|
రాష్ట్రంలో హంగ్ తప్పదు: వెంకయ్యనాయుడుఈసారి జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ తప్పదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. నాలుగు పార్టీలు బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ఏపార్టీకీ పూర్తి మెజారిటీ రాబోదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రచారంలో భాగంగా విశాఖకు చేరుకున్న వెంకయ్యనాయుడు సోమవారం మీడియా సమవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో త్రిశంకు సభ ఖాయమని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Mar 2009 | 11:53 am పీజీవరకు ఉచిత విద్య: కాంగ్రెస్ హామీతాము అధికారంలోకి వస్తే కేజీనుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతోపాటు ప్రస్తుతం తాము కొనసాగిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ ఆ పార్టీ పేర్కొంది. ఇప్పటివరకు అందరికీ సొంత ఇళ్లు అనే లక్ష్యంతో పనిచేసిన తాము ఇకముందు ప్రతి ఇంటికీ మౌలిక సదుపాయాలు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తామని ఆ పార్టీ పేర్కొంది.Source: ఏపీ న్యూస్ | 23 Mar 2009 | 11:52 am ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సోనియాకొద్దిరోజుల్లో లోక్‌సభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ ప్రచారాన్ని ప్రారంభించారు. కర్ణాటక రాజధాని బెంగుళూరుకు సమీపంలోని డవాంగెరేలో జరిగిన కార్యక్రమంలో భాగంగా సోనియా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.Source: జాతీయ | 23 Mar 2009 | 11:51 am ప్రజల కారును ఆవిష్కరించిన రతన్ టాటాదేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా మోటార్స్ "నానో" కారును టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు. ప్రజల కారుగా ఇప్పటికే విశేష ప్రాచుర్యం పొందిన ఈ వాహనం రోడ్డుపైకి రూ.1.2- 1.3 లక్షలతోSource: Yahoo! Telugu: News | 23 Mar 2009 | 11:47 am తెదేపాకు మాజీ మంత్రి ముత్యం రెడ్డి గుడ్బైతెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు డీఎస్, ముఖ్యమంత్రి వైఎస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. తన రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు పంపిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి నేరుగా వెళ్లి వైఎస్‌తో సమాలోచనలు జరిపారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే విషయమై గత కొద్ది రోజులుగా ఊగిసలాడిన ముత్యం రెడ్డి ఎట్టకేలకు సోమవారం తుది నిర్ణయం తీసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Mar 2009 | 11:45 am అభివృద్ధే మాకు శ్రీరామ రక్ష: వైఎస్-డీఎస్గత ఐదేళ్ళ కాలంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తమకు శ్రీరామ రక్షగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్, పీసీసీ అధ్యక్షుడు డీఎస్ అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్ళ పాటు స్వర్ణయుగ పాలన అందించామని వారిద్దరు కితాబిచ్చుకున్నారు. ప్రజాసంక్షేమ పథకాల అమలులో గత ప్రభుత్వాలే కాదు దేశంలో మరే ప్రభుత్వం తమతో సరితూగలేదన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తే అధికారం నుంచి గద్దె దించడంఖాయమన్న నిత్య సత్యాన్ని తాను తన సుదీర్ఘ రాజకీయ ప్రస్తానంలో గ్రహించి, పాలన సాగించినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన సోమవారం గాంధీభవన్‌లో వారిద్దరు విడుదల చేశారు.Source: ఏపీ న్యూస్ | 23 Mar 2009 | 11:38 am డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్: సానియా ర్యాంక్ పతనండబ్ల్యూటీఏ తాజాగా ప్రకటించిన తాజా ర్యాకింగ్స్‌లో భారత టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా సింగిల్స్ ర్యాంక్ మరోసారి పతనమైంది. తాజాగా ముగిసిన ఇండియన్ వెల్స్ టోర్నీలో ప్రతిభ చూపలేకపోయిన సానియా సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో...Source: Yahoo! Telugu: News | 23 Mar 2009 | 11:32 am నేను పాక్‌లోని ఫరీద్‌కోట్ వాసిని: అజ్మల్ కసబ్ముంబై ఉగ్రవాద దాడుల సందర్భంగా భద్రతా దళాలకు పట్టుబడిన ఏకైక తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ సోమవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు తాను పాకిస్థాన్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాకు చెందినవాడినని అంగీకరించాడు. ముంబై దాడులకు సంబంధించి తొలి రోజు విచారణ సందర్భంగా కసబ్ ఈ విషయాన్ని ధృవీకరించాడు.Source: జాతీయ | 23 Mar 2009 | 11:32 am ఐపీఎల్ వివాదం: బీసీసీఐపై చిదంబరం మండిపాటుఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌ను విదేశాలకు తరలించాలని బీసీసీఐ నిర్ణయించడంపై హోంశాఖ మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. ఐపీఎల్ అధికారిక యంత్రాంగం, బీసీసీఐ తీసుకున్న నిర్ణయం, దానిపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలSource: Yahoo! Telugu: News | 23 Mar 2009 | 11:30 am మాది ప్రజా అనుకూల ప్రభుత్వం: వైఎస్తమది ప్రజా అనుకూల ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. తమది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని ప్రతిపక్షాలు చెబుతున్న మాటలు వాస్తవం కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తమది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమే...Source: Yahoo! Telugu: News | 23 Mar 2009 | 11:29 am ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సోనియాకొద్దిరోజుల్లో లోక్‌సభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ ప్రచారాన్ని ప్రారంభించారు. కర్ణాటక రాజధాని బెంగుళూరుకు సమీపంలోని డవాంగెరేలో జరిగిన కార్యక్రమంలో భాగంగా సోనియా తన...Source: Yahoo! Telugu: News | 23 Mar 2009 | 11:29 am కుప్వారా ఎన్‌కౌంట్‌లో పెరిగిన మృతుల సంఖ్యజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారా జిల్లాలో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. కాగా, ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఉత్తర కాశ్మీర్, కుప్వారా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నట్టు ఖచ్చితమైన సమాచారంతో సైనిక బలగాలు స్థానిక పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టాయి.Source: జాతీయ | 23 Mar 2009 | 11:13 am ముంబై ఉగ్రవాద దాడుల విచారణ ప్రారంభంముంబై ఉగ్రవాద దాడుల కేసు విచారణ సోమవారం ప్రారంభం అయింది. గత ఏడాది నవంబరు 26న పది మంది ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి ఇక్కడ వరకు వచ్చి దేశ ఆర్థిక రాజధానిలో విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ దాడులకు తీవ్ర నిరసన వ్యక్తం అయింది.Source: జాతీయ | 23 Mar 2009 | 11:11 am నేను పాకిస్థాన్ నుంచి వచ్చాను: కసబ్ వెల్లడిముంబయి ఉగ్రవాద దాడుల సందర్భంగా భద్రతా దళాలకు పట్టుబడిన ఒకేఒక్క తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ సోమవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు తాను పాకిస్థాన్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాకు చెందినవాడినని అంగీకరించాడు. ముంబయిSource: Yahoo! Telugu: News | 23 Mar 2009 | 10:42 am వరుణ్ ఇప్పటికీ మా అభ్యర్ధే: బీజేపీ స్పష్టంయువనేత వరుణ్‌గాంధీ ఇప్పటికీ తమ పార్టీ అభ్యర్ధేనని బీజేపీ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా వరుణ్‌ను పార్టీ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలపరాదంటూ ఈసీ చేసిన సూచనను ఆ పార్టీ కొట్టిపారేసింది. పార్టీలు ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో ఎవరిని నిలబెట్టకూడదో...Source: Yahoo! Telugu: News | 23 Mar 2009 | 10:34 am ఐపీఎల్‌కు వేదికగా లండన్‌కు టీం ఇండియా ఓటుఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ వేదిక లండన్ అయితే బాగుంటుందని టీం ఇండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. త్వరలో జరిగే ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 23 Mar 2009 | 10:19 am రాష్ట్రంలో హంగ్ తప్పదు: వెంకయ్యనాయుడుఈసారి జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ తప్పదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. నాలుగు పార్టీలు బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ఏపార్టీకీ పూర్తి మెజారిటీ రాబోదని ఆయన పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 23 Mar 2009 | 8:42 am రెండో టెస్ట్‌కు న్యూజిలాండ్ జట్టు యథాతథంటీం ఇండియాతో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే రెండో టెస్ట్‌కు కూడా కొనసాగించాలని న్యూజిలాండ్ సెలెక్టర్లు నిర్ణయించారు. సోమవారం రెండో టెస్ట్ జట్టు ఎంపిక కోసం సమావేశమైన న్యూజిలాండ్ సెలెక్టర్లు ఈ మేరకుSource: Yahoo! Telugu: News | 23 Mar 2009 | 8:40 am నానో వెళ్ళినందుకు బాధపడుతున్నాం: బుద్ధదేవ్టాటా కంపెనీకి చెందిన నానో ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్ నుంచి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళడం తమకెంతో బాధగావుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. దీనికి ప్రధాన కారణం తృణమూల్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ఆ పార్టీని విమర్శించారు. కార్మికుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. నానో మోటార్స్ సంస్థ ఉత్పాదన సింగూర్ నుంచి తరలివెళ్ళడం వెనుక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హస్తంవుందని, లేకుంటే సోమవారం ఆ బుల్లికారు తమ రాష్ట్ర రాజధాని కోల్‌కతా లేదా ముంబైలో విడుదలైవుండేదని ఆయన తెలిపారు.Source: జాతీయ | 23 Mar 2009 | 8:17 am బీసీసీఐ మమ్మల్ని సంప్రదించలేదు: హోంశాఖఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌ను విదేశాలకు తరలించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై హోంశాఖ మంత్రి పి.చిదంబరంను షాక్‌కు గురిచేసినట్లు సమాచారం. హోంశాఖతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం చిదంబరం విస్మయం చెందినట్లు తెలుస్తోంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయం హోంశాఖను అసంతృప్తికి గురిచేసింది. ఇటువంటి సత్వర నిర్ణయాలు తీసుకునే ముందు తమను సంప్రదించి ఉంటే బాగుండేదని హోంశాఖ భావిస్తోంది. తాజా పరిణామంపై హోంశాఖ త్వరలోనే వివరణ ఇవ్వనుంది.Source: జాతీయ | 23 Mar 2009 | 7:51 am లాలూ కలియుగ దుర్యోధనుడు...కాంగ్రెస్బీహార్ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలియుగ దుర్యోధనుడని బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ శర్మ అభివర్ణించాడు. ఏ విధంగానైతే దుర్యోధనుడు పాండవులకు ఐదు ఊర్లను ఇవ్వడానికి నిరాకరించాడో, అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్‌కూడా ఈ సారి బీహార్ రాష్ట్రంలో లోక్‌సభ సీట్లను కాంగ్రెస్ పార్టీకి కేటాయంచడంలో వ్యవహరించారని ఆయన అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 23 Mar 2009 | 6:33 am ఫిలిబిత్ అభ్యర్థి వరుణ్ గాంధీయే: భాజపాఫిలిబిత్ లోక్‌సభ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి వరుణ్ గాంధీయేనని భారతీయ జనతా పార్టీ సోమవారం ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్థుల పట్ల కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆ పార్టీ ఆరోపించింది. ముస్లిం ప్రజలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుకున్న వరుణ్ గాంధీపై సీఈసీ అనర్హత వేటు వేసిన విషయం తెల్సిందే. ఆయనకు టిక్కెట్ ఇవ్వరాదని భాజపాకు ఈసీ సూచించింది.Source: జాతీయ | 23 Mar 2009 | 6:33 am కొనసాగుతున్న మహా సీట్ల ప్రతిష్టంభనమహాకూటమిలోని ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, తెలంగాణా రాష్ట్ర సమితిల మధ్య సీట్ల సర్దుబాటులో నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో తెదేపా దిగిరాకుంటే ఒంటరిపోరుకైనా సిద్ధమని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 23 Mar 2009 | 6:31 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2009 | 5:24 am మార్చి 23, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ...Source: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2009 | 5:23 am తొలి దశ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన రాష్ట్రపతిదేశంలో తొలి దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సోమవారం విడుదల చేశారు. తొలి దశలో దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 124 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు.. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల తొలి దశ అసెబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది.Source: జాతీయ | 23 Mar 2009 | 5:19 am వరుణ్ గాంధీపై సీఈసీ అనర్హత వేటుభారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వరాదని భాజపాకు సీఈసీ ఆదేశించింది. తన ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వరుణ్ గాంధీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈసీ నిర్ధారించింది. వరుణ్ ప్రసంగించిన సీడీలను పరిశీలించిన ఈసీ, అందులోని మాటలు వరుణ్ గాంధీవేనని నిర్ధారించి, అనర్హత వేటు వేసింది.Source: జాతీయ | 23 Mar 2009 | 5:15 am రాష్ట్ర కొత్త డి.జి.పి ఏకే.మహంతి: సీఈసీ ఆదేశాలునియామకం అధికార కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బలాంటిదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, డీజీపీగా నియమితులైన మహంతి వీలైనంత త్వరగా బాధ్యతలు చేపట్టాలని సీఈసీ కోరింది. మహంతి నియామకంపై మజ్లిస్ పార్టీ చేసిన ఆరోపణలను ఈసీ ఏమాత్రం పరిగణంలోకి తీసుకోక పోవడం గమనార్హం.Source: ఏపీ న్యూస్ | 23 Mar 2009 | 4:22 am వైఎస్ అవినీతి భగీరథుడు: ఎన్టీఆర్ ఆరోపణతూర్పుగోదావరి జిల్లాలోనూ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం అధికార కాంగ్రెస్‌పై వాడివేడి ఆరోపణలతో సాగింది. ఎన్టీఆర్ ప్రచార కార్యక్రమాలకు తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు. తుని, అన్నవరం, ఉప్పాడ, కాకినాడ నగరంలో కొన్ని చోట్ల ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా అవినీతి భగీరథుడిగా అభివర్ణించారు.Source: ఏపీ న్యూస్ | 22 Mar 2009 | 11:34 am
|