బెయిల్ పిటీషన్ ఉపసంహరించుకున్న వరుణ్ గాంధీ

భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వరుణ్ గాంధీ శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ను కోరుతూ వరుణ్ దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. దానిని ఉపసంహరించుకోవాలని వరుణ్ గాంధీ నిర్ణయించుకున్నారు.
Source: జాతీయ | 27 Mar 2009 | 12:15 pm

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 45 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం లాభాల బాటలో పయనించింది. 34 పాయింట్ల వృద్ధితో 10,037 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం ఒకానొక దశలో 10127 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఆపై గరిష్ట స్థాయి నుంచి 2214 పాయింట్లు
Source: Yahoo! Telugu: News | 27 Mar 2009 | 11:44 am

జూనియర్‌ను పరామర్శించిన హరికృష్ణ

కారు ప్రమాదానికి గురై ప్రస్తుతం కిమ్స్‌లో చికిత్స పొందుతున్న సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆయన తండ్రి హరికృష్ణ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ తన తోబుట్టువులు, తండ్రి ఎన్టీఆర్ ఆశీసులతోపాటు...
Source: Yahoo! Telugu: News | 27 Mar 2009 | 11:34 am

ఉగాదివేళ పార్టీకి శుభవార్త: చిరంజీవి

తమ పార్టీ అభ్యర్ధులకు ఉమ్మడి గుర్తు లభించడం ఉగాది పండుగవేళ తమకు వినిపించిన శుభవార్తగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. ఉగాదివేళ తమకు లభించిన ఈ విజయం సాక్షిగా వచ్చే ఎన్నికల్లోనూ ప్రజారాజ్యం విజయం...
Source: Yahoo! Telugu: News | 27 Mar 2009 | 11:05 am

పాక్ మసీదుపై బాంబు దాడి: 45 మంది మృతి

పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో శుక్రవారం ఓ మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 45 మందికిపైగా మృతి చెందారు. శుక్రవారం ప్రార్థనలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. దాడిలో అనేక మంది గాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 27 Mar 2009 | 11:03 am

హిందువులకు వ్యతిరేకంగా కుట్ర: థాక్రే

దేశంలో హిందువులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని శివసేన అధినేత బాల్‌థాక్రే అభిప్రాయపడ్డారు. ఇలాంటి కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్క హిందూ పౌరుడు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల అనంతరం ఢిల్లీ ఎర్రకోటపై కాషాయ జెండాను ఎగురవేయాలని ఆయన హిందువులకు విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 27 Mar 2009 | 11:03 am

ఎనిమిది మందితో టీఆర్ఎస్ నాలుగో జాబితా

తమ పార్టీ తరపున బరిలో దిగనున్న అభ్యర్ధులకు సంబంధించిన నాలుగో జాబితాను టీఆర్ఎస్ శుక్రవారం విడుదల చేసింది. టీఆర్ఎస్ విడుదల చేసిన ఈ నాలుగో జాబితాలో ఎనిమిదిమంది చోటు సంపాదించారు.
Source: Yahoo! Telugu: News | 27 Mar 2009 | 10:46 am

అంబర్ చెస్ టోర్నమెంట్ విజేత అరోనియన్

ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఇక్కడ జరిగిన 18వ అంబర్ బ్లైండ్‌ఫోల్డ్, రాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరో గ్రాండ్‌మాస్టర్ కూడా ఆనంద్‌తో కలిసి రెండో స్థానాన్ని పంచుకున్నాడు. రాపిడ్ విభాగంలో ఆధిపత్యాన్ని
Source: Yahoo! Telugu: News | 27 Mar 2009 | 10:44 am

సుప్రీంకోర్టు తీర్పుపై లోక్‌సత్తా పార్టీ హర్షం

ఎన్నికల సంఘం వద్ద నమోదైన రాజకీయ పార్టీలన్నింటికీ ఉమ్మడిగుర్తు కేటాయించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై లోక్‌సత్తా పార్టీ హర్షం వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పువల్ల ఈ ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ ఈల గుర్తుతో బరిలో దిగనుండడం...
Source: Yahoo! Telugu: News | 27 Mar 2009 | 10:37 am

హైకోర్టు నుంచి వరుణ్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ

భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వరుణ్ గాంధీ శుక్రవారం ఢిల్లీ హైకోర్టు నుంచి బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ను కోరుతూ వరుణ్ దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది.
Source: Yahoo! Telugu: News | 27 Mar 2009 | 10:10 am

కెప్టెన్సీ వివాదం: గంగూలీపై బుచానన్ విమర్శలు

కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్ జాన్ బుచానన్ శుక్రవారం ఆ జట్టు ప్రధాన ఆటగాడు సౌరవ్ గంగూలీపై నిప్పులు చెరిగారు. ఇటీవల జాన్ బుచానన్ ఐపీఎల్ రెండో సీజన్‌లో తమ జట్టుకు ఏ ఒక్క ఆటగాడో కెప్టెన్‌గా ఉండడని, నలుగురైదుగురు కెప్టెన్లు
Source: Yahoo! Telugu: News | 27 Mar 2009 | 10:02 am

సామాజిక న్యాయానికి లభించిన విజయం: చిరు

తమ పార్టీకి ఉమ్మడి ఎన్నికల గుర్తును కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడం సామాజిక న్యాయానికి లభించిన విజయంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది రోజున ‘ఉమ్మడి’ గుర్తు లభించడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది భవిష్యత్ విజయానికి శుభ సూచకమన్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2009 | 9:25 am

ప్రజారాజ్యానికి గుర్తు కేటాయించండి: సుప్రీం

రాష్ట్రంనుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో నిలబడుతున్న ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు కేటాయించాలంటూ ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. చీప్ జస్టీస్ కేజీ బాలకృష్ణన్, జస్టీస్ పి సదాశివంలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు...
Source: Yahoo! Telugu: News | 27 Mar 2009 | 9:19 am

ఐక్యత కరువైన యూపీఏ మిత్రపక్షాలు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది యూపీఏ పక్షాల్లో తలోదారి చూసుకుంటున్నాయి. కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు కుదరక పలు రాజకీయ పక్షాలు వారికి అందుబాటులో ఉన్న పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడం గత కొన్నిరోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. దీంతో మరికొన్ని వారాల్లో ఎన్నికలు ఎదుర్కోబోతున్న అధికార యూపీఏ కూటమిలో ఐక్యత లోపించడం స్పష్టంగా కనిపిస్తోంది.
Source: జాతీయ | 27 Mar 2009 | 9:17 am

మార్చి 31నుంచి ప్రభాస్-పూరీల కొత్త చిత్రం

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న భారీ చిత్రం ఈ నెల 31న ప్రారంభం కానుంది. ఆదిత్యారామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆదిత్యరామ్, ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Mar 2009 | 8:22 am

అలాంటి చిత్రాలు తగ్గించుకుంటా: ఛార్మి

శ్రీ ఆంజనేయం చిత్రంతో తెలుగులో రంగప్రవేశం చేసి అటుపై కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఛార్మి కొద్దికాలంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితం కావడం గమనార్హం. తాజాగా మనోరమ చిత్రం ద్వారా ఉగాదికి తెలుగు ప్రేక్షకులను...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Mar 2009 | 8:20 am

మహేష్‌బాబుతో త్రివిక్రమ్ చిత్రం ప్రారంభం

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, స్టార్ రైటర్, డైరక్టర్ త్రివిక్రమ్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన అతడు తర్వాత చేస్తోన్న మరో భారీ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఈ చిత్రం షూటింగ్ మార్చి 25న అన్నపూర్ణ స్టూడియోలో..
Source: Yahoo! Telugu: Entertainment | 27 Mar 2009 | 8:14 am

ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు లైఫ్‌స్టైల్

ముప్పలనేని శివ దర్శకత్వంలో ఎస్.ఎమ్ సినీ మ్యాక్స్ పతాకంపై శ్రీ మాధవ్ పట్నాయక్ నిర్మిస్తున్న చిత్రం లైఫ్‌స్టైల్. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ నెల 29న విడుదల కానుంది. అలాగే ఏప్రిల్...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Mar 2009 | 8:08 am

కోరుకున్న గుర్తును కేటాయించండి: సుప్రీం

ఉమ్మడి గుర్తు కేటాయింపుపై ప్రజారాజ్యం పార్టీకి ఉపశమనం లభించింది. పీఆర్పీతో సహా లోక్‌సత్తా, తమిళనాడులోని డీఎండీకే పార్టీలు అడిగిన ఉమ్మడి గుర్తును కేటాయించాల్సిందిగా దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే సుప్రీం ఆదేశాలపై ఎన్నికల సంఘం కౌంటర్ పిటీషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.
Source: జాతీయ | 27 Mar 2009 | 7:53 am

శ్రీరామ నవమి రోజున సెలవు

ప్రజలందరూ వైభవంగా జరుపుకునే శ్రీరామ నవమి పర్వదినం రోజును (ఏప్రిల్ 4) రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినాల జాబితాలో చేర్చింది. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ నాలుగో తేదీన సాధారణ సెలవు దినాన్ని ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2009 | 7:30 am

ఎన్టీఆర్ ప్రాణానికి హాని లేదు: వైద్యులు

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి ప్రాణహాని లేదని కిమ్స్ వైద్యులు స్పష్టం చేసారు. ఎన్టీఆర్‌కు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ రెండువారాలపాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2009 | 7:29 am

రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్

తెలుగుదేశం ప్రచార తురుపుముక్క, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కారు గురువారం రాత్రి ప్రమాదానికి లోనైంది. ఈ ప్రమాదంలో ఆయన తలకు, కన్ను, నుదుటి భాగం, వెన్నుపూస, పక్కటెముకలకు గాయాలు తగిలాయి. అయితే, ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదేమేమీ లేదని వైద్యులు వెల్లడించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2009 | 7:29 am

కుల సంఘంగా ముద్రవేశారు: మందకృష్ణ

తమతో పొత్తుకు మహాకూటమి అంగీకరించని నేపథ్యంలో తమ ప్రతినిధులను స్వతంత్ర అభ్యర్ధులుగా ఎన్నికల బరిలో నిలపనున్నట్టు ఎమ్మార్పీఎస్ పేర్కొంది. దీనిప్రకారం రాష్ట్రంలోని మొత్తం 294 శాసనసభ, 42 లోక్‌సభ స్థానాల్లోనూ మాదిగ, ఉపకులాలు ఉద్యమకారులను రంగంలోకి దించనున్నట్టు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2009 | 7:19 am

ఎన్నికల్లో మన్మోహన్ పోటీ చేయాలి: అద్వానీ

వచ్చే లోక్‌సభ ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మన్మోహన్ సింగ్‌ను ప్రకటించిన నేపథ్యంలో రాజ్యసభ మార్గంలో కాకుండా, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాలని అద్వానీ కోరారు.
Source: జాతీయ | 27 Mar 2009 | 6:45 am

ఎన్డీయే కూటమిలోనే జేడీ (యు): నితీష్

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోనే తమ పార్టీ కొనసాగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే, పార్టీలోని సీనియర్ నేతలు జార్జి ఫెర్నాండెజ్‌కు టిక్కెట్ నిరాకరించక పోవడాన్ని ఆయన సమర్థించుకున్నారు. టిక్కెట్ నిరాకరణ వెనుక ఎలాంటి దురుద్దేశాలు గానీ, రాజకీయ ఒత్తిడులు గానీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఫెర్నాండెజ్‌ ఆరోగ్యం సరిగా లేదని అందువల్లే ఆయన లోక్‌సభ టిక్కెట్ నిరాకరించామని చెప్పారు.
Source: జాతీయ | 27 Mar 2009 | 5:44 am

ప్రజారాజ్యం పార్టీ తొలి జాబితా విడుదల

ప్రజారాజ్యం పార్టీ తొలి జాబితా ఎట్టకేలకు విడుదలైంది. జగ్గంపేట పర్యటనలో ఉన్న చిరంజీవి ఈ జాబితాను విడుదల చేశారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శుక్రవారం ఉదయం 9.27 నిమిషాలకు జాబితాలోని పేర్లను మీడియాకు వెల్లడించారు. వంద అసెంబ్లీ, తొమ్మిది లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను సాయంత్రం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ హైదరాబాద్‌లో వెల్లడిస్తారని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2009 | 4:55 am

లోక్‌సభ సమరం: కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార యూపీఏ కూటమిని ముందుకు నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రోజుకో షాక్ ఎదురవుతుంది. ఉత్తరాదిలో కాంగ్రెస్‌ను పక్కనబెట్టి యూపీఏ భాగస్వాములుగా ఉన్న ఆర్జేడీ, ఎల్జేపీ, ఎస్పీ పార్టీలు పొత్తు ఖరారు చేసుకున్నాయి. బీహార్‌లో వచ్చే లోక్‌సభ ఎన్నికలను కలిసి ఎదుర్కోవాలని ఈ మూడు పార్టీలు నిర్ణయించాయి.
Source: జాతీయ | 27 Mar 2009 | 4:34 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 27 Mar 2009 | 4:20 am

మార్చి 27, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 ప్రేమలు- పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Mar 2009 | 4:17 am

యువతకు అధికారం: ప్రధాని ఉద్ఘాటన

మారుతున్న కాలమాన ప్రమాణాలకు అనుగుణంగా అధికార బాధ్యతలను యువతకు కట్టబెట్టాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ఉద్ఘాటించారు. అలాగే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీకి మంత్రి పదవి ఇవ్వాలని తాము భావించగా, ఆయన సున్నితంగా తిరస్కరించారని ప్రధాని వెల్లడించారు.
Source: జాతీయ | 27 Mar 2009 | 3:58 am

ప్రరాపా అభ్యర్థుల తొలిజాబితా...రేపే విడుదల

ప్రజారాజ్యం పార్టీ సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే తన అభ్యర్థుల జాబితాను శుక్రవారంనాడు అధికారికంగా ప్రకటించనుంది. ప్రజా అంకిత యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనలోనున్న ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవి అక్కడే తమ పార్టీకి చెందిన అభ్యర్థులను ప్రకటిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 26 Mar 2009 | 2:59 pm

ఒంటరిగానే పోటీ చేస్తాం: కరుప్పు ఎంజీఆర్

తమిళ సినీ రంగానికి చెందిన నటుడు, కెప్టన్ విజయకాంత్(కరుప్పు ఎంజీఆర్) తమిళనాడులో తమ పార్టీ డీఎండీకే(దేశీయ ముత్పోక్కుమ్ ద్రావిడ మున్నేట్ర కజగమ్) తరపున ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
Source: జాతీయ | 26 Mar 2009 | 1:30 pm

31న ప్రభాస్-పూరి జగన్నాథ్‌ల కొత్త చిత్రం!

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న భారీ చిత్రం ఈ నెల (మార్చి 31) నుంచి ప్రారంభం కానుంది. ఆదిత్యారామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆదిత్యరామ్, ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఈ నెల 31 నుంచి ఏకధాటిగా...
Source: వినోదం | 26 Mar 2009 | 1:29 pm

బీహార్‌లో ఎస్పీ, ఆర్జేడీ, ఎల్జేపీ చెట్టాపట్టాల్

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లు బీహార్‌లో వచ్చే ఎన్నికలను కలిసి ఎదుర్కోవాలని నిర్ణయించాయి. మూడు పార్టీలు వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓ అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ప్రకటించారు.
Source: జాతీయ | 26 Mar 2009 | 12:16 pm

ఇంద్రుడే "పాపికొండల" శిఖరాన్ని తొలిచాడా..?!

మహారాష్ట్ర, నాసిక్ కొండలలో పుట్టి... వందకు పైగా చిన్నా, పెద్దా ప్రవాహాలను తనలో కలుపుకుని ప్రవహించే పావన గోదావరీ నదీమతల్లి, ఏలేరుపాడు దాటేసరికి దక్షిణాదిలోనే పెద్దనదిగా మనకు సాక్షాత్కరిస్తుంది. అలాంటి గలగలా పారే గోదావరికి రెండువైపులా ఆకాశాన్ని తాకే రీతిలో ఉండే కొండలనే...
Source: వినోదం | 26 Mar 2009 | 12:09 pm

పీఆర్పీ ప్రజా అంకితయాత్రలో అపశృతి

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి రోడ్‌షోలో అపశృతి చోటుచేసుకుంది. తూర్పుగోదావరి తునిలో జరిగిన ప్రజా అంకిత యాత్రలో భారీ ఎత్తున అభిమానులు హాజరైయ్యారు. వీరిలో కొంతమంది అభిమానులు తుని తమ అభిమాన నటుడిని చూసేందుకు బస్‌షెల్టర్‌ పైకి ఎక్కడంతో హఠాత్తుగా గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో పది మంది గాయాలకు గురైయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 26 Mar 2009 | 11:21 am