పెరేడ్‌ గ్రౌండ్‌లో మోగిన ప్రజా విజయభేరి

‘ప్రజారాజ్యం’ ప్రజా విజయభేరి అట్టహాసంగా మోగింది. సికింద్రాబాద్‌లోని పెరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయింది. అశేష అభిమాన జన సందోహం తరలి రావడంతో పరేడ్‌ గ్రౌండ్‌ సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ప్రజా విజయభేరి సభా వేదికపై ప్రజారాజ్యం పార్టీకి చెందిన హేమాహెమీలంతా ఆసీనులయ్యారు. లక్షలాది సంఖ్యలో అభిమానులు విజయభేరీ సభా ప్రాంగణానికి తరలివస్తుండడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ అక్కడే స్తంభించి పోయింది.
Source: ఏపీ న్యూస్ | 21 Mar 2009 | 1:12 pm

వారంలో 2.40 శాతం మేరకు సెన్సెక్స్ వృద్ధి

గత వారం కంటే ఈ వారంలో కీలక సూచీలు బాగా వృద్ధి చెందాయనే చెప్పాలి. రియాల్టీ, మెటల్ కౌంటర్లలో క్రయవిక్రయాలు ఊపందుకోవడంతో ఈ వారంలో సెన్సెక్స్ 2.40 శాతం వరకు లాభపడింది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు మరో సారి తగ్గించే అవకాశం ఉందన్న అంచనాల...
Source: Yahoo! Telugu: News | 21 Mar 2009 | 11:22 am

వైఎస్‌పై రోజా విమర్శలు గర్హనీయం: కాంగ్రెస్

ముఖ్యమంత్రి వైఎస్‌పై టీడీపీ నేత రోజా చేస్తున్న విమర్శలు గర్హనీయమంటూ కాంగ్రెస్ హెచ్చరించింది. రోజా ఇకనైనా తన తీరు మార్చుకోకుంటే ఆమె తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ పార్టీ పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 21 Mar 2009 | 11:13 am

బీహార్‌లో 37 సీట్లలో కాంగ్రెస్ పోటీ: షిండే

బీహార్‌ రాష్ట్రంలోని 40 లోక్‌సభ సీట్లకు గాను 37 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన బీహార్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సుషీల్ కుమార్ షిండే శనివారం వెల్లడించారు. మిగిలిన మూడు స్థానాల్లో పోటీ చేయబోమని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 21 Mar 2009 | 10:59 am

భారత భూభాగంపై పాక్ కాల్పులు: సైన్యం

భారత భూభాగంపై పాకిస్థాన్ మళ్లీ కాల్పులకు తెగబడిందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. శుక్రవారం రాత్రి శనివారం తెల్లవారు జామువరకు యూరీ సెక్టార్‌లోని కమల్‌కోట్ భారత భద్రతా దళాల పోస్టులపై కాల్పులకు తెగబడ్డారని సైనికాధికారులు వెల్లడించారు. పాక్ సైనికులు జరిపిన ఈ కాల్పుల కారణంగా ఓ సైనికుడు గాయపడినట్టు సైనిక వర్గాలు పేర్కొన్నాయి.
Source: జాతీయ | 21 Mar 2009 | 10:53 am

రోశయ్య విమర్శలు మానుకోవాలి: గాలి

తమ పార్టీ తరపున ప్రచారబరిలో దిగిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లపై ఆర్థికమంత్రి రోశయ్య చేస్తున్న విమర్శలను టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తప్పుబట్టారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లను విమర్శించడం రోశయ్య ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 21 Mar 2009 | 10:46 am

భారత భూభాగంపై పాక్ కాల్పులు: సైన్యం

భారత భూభాగంపై పాకిస్థాన్ మళ్లీ కాల్పులకు తెగబడిందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. గత రాత్రినుంచి శనివారం తెల్లవారుజామువరకు పాక్ దళాలు భారత భూభాగంపైకి కాల్పులు జరిపినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. పాక్ జరిపిన ఈ కాల్పుల కారణంగా...
Source: Yahoo! Telugu: News | 21 Mar 2009 | 10:34 am

కాంగ్రెస్‌, జేఎంఎంల పొత్తుపై నీలినీడలు

లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్ఛా పార్టీ (జేఎంఎం)ల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందానికి బ్రేక్ పడే సూచనలు కన్పిస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైన ఈ రెండు పార్టీలు ఇటీవలే సీట్ల పంపిణీ...
Source: Yahoo! Telugu: News | 21 Mar 2009 | 10:25 am

బీహార్‌లో 37 స్థానాల్లో బరిలోకి: కాంగ్రెస్

బీహార్‌లో రాజకీయం క్రమంగా వెడెక్కుతోంది. లాలూ, పాశ్వాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందంతో తాము కోరినన్ని సీట్లు దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ రాష్ట్రంలోని దాదాపు అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ బరిలో దిగాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా...
Source: Yahoo! Telugu: News | 21 Mar 2009 | 10:04 am

నిబంధనల్లో మార్పు సిగ్గుచేటు: హామిల్టన్

ఫార్ములా వన్‌ నిబంధనల్లో మార్పు చేయడం సిగ్గుచేటని ఎఫ్1 ప్రపంచ ఛాంపియన్ లెవిస్ హామిల్టన్ విమర్శించాడు. ఇలా నిబంధనల్లో మార్పు చేస్తే ఎఫ్1 ఎలా వృద్ధి చెందుతుందని హామిల్టన్ ప్రశ్నించాడు. రానున్న రోజుల్లో ఈ ఆటకు ఎం జరుగుతోందో తనకు అర్థం...
Source: Yahoo! Telugu: News | 21 Mar 2009 | 9:49 am

ఆర్ఎస్ఎస్ నుంచి వైదొలగిన సుదర్శన్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ కేఎస్ సుదర్శన్ పదవి నుంచి తప్పుకున్నట్లు ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. ఆయన తర్వాత జనరల్ కార్యదర్శిగా ఉన్న మోహన్ భగవత్ చీఫ్ పీఠాన్ని అధిష్టించనున్నారని పేర్కొన్నాయి. రేషిమ్‌బాఘ్ స్మృతి మందిరం...
Source: Yahoo! Telugu: News | 21 Mar 2009 | 8:26 am

విజయంపై ధీమాతో ప్రజల ముందుకు: వైఎస్

విజయంపై ధీమాతోనే తాజా ఎన్నికల కోసం తాము ప్రజల ముందుకు వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలన్నింటినీ అమలు చేసిన తాము అదే ధైర్యంతోనే ప్రజలముందుకు వెళ్తున్నామంటూ వ్యాఖ్యానించారు.
Source: Yahoo! Telugu: News | 21 Mar 2009 | 8:19 am

మోంటే కార్లో టోర్నీ నుంచి తప్పుకున్న ఫెదరర్

త్వరలో ప్రారంభం కానున్న మోంటే కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ నుండి స్విట్జర్లాండ్‌కు చెందిన టాప్ ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్ తప్పుకున్నాడు. టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఫెదరర్ ఇదివరకే తమతో చెప్పినట్లు ఈ టోర్నీ డైరెక్టర్ జికో ఫ్రానులొవిక్...
Source: Yahoo! Telugu: News | 21 Mar 2009 | 8:03 am

'భారత్ మహాన్.కామ్‌'కు అర్ధశత దినోత్సవం

కార్తీక్, కరుణ హీరోహీరోయిన్లుగా, చిగుళ్లపల్లి పుందరీకం నిర్మించిన భారత్ మహాన్.కామ్ చిత్రం శుక్రవారంతో 50 రోజులను పూర్తి చేసుకుంది. అర్థశతదినోత్సవాన్ని పురస్కరించుకుని నటీనటులు, టెక్నీషియన్లకు ఫిలింఛాంబర్‌లో షీల్డులను అందజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Mar 2009 | 7:55 am

'భారత్ మహాన్.కామ్‌'కు అర్ధశత దినోత్సవం

కార్తీక్, కరుణ హీరోహీరోయిన్లుగా, చిగుళ్లపల్లి పుందరీకం నిర్మించిన భారత్ మహాన్.కామ్ చిత్రం శుక్రవారంతో 50 రోజులను పూర్తి చేసుకుంది. అర్థశతదినోత్సవాన్ని పురస్కరించుకుని నటీనటులు, టెక్నీషియన్లకు ఫిలింఛాంబర్‌లో షీల్డులను అందజేశారు.
Source: Yahoo! Telugu: News | 21 Mar 2009 | 7:55 am

విడుదలైన "అ..ఆ..ఇ..ఈ" ఆడియో

శ్రీకాంత్, మీరాజాస్మిన్, సదా హీరోహీరోయిన్లుగా, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో అశోక్‌యాదవ్ నిర్మిస్తున్న "అ..ఆ..ఇ..ఈ" చిత్రం ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. శుక్రవారం జయభేరి గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Mar 2009 | 7:54 am

ఆర్సెస్‌ చీఫ్‌గా మోహన్ భగవత్ నియామకం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) చీఫ్‌గా ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ నియమితులయ్యారు. నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఆ పార్టీ కార్యవర్గ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చీఫ్ కె.సుదర్శన్ ఆ పదవి నుంచి తప్పుకోవడంతో మోహన్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం సంస్థలో రెండవ స్థానంలో ఉన్న మోహన్ భగవత్ ఒక పట్టాన కొరుకుడు పడని వ్యక్తిగా ముద్రపడ్డారు.
Source: జాతీయ | 21 Mar 2009 | 7:51 am

వైవిధ్యంగా పోలీస్ పోలీస్ ఆడియో విడుదల

శ్రీరామ్, పృథ్వీరాజ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్లుగా నటించిన చిత్రం పోలీస్ పోలీస్. చందు దర్శకత్వంలో మన్మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఆడియోను శుక్రవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఆడియో విడుదల కార్యక్రమాన్ని...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Mar 2009 | 7:51 am

తీవ్రవాదాన్ని రూపుమాపాలి: రాష్ట్రపతి పాటిల్

సమాజంలో నానాటికీ ప్రజ్వరిల్లుతున్న తీవ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపాలని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే అతిపెద్ద వినాశకారి అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచ శాంతి కోసం ఉగ్రవాదాన్ని నిర్మూలించే కొన్ని కీలకమైన కార్యక్రమాలను చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 21 Mar 2009 | 7:41 am

కేరళ విమానాశ్రయాలకు ఎల్టీటీఈ ముప్పు

కేరళ రాష్ట్రంలోని మూడు విమానాశ్రయాలకు తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో తిరువనంతపురం, కొచ్చిన్ కోళికోడ్ విమానాశ్రయాలకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముంబైలోని ఎయిర్‌పోర్ట్ ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందని, అందువల్ల భద్రను మరింత పెంచినట్టు ఎయిర్ ఇండియా సెక్యూరిటీ ఆఫీస్ అధికారులు వెల్లడించారు. దీంతో మూడు విమానాశ్రయాల భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసి, గస్తీని మరింత ముమ్మరం చేసినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 21 Mar 2009 | 7:26 am

జార్ఖండ్‌లో కాంగ్రెస్-జెఎంఎం పొత్తు విచ్ఛిన్నం

జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్ఛా పార్టీల మధ్య కుదిరిన పొత్తు విచ్ఛిన్నమైంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేలా ఈ రెండు పార్టీలు సీట్ల పంపిణీ ఒప్పందాన్ని ఇటీవల కుదుర్చుకున్నాయి. ఈ విషయాన్ని జేఎంఎం చీఫ్ శిబూ సొరేన్ కుమారుడు శిబు సొరేన్ శనివారం వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.
Source: జాతీయ | 21 Mar 2009 | 7:10 am

'పౌరుడు' దర్శకుడు రాజ్ ఆదిత్య ఆత్మహత్య

వర్ధమాన దర్శకుడు రాజ్ ఆదిత్య సికింద్రాబాద్‌లో శనివారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. సుమంత్ హీరోగా వచ్చిన పౌరుడు చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్ ఆదిత్య తాజాగా దర్శకత్వం వహించిన 'మళ్లీ మళ్లీ' చిత్రం శనివారం...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Mar 2009 | 6:51 am

పోటీ నుంచి వరుణ్‌ను తప్పించాలి: ఏచూరీ

మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ యువ నేత వరుణ్ గాంధీని ఎన్నికల పోటీకి దూరంగా ఉంచాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ డిమాండ్ చేశారు. దేశ నైతిక విలువలపై ఏమాత్రం నమ్మకం, గౌరవం ఉన్నా భాజపా వరుణ్‌పై తక్షణ చర్య తీసుకోవాలని ఆయన సూచించారు. వరుణ్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఏచూరీ స్పందిస్తూ.. ఎన్నికల సంఘం తుది నిర్ణయం వచ్చేంత వరకు వేచి చూసే ధోరణిని అవలంభించడం భాజపాకు మంచిది కాదన్నారు.
Source: జాతీయ | 21 Mar 2009 | 6:42 am

మరోమారు సీబీఐ కస్టడీకి రాజు సోదరులు

సత్యం కంప్యూటర్స్ ఆర్థిక కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజులను సీబీఐ మరోమారు తమ కస్టడీలోకి తీసుకుంది. ఇప్పటికే ఓసారి రాజు సోదరులను కస్టడీలోకి తీసుకుని విచారించిన సీబీఐ మరోసారి వారిని తమ కస్టడీలోకి తీసుకోవడం విశేషం.
Source: ఏపీ న్యూస్ | 21 Mar 2009 | 6:28 am

భారత ఎయిర్‌మార్షల్‌ చీఫ్‌గా ప్రదీప్ నాయక్

భారత వైమానికదళ అధిపతిగా ప్రదీప్ నాయక్ నియమితులయ్యారు. ఆయన వచ్చే మే 31వ తేదీన బాధ్యతలు స్వీకరించవచ్చు. ప్రస్తుత ఎయిర్ మార్షల్ ఫాలి హోమీ మేజర్ పదవీ విరమణ చేసిన తర్వాత ప్రదీప్ నాయక్ బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్రం ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రదీప్ నాయక్ ప్రస్తుతం భారత వైమానికదళ ఉప దళపతిగా ఉన్నారు. 1949 జులై 22వ తేదీన జన్మించిన నాయక్, 1969 జూన్ 21వ తేదీన వైమానికదళంలోకి ప్రవేశించారు.
Source: జాతీయ | 21 Mar 2009 | 5:51 am

1994 పరిణామాలపై పుస్తకం: దగ్గుబాటి

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1994 ఆగస్టులో చోటుచేసుకున్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓ పుస్తకాన్ని తయారుచేశారు. ఒక చరిత్ర - కొన్ని నిజాలు (అదర్‌సైడ్ ఆఫ్ ట్రూత్) అనే పేరుతో సిద్ధమైన ఈ పుస్తకాన్ని ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు విడుదల చేస్తానంటూ ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Mar 2009 | 5:26 am

నేడు ప్రజారాజ్యం ప్రజా విజయభేరి

తెలంగాణ ప్రాంతంలో తన బలాన్ని నిరూపించేందుకు ప్రజారాజ్యం పార్టీ నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్‌లో శనివారం సాయంత్రం జరుగనుంది. పార్టీ స్థాపించిన తర్వాత రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సభను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుపతి, రాజమండ్రి బహిరంగ సభలకు ధీటుగా ప్రజా విజయభేరి సభను నిర్వహించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Mar 2009 | 5:22 am

నైతిక విలువలకు కాంగ్రెస్ పాతర: జూ ఎన్టీఆర్

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు రాజకీయాలను, విలువలను దిగజార్చారంటూ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఆపై ఏం చేసిందో అందరికీ తెలిసిందేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క మహిళైనా ఆర్థికంగా నిలబడిందా అంటూ ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఆవేశంగా ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Mar 2009 | 5:22 am

నేడు పీఆర్పీ తీర్థం పుచ్చుకోనున్న కృష్ణంరాజు

సినీనటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు ప్రజారాజ్యం పార్టీలో చేరే విషయం దాదాపు ఖరారైంది. బీజేపీనుంచి మరోపార్టీకి మారేందుకు కృష్ణంరాజు ప్రయత్నిస్తున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో శనివారం ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరే విషయం తేలనుంది.
Source: ఏపీ న్యూస్ | 21 Mar 2009 | 5:22 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 21 Mar 2009 | 3:30 am

మార్చి 21, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 న్యూ సినిమా స్పెషల్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 నీపేరేనా ప్రేమ 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమా ...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Mar 2009 | 3:28 am

తృతీయ కూటమి కల సాకారం కాదు: వెంకయ్య

కేంద్రంలో తృతీయ కూటమి అధికార కల.. కలగానే మిగిలి పోతోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు. తృతీయ కూటమి ఓ పార్కింగ్ ప్రదేశంలాంటిదని పేర్కొన్న వెంకయ్య అక్కడ ఏ పార్టీ అయినా కాసేపు నిలిచి, తర్వాత వెళ్లిపోవచ్చంటూ ఎద్దేవా చేశారు. తృతీయ కూటమిలో చేరామంటూ చెబుతున్న పార్టీలన్నీ ఎన్నికల తర్వాత తలో దిక్కుకు పారిపోతాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Source: జాతీయ | 21 Mar 2009 | 3:21 am

సుప్రీం జడ్జిపై చెప్పు విసిరిన మహిళకు జైలు శిక్ష

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు న్యాయమూర్తిపై చెప్పు విసిరిన సంఘటనలో ఒక మహిళకు జైలు శిక్ష విధించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కేసు విచారణ సాగుతున్న సమయంలో న్యాయమూర్తిపై ఓ మహిళ చెప్పు విసిరింది. కేసు విచారణ నిమిత్తం న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న జస్టిస్ అరిజిత్ పసాయత్‌పైకి నిందితురాలిగా కోర్టుకు హాజరైన లీలాడేవిడ్ అనే మహిళ చెప్పు విసరడంతో కోర్టులో కలకలం రేగింది. దీంతో కోర్టు ధిక్కారణ నేరం కింద సదరు మహిళకు మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించారు.
Source: జాతీయ | 21 Mar 2009 | 3:18 am

చేవెళ్ల నుంచే మా ఎన్నికల పర్యటన: వైఎస్

వచ్చే ఎన్నికల్లోనూ విజయం కాంగ్రెస్ పార్టీదేనని ముఖ్యమంత్రి వైఎస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ పొలానికి నీరు, ప్రతి ఇంట్లో వెలుగు, ప్రతి ఒక్కరికీ చేతినిండా పని అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ రానున్న ఎన్నికలకోసం పార్టీ ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విజయఢంకా మోగించి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు.
Source: ఏపీ న్యూస్ | 20 Mar 2009 | 2:50 pm

కూటమికోసం సగం సీట్లు తగ్గించుకుంటాం: మందకృష్ణ

తమకు సీట్లు కేటాయించే విషయమై మహాకూటమికి 48గంటల డెడ్‌లైన్ పెట్టిన ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ తాజాగా తన నిర్ణయాన్ని సవరించుకున్నారు. తన డిమాండ్‌కు మహాకూటమినుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా ఆయనే మరో ఆఫర్‌ను కూటమి ముందుంచారు. దీనిప్రకారం ముందుగా కోరినట్టు కాకుండా 15 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లు ఇచ్చినా సరిపెట్టుకుంటామంటూ ఆయన ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Mar 2009 | 2:25 pm