|
ప్రజారాజ్యంతో "మనపార్టీ" పొత్తు: అరవింద్ప్రజారాజ్యం పార్టీతో మనపార్టీ పొత్తు కుదుర్చుకుంది. గురువారం పీఆర్పీ కార్యాలయంలో పార్టీ నేత అల్లు అరవింద్‌తో పాటు మనపార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పీఆర్పీ అధినేత చిరంజీవి సమక్షంలో ప్రజారాజ్యంతో మనపార్టీ పొత్తు ఖరారైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం పీఆర్పీ కృషి చేస్తోందని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 26 Mar 2009 | 10:36 am బాబుతో జర జాగ్రత్త: వైఎస్ హెచ్చరికఎన్నికల్లో లబ్దికోసం అలవికాని హామీలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లుగా తాను అందిస్తున్న పాలనకు, అంతకుముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు అందించిన పాలనకు ఉన్న తేడాను గమనించాలని ఆయన పేర్కొన్నారు. తన పాలనలో ప్రజలకు ఎన్నో మోసాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల వేళ మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారంటూ ఆయన విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 26 Mar 2009 | 10:24 am ఎనిమిది మంది బీఆర్‌వో సిబ్బందికి సూర్యచక్రబోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో)కు చెందిన ఎనిమిది మంది సిబ్బందికి గురువారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సూర్యచక్ర అవార్డులు అందుజేయనున్నారు. బీఆర్‌వో సిబ్బందికి సూర్యచక్ర ప్రదానం చేస్తుండటం గత దశాబ్దకాలంలో ఇదే తొలిసారి. రక్షణ శాఖకు రోడ్లు నిర్మించే కార్యకలాపాలను బీఆర్‌వో చూసుకుంటుంది. మెడల్స్ ప్రకటించబడిన సిబ్బంది విధులు నిర్వహిస్తూ వివిధ ఘటనల్లో మృతి చెందారు. దేశంలో మూడో అత్యున్నత పురస్కారమైన సూర్యచక్రను ఎనిమిది మంది బీఆర్‌వో సిబ్బందికి ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు రక్షణ శాఖ బుధవారం సాయంత్రం ఓ మీడియా ప్రకటనలో వెల్లడించిందిSource: జాతీయ | 26 Mar 2009 | 10:21 am అన్నాడీఎంకేతో పీఎంకే పొత్తు ఖరారుకేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వంలో పీఎంకేను ఉంచేందుకు కాంగ్రెస్ చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలం అయింది. యూపీఏ కూటమి ప్రభుత్వంలో కొనసాగడంపై పీఎంకే గురువారం తన వైఖరిని స్పష్టం చేయనుంది. కేంద్ర మంత్రి, పీఎంకే నేత అన్బుమణి రాందాస్ బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో సమావేశమయ్యారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేతో కలిసి వచ్చే ఎన్నికల బరిలో దిగడంపై తమకున్న సమస్యలను పీఎంకే నేత అన్బుమణి రాందాస్ ఈ సమావేశంలో అహ్మద్ పటేల్‌కు వివరించారు.Source: జాతీయ | 26 Mar 2009 | 10:15 am గొల్లపల్లి ఓడిపోతారనే టికెట్ ఇవ్వలేదు: వైఎస్మంత్రి గొల్లపల్లి సూర్యారావు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని సర్వేల్లో తేలడంతోనే ఆయనకు టికెట్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. అదేసమయంలో టికెట్ గురించి గొల్లపల్లికి తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని కూడా వైఎస్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా తాండూరులో గురువారం జరిగిన విలేకరుల సమవేశంలో వైఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అంచానాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుపొందగలరనుకున్నామో వారికే టిక్కెట్లు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 26 Mar 2009 | 10:04 am అజ్ఞాతం వీడండి: మావోలకు డీజీపీ పిలుపురాష్ట్రంలోని మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కొత్త డీజీపీ ఏకే మహంతి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మావోయిస్టులకు, పోలీసులకు జరుగుతున్న పోరును ఎలుకా, పిల్లి ఆటగా ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో రిగ్గింగ్ అన్నది లేకుండా చూస్తామన్నారు. అలాగే ప్రజలకు పోలీసు అధికారులు అందుబాటులో లేరంటూ వస్తున్న ఫిర్యాదులపై సీరియస్‌గా దృష్టిసారించనున్నట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 26 Mar 2009 | 9:40 am రవితేజ హీరోగా 'ఆంజనేయులు' ప్రారంభం'ఇడియట్', 'నేనింతే'లాంటి టైటిల్స్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుని తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రవితేజ తాజాగా "ఆంజనేయులు" అనే పేరుతో తెరపైకి రానున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై గణేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్...Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2009 | 9:32 am మీనా ప్రధాన పాత్రలో 'వెంగమాంబ' ప్రారంభంమీనా ప్రధాన పాత్రలో వి. దొరస్వామిరాజు నిర్మాతగా వి.ఎం.సి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం వెంగమాంబ. ఈ భక్తిరస చిత్రంలో సాయికుమార్ శ్రీ వేంకటేశ్వరునిగా నటిస్తుండగా మీనా వెంగమాంబగా నటిస్తోంది. ఉదయభాస్కర్ దర్శకత్వం...Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2009 | 9:30 am బ్యాంకాక్‌లో అధినేత చిత్రం షూటింగ్జగపతిబాబు హీరోగా వి. సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి సమర్పణలో కె.కె రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం అధినేత. ఈ చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మార్చి 25 నుంచి ఏప్రిల్...Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2009 | 9:29 am త్రిష హీరోయిన్‌గా ఆకాశమంత ఆడియోప్రకాష్ రాజ్ తండ్రిగా, త్రిష కూతురిగా నటిస్తోన్న చిత్రం ఆకాశమంత. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాధామోహన్ దర్శకుడిగా, దిల్‌రాజు నిర్మించిన ఆకాశమంత చిత్రం ఆడియో ఆ బేనర్‌లో పనిచేసిన సంగీత దర్శకుల సమక్షంలో జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2009 | 8:11 am విడుదలకు భార్గవి చివరి చిత్రం హాలీడేస్ఇటీవల మృతి చెందిన వర్ధమాన నటి భార్గవి చివరగా నటించిన హాలిడేస్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. స్నేహాలు, ప్రేమలు, భావోద్వేగాలు లాంటి అందమైన మలుపులతో, చక్కటి సాహిత్యంతో ఇంపైన సంగీతంతో ఈ హాలీడేస్ చిత్రం...Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2009 | 8:01 am ముమైత్ ఖాన్ టార్గెట్ ఆడియో విడుదలముమైత్ఖాన్ ప్రధాన పాత్రలో శివబాలాజీ, శ్రద్ధాదాస్ జంటగా నటిస్తోన్న చిత్రం టార్గెట్. రమేష్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల ఫిలింఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సి. కళ్యాణ్...Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2009 | 7:59 am "శ్రీ షిర్డి సాయిబాబా" ఆడియో విడుదలప్రముఖ పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి సాయిబాబా పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం శ్రీ షిర్డి సాయిబాబా. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం ఫిలిమ్ ఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కాంగ్రెస్ నేత టి. సుబ్బరామిరెడ్డి..Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2009 | 7:58 am ఛార్మి "మనోరమ" అలరించేనా...?ఛార్మి ప్రధాన పాత్రలో ప్రముఖ సంస్థ జీటీవీ నిర్మిస్తోన్న ద్వితీయ చిత్రం 'మనోరమ'. జీటీవీ సంస్థ నుంచి తొలిచిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మస్త్ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో రెండో చిత్రం మనోరమ అయినా ప్రేక్షకులను అలరించేనా అనే...Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2009 | 7:56 am జమ్మూ- కాశ్మీర్ ఎన్‌కౌంటర్: లష్కరే కమాండర్ హతంజమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారాలో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన జిల్లా కమాండర్ హతమయ్యారని రక్షణ శాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. అంతకుముందు కుప్వారా అడవుల్లో మార్చి- 20న ప్రారంభమై నాలుగు రోజులకుపైగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం 25 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 26 Mar 2009 | 7:28 am ప్రజారాజ్యం జాబితా ఎప్పుడు..?ఎన్నికల హడావుడి మొదలైంది. నాయకులు టికెట్లకోసం తీవ్ర ప్రయత్నాలలో ఉన్నారు, దాదాపుగా అన్ని పార్టీలు టికెట్ల ఖరారు విషయంలో ఓ నిర్ణయానికి వచ్చి ప్రకటించేస్తున్నారు. కాని ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్ల విడుదల కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. పార్టీ కార్యాలయం వద్ద రోజంతా పడిగాపులు కాసిన ఆశావహులను పలకరించినవారే లేకపోయారు. జాబితా ఎప్పుడు విడుదలవుతుందనేది పార్టీ వర్గాలే ఇదమిద్దంగా చెప్పలేక పోతున్నాయి. బుధవారం సాయంత్రంలోగా విడుదల చేస్తామని స్వయంగా చిరంజీవి ప్రకటించడంతో టికెట్ ఆశిస్తున్న నాయకులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలి వచ్చారు. కాని బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు అభ్యర్ధుల జాబితా వెలువడలేదు.Source: ఏపీ న్యూస్ | 26 Mar 2009 | 6:19 am మా ప్రధాని మహా బలవంతుడు: రాహుల్ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫస్ట్‌క్లాస్ రాజకీయనాయకుడని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కితాబిచ్చారు. ప్రధానమంత్రికి తన పూర్తి మద్దతు కొనసాగుతుందని తెలిపారు. మన్మోహన్ సింగ్ బలహీన ప్రధానమంత్రి అని వచ్చిన విమర్శలను రాహుల్ ఈ సందర్భంగా కొట్టిపారేశారు. ఇటువంటి విమర్శలు చేయడం చాలా సులభమన్నారు.Source: జాతీయ | 26 Mar 2009 | 6:19 am జూనియర్ ఎన్టీఆర్ యాత్రకు బ్రేక్: అధిష్టానంపై అలకా...?గత పక్షం రోజులుగా రోడ్‌షోలతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ చైతన్యరథానికి మరమత్తులు అవసరమయ్యాయని అందుకే హైదరాబాద్ వెళ్తున్నానని తెలిపారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ యాత్రకు బ్రేక్ పడడానికి కారణం మరోటి ఉందని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. తన మిత్రుడు వంశీకి గన్నవరం టిక్కెట్ ఇవ్వాల్సిందిగా జూనియర్ పార్టీ అధిష్టానాన్ని కోరారని, అయితే ఈ విషయంలో పార్టీ శ్రేణులు తటపటాయిస్తుండడంతో నేరుగా విషయాన్ని తేల్చుకునేందుకే ఆయన యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ వేశారని సదరు వర్గాల ఉవాచ.Source: ఏపీ న్యూస్ | 26 Mar 2009 | 6:16 am ఏప్రిల్ నాలుగున చిరంజీవి నామినేషన్ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఏప్రిల్ నెల నాల్గవ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆరోజు దశమి కావడంతో ఉదయం 10.30 గంటల తరువాత శుభ ముహూర్తంగా నిర్ణయించారని తెలిసింది. ఇదిలావుండగా చిరంజీవి అదే రోజు ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో తిరుపతికి చేరుకుంటారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అధికారికంగా ఈ విషయం ప్రకటించలేదు. అయినాకూడా గతంలో చిరంజీవి మూడవ తేదీన నామినేషన్ వేయనున్నారని ప్రచారం జరిగిందిSource: ఏపీ న్యూస్ | 26 Mar 2009 | 6:05 am యూపీఎ నుంచి బయటకు వెళ్లనున్న పీఎమ్కెయూపీఏ కూటమి బీటలు వారుతోంది. యూపీఎ మిత్రపక్షాలు ఒకటొకటిగా క్రమంగా కూటమి నుంచి బయటకు వెళ్లడం జరుగుతోంది. తాజాగా యూపీఎ మిత్రపక్షమైన పీఎమ్‌కె బయటకు వెళ్లడానికి సిద్ధమైంది. పీఎమ్‌కెను ఎలాగైనా ఒప్పించాలన్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం విఫలమైనట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి అన్బుమణి రాందాస్ బుధవారం యూపీఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ సహాయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌ను కలిసి డీఎమ్‌కేతో కొనసాగేందుకుగల ఇబ్బందులను వివరించారు. దీంతో యూపీఎతో అన్బుమణి రాందాస్ చెలిమికి తెరపడ్డట్లైంది.Source: జాతీయ | 26 Mar 2009 | 5:17 am ఆ పార్టీలకు ఉమ్మడి గుర్తు ఇవ్వండి: హైకోర్టుఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఉమ్మడి గుర్తు కేటాయించాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఓటరు ఎలాంటి తికమక, శ్రమ లేకుండా నచ్చిన పార్టీకి ఓటు వేసేందుకై ఎన్నికల సంఘం ఈ విధంగా ఉమ్మడి గుర్తు కేటాయించాలంటూ హై కోర్టు కోరింది. తమకు ఉమ్మడి గుర్తు కేటాయింపును నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ లోక్‌సత్తా ప్రధాన కార్యదర్శి జి. లక్ష్మణ్ బాలాజీ వేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.Source: ఏపీ న్యూస్ | 26 Mar 2009 | 5:16 am కుప్వారా ఎన్‌కౌంటర్‌లో పాక్ ఆర్మీ ప్రమేయంజమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో తీవ్రవాద అనుబంధ కార్యకలాపాలు పెరిగే సమయం ఆసన్నమవుతోందని ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ బుధవారం హెచ్చరించారు. తాజాగా రాష్ట్రంలోని కుప్వారా జిల్లా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన లష్కరే తోయిబా తీవ్రవాదుల వద్ద స్వాధీనపరుచుకున్న పరికరాలు పాకిస్థాన్ భద్రతా దళాలకు చెందినవని ఆర్మీ భావిస్తోంది. సరిహద్దకు ఆవలివైపు తీవ్రవాద క్యాంపులు ఉన్నాయి. తీవ్రవాదులకు పాక్ ఆర్మీ సాయం పడిందనే అనుమానాలను కొట్టిపారేయలేమని కపూర్ విలేకరులుతో చెప్పారుSource: జాతీయ | 26 Mar 2009 | 4:25 am వరుణ్ వ్యాఖ్యలు: ఎన్డీఏలో అభిప్రాయభేదాలుమైనారిటీలను లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరుణ్ గాంధీ తాజాగా ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి పక్షాల మధ్య అభిప్రాయభేదాలకు కూడా కారణమయ్యారు. ముస్లింలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై బీజేపీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వరుణ్ గాంధీ ఇప్పటికీ అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలోని జేడీ(యూ) నేత నితీష్ కుమార్ మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు వరుణ్ గాంధీపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 26 Mar 2009 | 4:20 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2009 | 3:58 am మార్చి 26, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం...Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2009 | 3:56 am చంద్రబాబుపై కేసు నమోదు చేయండి: ఐవి.సుబ్బారావురానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రచురించిన కరపత్రంపై ముద్రణకర్త, ప్రచురణకర్తల పేర్లు లేనందున ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేయాలని ఎన్నికల కమిషన్ పోలీసులను ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో వివరాలను తెలిపే ఈ కరపత్రంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి కె. రోశయ్య ఫిర్యాదు చేశారని, ఆ మేరకు కేసు నమోదు చేయాలని కమిషన్ ఆదేశించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవి సుబ్బారావు తెలిపారుSource: ఏపీ న్యూస్ | 26 Mar 2009 | 2:59 am కాంగ్రెస్‌కు ప్రచారం చేయనున్న షారుఖ్-ప్రీతీజింతాబాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్, ప్రముఖ నటి ప్రీతీ జింతా, గోవిందా మరియు నగ్మాలు ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని, రోడ్ షోలలోకూడా వారు పాల్గొంటారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ప్రకాష్ జయ్‌స్వాల్ మంగళవారం ఈ విషయం తెలిపారు. ఈయన ప్రస్తుతం కాన్పూర్ నుంచి మూడవసారి లోక్‌సభకు పోటీ చేయనున్నారు.Source: జాతీయ | 25 Mar 2009 | 2:31 pm కసబ్ ప్రాణాలకు ముప్పునిరుడు ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడులలో ప్రాణాలతో పట్టుబడ్డ ఏకైక తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ ప్రస్తుతం భారత పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇతని ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వివరాలలోకి వెళితే..మాఫియా డాన్ ఛోటా రాజన్ వలన కసబ్ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గూఢచారి వర్గాలు ఈ విషయాన్ని తమకు తెలిపినట్లు ముంబై పోలీసులు స్పష్టం చేశారుSource: జాతీయ | 25 Mar 2009 | 2:11 pm భార్గవి చివరి సినిమా "హాలీడేస్"స్నేహాలు, ప్రేమలు, భావోద్వేగాలు లాంటి అందమైన మలుపులతో, చక్కటి సాహిత్యంతో ఇంపైన సంగీతంతో "హాలీడేస్" చిత్రం రూపొందుతోంది. ఆర్.సి.ఎం. సినీ చిత్ర పతాకంపై ఎస్.ఎస్. కుమార్ దర్శకత్వంలో ఎ. రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ పాట మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. శివనాగ్, భార్గవి, సానియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.Source: వినోదం | 25 Mar 2009 | 1:02 pm కుప్వారా ఎన్‌కౌంటర్: బాధ్యత వహించిన లష్కరేనాలుగు రోజుల పాటు హోరాహోరీగా కుప్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఇ తోయిబా తీవ్రవాద సంస్థ బాధ్యత వహించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో తమ సంస్థకు చెందిన సభ్యులే పాల్గొన్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారా జిల్లాలో నాలుగు రోజులపాటు భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్ మంగళవారం రాత్రితో ముగిసింది. ఇందులో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది, 17 మంది తీవ్రవాదులు మృతి చెందారు.Source: జాతీయ | 25 Mar 2009 | 12:48 pm 20 కేజీల బరువెక్కిన శివాజీ!తమిళ సూపర్ స్టార్, రజినీ కాంత్ 20 కేజీల బరువు ఎక్కారట. మాజీ ప్రపంచ సుందరి, అమితాబ్ బచ్చన్ ఇంటి కోడలు ఐశ్వర్యారాయ్ సరసన రజినీ కాంత్ నటించే తాజా కోలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం "ఎందిరన్" సినిమా కోసం శివాజీ బరువు ఎక్కారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.Source: వినోదం | 25 Mar 2009 | 11:46 am పదవికి, కాంగ్రెస్‌కు గొల్లపల్లి గుడ్బైవచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ కేటాయించకపోవడంతో అలకబూనిన రాష్ట్రమంత్రి గొల్లపల్లి సూర్యారావు తన పదవికి రాజీనామా చేశారు. అదేసమయంలో కాంగెస్ పార్టీకి సైతం తాను రాజీనామా చేస్తున్నట్టు గొల్లపల్లి ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 11:25 am మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 197 పాయింట్ల వృద్ధిబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రతికూల ప్రభావంతో 29 పాయింట్లు పతనమై 9,442 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం ఒకానొక దశలో 9,430 పాయింట్ల కనిష్టSource: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 11:17 am చెల్లెమ్మ స్థానం చేవెళ్ళ నుంచి వైఎస్ ప్రచారంముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనకు ఇష్టమైన చేవెళ్ల నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ ప్రచార ప్రారంభానికి ముందుగా బషీర్‌బాగ్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడ నుంచి అసెంబ్లీ సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 25 Mar 2009 | 11:17 am రేపు భారత్- న్యూజిలాండ్ కీలకమైన రెండో టెస్ట్నేపియర్లోని మెక్‌లీన్ పార్కులో టీం ఇండియా, ఆతిథ్య న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం కీలకమైన రెండో టెస్ట్ ప్రారంభం కాబోతుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీం ఇండియా 1-0 ఆధిక్యతలో ఉన్న సంగతిSource: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 11:06 am ఐపీఎల్: కేకేఆర్ కెప్టెన్సీ నుంచి గంగూలీ తొలగింపుఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్సీ నుంచి టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తొలగించబడ్డాడు. గత సీజన్‌లో కేకేఆర్‌కు గంగూలీ పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఉన్నSource: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 10:49 am ఇండియన్ ఓపెన్ రెండో రౌండులో చేతన్ ఆనంద్భారత అగ్రశ్రేణి షట్లర్, మూడో సీడ్ చేతన్ ఆనంద్ ఇక్కడ జరుగుతున్న ఇండియన్ ఓపెన్ రెండో రౌండులోకి అడుగుపెట్టాడు. తొలి రౌండు మ్యాచ్‌లో చేతన్ ఆనంద్ మలేషియా క్రీడాకారుడు చాంగ్ చియాలోక్‌పై విజయం సాధించాడు. ఇండియన్ ఓపెన్Source: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 10:32 am 27మంది అభ్యర్ధులతో టీడీపీ తొలి జాబితారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో దిగనున్న అభ్యర్ధుల తొలి జాబితాను టీడీపీ బుధవారం ప్రకటించింది. మొత్తం 27మంది అభ్యర్ధులు తొలి జాబితాలో చోటు సంపాదించారు.Source: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 10:27 am తొపలోవ్‌తో డ్రా: ఆనంద్‌కు సంయుక్త ఆధిక్యతప్రపంచ ఛాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అంబర్ బ్లైండ్‌ఫోల్డ్, రాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో స్పష్టమైన ఆధిక్యాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం మరో ఇద్దరు గ్రాండ్‌మాస్టర్‌లతో కలిసి ఆనంద్ అగ్రస్థానాన్ని పంచుకుంటున్నాడు. బల్గేరియాSource: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 10:26 am
|