|
భార్గవి చివరి సినిమా "హాలీడేస్"స్నేహాలు, ప్రేమలు, భావోద్వేగాలు లాంటి అందమైన మలుపులతో, చక్కటి సాహిత్యంతో ఇంపైన సంగీతంతో "హాలీడేస్" చిత్రం రూపొందుతోంది. ఆర్.సి.ఎం. సినీ చిత్ర పతాకంపై ఎస్.ఎస్. కుమార్ దర్శకత్వంలో ఎ. రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ పాట మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. శివనాగ్, భార్గవి, సానియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.Source: వినోదం | 25 Mar 2009 | 1:02 pm కుప్వారా ఎన్‌కౌంటర్: బాధ్యత వహించిన లష్కరేనాలుగు రోజుల పాటు హోరాహోరీగా కుప్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఇ తోయిబా తీవ్రవాద సంస్థ బాధ్యత వహించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో తమ సంస్థకు చెందిన సభ్యులే పాల్గొన్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారా జిల్లాలో నాలుగు రోజులపాటు భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్ మంగళవారం రాత్రితో ముగిసింది. ఇందులో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది, 17 మంది తీవ్రవాదులు మృతి చెందారు.Source: జాతీయ | 25 Mar 2009 | 12:48 pm మన్మోహన్ విమర్శలను తిప్పికొట్టిన అద్వానీప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా తనను లక్ష్యంగా చేసుకొని చేసిన విమర్శలను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే అద్వానీ తిప్పికొట్టారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలకపాత్ర పోషించారని, గుజరాత్ అల్లర్లకు నేతృత్వం వహించారని, తీవ్రవాదాన్ని అరికట్టడంలో హోంమంత్రిగా విఫలం అయ్యారని అద్వానీపై మన్మోహన్ సింగ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 25 Mar 2009 | 12:08 pm 20 కేజీల బరువెక్కిన శివాజీ!తమిళ సూపర్ స్టార్, రజినీ కాంత్ 20 కేజీల బరువు ఎక్కారట. మాజీ ప్రపంచ సుందరి, అమితాబ్ బచ్చన్ ఇంటి కోడలు ఐశ్వర్యారాయ్ సరసన రజినీ కాంత్ నటించే తాజా కోలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం "ఎందిరన్" సినిమా కోసం శివాజీ బరువు ఎక్కారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.Source: వినోదం | 25 Mar 2009 | 11:46 am పదవికి, కాంగ్రెస్‌కు గొల్లపల్లి గుడ్బైవచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ కేటాయించకపోవడంతో అలకబూనిన రాష్ట్రమంత్రి గొల్లపల్లి సూర్యారావు తన పదవికి రాజీనామా చేశారు. అదేసమయంలో కాంగెస్ పార్టీకి సైతం తాను రాజీనామా చేస్తున్నట్టు గొల్లపల్లి ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 11:25 am మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 197 పాయింట్ల వృద్ధిబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం లాభాల బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రతికూల ప్రభావంతో 29 పాయింట్లు పతనమై 9,442 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం ఒకానొక దశలో 9,430 పాయింట్ల కనిష్టSource: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 11:17 am సరైన అభ్యర్థులను ఎన్నుకోండి: కలామ్సమర్థవంతమైన నాయకులను ఎన్నుకునే అవకాశం కేవలం ఓటు ద్వారానే సాధ్యమౌతుందని, అలాంటి ఓటు హక్కు ప్రతి ఒక్కరికి విలువైనదని, ఈ ఓటు ద్వారా నాయకులను ఎన్నుకుని చట్టసభలకు పంపించే అవకాశం ఐదు సంవత్సరాలకు ఒక్కసారిమాత్రమే వస్తుందని ఆయన తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు దేశ భవిష్యత్తును అభివృద్ధి మార్గంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారని ఆయన తెలిపారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరికి పవిత్రమైన హక్కు అని, ఇది తమ మాతృభూమి పట్ల చూపే బాధ్యతగా ఆయన అభివర్ణించారు.Source: జాతీయ | 25 Mar 2009 | 11:17 am యాంటీ శాటిలైట్ వెపన్స్ తయారీపై భారత్ దృష్టియాంటీ శాటిలైట్ వెపన్స్ (ఉపగ్రహ నిరోధక ఆయుధాలు) తయారీపై భారత్ దృష్టి సారించింది. ప్రపంచంలో అంతరిక్ష పరిజ్ఞానాన్ని సముపార్జించుకున్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటి. ప్రస్తుతం ఉపగ్రహ నిరోధక ఆయుధాల తయారీపై దృష్టిని కేంద్రీకరించింది. తీవ్రవాద నిరోధక ఆయుధాలను సమకూర్చుకునేందుకు అమెరికాతో కలిసి పనిచేయడానికి భారత్ సమ్మతం తెలిపింది.Source: జాతీయ | 25 Mar 2009 | 11:17 am చెల్లెమ్మ స్థానం చేవెళ్ళ నుంచి వైఎస్ ప్రచారంముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనకు ఇష్టమైన చేవెళ్ల నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ ప్రచార ప్రారంభానికి ముందుగా బషీర్‌బాగ్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడ నుంచి అసెంబ్లీ సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 25 Mar 2009 | 11:17 am రేపు భారత్- న్యూజిలాండ్ కీలకమైన రెండో టెస్ట్నేపియర్లోని మెక్‌లీన్ పార్కులో టీం ఇండియా, ఆతిథ్య న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం కీలకమైన రెండో టెస్ట్ ప్రారంభం కాబోతుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీం ఇండియా 1-0 ఆధిక్యతలో ఉన్న సంగతిSource: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 11:06 am ఐపీఎల్: కేకేఆర్ కెప్టెన్సీ నుంచి గంగూలీ తొలగింపుఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్సీ నుంచి టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తొలగించబడ్డాడు. గత సీజన్‌లో కేకేఆర్‌కు గంగూలీ పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఉన్నSource: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 10:49 am ఇండియన్ ఓపెన్ రెండో రౌండులో చేతన్ ఆనంద్భారత అగ్రశ్రేణి షట్లర్, మూడో సీడ్ చేతన్ ఆనంద్ ఇక్కడ జరుగుతున్న ఇండియన్ ఓపెన్ రెండో రౌండులోకి అడుగుపెట్టాడు. తొలి రౌండు మ్యాచ్‌లో చేతన్ ఆనంద్ మలేషియా క్రీడాకారుడు చాంగ్ చియాలోక్‌పై విజయం సాధించాడు. ఇండియన్ ఓపెన్Source: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 10:32 am 27మంది అభ్యర్ధులతో టీడీపీ తొలి జాబితారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో దిగనున్న అభ్యర్ధుల తొలి జాబితాను టీడీపీ బుధవారం ప్రకటించింది. మొత్తం 27మంది అభ్యర్ధులు తొలి జాబితాలో చోటు సంపాదించారు.Source: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 10:27 am తొపలోవ్‌తో డ్రా: ఆనంద్‌కు సంయుక్త ఆధిక్యతప్రపంచ ఛాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అంబర్ బ్లైండ్‌ఫోల్డ్, రాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో స్పష్టమైన ఆధిక్యాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం మరో ఇద్దరు గ్రాండ్‌మాస్టర్‌లతో కలిసి ఆనంద్ అగ్రస్థానాన్ని పంచుకుంటున్నాడు. బల్గేరియాSource: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 10:26 am కలర్స్ స్వాతి హీరోయిన్‌గా "అనంతపురం-1980"అంతా కొత్తవారితో తమిళంలో నిర్మించబడిన సుబ్రహ్మణ్యపురంచిన్న సినిమాగా విడుదలైనా అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలో కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం అనంతపురం-1980 పేరుతో తెలుగులో విడుదల కానుంది.Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2009 | 10:01 am మరోసారి దీవించండి: వైఎస్ విజ్ఞప్తివచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ద్వారా మరోసారి తనని దీవించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల ముందు చేసిన వాగ్ధానాలన్నింటినీ నెరవేర్చడం ద్వారా తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల...Source: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 9:36 am మళ్లీ అధికారం మాదే: వైఎస్ విశ్వాసంవచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం తమదేనని ముఖ్యమంత్రి వైఎస్ విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలే తిరిగి తమకు అధికారాన్ని కట్టబెడుతాయని ఆయన పేర్కొన్నారు. అదేసమయంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపోటములకు తానే పూర్తిగా బాధ్యత వహిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 25 Mar 2009 | 8:49 am నిష్పక్షపాతంగా వ్యవహరించండి: డీజీపీరానున్న ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ రాష్ట్ర కొత్త డీజీపీ ఏకే మహంతి పోలీసు అధికారులకు తనదైన శైలిలో ఆదేశాలు జారీచేశారు. జిల్లా ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా మహంతి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా కర్తవ్యం తప్ప మరేదీ పట్టించుకోవద్దంటూ సూచించారు. విధి నిర్వహణలో పొరపాట్లు, తప్పులకు అవకాశం ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి చేసిన ఆయన ఎవరు తప్పు చేసినా సహించేది లేదని పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 25 Mar 2009 | 8:49 am వందమందితో నేడు టీడీపీ తొలి జాబితారానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో దిగనున్న అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించేందుకు తెలుగుదేశం సిద్ధమైంది. టీఆర్ఎస్‌తో సీట్ల విషయమై ఏర్పడిన ప్రతిష్టంభనకు పూర్తిగా తెరపడిన నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు వందమంది అభ్యర్ధులతో కూడిన జాబితాను బుధవారం టీడీపీ విడుదల చేయనుంది.Source: ఏపీ న్యూస్ | 25 Mar 2009 | 8:49 am కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌కు బాధ్యత వహించిన లష్కరేజమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారా జిల్లాలో నాలుగు రోజులపాటు భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న తీవ్రవాదులు తమవారేనని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా బుధవారం ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్ మంగళవారం రాత్రిSource: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 8:22 am వరుణ్‌పై ఎఫ్ఐఆర్ తొలగింపుకు హైకోర్టు నిరాకరణముస్లింలను లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ నమోదైన ఎఫ్ఐఆర్‌ను తొలగించాలని భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వరుణ్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది.Source: Yahoo! Telugu: News | 25 Mar 2009 | 7:50 am కాంగ్రెస్ జైత్రయాత్రను ప్రారంభించిన సీఎంరాష్ట్రంలో వేడెక్కుతోన్న ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ సోమాజీగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి, నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి వైఎస్సార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి తన ప్రచార జైత్రయాత్రను వైఎస్సార్ లాంఛనంగా ప్రారంభించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ప్రచారాన్ని సీఎం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి ప్రారంభించడంతో ఎనలేని ఆదరణ లభించింది. దీంతో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించాలనే సెంటిమెంట్‌తో వైఎస్సార్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని పార్టీశ్రేణులు వెల్లడించాయి.Source: ఏపీ న్యూస్ | 25 Mar 2009 | 7:02 am వరుణ్ పిటీషన్‌ను కొట్టేసిన అలహాబాద్ కోర్టుతనపై నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్‌ను కొట్టి వేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వరుణ్ గాంధీ దాఖలు దాఖలు చేసిన పిటీషన్‌ను అలహాబాద్ కోర్టు కొట్టి వేసింది. దీంతో ఆయనను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్టు చేసే పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు వరుణ్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. ఈనెల 19వ తేదీన తన సొంత నియోజకవర్గం పిలిభిత్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 25 Mar 2009 | 6:23 am ముగిసిన కుప్వారా ఎన్‌కౌంటర్: 25మంది మృతిజమ్మూ, కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదులకు, సైనిక దళాలకు మధ్య గత ఐదు రోజులుగా కొనసాగిన ఎన్‌కౌంటర్ ఎట్టకేలకు ముగిసింది. ఈ ఎన్‌కౌంటర్ సందర్భంగా మృతి చెందినవారి సంఖ్య 25కు చేరింది. మృతి చెందినవారిలో 17మంది తీవ్రవాదులు కాగా మిగిలిన ఎనిమిదిమంది భద్రతా సిబ్బంది. ఈ విషయమై సైన్యం అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ తీవ్రవాదులకు, సైన్యానికి మధ్య ముఖాముఖి జరిగిన పోరు ముగిసిందని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ సందర్భంగా మృతి చెందిన సైనికుల్లో ఓ మేజర్ కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం ముగిసిన ఈ ఎన్‌కౌంటర్ ఈ నెల 20న హర్ఫాదా అడవిలోని షాంశబరి రేంజ్‌లో ప్రారంభమైనట్టు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు.Source: జాతీయ | 25 Mar 2009 | 6:03 am 15 మందితో తెరాస తొలి జాబితా విడుదలతెలుగుదేశంతో పొత్తుపై ఏకాభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో బుధవారం తెలంగాణా రాష్ట్ర సమితి తన తొలి జాబితాను ప్రకటించింది. తెరాస ప్రకటించిన ఈ తొలి జాబితాలో 15మంది అభ్యర్ధుల స్థానాలు ఖరారయ్యాయి. మహాకూటమి పేరుతో తెదేపాతో కలిసి ఏర్పాటు చేసిన పొత్తు అనేక మలుపులు తిరిగి మంగళవారం చివరిసారిగా సాగించిన చర్చలు సఫలం కావడంతో తెరాస బుధవారం తన జాబితా ప్రకటించడం విశేషం.Source: ఏపీ న్యూస్ | 25 Mar 2009 | 5:42 am ప్రధాని మన్మోహన్‌పై వామపక్షాల మండిపాటుమేనిఫెస్టో సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై వామపక్షాలు పండిపడ్డాయి. తాము దేశ ప్రగతికి, అభివృద్ధికి నిరోధకులం కామని స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను మాత్రమే తాము నిరోధించామని మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో వామపక్ష నేతలు వివరణ ఇచ్చారు. జాతీయ సమగ్రతను తాకట్టు పెట్టే విధంగా అమెరికాతో ప్రధాని అణు ఒప్పందం కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ అంశాన్ని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చి ఉంటే బాగుండేదన్నారు.Source: జాతీయ | 25 Mar 2009 | 5:17 am అసోం రాష్ట్రంలో వార్తాపత్రిక ఎడిటర్ హత్యఅసోం రాష్ట్రంలో గుర్తుతెలియని కొందరు దుండగులు మంగళవారం రాత్రి "అజీ" అనే స్థానిక వార్తాపత్రిక ఎడిటర్- ఇన్- చీఫ్ అనిల్ మంజుదార్‌ను కాల్చిచంపారు. ప్రభుత్వంతో చర్చలకు వస్తున్న ఉల్ఫా సంస్థకు అజీ అనుకూలంగా వార్తలు ప్రచురిస్తుంటుంది. రాజ్‌గఢ్ రోడ్డులో ఉన్న మంజుదార్ (40) నివాసం వద్దనే కొందరు యువకులు ఆయనను కాల్చిచంపారని పోలీసులు చెప్పారు.Source: జాతీయ | 25 Mar 2009 | 4:13 am రాజ్‌నాథ్‌పై పోటీకి నిలబెట్టం: అమర్ సింగ్భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌పై అభ్యర్థిని పోటీకి నిలబెట్టబోమని సమాజ్‌వాది పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రాజ్‌నాథ్ పోటీ చేయనున్నారు. అదే సమయంలో ఆ స్థానం నుంచి పోటీ చేసే లౌకిక అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్ మంగళవారం విలేఖరులకు తెలిపారు. మథురలో ఆర్.ఎల్.డి అధినేత అజిత్ సింగ్ కుమారుడు జయంత్ చౌదరిపై కూడా తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టడం లేదని చెప్పారు.Source: జాతీయ | 25 Mar 2009 | 4:12 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2009 | 4:03 am మార్చి 25, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 సుహాసిని కథలు 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం...Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2009 | 4:01 am లోక్‌సత్తాతో బీసీ యునైటెడ్ ఫ్రంట్ పొత్తులోక్సత్తా పార్టీ బీసీ యునైటెడ్ ఫ్రంట్‌తో పొత్తు కుదుర్చుకున్నట్లు ఆ పార్టీ జాతీయ సమన్వయకర్త జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కోట్లు ఖర్చు పెట్టే వారికే సీట్లను కేటాయిస్తూ అదే సామాజిక న్యాయమని భావిస్తున్నాయని ఆయన విమర్శించారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్‌కు 14 అసెంబ్లీ సీట్లను కేటాయించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంగళవారం ఆయన ఫ్రంట్ అధ్యక్షుడు పాటూరి రామకృష్ణయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 24 Mar 2009 | 2:50 pm కాంగ్రెస్‌కు ప్రచారం చేయనున్న షారుఖ్-ప్రీతీజింతాబాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్, ప్రముఖ నటి ప్రీతీ జింతా, గోవిందా మరియు నగ్మాలు ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని, రోడ్ షోలలోకూడా వారు పాల్గొంటారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ప్రకాష్ జయ్‌స్వాల్ మంగళవారం ఈ విషయం తెలిపారు. ఈయన ప్రస్తుతం కాన్పూర్ నుంచి మూడవసారి లోక్‌సభకు పోటీ చేయనున్నారు.Source: జాతీయ | 24 Mar 2009 | 2:21 pm చంద్రబాబు కాళ్ల బేరం: మెట్టు దిగిన కేసీఆర్కె.చంద్రశేఖర రావు హైడ్రామాకు తెరదించారు. బెదిరింపులు, డెడ్‌లైన్‌లకు స్వస్తి చెప్పి, ఒక మెట్టు దిగారు. మహాకూటమి అధినేత చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి తన సపరివారంతో బయలుదేరారు. సీట్ల పంపిణీపై తుది నిర్ణయం తీసుకునేందుకు వారిద్దరు ఒకచోట భేటీ అవుతున్నారు. చంద్రబాబు స్వయంగా కాళ్ళబేరానికి వచ్చి, కేసీఆర్‌కు ఫోన్ చేసి ఆహ్వానించారు. దీంతో కేసీఆర్ తన బెట్టు సడలించినట్టు తెరాస శ్రేణులు వెల్లడించాయి.Source: ఏపీ న్యూస్ | 24 Mar 2009 | 1:42 pm మహాకూటమిలో ముగిసిన సీట్ల లొల్లిసీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలిగిపోయంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి సన్నిహితుడైన సిఎం రమేష్ దౌత్యం ఫలించింది. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మంగళవారం మధ్యాహ్నం జరిగిన చర్చలు ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సమితికి 48 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. దీంతో తెరాస జాబితా బుధవారం ఉదయం విడుదల చేయనుంది.Source: ఏపీ న్యూస్ | 24 Mar 2009 | 1:13 pm మెగాస్టార్‌తో రెబల్‌స్టార్ దోస్తీతెలుగు వెండితెర హీరోలు రాజకీయాల్లో ఒకటయ్యారు. వారిలో ఒకరు మెగాస్టార్. మరొకరు రెబల్ స్టార్. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను తమ నటనతో ఆలరించిన ఈ స్టార్లు ఇకపై ప్రజా సేవ కోసం రాజకీయ తెరపై చేతులు కలిపారు. హైదరాబాద్‌లోని ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పీఆర్పీలోకి కృష్ణంరాజును సాదరంగా ఆహ్వానించారు.Source: ఏపీ న్యూస్ | 24 Mar 2009 | 1:06 pm బార్‌లో ప్రీతి జింగ్యానియా డ్యాన్స్సన్రేస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సర్థార్ పటేల్, సురేష్, వినోద్, మహేష్, వివేక్, దిలీప్, గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం "తేజం". ఎస్.రాజశేఖర్ నిర్మాతగా రాజ్.కె.ఎస్ గోపి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలోSource: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2009 | 11:59 am అనుష్కకు ఆటోగ్రాఫ్ తెచ్చిన తంటాలుసినీ తారలకు ఎవరికైనా హిట్లు వస్తే ఓ పట్టాన మాట వినరని అంటుంటారు. ఇది చాలా మంది నటీనటుల విషయంలో రుజువైంది కూడాను. ఈ జాబితాలో ఇప్పుడు కొత్తగా సెక్సీ నటి అనుష్క కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది. వరుస హిట్లు, ఆఫర్లతోSource: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2009 | 11:55 am బ్యాంకాక్‌లో అధినేత షూటింగ్‌కు ఏర్పాట్లుప్రైమ్స్టార్ జగపతిబాబు హీరోగా మాస్ డైరెక్టర్ వి. సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి సమర్పణలో కె.కె రాధామోహన్ నిర్మిస్తున్న రాజకీయ సంచలన చిత్రం "అధినేత".Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2009 | 11:50 am
|