వరుణ్‌కు వీఐపీ వసతులు నిల్: జైలు సిబ్బంది

భారతీయ జనతా పార్టీ యువనేత, ఆ పార్టీ ఫిలిభిత్ లోక్‌సభ అభ్యర్థి వరుణ్ గాంధీకి ఎలాంటి వీఐపీ వసతులను కల్పించలేదని జైలు అధికారులు వెల్లడించారు. మైనారిటీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన వరుణ్‌ను స్థానిక కోర్టులో లొంగి పోయిన విషయం తెల్సిందే. అలా జైలుపాలైన వరుణ్ జైలు జీవితం 24 గంటలు ముగిసింది. సోమవారం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వరుణ్‌కు జైలులో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని, అయితే, ఇంటి ఆహారాన్ని మాత్రం అనుమతిస్తునట్టు చెప్పారు.
Source: జాతీయ | 29 Mar 2009 | 12:19 pm

ములాయం సింగ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్ అధికారితో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా ములాయంకు ఈసీ ఈ నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ములాయంకు ఈసీ నోటీసులు జారీ చేయడం విశేషం.
Source: జాతీయ | 29 Mar 2009 | 12:00 pm

మూడేళ్ళలో 10 లక్షల మందికి ఉపాధి: చిరు

తమ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చే మూడేళ్ళలో పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తామనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. అలాగే, తమ పార్టీతోనే సామాజికన్యాయం సాకారమవుతుందని ఆయన మరోమారు నొక్కివక్కాణించారు. పార్టీ అభ్యర్ధుల ఎంపికలోనే సామాజికన్యాయం పాటించడం ద్వారా పీఆర్పీ తన చిత్తశుద్ధిని రుజువు చేసిందని చిరంజీవి వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2009 | 11:57 am

ఆ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తాం: రాఘవులు

మహాకూటమిలోని తెరాస సీపీఎంల మధ్య వివాదాస్పదంగా ఉన్న నాలుగు స్థానాల్లో తమ పార్టీ నామినేషన్లు దాఖలు చేస్తుందని సీపీఎం రాష్ట్ర శాఖ కార్యదర్శి రాఘవులు తెలిపారు. కూటమికి నాయకత్వం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యవర్గ అత్యవసర సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2009 | 11:50 am

పీఎంకే మంత్రుల రాజీనామాలకు ఆమోదం

పీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్బుమణి రాందాస్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వేలులు శనివారం రాజీనామాల చేసిన విషయం తెల్సిందే. యూపీఏ కూటమిలో కొనసాగిన ఈ మంత్రులిద్దరూ తమిళనాడుకు చెందిన పీఎంకేకు చెందినవారన్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి నుంచి పీఎంకే వైదొలిగిన కారణంగా రాందాస్, వేలులు తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
Source: జాతీయ | 29 Mar 2009 | 11:38 am

ప్రజారాజ్యంతోనే సామాజికన్యాయం: చిరు

ప్రజారాజ్యం పార్టీతోనే సామాజికన్యాయం సాకారమవుతుందని ఆ పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. పార్టీ అభ్యర్ధుల ఎంపికలోనే సామాజికన్యాయం పాటించడం ద్వారా పీఆర్పీ తన చిత్తశుద్ధిని రుజువు చేసిందని చిరంజీవి వ్యాఖ్యానించారు.
Source: Yahoo! Telugu: News | 29 Mar 2009 | 11:37 am

జూ.ఎన్టీఆర్‌ను పరామర్శించిన బాలకృష్ణ

రోడ్డు ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను సినీనటుడు, తెదేపా నేత బాలకృష్ణ ఆదివారం పరామర్శించారు. కడప, చిత్తూరు జిల్లాల్లో ఎన్నికల పర్యటన నిర్వహించేందుకు సిద్ధమైన బాలకృష్ణ దానికి ముందు ఎన్టీఆర్‌ను పరామర్శించేందుకు కిమ్స్‌కు వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2009 | 11:19 am

రాందాస్, వేలుల రాజీనామాలకు ఆమోదం

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్బుమణి రాందాస్, మరో కేంద్రమంత్రి వేలుల రాజీనామాలను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆదివారం ఆమోదించారు. యూపీఏ కూటమిలో కొనసాగిన ఈ మంత్రులిద్దరూ తమిళనాడుకు చెందిన పీఎంకేకు చెందినవారన్న సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 29 Mar 2009 | 10:57 am

యూపీఏలో దేశ భద్రతకు ముప్పు: జైట్లీ

ఇప్పటికే ప్రధాని మన్మోహన్ సామర్ధ్యంపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత ఇరుకున పెట్టే దిశగా యూపీఏ పాలనపై విమర్శనాస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ జైట్లీ సైతం మాట్లాడుతూ యూపీఏ పాలనలో జాతీయ భద్రత, ఆర్థికవ్యవస్థలు దుర్వినియోగం అయ్యాయంటూ దుయ్యబట్టారు.
Source: జాతీయ | 29 Mar 2009 | 10:31 am

కాంగ్రెస్‌ అధిష్టానంపై కోపం లేదు: పురంధేశ్వరి

కాంగ్రెస్ అధిష్టానం తనకు విశాఖపట్నం లోక్‌సభ కేటాయించడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. సీట్ల కేటాయింపులు జరిపేటప్పుడు ఒక్కోసారి కోరుకున్న స్థానాలు లభించకపోవడం అన్నది సహజమేనని ఆమె అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2009 | 10:16 am

జూనియర్‌ను పరామర్శించిన బాలయ్య

రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ ఆదివారం పరామర్శించారు. కడప, చిత్తూరు జిల్లాల్లో ఎన్నికల పర్యటన నిర్వహించేందుకు...
Source: Yahoo! Telugu: News | 29 Mar 2009 | 10:02 am

యూపీఏతో జాతీయ భద్రత దుర్వినియోగం: జైట్లీ

ఇప్పటికే ప్రధాని మన్మోహన్ సామర్ధ్యంపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత ఇరుకున పెట్టే దిశగా యూపీఏ పాలనపై విమర్శనాస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ జైట్లీ...
Source: Yahoo! Telugu: News | 29 Mar 2009 | 9:40 am

మంత్రి పదవులకు అన్బుమణి, వేలు రాజీనామా

పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)కు చెందిన కేంద్ర మంత్రులు అన్బుమణి రాందాస్, ఆర్.వేలులు తమ మంత్రి పదవులకు శనివారం రాజీనామా చేశారు. ఎన్నికల పొత్తుల్లో భాగంగా పీఎంకే జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమితో పొత్తు పెట్టుకుంది. ఫలితంగా వారిద్దరు తమ మంత్రి పదవుల నుంచి తప్పుకున్నారు. వీరిద్దరు స్వయంగా ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి, తమ రాజీనామా పత్రాలను సమర్పించారు.
Source: జాతీయ | 29 Mar 2009 | 9:36 am

కాంగ్రెస్‌కు పట్టం కట్టండి: వైఎస్ విజ్ఞప్తి

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి, తమకు మరోసారి పట్టం కట్టాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో తొమ్మిదేళ్లపాటు రైతులకు చంద్రగ్రహణం పడితే తమ హయాంలోని ఐదేళ్లలో రైతులకు రాజయోగం పట్టిందంటూ ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2009 | 9:22 am

విశాఖస్థానంపై అసంతృప్తి లేదు: పురందరేశ్వరి

కాంగ్రెస్ అధిష్టానం తనకు విశాఖపట్నం లోక్‌సభ కేటాయించడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు. సీట్ల కేటాయింపులు జరిపేటప్పుడు ఒక్కోసారి కోరుకున్న స్థానాలు లభించకపోవడం అన్నది...
Source: Yahoo! Telugu: News | 29 Mar 2009 | 9:18 am

నేపియర్ టెస్టును కాపాడుకుంటాం: లక్ష్మణ్

ఫాలోఆన్ ఆడుతున్నప్పటికీ నేపియర్ టెస్టును కాపాడుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తామని భారత బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. గతంలో ఈ తరహా స్థితికి వచ్చినా టెస్టులను కాపాడుకున్న ఘనత భారత్‌కు ఉందని లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు.
Source: Yahoo! Telugu: News | 29 Mar 2009 | 8:34 am

ఫోఖ్రాన్‌లో బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష

ఫోఖ్రాన్‌లో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్షను ఆదివారం నిర్వహించారు. ఫోఖ్రాన్‌లోని ఛాందన్ ఫైరింగ్ రేంజ్ నుంచి ఈ పరీక్ష నిర్వహించినట్టు డైరక్టరేట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను చేధించగల ఈ క్షిపణి ప్రయోగం ఆదివారం ఉదయం 11.15 నిమిషాల ప్రాంతంలో నిర్వహించారు. భోజాసార్ గ్రామంలోని ఛాందన్ ఫైరింగ్ రేంజ్ నుంచి అజాసర్‌లోని లక్ష్యాలపై ప్రయోగించారు.
Source: జాతీయ | 29 Mar 2009 | 8:15 am

చర్చల పునఃప్రారంభానికి కృషి: జర్ధారీ

పొరుగుదేశం భారత్‌తో నిలిచిపోయిన చర్చలు పునఃప్రారంభంకావాలని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసీఫ్ అలీ జర్ధారీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ పునఃప్రారంభం అయ్యేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 29 Mar 2009 | 7:30 am

వరుణ్ గాంధీకి శ్రీరామ్ సేన మద్దతు

మతోద్రేకాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి జైలుపాలైన భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీకి శ్రీరామ్ సేన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫిలిభిత్‌ లోక్‌సభకు భాజపా తరపున పోటీ చేస్తున్న వరుణ్ గాంధీ మైనార్టీలకు వ్యతిరేక వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో చిక్కుకున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయడంతో కోర్టు ఎదుట లొంగిపోయి, జైలు పాలయ్యాడు. ఈ నేపథ్యంలో వరుణ్ గాంధీకి భాజపా నుంచి ఆశించిన మద్దతు లభించక పోయినప్పటికీ శ్రీరామసేన అండగా నిలిచింది.
Source: జాతీయ | 29 Mar 2009 | 7:18 am

కాంగ్రెస్, డీఎంకేల మధ్య సీట్ల సర్ధుబాటు ఖరారు

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకేకు దాని మిత్రపక్షం కాంగ్రెస్‌కు మధ్య సీట్ల సర్ధుబాటు ప్రక్రియ పూర్తయ్యింది. తమిళనాడు, పుదుచ్చేరిలో ఉన్న మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో డీఎంకే 21, కాంగ్రెస్ 16, మరో...
Source: Yahoo! Telugu: News | 29 Mar 2009 | 7:08 am

3న పాలకొల్లు, 4న తిరుపతిలో చిరు నామినేషన్‌

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి చిరంజీవి పోటీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తిరుపతి నుంచి చిరు పోటీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. రెండో స్థానంగా పాలకొల్లును ఎంచుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2009 | 6:49 am

విజయశాంతికి మెదక్ స్థానం ఖరారు

కొత్తగా పార్టీ తీర్ధం పుచ్చుకున్న విజయశాంతికి మెదక్ లోక్‌సభ స్థానాన్ని ఖరారు చేస్తూ టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటన చేసింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి విజయశాంతిని బరిలో దించనున్నట్టు తొలుత ప్రకటించిన టీఆర్ఎస్ వర్గాలు...
Source: Yahoo! Telugu: News | 29 Mar 2009 | 6:39 am

ప్రధాని మన్మోహన్‌తో భేటీ కానున్న ఒబామా

వచ్చే నెల 2న లండన్‌లో జరగనున్న జీ-20 సదస్సుకు విచ్చేయనున్న సందర్భంగా భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లో పెట్రేగిపోతున్న తీవ్రవాదంపై అంతర్జాతీయంగా...
Source: Yahoo! Telugu: News | 29 Mar 2009 | 6:25 am

కాంగ్రెస్-డీఎంకేల మధ్య సీట్ల సర్దుబాటు

తమిళనాడు రాష్ట్రంలో అధికార డీఎంకే, మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ముగిసింది. తమిళనాడు, పుదుచ్చేరిలో ఉన్న మొత్తం 40 (39+1) పార్లమెంట్ స్థానాల్లో డీఎంకే 21 సీట్లలో, కాంగ్రెస్ 16 చోట్ల మరో మిత్రపక్షం దళిత్ పాంథర్స్ అసోసియేషన్ (డీపీఐ) రెండు సీట్లలో, మరో పార్టీ ఐయూఎంఎల్‌కు ఒక స్థానాన్ని కేటాయించారు. పుదుచ్చేరిలోని ఏకైక స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకే కేటాయించారు. ఈ మేరకు కుదిరిన ఒప్పందంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ సమక్షంలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు కెవీ.తంగబాలు సంతకాలు చేశారు.
Source: జాతీయ | 29 Mar 2009 | 5:49 am

మార్చి 29, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా 15.00 అభిరుచి 15.30 ఈనాడు సినిమా ...
Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2009 | 5:27 am

యూపీఏ వైఫల్యాలే మా అస్త్రాలు: రాజ్‌నాథ్

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలే తమ ప్రచార అస్త్రాలని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. యూపీఏ ప్రజా వ్యతిరేక విధానాలను తమకు అనుకూలంగా మలుచుకుంటామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో యూపీఏ పూర్తిగా విఫలమైందని, ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు మండిపోతున్నాయని ఇదే మా ఎన్నికల ప్రధాన అస్త్రం అని చెప్పారు.
Source: జాతీయ | 29 Mar 2009 | 5:25 am

ఈ వారం


Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2009 | 5:25 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2009 | 5:23 am

వరుణ్ అరెస్టు వెనుక అద్వానీ కుట్ర: కాంగ్రెస్

భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీ అరెస్టు వెనుక ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వరుణ్ పిలిభిత్ కోర్టులో స్వచ్ఛందంగా లొంగి పోయేందుకు వచ్చినపుడు హైడ్రామా నెలకొంది. ఈ డ్రామా ఎపిసోడ్‌కు అద్వానీ పథక రచన చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ పేర్కొన్నారు. దీనిపై ఆయన శనివారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ అద్వానీ అమోదముద్ర లేకుండా వరుణ్ కోర్టులో లొంగి పోయే అవకాశం లేదన్నారు.
Source: జాతీయ | 28 Mar 2009 | 3:39 pm

కోలుకుంటున్న ఎన్టీఆర్: పర్యటన అనుమానమే

రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల పర్యటనలో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. ఆయన కోలుకునేందుకు నాలుగు నుంచి ఆరు వారాలు పడుతుందని కిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రమాదంలో వెన్నుపూసకు తగిలిన గాయం వల్ల ఆయన నడవడానికి, కూర్చోవడానికి సమయం తీసుకుంటుందని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Mar 2009 | 1:43 pm

తెరాస లోక్‌సభ అభ్యర్థులు వీరే

మహాకూటమిలో తెలంగాణా రాష్ట్ర సమితి వాటాగా వచ్చిన తొమ్మిది లోక్‌సభ సీట్లకు గాను తెరాస అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తెరాస అధినేత ఈ దఫా మహబూబ్‌నగర్ నుంచి బరిలోకి దిగుతుండగా, ఆయన కుమారుడు కె.టీ.రామారావు కరీంనగర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే సినీ నటి విజయశాంతి మెదక్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Mar 2009 | 1:40 pm