనున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Mar 2009 | 11:32 am

మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ భారీ పతనం

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సోమవారం నష్టాల బాటలో పయనించింది. 146 పాయింట్ల పతనంతో 9,902 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ను బ్యాకింగ్, లోహ, రియాల్టీ వాటాలు మరింత కుంగదీశాయి. రోజు గడిచేకొద్ది సెన్సెక్స్ పతనం కొనసాగుతూనే వచ్చింది.
Source: Yahoo! Telugu: News | 30 Mar 2009 | 11:13 am

లోక్‌‍సభ ఎన్నికలకు నటుడు గోవిందా దూరం

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటుడు గోవిందా ఈసారి లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని మాహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సోమవారం విలేకరులకు వెల్లడించారు. గత లోక్‌సభ
Source: Yahoo! Telugu: News | 30 Mar 2009 | 11:05 am

సెజ్‌ల పేరుతో భూములు స్వాహా: బాలయ్య

ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (సెజ్‌) పేరుతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని భూములన్నింటినీ తెగనమ్మిందంటూ సినీనటుడు, తెలుగుదేశం పార్టీ నేత బాలకృష్ణ విమర్శించారు. అందుకే వచ్చే ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మిగిలేది అంధకారమేనని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2009 | 10:53 am

"పొరుగు"తో ఎదురయ్యే ముప్పును ఎదుర్కొంటాం: ఆర్మీ

పొరుగు దేశాల నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు దేశ సైన్యం అన్ని వేళలా సర్వ సన్నద్ధంగా ఉందని ఆర్మీ వైస్- చీఫ్ లెప్టినెంట్ జనరల్ నోబెల్ తంబురాజ్ తెలిపారు. పాకిస్థాన్ నుంచి వచ్చే ఎటువంటి తీవ్రవాద ముప్పునైనా ఎదుర్కొనేందుకు భారత భద్రతా దళాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని చెప్పారు.
Source: జాతీయ | 30 Mar 2009 | 10:49 am

వరుణ్‌పై నాసా... చట్ట దుర్వినియోగమే: మేనక

బీజేపీ యువనేత, తన కుమారుడు వరుణ్‌గాంధీపై జాతీయ భద్రతా చట్టం (నాసా)ను ప్రయోగించడం దేశంలోని కఠిన చట్టాలను దుర్వినియోగపర్చడమేనని బీజేపీ ఎంపీ మేనకాగాంధీ పేర్కొన్నారు. ఈ తరహా నిర్ణయాలు దేశానికి చాలా ప్రమాదకరమని...
Source: Yahoo! Telugu: News | 30 Mar 2009 | 10:47 am

తెలంగాణాపై స్పష్టత లేని పార్టీలు: వెంకయ్య

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై రాష్ట్రంలోని ఏ ఒక్క రాజకీయ పార్టీలో స్పష్టత లేదని భారతీయ జనతా పార్టీ ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తెరాసకు అసలు విలువలు, సిద్ధాంతాలు లేవని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ విషయంలో తెరాసకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ పార్టీ అనైతిక పొత్తులకు సిద్ధం అయ్యేది కాదని వెంకయ్య దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2009 | 10:36 am

'ఉమ్మడి గుర్తు'లో విజయం సాధించిన పీఆర్పీ

ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి గుర్తు "గండం" నుంచి బయటపడింది. తాము మొదటి నుంచి కోరుతున్నట్టుగానే ఆ పార్టీకి 'రైలింజన్' గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. అలాగే జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని లోక్‌సత్తా పార్టీకి 'విజిల్' గుర్తును కేటాయించింది. ఈ రెండు పార్టీలు ఉమ్మడి గుర్తు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2009 | 10:28 am

పాక్ పోలీసు కేంద్రంపై దాడి: ఒక ఉగ్రవాది అరెస్ట్

పాకిస్థాన్‌లోని లాహూర్ నగరంలో ఉన్న ప్రధాన పోలీసు కేంద్రంపై ఉగ్రవాదులు సోమవారం అనూహ్యంగా జరిపిన దాడిలో పాల్గొన్న ఒకరిని భద్రతా దళాలు నిర్బంధించాయి. లాహోర్ సమీపంలోని మానవన్ పోలీసు శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు
Source: Yahoo! Telugu: News | 30 Mar 2009 | 10:27 am

పాక్ దాడికి 26/11తో సారూప్యం లేదు: చిదంబరం

పాకిస్థాన్‌లోని పోలీసు శిక్షణా కేంద్రంపై జరిగిన తీవ్రవాదుల దాడికి, ముంబయిపై గత ఏడాది నవంబర్‌లో జరిగిన దాడికి ఎలాంటి సారూప్యం లేదని కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు. లాహోక్ దాడికి, ముంబయి దాడులకు...
Source: Yahoo! Telugu: News | 30 Mar 2009 | 10:24 am

గంభీర్ భారత క్రికెట్‌లో రెండో గోడ: సెహ్వాగ్

న్యూజిలాండ్‌తో నేపియర్‌‍లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన టీం ఇండియా ఓపెనర్ గౌతం గంభీర్ భారత క్రికెట్‌లో "రెండో గోడ" అని జట్టు తాత్కాలిక కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో సుదీర్ఘ సమయం క్రీజ్‌లో
Source: Yahoo! Telugu: News | 30 Mar 2009 | 10:04 am

మియామీ ఓపెన్: ఫెదరర్, సెరెనా ముందంజ

విలియమ్స్ సోదరీమణులు, పురుషుల ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) ఇక్కడ జరుగుతున్న డబ్ల్యూటీఏ, ఏటీపీ హార్డ్‌కోర్ట్ టోర్నమెంట్ నాలుగో రౌండులోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే రెండో సీడ్ దినారా సఫీనా (రష్యా)కు
Source: Yahoo! Telugu: News | 30 Mar 2009 | 9:50 am

సెజ్‌ల పేరుతో కాంగ్రెస్ దోపిడీ: బాలకృష్ణ

సెజ్‌ల పేరుతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని భూములన్నింటినీ తెగనమ్మిందంటూ సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ విమర్శించారు. అందుకే వచ్చే ఎన్నికల తర్వాతకూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మిగిలేది అంధకారమేనని...
Source: Yahoo! Telugu: News | 30 Mar 2009 | 9:28 am

టికెట్లురాని వారికి న్యాయం చేస్తాం: బాబు హామీ

మహాకూటమిలో పొత్తుల కారణంగా పార్టీ తరపున ఈ ఎన్నికల్లో టికెట్లురాని వారిని తాము మర్చిపోమని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే టికెట్లురాని వారికి తగు విధంగా న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. పొత్తుల్లో భాగంగా సీట్లను త్యాగం చేసినవారి రుణం తీర్చుకోవడానికి తన జీవితం సరిపోదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2009 | 9:23 am

పథకాల పేరుతో దోచుకుంటున్న కాంగ్రెస్: చిరు

పథకాల పేరుతో అధికార కాంగ్రెస్ పార్టీ ధనార్జనకు పాల్పడుతోందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ధ్వజమెత్తారు. కోస్తా కారిడార్, సెజ్‌ల పేరుతో తన తనయుడికి, బంధువులకు ముఖ్యమంత్రి వైఎస్ రాష్ట్రాన్ని దోచి పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని అడ్డం పెట్టుకుని కార్పొరేట్ ఆస్పత్రులు, బీమా కంపెనీలు కోట్లు కూడబెడుతున్నాయని ఆయన విమర్శించారు. ఆరోగ్యశ్రీలాంటి పథకాలు కొందరు పేదలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని అయితే వీటి పేరుతో పెద్దలు మాత్రం అందినకాడికి దోచుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2009 | 9:13 am

ఏప్రిల్ 6న కసబ్‌ విచారణ: కొత్త లాయర్ నియామకం

ముంబయిపై జరిగిన తీవ్రవాదుల దాడుల్లో ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ అమిర్ కసబ్ కోసం ప్రత్యేక కోర్టు న్యాయవాదిని నియమించింది. కసబ్ కేసు ఏప్రిల్ ఆరున విచారణకు రానున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు నిర్ణయం ప్రకారం అంజలీ వాగ్మరే అనే ఈ లాయర్ కసబ్ తరపున విచారణకు హాజరుకానున్నారు.
Source: జాతీయ | 30 Mar 2009 | 8:25 am

తీవ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం: ఆర్మీ

పాకిస్థాన్ నుంచి ఎదురవుతున్న తీవ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు తాము అన్నివేళలా సిద్ధంగా ఉన్నామని ఆర్మీ వైస్- చీఫ్ లెప్టినెంట్ జనరల్ నోబెల్ తంబురాజ్ తెలిపారు. పాకిస్థాన్ నుంచి వచ్చే ఎటువంటి తీవ్రవాద ముప్పునైనా
Source: Yahoo! Telugu: News | 30 Mar 2009 | 8:20 am

తెలంగాణపై ఏపార్టీకీ స్పష్టత లేదు: వెంకయ్య

తెలంగాణ ఏర్పాటుపై రాష్ట్రంలోని ఏపార్టీకీ స్పష్టమైన విధానం లేదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. ఈ విషయంలో టీఆర్ఎస్‌కు అసలు విలువలు కూడా లేవని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ విషయంలో టీఆర్ఎస్‌కు ఏమాత్రం...
Source: Yahoo! Telugu: News | 30 Mar 2009 | 8:18 am

మెజారిటీపై అప్పుడే చెప్పలేం: దత్తాత్రేయ

రాష్ట్రంలో ప్రస్తుతం చతుర్ముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందనే విషయాన్ని అప్పుడే చెప్పలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. అయితే అవినీతి, అక్రమాలతో నిండిపోయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయాల్లో నైతిక విలువలు దిగజారిపోయాయన్నారు
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2009 | 7:51 am

"ప్లేబాయ్" బ్రాండ్ అంబాసిడర్‌గా మల్లికా?

బాలీవుడ్ సెక్సీతార, అందాల ముద్దుగుమ్మ మల్లికా షెరావత్ "ప్లే బాయ్" అనే పెర్‌ఫ్యూమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్లే బాయ్ కంపెనీ ప్రాడెక్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నటించేందుకు మల్లికా షెరావత్..
Source: వినోదం | 30 Mar 2009 | 7:46 am

జయ హో...అందరిదీ...ఏ.ఆర్.రెహ్మాన్

కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో హాలీవుడ్ చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్‌లోని జయ హో... పాటను అధికారికంగా తమ పార్టీకి ప్రచారాన్ని వాడుకుంటుండటంతో తానేమీ మాట్లాడలేనని జయ హో...పాట అందరిదీ అని ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ తెలిపారు.
Source: జాతీయ | 30 Mar 2009 | 7:41 am

యూపీఏలో "బ్లాక్ డే"ను పాటిస్తున్న భాజపా

పిలిభిత్ లోక్‌సభ స్థానం అభ్యర్థి వరుణ్ గాంధీపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించండాన్ని నిరశిస్తూ భారతీయ జనతా పార్టీ సోమవారం బ్లాక్‌ డేగా పాటిస్తోంది. ఆ పార్టీకి చెందిన యువ మోర్ఛా నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు గట్టి పోలీసు బందోబస్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Source: జాతీయ | 30 Mar 2009 | 6:32 am

నేటితో ముగియనున్న నామినేషన్ల ఘట్టం

తొలిదశ నామినేషన్ల దాఖలు ఘట్టం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. ఇప్పటి వరకు 1300 పై చిలుకు నామినేషన్లుల దాఖలు చేశారు. ఆఖరిరోజు కావడంతో ఈ సంఖ్య రెంట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్టు ఎన్నికల వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన అనేకమంది ఆఖరి రోజున నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2009 | 6:10 am

ప్రజారాజ్యానికి వీడని "ఉమ్మడి" గుర్తు చిక్కులు

ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు కేటాయింపు చిక్కులు ఇంకా వీడలేదు. ఉమ్మడి గుర్తు కేటాయించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా, ఎన్నికల సంఘం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల కాపీ శనివారం రాత్రి కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి చేరింది. ఈ ఆదేశాలను పరిశీలిస్తున్న ఈసీ తన నిర్ణయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆదివారం సెలవు దిన కావడంతో ముగ్గురు కమిషనర్లు ఒకచోట సమావేశం కాలేక పోయారు. దీంతో గుర్తు కేటాయింపుపై నిర్ణయం తీసుకోలేదు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2009 | 6:00 am

అలా జైల్లో కుదరదట

"భోజనం బాగోలేదంటూ అబ్బాయి ఉత్తరం రాశాడండీ" అంది సరోజ "అలాంటప్పుడు వేరే హోటల్‌కెళ్ళి తినొచ్చు కదా..?" అన్నాడు రాంజీ...
Source: వినోదం | 30 Mar 2009 | 5:57 am

హ్యాపీ బర్త్ డే టూ యూ

"మనముందర సీట్లో ఆయన మొట్ట మొదటి సారిగా.. విమానంలో ప్రయాణిస్తున్నాడనుకుంటా.." అంది సుజాత "ఎలా చెప్పగలవు...?" అడిగాడు...
Source: వినోదం | 30 Mar 2009 | 5:55 am

స్విస్ బ్యాంకు నల్లధనం వెలికి తీస్తాం: అద్వానీ

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల బినామీ (రహస్య) ఖాతాల్లో ఉన్న రూ.25 లక్షల కోట్ల నల్లధనాన్ని తిరిగి దేశానికి రప్పిస్తామని, తాము అధికారంలోకి వస్తే దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే అద్వానీ ప్రకటించారు. ఆయన ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం స్పిస్ బ్యాంకుల్లో ఉన్న తమ దేశ పౌరుల ఖాతాల సమాచారాన్ని బయటపెట్టాలని కోరింది. ఇదే విధంగా భారతీయుల బినామీ ఖాతాలను కూడా బయటపెట్టాలని జి- 20 సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డిమాండ్ చేయాలని అద్వానీ కోరారు.
Source: జాతీయ | 30 Mar 2009 | 5:04 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 30 Mar 2009 | 4:10 am

మార్చి 30, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ ...
Source: Yahoo! Telugu: Entertainment | 30 Mar 2009 | 4:08 am

వరుణ్ గాంధీపై నాసా చట్టం ప్రయోగం

భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వరుణ్ గాంధీపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం రాత్రి జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్ఎస్ఏ) ప్రయోగించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున వరుణ్ గాంధీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారనే ఆరోపణల కారణంగా వరుణ్‌పై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Source: జాతీయ | 30 Mar 2009 | 3:53 am

కాంగ్రెసే మా రాజకీయ ప్రధాన ప్రత్యర్థి: అద్వానీ

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి అని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఉద్ఘాటించారు. ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడితే ప్రధానమంత్రి పదవికి వీపీ.సింగ్ లాంటి అభ్యర్థిని సమర్థించడానికి వామపక్షాలతో మరోమారు చేతులు కలిపే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీయే భాజపా ప్రధాన రాజకీయ ప్రత్యర్థి. ఎందుకంటే కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని దెబ్బతీసేందుకే తాము ఇన్నేళ్లుగా పోరాడుతూ ఉన్నాం. దేశాన్ని రెండు పార్టీల వ్యవస్థగా మార్చేందుకు తాము కృషి చేస్తున్నాం. ఇక వామపక్షాలతో విభేదాలు సిద్ధాంతపరమైనవై అని ఆయన ఆదివారం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Source: జాతీయ | 30 Mar 2009 | 3:34 am

వరుణ్‌కు వీఐపీ వసతులు నిల్: జైలు సిబ్బంది

భారతీయ జనతా పార్టీ యువనేత, ఆ పార్టీ ఫిలిభిత్ లోక్‌సభ అభ్యర్థి వరుణ్ గాంధీకి ఎలాంటి వీఐపీ వసతులను కల్పించలేదని జైలు అధికారులు వెల్లడించారు. మైనారిటీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన వరుణ్‌ను స్థానిక కోర్టులో లొంగి పోయిన విషయం తెల్సిందే. అలా జైలుపాలైన వరుణ్ జైలు జీవితం 24 గంటలు ముగిసింది. సోమవారం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వరుణ్‌కు జైలులో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని, అయితే, ఇంటి ఆహారాన్ని మాత్రం అనుమతిస్తునట్టు చెప్పారు.
Source: జాతీయ | 29 Mar 2009 | 12:19 pm

ములాయం సింగ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్ అధికారితో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా ములాయంకు ఈసీ ఈ నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ములాయంకు ఈసీ నోటీసులు జారీ చేయడం విశేషం.
Source: జాతీయ | 29 Mar 2009 | 12:00 pm

మూడేళ్ళలో 10 లక్షల మందికి ఉపాధి: చిరు

తమ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చే మూడేళ్ళలో పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. అలాగే, తమ పార్టీతోనే సామాజికన్యాయం సాకారమవుతుందని ఆయన మరోమారు నొక్కివక్కాణించారు. పార్టీ అభ్యర్ధుల ఎంపికలోనే సామాజికన్యాయం పాటించడం ద్వారా పీఆర్పీ తన చిత్తశుద్ధిని రుజువు చేసిందని చిరంజీవి వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2009 | 11:57 am