|
చేవెళ్ల నుంచే మా ఎన్నికల పర్యటన: వైఎస్వచ్చే ఎన్నికల్లోనూ విజయం కాంగ్రెస్ పార్టీదేనని ముఖ్యమంత్రి వైఎస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ పొలానికి నీరు, ప్రతి ఇంట్లో వెలుగు, ప్రతి ఒక్కరికీ చేతినిండా పని అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ రానున్న ఎన్నికలకోసం పార్టీ ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విజయఢంకా మోగించి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు.Source: ఏపీ న్యూస్ | 20 Mar 2009 | 1:20 pm కాంగ్రెస్, ఎన్సీపీ సీట్ల సర్దుబాటు ఖరారుకేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) శుక్రవారం అధికార యూపీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌తో మహారాష్ట్రకు సంబంధించి సీట్ల సర్దుబాటు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ మొత్తం 40 సీట్లలో 22 స్థానాల్లో పోటీ చేయనుండగా, 26 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది.Source: జాతీయ | 20 Mar 2009 | 12:31 pm రోజాపై మహిళా కాంగ్రెస్ దాడితెలుగు దేశంపార్టీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు రోజా మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెపై దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా కొందరు మహిళలు రోజాపై దాడికి పాల్పడ్డారు. మంత్రి గల్లా అరుణకుమారి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రగిరిలో సినీ నటిరోజాకు తెలుగుదేశం పార్టీ తరుపున దాదాపుగా టికెట్ ఖరారైంది. దీంతో యర్రావానిపాళెం మండలం బందవాని పల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె కాంగ్రెస్ పార్టీపై ఘాటుగా విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 20 Mar 2009 | 11:43 am మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 35 పాయింట్ల పతనంబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిసింది. 51 పాయింట్ల పతనంతో 8,951 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సూచి అనంతరం బ్యాంకింగ్, కాపిటల్ గూడ్స్, రియాల్టీ వాటాలు బలహీనపడటంతో ఒకానొక దశలో 8,867 పాయింట్లSource: Yahoo! Telugu: News | 20 Mar 2009 | 11:28 am కూటమికోసం సీట్లు తగ్గించుకుంటాం: మందకృష్ణతమకు సీట్లు కేటాయించే విషయమై మహాకూటమికి 48గంటల డెడ్‌లైన్ పెట్టిన ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ తాజాగా తన నిర్ణయాన్ని సవరించుకున్నారు. తన డిమాండ్‌కు మహాకూటమినుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో...Source: Yahoo! Telugu: News | 20 Mar 2009 | 11:28 am కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య సీట్ల సర్దుబాటు ఖారారుకేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) శుక్రవారం అధికార యూపీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌తో మహారాష్ట్రకు సంబంధించి సీట్ల సర్దుబాటు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది.Source: Yahoo! Telugu: News | 20 Mar 2009 | 10:49 am హాలీవుడ్ సెక్సీయెస్ట్ మదర్‌గా ఏంజెలీనా!మదర్స్ డే సందర్భంగా నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ సెక్సీయెస్ట్ మదర్‌గా టాప్‌లో నిలిచింది. ఇప్పటికే ఆరుగురి సంతానం కలిగి ఉన్న ఏంజెలీనా, ఏడో సంతానానికి కూడా ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో..Source: వినోదం | 20 Mar 2009 | 10:44 am ఐపీఎల్ రెండో సీజన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం నోఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌ను పట్టిపీడిస్తున్న భద్రతా సమస్యలు ఇంకా తీవ్రరూపం దాల్చాయి. మహారాష్ట్ర పోలీసులు తాజాగా ఐపీఎల్ రెండో సీజన్‌కు భద్రత కల్పించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలుSource: Yahoo! Telugu: News | 20 Mar 2009 | 10:34 am మేఘాలయ సంక్షోభం: అద్వానీతో సంగ్మా భేటికేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం మేఘాలయ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఎన్సీపీ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ సీనియర్ నేత పీఏ సంగ్మా శుక్రవారం బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, సీనియర్ నేత ఎల్‌కే అద్వానీతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పాలన విధించడంపై ఆగ్రహంతోనే అద్వానీతో సంగ్మా తాజాగా సమావేశమయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.Source: జాతీయ | 20 Mar 2009 | 10:13 am రాజకీయాలను గ్రామాలకు తెస్తాం: జేపీరాజధానిలోనే కేంద్రీకృతమైన రాజకీయాలను గ్రామాలకు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో డబ్బున్నవారిదే రాజ్యంగా ఉందని అందుకే రాజకీయాలను భూమార్గం...Source: Yahoo! Telugu: News | 20 Mar 2009 | 9:48 am వచ్చే ఎన్నికల్లోనూ గెలుపుమాదే: వైఎస్వచ్చే ఎన్నికల్లోనూ విజయం కాంగ్రెస్ పార్టీదేనని ముఖ్యమంత్రి వైఎస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ పొలానికి నీరు, ప్రతి ఇంట్లో వెలుగు, ప్రతి ఒక్కరికీ చేతినిండా పని అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నట్టు ఈ సందర్భంగా...Source: Yahoo! Telugu: News | 20 Mar 2009 | 9:37 am ఎన్నికల తరువాత ప్రధానిపై నిర్ణయం: దేవెగౌడతృతీయ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ శుక్రవారం మాట్లాడుతూ.. తమ కూటమి ప్రధాని అభ్యర్థిత్వంపై ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే లోక్‌సభSource: Yahoo! Telugu: News | 20 Mar 2009 | 9:29 am కృష్ణా పర్యటన విజయవంతం: చిరంజీవితన కృష్ణా జిల్లా పర్యటన విజయవంతమైందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రజలు పీఆర్పీకి బ్రహ్మరథం పట్టారని పేర్కొన్న ఆయన పార్టీ విజయావకాశాలు సాధిస్తుందనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 20 Mar 2009 | 9:10 am వరుణ్... ఇక ప్రచారానికి వెళ్లొద్దు: బీజేపీతన వివాదాస్పద వ్యాఖ్యలతో ఈసీ నోటీసులతోపాటు, క్రిమినల్ కేసులను కూడా ఎదుర్కొంటున్న యువనేత వరుణ్ గాంధీని పార్టీ ప్రచారం నుంచి దూరంగా ఉంచనున్నట్టు బీజేపీ ప్రకటించింది. దీనిప్రకారం పార్టీ తరపున ప్రచారం నిర్వహించనున్న నేతల పేర్లతో కూడిన జాబితానుంచి బీజేపీ వరుణ్ పేరును తొలగించి ఈసీకి సమర్పించనుంది.Source: జాతీయ | 20 Mar 2009 | 9:07 am ఇండియన్ వెల్స్ టోర్నీ సెమీస్‌లో ఆండీ ముర్రేఆండీ ముర్రే (ఇంగ్లాండ్) ఇండియన్ వెల్స్ హార్డ్‌కోర్ట్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముర్రే క్రొయేషియా క్రీడాకారుడు ఇవాన్ జుబికిక్‌తో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ముర్రే 7-5, 7-6 (8/6)Source: Yahoo! Telugu: News | 20 Mar 2009 | 9:06 am ప్రకృతి రమణీయతకు నెలవు "పేరుపాలెం బీచ్"ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు మండలానికి చెందిన గ్రామము పేరుపాలెం. పేరుపాలెం ఒక సుందరమైన పర్యాటక ప్రదేశమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇక్కడ మనోహరమైన, సువిశాలమైన సాగరతీరం కలదు. ఈ పేరుపాలెం బీచ్ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.Source: వినోదం | 20 Mar 2009 | 8:32 am ఉమ్మడి గుర్తు కోసం సుప్రీంను ఆశ్రయించిన పీఆర్పీఉమ్మడి గుర్తు కోసం ప్రజారాజ్యం పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు తమ పార్టీ ఉమ్మడి గుర్తు కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని ఆ పార్టీ నేత అల్లు అరవింద్ శుక్రవారం తెలిపారు. తమ పార్టీకి తప్పకుండా ఉమ్మడి గుర్తు వస్తుందని, లేని పక్షంలో ప్రత్యామ్నాయం ఉండనే ఉందన్నారు. పీఆర్పీకి ఒకే గుర్తు కేటాయించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంను ఆ పిటిషన్‌లో కోరామని అల్లు అరవింద్ చెప్పారుSource: ఏపీ న్యూస్ | 20 Mar 2009 | 8:27 am వరుణ్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి, దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనవడు వరుణ్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు వరుణ్ గాంధీ గత కొన్నిరోజులుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.Source: జాతీయ | 20 Mar 2009 | 8:20 am మేఘాలయ వివాదం: అద్వానీతో సంగ్మా భేటికేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం మేఘాలయ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఎన్సీపీ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ సీనియర్ నేత పీఏ సంగ్మా శుక్రవారం బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, సీనియర్ నేత ఎల్‌కేSource: Yahoo! Telugu: News | 20 Mar 2009 | 8:17 am "నిన్ను చేరాలని" ఆడియో విడుదలబాలాదిత్య, అనిల్ హీరోలుగా రూపా, సానియా హీరోయిన్లుగా వి.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "నిన్ను చేరాలని". శారదా ప్రొడక్షన్స్ పతాకంపై డి. లక్ష్మీనారాయణ నిర్మించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది.Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2009 | 7:46 am 22న "మేస్త్రీ"కి అభినందన సభదర్శకరత్న దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలో నటించిన "మేస్త్రీ" చిత్రం అభినందన సభ ఈ నెల 22న రవీంద్రభారతిలో జరుగనుంది. వంశీ ఇంటర్నేషనల్ వంశీరామరాజు ఆధ్వర్యంలో ఈ సభను వైభవంగా నిర్వహిస్తున్నారు. సురేష్ కృష్ణ దర్శకత్వం...Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2009 | 7:44 am 21న ప్రేక్షకుల ముందుకు కూతురు కోసంఆర్. నారాయణమూర్తి నిర్మాణ, దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కూతురు కోసం చిత్రం శనివారం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఇటీవలే పొట్టిశ్రీరాములు యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ ఆవుల మంజులత, ఉస్మానియా తెలుగు...Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2009 | 7:43 am భవాని ఐపీఎస్‌గా ప్రేక్షకుల ముందుకు స్నేహస్నేహ టైటిల్ పాత్రలో రూపొందుతున్న చిత్రం భవాని ఐపీఎస్. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి జి. కిచ దర్శకత్వం వహిస్తున్నారు. నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్ స్టూడియోలో గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్...Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2009 | 7:37 am పున్నమినాగు కోసం ముమైత్ హాట్ స్టిల్స్పున్నమినాగు చిత్రం పబ్లిసిటీ కోసం ముమైత్‌ఖాన్ హాట్ చిత్రాలను నిర్మాతలు ఉపయోగించుకున్నారు. నాగుపాము పాత్ర ప్రధానంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ముమైత్ కొన్ని హాట్స్ సీన్స్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగిని డాన్స్...Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2009 | 7:35 am వేడుకగా ప్రభాస్ "బిల్లా" ఆడియో ఆవిష్కరణగోపీకృష్ణా మూవీస్ పతాకంపై రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్, అనుష్క, నమిత హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న "బిల్లా" చిత్రం ఆడియో అభిమానుల కేరింతల మధ్య బుధవారం రాత్రి శిల్పారామంలో విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన ఆడియో సభకు...Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2009 | 7:31 am జయప్రకాష్ రైలు ప్రచారం ప్రారంభంలోక్సత్తా పార్టీ జాతీయ సమన్వయకర్త జయప్రకాష్ నారాయణ విజిల్ స్టాప్స్ పేరిట రైలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం సికిందరాబాద్ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఆయన తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రత్యేకంగా కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ఓ బోగీని లోక్‌సత్తా పార్టీకి కేటాయించారు. విజిల్ స్టాప్స్ పేరిట ఈ ప్రయాణం 7 జిల్లాలలో 25 నియోజకవర్గాలమీదుగా నెల్లూరు వరకు కొనసాగుతుంది. ప్రతి స్టేషన్లో రైలు ఆగిన ఆ కొద్ది సమయంలోనే జయప్రకాష్ నారాయణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారుSource: ఏపీ న్యూస్ | 20 Mar 2009 | 7:09 am చర్యలు తీసుకునేందుకు అవి చాలు: భారత్పాకిస్థాన్ ప్రభుత్వం అడిగిన 30 ప్రశ్నలకు తాము ఇటీవల పంపిన సమాధానాలు ఆ దేశ చర్యలు తీసుకునేందుకు సరిపోతాయని విదేశాంగ శాఖ సహాయమంత్రి ఆనంద్ శర్మ పేర్కొన్నారు. తాము పంపిన సమాధానాలతో ఉగ్రవాద అనుమానితులపై చర్యలు తీసుకునేందుకు వీలుందని ఆయన గురువారం అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 20 Mar 2009 | 6:41 am పాకిస్థాన్ వనరులతో పేట్రేగుతున్న తీవ్రవాదులు: ప్రణబ్దేశంలో తీవ్రవాద కార్యకాలాపాలు సాగిస్తున్న వ్యక్తులు పాకిస్థాన్ వనరులను ఉపయోగించుకుంటున్నారని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. భారత్‌లో తీవ్రవాద దాడులకు పాకిస్థాన్ భూభాగంలో ఉన్న తీవ్రవాద మౌళిక సదుపాయాలను ఉపయోగించుకుంటున్నారని చెప్పారు.Source: జాతీయ | 20 Mar 2009 | 6:18 am ఎక్కడున్నాయో కనిపెట్టేందుకే..?తలమీద చాలా తక్కువ వెంట్రుకలు ఉన్న ఒకాయన 'హేర్ కటింగ్' చేసుకోవడానికి సెలూన్‌కి వచ్చాడు.Source: వినోదం | 20 Mar 2009 | 5:20 am వందనోటు మింగేసింది...!"ఈ మేక ధర ఎంత..?" అడిగాడు రామయ్య "500 రూపాయలు" చెప్పాడు గొర్రెలకాపరి...Source: వినోదం | 20 Mar 2009 | 5:19 am వైఎస్.. నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు: బాబుముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నికల నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్ చేస్తున్న ఈ తరహా నిబంధనల ఉల్లంఘనను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంపై ఎన్నికల కమిషన్.. ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విషయమై బాబు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 20 Mar 2009 | 5:11 am నాకు ఈ ఎన్నికలు ఆఖరవనుకుంటున్నా: ప్రణబ్విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పనున్నారు. జాంగిపూర్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే లోక్‌సభ ఎన్నికలే తనకు ఆఖరి ఎన్నికలవుతాయోమో అని వ్యాఖ్యానించారు. కోల్‌కతాకు 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాంగీపూర్‌లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను పార్లమెంటు సభ్యునిగా 37 ఏళ్లపాటు కొనసాగానన్నారు. మరోసారి మీరు మద్దతిస్తే లోక్‌సభకు వెళతానని ప్రజలను అభ్యర్థించారు.Source: జాతీయ | 20 Mar 2009 | 5:10 am ఇందిరమ్మతో అప్పులే: చిరంజీవిరాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకం వల్ల పేదవారికి అప్పులే మిగులుతున్నాయంటూ ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. ఈ పథకం మంచిదే అయినా దీనివల్ల పేదలు మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారంటూ ఆయన విమర్శించారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గురువారం గుడివాడలో పర్యటించిన చిరంజీవి అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇందిరమ్మ పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తున్న డబ్బు సరిపోవడం లేదంటూ పేర్కొన్న ఆయన ఈ పథకం కోసం పేదలు ఉన్న ఇళ్లు పీకి పందిరేసుకుంటున్నారని విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 20 Mar 2009 | 4:51 am ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు: మోహన్బాబురాష్ట్రంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో తనకు పోటీ చేసే ఆలోచనే లేదని సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ మోహన్‌బాబు స్పష్టం చేశారు. గురువారం మోహన్ బాబు జన్మదిన సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకున్న మోహన్ బాబు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వెంకన్న కొండపై తాను రాజకీయాల గురించి ప్రస్తావించదలచుకోలేదని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 20 Mar 2009 | 4:38 am కాంగ్రెస్‌లోకి లాలూ బావమరిది సాధుఎల్జేపీతో సీట్ల సర్దుబాటు ఒప్పందంతో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఇచ్చిన షాక్‌కు కాంగ్రెస్ కూడా అమీతుమీ తేల్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఆర్జేడీ, ఎల్జేపీలు సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదుర్చుకొని కాంగ్రెస్‌కు మూడు స్థానాలు మాత్రమే వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్‌లో 26 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.Source: జాతీయ | 20 Mar 2009 | 4:25 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2009 | 4:04 am మార్చి 20, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 ప్రేమలు- పెళ్లిళ్లు ...Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2009 | 4:03 am ఎన్నికలకు నేను సిద్ధం: మన్మోహన్బైపాస్ సర్జరీ చేయించుకున్న తరువాత ఇటీవలే కోలుకుని విధులకు యధావిథిగా హాజరవుతున్న దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ తాజాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. బీపేజీ నేత వరుణ్ గాంధీ మైనారిటీలను లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం విలేకరులతో మన్మోహన్ మాట్లాడుతూ.. వరుణ్ గాంధీనే ఈ వ్యాఖ్యలు చేసివుంటే, అది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు బాగానే ఉందని, ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.Source: జాతీయ | 20 Mar 2009 | 4:02 am ప్రజలు మాకే పట్టం కడతారు: మన్మోహన్ ధీమావచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలు తమకే పట్టం కడతారని ప్రధాని మన్మోహన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బైపాస్ సర్జరీ అనంతరం ఆయన తొలిసారి గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానిని, అక్కడే ఉన్న మీడియా ప్రశ్నించగా ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు.Source: జాతీయ | 19 Mar 2009 | 2:30 pm సినీ గ్లామర్‌ను నమ్ముకున్న బాబు: దత్తాత్రేయతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రోడ్‌షోలకు వెళితే కార్యకర్తలు తప్ప, ప్రజలు రాకపోవడం వల్లే సినీ గ్లామర్‌ను నమ్ముకున్నారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. అందుకే చంద్రబాబు.. సినీ హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్‌లను ప్రచార బరిలోకి దించారని దత్తన్న ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేస్తున్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల కన్నా.. ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపైనే ప్రజలకు విశ్వాసం ఉంటుందని బండారు అభిప్రాయం వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 19 Mar 2009 | 11:52 am
|