స్టాంపుపేపర్ల కుంభకోణం: తెల్గీకి ఏడేళ్ల జైలుశిక్ష

కోట్లాది రూపాయాల స్టాంప్ పేపర్ల కుంభకోణానికి సంబంధించిన కేసులో అబ్దుల్ కరీం తెల్గీకి ఇక్కడి ప్రత్యేక సీబీఐ కోర్టు గురువారం ఏడేళ్ల జైలుశిక్ష ఖారారు చేసింది. స్టాంపు పేపర్ల కుంభకోణానికి ప్రధాన సూత్రధారి అయిన తెల్గీ గుజరాత్ సీబీఐ కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు.
Source: జాతీయ | 19 Mar 2009 | 12:24 pm

ప్రధాని పదవిపై పవార్ వ్యాఖ్యలు: కాంగ్రెస్ గరంగరం

దేశ ప్రధాని అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో ఈ విషయంలో పవార్‌ను వివరణ కోరేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. పవార్ వ్యాఖ్యలను ప్రధానాస్త్రంగా చేసుకుని కాంగ్రెస్‌పై భారతీయ జనతా పార్టీ దాడికి దిగేందుకు సిద్ధమవుతుండడంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.
Source: జాతీయ | 19 Mar 2009 | 12:23 pm

బోయకొండపై కొలువైన గంగమ్మ తల్లి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో నెలవైన ప్రముఖ శక్తి క్షేత్రాలలో బోయకొండ గంగమ్మ తల్లి ఆలయం ఒకటి. జిల్లాలోని పుంగనూరు తాలుకాలోని చౌడేపల్లి మండలంలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి.. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా, ప్రక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల భక్తుల...
Source: వినోదం | 19 Mar 2009 | 12:12 pm

మధ్యప్రదేశ్‌లో 12 మంది సభ్యుల సజీవదహనం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందిని డెకాయిట్లు సజీవదహనం చేశారు. రాష్ట్రంలోని సాత్నాకు సమీపంలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. గత రాత్రి సుందర్ సింగ్ పటేల్ లేదా ఖేర్ దుషాన్ పటేల్ నేతృత్వంలోని డెకాయిట్ బృందం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Source: జాతీయ | 19 Mar 2009 | 12:05 pm

సినీ గ్లామర్‌ను నమ్ముకున్న బాబు: దత్తాత్రేయ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రోడ్‌షోలకు వెళితే కార్యకర్తలు తప్ప, ప్రజలు రాకపోవడం వల్లే సినీ గ్లామర్‌ను నమ్ముకున్నారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. అందుకే చంద్రబాబు.. సినీ హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్‌లను ప్రచార బరిలోకి దించారని దత్తన్న ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేస్తున్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల కన్నా.. ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపైనే ప్రజలకు విశ్వాసం ఉంటుందని బండారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2009 | 11:52 am

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్

బాంబే స్టాక్ మార్కెట్ గురువారం స్వల్ప లాభాలతో ముగిసింది. దీంతో మార్కెట్‌లో లావాదేవీలు ముగిసే సమయానికి సెన్సెక్స్ 25 పాయింట్ల లాభంతో 9,002 పాయింట్ల వద్ద ముగిసింది. రోజు మొత్తంలో ఒకానొక దశలో గరిష్టంగా 187 పాయింట్లు...
Source: Yahoo! Telugu: News | 19 Mar 2009 | 11:25 am

మేఘాలయలో కేంద్ర పాలన: రాష్ట్రపతి నిర్ణయం

మేఘాలయ అసెంబ్లీలో ఇటీవల జరిగిన విశ్వాసపరీక్ష వివాదాస్పదం అవడంతో ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పాలన విధించబడింది. మేఘాలయలో కేంద్ర ప్రభుత్వ పాలన విధించాలని వచ్చిన సిఫార్సులను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గురువారం ఆమోదించారు.
Source: Yahoo! Telugu: News | 19 Mar 2009 | 11:08 am

శ్రీకాకుళంలో నీటి ట్యాంకు కూలి ముగ్గురు మృతి

నీటి ట్యాంకు కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన శ్రీకాకుళంలో గురువారం చోటు చేసుకుంది. నిర్మాణ పనుల్లో భాగంగా పాత వాటర్ ట్యాంకును తొలగిస్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2009 | 11:02 am

నేడు తిరుపతికి రానున్న మాజీ రాష్ట్రపతి కలాం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గురువారం తిరుపతికి విచ్చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో జరిగే లీడ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేందుకై కలాం తిరుపతికి విచ్చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2009 | 11:01 am

నేను ప్రధాని పదవి రేసులో లేను: శరద్ పవార్

ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో తాను లేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్, కేంద్ర మంత్రి శరద్ పవార్ వివరణ ఇచ్చారు. శరద్ పవార్‌కు ఉన్న ప్రధాని కావాలనే ఆకాంక్షపై కాంగ్రెస్‌లో ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇవ్వడం
Source: Yahoo! Telugu: News | 19 Mar 2009 | 10:59 am

చివరి పార్టీ ఏర్పాటు చేయరూ..!

ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌తో మృత్యువుతో పోరాడుతున్న బ్రిట్ రియాల్టీ టీవీ స్టార్, బ్రిటన్ నటి జేడ్ గూడీ, చివరి పార్టీని ఏర్పాటు చేయాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యులను అర్థించింది. 27 ఏళ్ళ గూడీ చివరిగా ఏర్పాటు చేయనున్న ఈ పార్టీలో తన స్నేహితులు, బంధువులను కళ్లారా చూడాలని ఆశిస్తుందని ఆమె తల్లి జాకీ తెలిపారు. ప్రస్తుతం జేడ్ గూడీ ఆరోగ్యం క్షీణించిందని, మృత్యువాత పడేందుకు రోజులు లెక్కపెట్టుకుంటోందని వైద్యులు వెల్లడించారు. మరణ శయ్యపై ఉన్న గూడీ, ఈ లోకం వదిలి వెళ్లే చివరి గంటల్లో అందరిని చూస్తూ కన్నుమూయాలని భావిస్తున్నట్లు సన్ పత్రిక తెలిపింది.
Source: వినోదం | 19 Mar 2009 | 10:56 am

లోక్‌సభకే పోటీ చేస్తా: పెన్మత్స స్పష్టం

విజయనగరం స్థానం నుంచి లోక్‌సభకు మాత్రమే పోటీ చేస్తానని సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెన్మత్స సాంబశివరాజు స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో దిగేందుకు తాను సిద్ధంగా లేనని ఆయన పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 19 Mar 2009 | 10:53 am

స్టాంపుపేపర్ల కుంభకోణం: తెల్గీకి ఏడేళ్ల జైలుశిక్ష

కోట్లాది రూపాయాల స్టాంప్ పేపర్ల కుంభకోణానికి సంబంధించిన కేసులో అబ్దుల్ కరీం తెల్గీకి ఇక్కడి ప్రత్యేక సీబీఐ కోర్టు గురువారం ఏడేళ్ల జైలుశిక్ష ఖారారు చేసింది. స్టాంపు పేపర్ల కుంభకోణానికి ప్రధాన సూత్రధారి అయిన తెల్గీ గుజరాత్ సీబీఐ కోర్టులో తన
Source: Yahoo! Telugu: News | 19 Mar 2009 | 10:50 am

తిరుగులేని అధికారాలు రద్దు చేయాలి: షరీఫ్

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేతృత్వంలోని పాక్ సంకీర్ణ ప్రభుత్వం అధ్యక్షుడికి ఉన్న తిరుగులేని అధికారాలను రద్దు చేయాలని మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్- ఎన్) పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ డిమాండ్ చేశారు.
Source: Yahoo! Telugu: News | 19 Mar 2009 | 10:42 am

పార్టీ తొలి అభ్యర్థిని ప్రకటించిన ప్రజారాజ్యం

చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ తన తొలి అభ్యర్థిని ప్రకటించింది. ఇటీవలే ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్న రావి వెంకటేశ్వరరావును గుడివాడ అభ్యర్ధిగా ప్రకటించడం ద్వారా పీఆర్పీ తన అభ్యర్థుల ప్రకటనకు తెరతీసింది.
Source: Yahoo! Telugu: News | 19 Mar 2009 | 10:23 am

తల్లిదండ్రులు కాబోతున్న అభి-ఐష్..!?

బాలీవుడ్ చిలకాగోరింకలు అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. అభి-ఐష్‌లకు పిల్లలంటే చాలా ఇష్టమట. ఇటీవల ఐశ్వర్యారాయ్ వెయిట్‌ను పరీక్షిస్తే ఆమె గర్భంతో ఉన్నట్లు తెలిసిందని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలిసింది.
Source: వినోదం | 19 Mar 2009 | 10:23 am

మరో 150 పరుగులు చాలు: రాహుల్ ద్రావిడ్

హామిల్టన్‌లో ఆతిథ్య దేశంతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో మరో 150 పరుగులు సాధిస్తే, బలమైన స్థితిలో ఉంటామని సీనియర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు. ఈ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట
Source: Yahoo! Telugu: News | 19 Mar 2009 | 10:07 am

కాంగ్రెస్‌తో వామపక్షాల దోస్తీ: కారత్ సంకేతాలు

వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం అవసరమైతే కాంగ్రెస్‌తో దోస్తీ పెట్టుకునే అవకాసాలను సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తోసిపుచ్చలేదు. ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అసరమైతే కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతామని ప్రకటించారు. కాంగ్రెస్‌తో చర్చలు జరిపేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు.
Source: జాతీయ | 19 Mar 2009 | 10:06 am

నేడు తిరుపతికి రానున్న మాజీ రాష్ట్రపతి కలాం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గురువారం తిరుపతికి విచ్చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో జరిగే లీడ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేందుకై కలాం తిరుపతికి విచ్చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 19 Mar 2009 | 9:53 am

శ్రీకాకుళంలో నీటి ట్యాంకు కూలి ముగ్గురు మృతి

నీటి ట్యాంకు కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన శ్రీకాకుళంలో గురువారం చోటు చేసుకుంది. నిర్మాణ పనుల్లో భాగంగా పాత వాటర్ ట్యాంకును తొలగిస్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో...
Source: Yahoo! Telugu: News | 19 Mar 2009 | 9:46 am

భాజపాలో విభేదాలు: జైట్లీ, రాజ్‌నాథ్ భేటి

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ జైట్లీ, అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మధ్య గత కొన్ని రోజులుగా నెలకొన్న వివాదానికి గురువారంతో తెరపడింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సీట్ల పంపిణీ వ్యవహారంపై చర్చలు జరిపేందుకు భాజపా సీనియర్ నేతలు ఇద్దరూ సమావేశమయ్యారు. ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలకు పార్టీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసేందుకు రాజ్‌నాథ్ సింగ్‌తో ఆయన నివాసంలో జైట్లీ సమావేశం అయినట్లు తెలిసింది.
Source: జాతీయ | 19 Mar 2009 | 9:12 am

రాజధాని రైలుపై దాడి యత్నం: ట్రాకు పేల్చివేత

ఢిల్లీ- దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు గురువారం ఉదయం అసోం రాష్ట్రంలో రైల్వే ట్రాకును పేల్చివేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలోని కర్బీ అంగ్లోంగ్ జిల్లాలో రైల్వే ట్రాకును ఈ రోజు ఉదయం శక్తివంతమైన బాంబుతో తిరుగుబాటుదారులు పేల్చివేశారు. రాత్రి 1.10 గంటల సమయంలో దిఫు పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ బాంబు దాడి జరిగింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లడానికి ముందుగా రైల్వే ట్రాకు పరిశీలన జరిపే సెక్యూరిటీ ఎస్కార్ట్ ఇంజిన్ వెళ్లిన వెంటనే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.
Source: జాతీయ | 19 Mar 2009 | 7:30 am

వరుణ్ గాంధీపై మరో రెండు కేసులు

బీజేపీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి, ఇందిరా గాంధీ మనవడు వరుణ్ గాంధీని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు వరుణ్ గాంధీ అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. సొంతపార్టీలనూ ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా వరుణ్ గాంధీపై ఉత్తరప్రదేశ్‌లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ముస్లింలను హెచ్చరిస్తూ పిలిభిత్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వరుణ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు
Source: జాతీయ | 19 Mar 2009 | 7:23 am

ఆటోను ఢీకొన్న లారీ: 9మంది చిన్నారుల మృతి

ఓలారీ స్కూలు పిల్లల ఆటోను ఢీకొన్న దుర్ఘటనలో 8మంది చిన్నారులతో సహా 9మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లా కొమురోలు మండలం తాటిచెర్లలో జరిగిన ఈ దుర్ఘటనలో మృతిచెందిన చిన్నారులంతా 12ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. ఓ ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు కొమురోలు మండలంలోని గుండేటిపల్లి, నాయుడుపల్లినుంచి ఆటోలో వస్తుండగా లారీ ఢీకొంది. దీంతో ప్రమాదస్థలంలోనే ఆటో డ్రైవర్‌తో సహా విద్యార్థులు మృతిచెందారు
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2009 | 7:16 am

డీజీపీ యాదవ్‌ బదిలీ: ఎన్నికల సంఘం ఆదేశం

రాష్ట్ర డీజీపీ ఎస్.ఎస్.పి.యాదవ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయనను పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో కొత్తవారిని నియమించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం పంపిన ఉత్తర్వులు ఫ్యాక్స్ ద్వారా బుధవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరాయి.
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2009 | 6:28 am

అద్వానీపై ప్రముఖ నర్తకి మల్లికా పోటీ!

ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీపై ప్రముఖ నర్తకి మల్లికా సారాభాయ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనుంది. అద్వానీ ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్‌ రాష్ట్రంలోని గాంధీనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు మల్లికా సారాభాయ్ బుధవారం వెల్లడించారు.
Source: జాతీయ | 19 Mar 2009 | 6:08 am

నాదెండ్లను ప్రోత్సహించింది కాంగ్రెస్సే: నన్నపనేని

ఆనాడు నాదెండ్ల భాస్కరరావును ప్రోత్సహించి ఎన్టీరామారావును గద్దెదింపింది కాంగ్రెస్ వారేనని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. ప్రస్తుతం తన కొడుకు జగన్‌కు సీటు కోసం వైఎస్ తన తమ్ముడు వివేకానందరెడ్డికి వెన్నుపోటు పొడిచారని ఆమె పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2009 | 5:32 am

ఎడ్లబండి పేరు..!

"ఫోర్డ్" అంటే ఏమిటి..?" అడిగాడు చిన్నా "అదొక కారు పేరు" చెప్పాడు బంటీ...
Source: వినోదం | 19 Mar 2009 | 5:04 am

దొంగ.. ఫింగర్ ఫ్రింట్స్..!

"నువ్వు దొంగను ఎందుకు పట్టుకోలేక పోయావు..?" కానిస్టేబుల్‌ని అడిగాడు యస్సై "సారీ సార్...! కాని నేను...
Source: వినోదం | 19 Mar 2009 | 5:03 am

చిన్నమ్మపై తమ్ముడు బాలయ్య పోటీ!

నందమూరి వంశంలోనే ఈ సారి ఎన్నికల రాజకీయం వేడెక్కనుంది. నందమూరి బాలకృష్ణను అక్క పురందరేశ్వరిపై లోక్‌సభకు పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. తమ అక్క పురందరేశ్వరిపై పోటీ చేయడానికి బాలకృష్ణకూడా సుముఖంగావున్నట్లు సమాచారం. కాగా ఆయనను ఎక్కడినుంచి పోటీకి దింపాలన్న విషయంపైకూడా తీవ్రంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే అసెంబ్లీ స్థానంనుంచి మాత్రం పోటీకి దింకూడదని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2009 | 4:51 am

కాంగ్రెస్‌ది నియంతల పాలన: ఎన్టీఆర్ ధ్వజం

కాంగ్రెస్ పార్టీది నియంతల పాలన అంటూ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్-ఐ అంటే ఇందిరా కాంగ్రెస్ కాదని ఇటలీ కాంగ్రెస్ అని ఆయన ఈ సందర్భంగా కొత్త అర్థం చెప్పారు. జర్మనీ నియంత హిట్లర్, ఇటలీ నియంత ముస్సోలిని బతికి ఉంటే కాంగ్రెస్ రూపంలో తమ వారసులు చక్కగా అరాచకత్వాన్ని కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషించేవారని ఆయన పేర్కొన్నారు. టీడీపీకి ప్రచారంలో భాగంగా విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ బుధవారం భీమిలినుంచి ప్రారంభించి కూర్మన్నపాలెం వద్ద పర్యటన ముగించారు
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2009 | 4:41 am

బీహార్‌లో 26 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్

కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి భాగస్వాములు ఆర్జేడీ, ఎల్‌జేపీ పార్టీలు సీట్లు సర్దుబాటులో మూడు సీట్లు మాత్రమే వదిలిపెట్టి మొండిచెయ్యి చూపడంతో కాంగ్రెస్ కంగుతింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో 26 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లోనూ సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు ఓ పట్టాన కుదరకపోవడంతో ఇక్కడ 24 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంతకుముందు వెల్లడించిన స్థానాలకంటే మరిన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు
Source: జాతీయ | 19 Mar 2009 | 4:37 am

26/11పై పాక్ స్పందన అసంపూర్తి: భారత్

ముంబై ఉగ్రవాద దాడులపై జరుపుతున్న దర్యాప్తుకు సంబంధించి బలమైన ఆధారాలను తమతో పంచుకోవాలని భారత్ కోరింది. గత ఏడాది నవంబరు 26న జరిగిన ముంబయి మారణహోమంపై ఇప్పటివరకు పాక్ తమతో పంచుకున్న సమాచారం అసంపూర్తిగా ఉందని భారత్ అభిప్రాయపడింది. ముంబై దాడుల సూత్రధారులకు సంబంధించి తాము అనేక సాక్ష్యాధారాలు అందించామని తెలిపింది. దాడుల దర్యాప్తును పూర్తి చేసేందుకు, ఆ దేశంలోని తీవ్రవాద మౌళిక సదుపాయాలను ధ్వంసం చేసేందుకు పాక్ ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చింది.
Source: జాతీయ | 19 Mar 2009 | 4:31 am

పార్టీ గుర్తు అరువు తెచ్చుకునే అవకాశం

ప్రజారాజ్యం పార్టీ ఒకే గుర్తుకోసం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఆ పార్టీకి ఇక బెంగ లేనట్లే. ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ గుర్తుపై ప్రజారాజ్యం అభ్యర్థులు పోటీ చేసే అవకాశం కలగనుంది. ఇదే గుర్తును కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ ఈ నెల 26వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘంవద్ద దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికార వర్గాలు తెలిపాయి
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2009 | 3:41 am

రాష్ట్ర డీజీపీపై బదలీ వేటు

రాష్ట్ర డీజీపీ ఎస్.ఎస్‌.పి. యాదవ్‌ను బదిలీ చేయాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషన్ బుధవారంనాడు ఆదేశించింది. కర్నూలు మీడియా సమావేశంలో డీజీపీ అధికార పార్టీకి అనుకూలంగాను, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినారని గతంలో తెలుగుదేశం పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాయి. దీనిపై విచారించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
Source: ఏపీ న్యూస్ | 18 Mar 2009 | 3:16 pm

భక్త రామదాసు బందీగా గడిపిన గోల్కొండ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ముఖ్యమైన సందర్శనీయ స్థలాలలో చెప్పుకోదగ్గది గోల్కొండ కోట. భక్త రామదాసు సీతమ్మకు చింతాకు పతకం చేయించి... రాజ్య నిధులను దుర్వినియోగం చేశాడన్న నేరారోపణతో.. ఈ కోటలోనే బందీగా గడిపాడు. హైదరాబాదు నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ కోట మొత్తాన్ని 120 మీటర్ల ఎత్తయిన నల్లరాతి కొండపైన నిర్మించారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజును కూడా కట్టారు. 1143 కాలంలో ఈ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలిస్తుండేవారు. 200 సంవత్సరాల తరువాత కాకతీయుల నుంచి బహమనీ సుల్తాను ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడని చరిత్రకారుల కథనం.
Source: వినోదం | 18 Mar 2009 | 1:36 pm

ఉగాది కానుకగా ఛార్మీ 'మనోరమ'

ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'మనోరమ'. జీ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత, నటుడు సురేష్ తెలిపారు. ఈ విషయమై బుధవారం ఏర్పాటు చేసిన...
Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2009 | 12:38 pm

బీవీ రెడ్డి ప్రధాన పాత్రలో 'శ్రీ షిర్డి సాయిబాబా'

ఎస్.ఆర్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై బి.వి.రెడ్డి బాబా పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం జగద్గురు శ్రీ షిర్డి సాయిబాబా. ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఏలూరు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అనుకున్న విధంగా, అందరి సహకారంతో...
Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2009 | 12:31 pm

అల్లరి నరేష్ హీరోగా 'ఆకాశరామన్న' ట్రైలర్స్

అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల, మీరా జాస్మిన్, గౌరి పండిట్ కాంబినేషన్‌లో త్వరలో విడుదలకు సిద్దమవుతున్న చిత్రం ఆకాశరామన్న. మన్యం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ దర్శకత్వం...
Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2009 | 12:31 pm