బీసీసీఐ నిర్ణయంతో సంబంధం లేదు: కాంగ్రెస్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ పోటీలను విదేశాల్లో నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీసుకున్న నిర్ణయంతో తమకెలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని ఆ పార్టీ అధికార ప్రతినిధి వీరప్ప మొయిలీ వివరణ చ్చారు.
Source: జాతీయ | 22 Mar 2009 | 12:06 pm

కాంగ్రెస్ అభ్యర్థులపై ఆర్జేడీ పోటీ: లాలూ ప్రసాద్

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపుతామని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో అమీతుమీకి సిద్ధంగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నిమిత్తం బీహార్‌లో సీట్ల సర్దుబాటు కుదిరింది. రాష్ట్రంలోని 40 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి కేవలం మూడు సీట్లు మాత్రమే కేటాయించారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ 37 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించింది.
Source: జాతీయ | 22 Mar 2009 | 11:57 am

వైఎస్ అవినీతి భగీరథుడు: ఎన్టీఆర్ ఆరోపణ

తూర్పుగోదావరి జిల్లాలోనూ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం అధికార కాంగ్రెస్‌పై వాడివేడి ఆరోపణలతో సాగింది. ఎన్టీఆర్ ప్రచార కార్యక్రమాలకు తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు. తుని, అన్నవరం, ఉప్పాడ, కాకినాడ నగరంలో కొన్ని చోట్ల ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా అవినీతి భగీరథుడిగా అభివర్ణించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2009 | 11:34 am

ప్రభావశూన్యంగా మారుతున్న పాకిస్థాన్: భారత్

పాకిస్థాన్‌లో యంత్రాంగం ప్రభావశూన్యంగా మారుతోందని, విఫలమైన రాజ్యం స్థితికి వేగంగా దిగజారుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో విస్తరిస్తున్న తాలిబాన్ తీవ్రవాదుల ప్రాబల్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లోని ఈ పరిస్థితులు భారత్‌పై కూడా ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
Source: జాతీయ | 22 Mar 2009 | 11:27 am

సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం: సీఎం

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన టిక్కెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించినట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తమ పార్టీ ఖచ్చితంగా 230 అసెంబ్లీ, 36 లోక్‌సభ సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2009 | 8:50 am

రాష్ట్ర డి.జి.పిగా ఎం.వి.కృష్ణారావు!

రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా మద్దాల వెంకట కృష్ణారావు (ఎం.వి.కృష్ణారావు)ను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను ప్రశంసల వర్షంలో ముంచెత్తి వివాదాల్లో చిక్కుకున్న డిజిపి యాదవ్‌పై చర్య తీసుకోవాలని మాహాకూటమి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2009 | 7:20 am

రేపు తొలిదశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల

ఏప్రిల్ 16వ తేదీన జరుగనున్న తొలి దశ పోలింగ్‌కు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర అసెంబ్లీకి ఉన్న 294 సీట్లకు కాను తొలి దశలో 154 స్థానాలకు, 42 ఎంపీ సీట్లకు గాను 16 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇఒ) ఐ.వి.సుబ్బారావు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2009 | 6:57 am

భారతీయ సిబ్బంది నౌకను విడిచిపెట్టిన పైరేట్లు

సోమాలియా సముద్రపు దొంగలు (పైరేట్లు) ఆదివారం భారతీయ నావికులు ఉన్న నౌకను విడిచిపెట్టారు. ఈ నౌకలో 16 మంది భారతీయ నావికులు ఉన్నారు. సోమాలియా తీరంలో శనివారం హైజాక్ చేసిన నౌకను పైరేట్లు విడిచిపెట్టారని అధికారిక వర్గాలు తెలిపాయి. నౌకలోని భారతీయ సిబ్బంది మొత్తం సురక్షితంగా ఉన్నారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది.
Source: జాతీయ | 22 Mar 2009 | 6:47 am

జలయజ్ఞంలో అవినీతిని ఎండగడతాం: దేవేందర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదు నక్షత్రాల హోటల్‌లో కలగంటున్నారని ప్రజారాజ్యం పార్టీ నేత దేవేందర్ గౌడ్ దుయ్యబట్టారు. హోటల్ ఏసీ గదుల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించి, 234 అసెంబ్లీ, 36 లోక్‌సభ స్థానాలు సాధిస్తామని వైఎస్ అంటున్నారు. అసలు 234 సీట్లు వస్తాయో, 34 సీట్లు వస్తాయో ఎన్నికల తరువాత తెలుస్తుందని ఎద్దేవా చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2009 | 6:45 am

లోక్‌సత్తా మూడో ఎన్నికల జాబితా విడుదల

లోక్‌సత్తా పార్టీ రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం శనివారం మూడో అభ్యర్థుల జాబితా ప్రకటించింది. తాజా జాబితాలో 61 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటికే విడుదల చేసిన రెండు జాబితాల్లో 56 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2009 | 6:44 am

మార్చి 22, 2009 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా 15.00 అభిరుచి 15.30 ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2009 | 5:35 am

ఈ వారం


Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2009 | 5:34 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2009 | 5:33 am

జమ్మూలో ఎన్‌కౌంటర్‌: ఆర్మీ మేజర్ మృతి

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ మేజర్‌తో సహా ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో సైనికుడు గాయపడ్డారు. సైనికుల ఎదురు కాల్పుల్లో ఐదుగురు మిలిటెంట్లు హతమైనట్టు సమాచారం. గత శుక్రవారం నుంచి సాగుతున్న ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. కుప్వారా జిల్లాలోని హఫ్రాదా అడవుల్లో తిష్టవేసిన మిలిటెంట్లను ఏరివేసే క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
Source: జాతీయ | 22 Mar 2009 | 5:15 am

పెరేడ్‌ గ్రౌండ్‌లో మోగిన ప్రజా విజయభేరి

‘ప్రజారాజ్యం’ ప్రజా విజయభేరి అట్టహాసంగా మోగింది. సికింద్రాబాద్‌లోని పెరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయింది. అశేష అభిమాన జన సందోహం తరలి రావడంతో పరేడ్‌ గ్రౌండ్‌ సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ప్రజా విజయభేరి సభా వేదికపై ప్రజారాజ్యం పార్టీకి చెందిన హేమాహెమీలంతా ఆసీనులయ్యారు. లక్షలాది సంఖ్యలో అభిమానులు విజయభేరీ సభా ప్రాంగణానికి తరలివస్తుండడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ అక్కడే స్తంభించి పోయింది.
Source: ఏపీ న్యూస్ | 21 Mar 2009 | 1:12 pm

"అల్లు అర్జున్‌"తో గుణశేఖర్ కొత్త చిత్రం!

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, డైనమిక్ డైరక్టర్ గుణశేఖర్‌ల సూపర్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. యూనివర్శల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తోన్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో హీరో అల్లు అర్జున్‌పై...
Source: వినోదం | 21 Mar 2009 | 1:08 pm