కోలుకుంటున్న ఎన్టీఆర్: పర్యటన అనుమానమే

రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల పర్యటనలో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. ఆయన కోలుకునేందుకు నాలుగు నుంచి ఆరు వారాలు పడుతుందని కిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రమాదంలో వెన్నుపూసకు తగిలిన గాయం వల్ల ఆయన నడవడానికి, కూర్చోవడానికి సమయం తీసుకుంటుందని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Mar 2009 | 1:43 pm

తెరాస లోక్‌సభ అభ్యర్థులు వీరే

మహాకూటమిలో తెలంగాణా రాష్ట్ర సమితి వాటాగా వచ్చిన తొమ్మిది లోక్‌సభ సీట్లకు గాను తెరాస అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తెరాస అధినేత ఈ దఫా మహబూబ్‌నగర్ నుంచి బరిలోకి దిగుతుండగా, ఆయన కుమారుడు కె.టీ.రామారావు కరీంనగర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే సినీ నటి విజయశాంతి మెదక్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Mar 2009 | 1:40 pm

సోనియా, రాహుల్ రోడ్ షోలు నిర్వహించకండి: ఇంటెలిజెన్స్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ సందడి నెలకొని ఉంది. ఇందులో భాగంగా రాజకీయ ప్రముఖులు, చిన్న-పెద్ద నాయకులు కూడా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రముఖ నాయకులైన సోనియా, రాహుల్ గాంధీలు చేస్తున్న రోడ్ షోలను విరమించాలని ప్రత్యేక భద్రతా దళాలు సూచిస్తున్నాయి. సోనియా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఇరువురు రోడ్ షోలలో పాల్గొనే సమయంలో ఏదైనా ప్రాంతంలో ఆత్మాహుతి దాడులు జరగవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వారి భద్రతను చేపట్టడంలో ప్రత్యేక భద్రతా దళాలకు(ఎస్‌పీజీ) చాలా కష్టంతో కూడుకున్న పని అనికూడా సూచిస్తున్నారు.
Source: జాతీయ | 28 Mar 2009 | 1:25 pm

ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో లేను: దేవెగౌడ

దేశ ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో తాను లేనని జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ మరోమారు స్పష్టం చేశారు. దేశ రాజకీయ చిత్రపటంలో కొత్తగా ఆవిర్భవించిన తృతీయ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన గౌడ.. శనివారం మాట్లాడుతూ ప్రధాని పదవిలో తాను లేనని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లోని మూడో కూటమికి చెందిన నేతలు, కార్యకర్తలు, మిత్రులు, మద్దతుదారులు ఈ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 28 Mar 2009 | 1:00 pm

వరుణ్‌‌కు రెండు రోజుల జ్యుడిషియల్ కస్టడీ

మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ యువనేత వరుణ్ గాంధీకి పిలిబిత్ స్థానిక కోర్టు రెండు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. వరుణ్ గాంధీ శనివారం స్వచ్ఛందంగా కోర్టు ముందు...
Source: Yahoo! Telugu: News | 28 Mar 2009 | 12:23 pm

84 అల్లర్ల కేసులో క్లీన్ చిట్: సీబీఐ వర్గాలు

దేశ రాజధాని న్యూఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగదీష్ టైట్లర్‌కు క్లీన్ చిట్ లభించనుంది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పేర్కొన్నట్టు ఆ వర్గాల సమాచారం.
Source: జాతీయ | 28 Mar 2009 | 12:12 pm

పోలీసులు అదుపులో తమ్మినేని గన్‌మెన్

లక్షలాది రూపాయల డబ్బుతో కారులో వెళుతున్న ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం గన్‌మెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, తమ్మినేనికి చెందినవిగా భావిస్తున్న రెండు కార్ల నుంచి సుమారు తొమ్మిది లక్షల రూపాలను స్వాధీనం చేసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Mar 2009 | 12:10 pm

రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో ఏప్రిల్ 23న జరగనున్న రెండో విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 16న తొలివిడత ఎన్నికలు జరగుతుండగా, ఏప్రిల్ 23న రెండో విడత ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. రెండో విడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 20 లోక్‌సభ, 140 శాసనసభ నియోజక వర్గాలకు పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి వెలువడుతున్న నోటిఫికేషన్‌లో భాగంగా శనివారం నుంచి ఏప్రిల్ 4 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Mar 2009 | 12:10 pm

ప్రధాని అభ్యర్ధి రేసులో లేను: గౌడ స్పష్టం

మూడో ఫ్రంట్ తరపున తాను ప్రధాని అభ్యర్ధి రేసులో లేనని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే మూడో ఫ్రంట్‌కు సంబంధించి ప్రధాని పదవికి సంబంధించిన అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం...
Source: Yahoo! Telugu: News | 28 Mar 2009 | 12:10 pm

ద్వితీయ జాబితాలో మహిళలకు స్థానం: చిరు

తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ద్వితీయ జాబితాలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. తాము మొదటి నుంచి చెప్పినట్టుగానే తొలి జాబితా సందర్భంగా సామాజికన్యాయాన్ని సింహ భాగం పాటించామని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 28 Mar 2009 | 12:10 pm

మారణహోమాన్ని అడ్డుకునే 'మనోరమ'

ఓ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని దానిచుట్టూ కథను అల్లే తరహా సినిమాలు మన తెలుగులో ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటున్నాయి. అలాంటి కోవలోనే తాజాగా ఛార్మి ప్రధాన పాత్రలో వచ్చిన మనోరమ సినిమాను కూడా చెప్పవచ్చు. జీ మోషన్...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Mar 2009 | 12:06 pm

టీడీపీతో సీపీఐ సీట్ల సర్ధుబాటు ఖరారు

మహాకూటమిలో భాగంగా టీడీపీతో సీపీఐ తన సీట్ల సర్ధుబాటును ఎట్టకేలకు పూర్తి చేసింది. ఇందులో భాగంగా సీపీఐకు 14 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లు కేటాయించేందుకు టీడీపీ సిద్ధమైంది.
Source: Yahoo! Telugu: News | 28 Mar 2009 | 12:01 pm

సత్యం రామలింగరాజు కేసు వాయిదా

సత్యం కంప్యూటర్స్ మాజీ ఛైర్మన్ రామలింగరాజు కేసుకు సంబంధించిన విచారణను నాంపల్లి కోర్టు ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసింది. రాజుకు సత్యశోధన పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ శనివారం...
Source: Yahoo! Telugu: News | 28 Mar 2009 | 11:56 am

వచ్చేవారంలో సెన్సెక్స్ సూచీ తగ్గే అవకాశం

వచ్చే వారం స్టాక్ మార్కెట్‌లో లాభాల శాతం తగ్గొచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవైపు ఇప్పటికే ఆర్థిక మాంద్యం ప్రభావం, మరోవైపు ఏప్రిల్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలు వెరసి వీటి ప్రభావం వచ్చే వారం స్టాక్ మార్కెట్‌పై పడే అవకాశాలున్నాయని ఆ...
Source: Yahoo! Telugu: News | 28 Mar 2009 | 11:33 am

మియామీ ప్రీ-క్వార్టర్స్‌లో సానియా, పేస్

మియామీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ జెక్ రిపబ్లిక్‌కు చెందిన లూకాస్ డ్లౌహీల జోడీ ప్రీ-క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. తొలి రౌండులో చీలీ జోడీ అయిన ఫెర్నాండో గొంజాలెజ్, జువాన్...
Source: Yahoo! Telugu: News | 28 Mar 2009 | 11:33 am

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

రానున్న ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో నిలవనున్న అభ్యర్ధులకు సంబంధించిన మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ శనివారం విడుదల చేసింది. ఈ జాబితాలో బాగంగా లోక్‌సభకు పోటీ చేస్తున్న 22మందిని, అసెంబ్లీకి పోటీచేస్తున్న 55మందిని పార్టీ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 28 Mar 2009 | 11:23 am

సైనా ఇంటికి: జ్వాలా, దిజులు సెమీస్‌కు

యోనెక్స్ సన్‌రైజ్ ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ స్టార్ సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. ఈ టోర్నీ క్వార్టర్స్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ సైనా.. మలేషియాకు చెందిన జూలియా పీ క్సియాన్ వాంగ్ చేతిలో...
Source: Yahoo! Telugu: News | 28 Mar 2009 | 9:49 am

పాప్ స్టార్ మరియా ప్రెగ్నెంటా!?

ప్రముఖ పాప్ స్టార్ మరియా కారే గర్భం ధరించినట్లు న్యూయార్క్ డైలీ వెల్లడించింది. 200,000 డాలర్ల విలువైన ఫర్నిచర్‌ను ఓ చిల్డ్రన్స్ స్టోర్‌లో మరియా కొనిందని, ఆమె త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుందనే వార్తలు సినీ వర్గాల్లో షికార్లు చేస్తున్నాయని న్యూయార్క్ డైలీ వెల్లడించింది. హాలీవుడ్ "హీరో" సినిమా గాయకుడు నిక్ కానాన్‌ను వివాహమాడిన కారే, ఇటీవల శాన్‌ఫ్రావిన్స్‌స్కోలోని ఓ చిల్డ్రన్స్ స్టోర్‌లో చిన్ని పాపాయి ఉపయోగించే ఫర్నిచర్ వంటి తదితర వస్తువులను కొనుగోలు చేసింది.
Source: వినోదం | 28 Mar 2009 | 9:20 am

వరుణ్‌కు రెండు రోజుల జ్యుడిషియల్ కస్టడీ

మతోద్రేకాన్ని రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పిలిభిత్ లోక్‌సభ స్థానం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వరుణ్ గాంధీని రెండు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి స్థానిక కోర్టు పంపింది. తనపై నమోదు చేసిన క్రిమినల్ కేసును ఉపసంహరించాలని కోరుతూ అలహాబాద్ కోర్టులో దాఖలు చేసుకున్న పిటీషన్‌ను కోర్టు కొట్టి వేసింది. దీంతో ఆయన శనివారం కోర్టులో స్వచ్ఛంధంగా లొంగి పోయారు.
Source: జాతీయ | 28 Mar 2009 | 8:30 am

మానవత్వాన్ని తట్టిలేపే "మనోరమ"

నటీనటులు.. ఛార్మి, నిషాల్, శ్రీధరరావు, ప్రదీప్, లహరి, సునయన, నిర్మాత.. గోయెంకా, కథ, స్క్రీన్‌ప్లేస దర్శకత్వం.. ఈశ్వరరెడ్డి, పతాకం. జీ మోషన్ పిక్చర్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. సురేష్. పాయింట్.. మతం పేరుతో జరుగుతున్న మారణహోమంతో, మానవ మనుగడకు ఎలాంటి ప్రమాదం కలుగుతుందన్నదే...
Source: వినోదం | 28 Mar 2009 | 8:18 am

ఎన్టీఆర్ కోలుకోవడానికి మరిన్ని రోజులు: డాక్టర్లు

సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి మరిన్ని రోజుల సమయం పడుతుందని కిమ్స్ వైద్యులు ప్రకటించారు. దాదాపు నాలుగువారాలు తర్వాతే ఆయన పూర్తిగా కోలుకోగలరని, అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని వారు పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 28 Mar 2009 | 7:45 am

రెండో జాబితాలో మహిళలకు స్థానం: చిరు

తమ పార్టీ తరపున వెలువడే రెండో జాబితాలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. తాము మొదటినుంచి చెప్పినట్టుగానే తొలి జాబితా సందర్భంగా సామాజికన్యాయాన్ని పాటించామని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 28 Mar 2009 | 7:33 am

పీఎంకేకు ఏడు లోక్‌సభ సీట్లు: జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమిలో తాజాగా చేరిన పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)కు ఏడు లోక్‌సభ సీట్లను కేటాయించారు. ఈ మేరకు జయలలిత శనివారం ఒక అధికారపూర్వక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడులోని 39 లోక్‌సభ సీట్లలో ఆరింటిని, పుదుచ్చేరిలో ఉన్న ఏకైక పార్లమెంట్ స్థానాన్ని పీఎంకేకు కేటాయించారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీ ఒక కొలిక్కి వచ్చింది.
Source: జాతీయ | 28 Mar 2009 | 7:04 am

రాష్ట్రంలో హంగ్ తప్పదు: వెంకయ్య జోస్యం

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ తప్పదని బీజేపీ జాతీయ కార్యదర్శి ఎం. వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. అదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలోని సర్కారు ఏర్పడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్‌గిరిలో శుక్రవారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి అధికారం అని పేర్కొన్నారు
Source: ఏపీ న్యూస్ | 28 Mar 2009 | 6:51 am

నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్

రాష్ట్రంలో ఏప్రిల్ 23న జరగనున్న రెండో విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది. రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 16న తొలివిడత ఎన్నికలు జరగనుండగా, ఏప్రిల్ 23న రెండో విడత ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. రెండో విడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 20 లోక్‌సభ, 140 శాసనసభ నియోజక వర్గాలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి వెలువడుతున్న నోటిఫికేషన్‌లో భాగంగా శనివారం నుంచి ఏప్రిల్ 4వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు
Source: ఏపీ న్యూస్ | 28 Mar 2009 | 6:22 am

సోనియా కనుసన్నల్లో ప్రధాని విధులు: అద్వానీ

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని భారతీయ జనతా పార్టీ ఎల్కే.అద్వానీ ఆరోపించారు. ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఆయన మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్డీయే అధికారంలోకి వస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి లోక్‌సభకు ఎన్నికయ్యే సభ్యుడే ప్రధాని పదవి చేపట్టేలా రాజ్యాంగ సవరణ చేస్తామని అద్వానీ ప్రకటించారు.
Source: జాతీయ | 28 Mar 2009 | 5:32 am

నచ్చితే జీతం పుచ్చుకుందామనీ...!

"ఒకటో తారీఖున మా అబ్బాయి, మీ అమ్మాయిని చూసేందుకు వస్తాడులేండీ" చెప్పాడు వరుడి తండ్రి "ఆరోజే ఎందుకండీ...?" అడిగాడు..
Source: వినోదం | 28 Mar 2009 | 5:05 am

రాలిపోతున్నాయన్న దిగులుతోనే..!

"మీ తల వెంట్రుకలు ఎలా రాలిపోయాయి..?" అడిగాడు రాజేష్ "దిగులుతో" చెప్పాడు దయాకర్ "దిగులు దేనికి..?"...
Source: వినోదం | 28 Mar 2009 | 5:04 am

సర్వీస్ కమిషన్‌లలోనూ రాజకీయం: సుప్రీం

పబ్లిక్ సర్వీసు కమిషన్లు వంటి సంస్థల్లోనూ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. పబ్లిక్ సర్వీసు కమిషన్లులాంటి అత్యున్నత సర్వీసుల్లోనూ రాజకీయాల వల్లే ప్రతిభ ఉన్న అభ్యర్ధులు ప్రైవేటు ఉద్యోగాల్లోకి వెళ్లిపోతున్నారంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. బీహార్ పశుసంవర్థకశాఖలో 1991లో జరిగిన అక్రమ నియామకాలకు సంబంధించిన కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేయడం విశేషం.
Source: జాతీయ | 28 Mar 2009 | 3:50 am

నేడు స్వచ్ఛంద అరెస్టుకు వరుణ్ సిద్ధం

మతోద్రేక ప్రసంగాలతో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న బీజేపీ యువ నేత వరుణ్‌గాంధీ శనివారం స్వచ్ఛందంగా అరెస్టు అవ్వాలని నిర్ణయించుకున్నారు. క్రిమినల్ కేసుల నేపథ్యంలో తప్పించుకోవడానికి వీలులేని పరిస్థితి తలెత్తడంతో స్వచ్ఛందంగా లొంగిపోవడానికే నిర్ణయించుకున్న వరుణ్‌గాంధీ ముందస్తు బెయిల్‌ను సైతం విరమించుకోవడం గమనార్హం. స్వచ్ఛంద అరెస్టుకు సంబంధించి శనివారం ఉదయం దాదాపు 11 గంటల ప్రాంతంలో వరుణ్ ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌కు వెళ్లి అక్కడి కలెక్టర్ ముందు అరెస్టు కానున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 28 Mar 2009 | 3:50 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 28 Mar 2009 | 3:29 am

మార్చి 28, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 న్యూ సినిమా స్పెషల్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 నీపేరేనా ప్రేమ 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమా ...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Mar 2009 | 3:26 am

అనకాపల్లినుంచి పోటీ చేయనున్న అల్లు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ పోటీ చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ప్రజారాజ్యం పార్టీ అధినేత శుక్రవారం ఉదయం తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. గతంలోనే అల్లు అరవింద్ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న విషయం తెలిసిందే.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2009 | 3:28 pm

ఎన్టీఆర్‌కు మెరుగైన చికిత్స: కిమ్స్ వైద్యులు

తెలుగుదేశం పార్టీ తరపున గత కొద్ది రోజులుగా ప్రచారంలో పాల్గొన్న, జూనియర్ ఎన్టీఆర్ గురువారం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గాయపడి చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ త్వరలో కోలుకుంటారని కిమ్స్ వైద్యులు శుక్రవారం వెల్లడించారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, పది రోజుల్లో ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లవచ్చునని వారు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2009 | 1:43 pm

మొరాదాబాద్ నుంచి పోటీ చేయనున్న అజహర్

హైదరాబాదీ క్రికెటర్ మాజీ కెప్టెన్ ముహమ్మద్ అజహరుద్దీన్ ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి లోకసభకు పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తొలుత ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయించడానికి అజహర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనకు టికెట్ లభించలేదు. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఏదైనా ఒక స్థానం నుంచి ఆయనను బరిలోకి దింపే ఆలోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. నేషనల్ ఫిగర్ కాబట్టి ఇతనిని ఎక్కడినుంచైనాకూడా పోటీ చేయించవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Source: జాతీయ | 27 Mar 2009 | 1:40 pm

జేడ్ గూడీ స్లీపింగ్ బ్యూటీ: జాకీ

హాలీవుడ్ నటి, తన కుమార్తె జేడ్ గూడీ స్లీపింగ్ బ్యూటీ అని ఆమె తల్లి జాకీ బడెన్ వెల్లడించింది. గూడీ అంతిమ యాత్రలో ఆమెను పెళ్లికూతురిగా ముస్తాబు చేశామని, తెల్లటి డ్రస్‌లో దేవతలా, నిద్రించే అందాన్ని చూసి నివ్వెర పోయానని జాకీ తెలిపింది. తన కూతురు అల్పాయుష్షుతో లోకాన్ని విడిచి వెళ్లిపోవడం తననెంతో కలచివేసిందని జాకీ ఆందోళన వ్యక్తం చేసింది.
Source: వినోదం | 27 Mar 2009 | 12:27 pm

బెయిల్ పిటీషన్ ఉపసంహరించుకున్న వరుణ్ గాంధీ

భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వరుణ్ గాంధీ శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ను కోరుతూ వరుణ్ దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. దానిని ఉపసంహరించుకోవాలని వరుణ్ గాంధీ నిర్ణయించుకున్నారు.
Source: జాతీయ | 27 Mar 2009 | 12:15 pm

మాజీ ప్రియుడితో మళ్లీ తెరపైకి బిపాసా!

ఈ మధ్య మాజీ ప్రియులతో సినీతారలు చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఫ్యాషనైంది. తాజాగా మాజీ ప్రియుడు దినో మోరియాతో, సెక్సీతార, బిపాసా బసు మళ్లీ తెరపై కన్పించబోతోంది. 2002 సంవత్సరం మధ్యలో దినో మోరియాతో బిపాసా బసు ప్రేమాయణం కొనసాగిస్తోందని వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు.. వారిద్దరి మధ్య సరస సల్లాపాలు కూడా జరిగిపోయాయని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేశాయి.
Source: వినోదం | 27 Mar 2009 | 12:10 pm