|
జేపీ రైలు యాత్రలోక్సత్తా జాతీయ సమన్వయకర్త జయప్రకాష్ నారాయణ్ రానున్న ఎన్నికల సందర్భంగా తన ఎన్నికల ప్రచారాన్ని వినూత్నరీతిలో నిర్వహించబోతున్నారు. ఆయన రైలు ప్రయాణం ద్వారా తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఈనెల 20న ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో సెకండ్ క్లాస్ ప్రత్యేక బోగీలో జయప్రకాష్ ప్రచార యాత్ర ప్రారంభం అవుతుందని లోక్‌సత్తా పార్టీ అధికార ప్రతినిధులు డివివిఎస్ వర్మ, కటారి శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2009 | 2:41 pm సీట్ల సర్దుబాటుపై మాట్లాడుకుందాం... రండి: ములాయంసీట్ల పంపిణీని దాదాపుగా పూర్తి చేసిన తరణంలోను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ మరోసారి కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటుపై చర్చించడానకి సిద్ధంగా ఉన్నామన్నారు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ కోరుకుంటే చర్చలు జరిపేందుకు తాము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామన్నారు.Source: జాతీయ | 17 Mar 2009 | 2:01 pm వంద రూపాయలకే గ్యాస్ సిలిండర్: చిరంజీవితాము అధికారంలోకి వస్తే వంటగ్యాస్ ను కేవలం వంద రూపాయలకే అందజేస్తామని కృష్ణా జిల్లా ప్రజా అంకిత యాత్రలో మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ, ప్రజారాజ్యం పార్టీకి వస్తున్న స్పందనను చూసి రాష్ట్రంలోని పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయని వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2009 | 12:34 pm వరుణ్‌పై ఈసీ కొరడా: క్రిమినల్ కేసుకు ఆదేశంభారతీయ జనతా పార్టీ తరపున వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఇందిరా గాంధీ మనవడు వరుణ్ గాంధీ మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా వరుణ్ గాంధీ చేసిన ప్రసంగంపై ఈసీ ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 17 Mar 2009 | 12:05 pm హోం శాఖ వద్దకు ఐపీఎల్ మూడో షెడ్యూల్ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ నిర్వహణ కోసం నిర్వాహకులు మూడో షెడ్యూల్‌ను తయారు చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ రెండూ దాదాపుగా ఒకే సమయంలో జరుగుతుండటంతో క్రికెట్ మ్యాచ్‌లకు భద్రతSource: Yahoo! Telugu: News | 17 Mar 2009 | 11:30 am కర్ణాటక నుంచి సోనియా ఎన్నికల ప్రచారంకాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్శన్ శ్రీమతి సోనియా గాంధీ రానున్న సార్వత్రిక ఎన్నికలకుగాను ప్రచారాన్ని కర్ణాటక రాష్ట్రంతో ప్రారంభించనున్నారు. మార్చి నెల 23వ తేదీన దావణగెరెనుంచి ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఇదిలావుండగా ఈ నెల 22వ తేదీన పార్టీ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఆ తర్వాతే సోనియాగాంధీ తన ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 17 Mar 2009 | 11:24 am మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 80 పాయింట్ల పతనంబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) మంగళవారం నష్టాల బాటలో పయనించింది. రెండు పాయింట్ల నష్టంతో 8,942 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సూచి అనంతరం లాభాల్లో నిలిచింది. ఒకానొక దశలో 9024 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అయితేSource: Yahoo! Telugu: News | 17 Mar 2009 | 11:22 am ఇండియన్ వెల్స్ నుంచి పేస్, భూపతి నిష్క్రమణపురుషుల డబుల్స్ నుంచి అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారులు లియాండర్ పేస్, మహేష్ భూపతి ఇద్దరూ వెనుదిరగడంతో బీఎన్‌పీ పారిబాస్ ఓపెన్‌లో భారత్ ఆశలు పూర్తిగా అడుగంటాయి. చెక్‌రిపబ్లిక్ ఆటగాడు లూకాస్ డ్లౌహీతో కలిసి ఈ టోర్నీ బరిలో దిగినSource: Yahoo! Telugu: News | 17 Mar 2009 | 11:14 am కాంగ్రెస్ పార్టీ ప్రచారంపైనే దృష్టి: అజారుద్దీన్రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడంకంటే పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొనడంపైనే తాను దృష్టి పెడుతానని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేర్కొన్నారు. ప్రజలతో కలిసి పనిచేయడానికే తాను రాజకీయాల్లోకి ప్రవేశించానని ఈ సందర్భంగా...Source: Yahoo! Telugu: News | 17 Mar 2009 | 11:09 am తృతీయ కూటమి అధికారంలోకి రావడం కష్టందేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని కూటములకు ప్రత్యామ్నాయంగా లెఫ్ట్, ప్రాంతీయ పార్టీలతో ఇటీవల ప్రాణం పోసుకున్న తృతీయ కూటమి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి రావడం చాలా కష్టమని సీనియర్ కమ్యూనిస్ట్ నేత జ్యోతి బసుSource: Yahoo! Telugu: News | 17 Mar 2009 | 11:00 am ఆరోగ్యశ్రీ కార్డులపైనా వివరణ ఇవ్వండి: రోశయ్యరాష్ట్రంలో అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన కార్డుల విషయంలో ఏవైనా ఇబ్బందులున్నాయా అంటూ ఆర్థికమంత్రి రోశయ్య ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనల పేరుతో 108 వాహనాలపై ఉన్న రాజీవ్‌గాంధీ బొమ్మపై...Source: Yahoo! Telugu: News | 17 Mar 2009 | 10:52 am వరుణ్ గాంధీపై క్రిమినల్ కేసుకు ఈసీ ఆదేశంభారతీయ జనతా పార్టీ తరపున వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఇందిరా గాంధీ మనవడు వరుణ్ గాంధీ మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మతపరమైనSource: Yahoo! Telugu: News | 17 Mar 2009 | 10:49 am కాంగ్రెస్‌తో చర్చలకు సిద్ధం: ములాయం సింగ్వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటులో మరోసారి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ వెల్లడించారు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ కోరుకుంటే చర్చలుSource: Yahoo! Telugu: News | 17 Mar 2009 | 10:40 am భారతదేశానికి వచ్చి హిందీ నేర్చుకున్నా: అద్వానీభారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి లాల్ కృష్ణ అద్వానీ తనకు ఇరవయ్యవ ఏట వరకు హిందీ భాష రాదని వెల్లడించారు. జమ్ము-కాశ్మీర్ మాజీ గవర్నర్ లెఫ్ట్‌నెంట్ జనరల్(రిటైర్డ్) ఎస్.కే. సిన్హాచే రచించిన"గార్డింగ్ ఇండియాస్ ఇంటిగ్రిటీ" పుస్తకావిష్కరణలో అద్వానీ పాల్గొని ప్రసంగించారు.Source: జాతీయ | 17 Mar 2009 | 10:29 am మరోసారి పార్టీ సమావేశానికి జెట్లీ గైర్హాజరుబీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జెట్లీ మరోసారి గైర్హాజరయ్యారు. ఈ నెల 13న జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి కూడా జెట్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ ఈశాన్య ప్రాంత కో- కన్వీనర్ పదవిలోSource: Yahoo! Telugu: News | 17 Mar 2009 | 10:07 am నాగార్జున యూనివర్శిటీలో అధ్యాపకులచే బంద్ఆరవ వేతనసంఘం సిఫార్సులను వెంటనే అమలు చేయాలని కోరుతూ నాగార్జున విశ్వవిద్యాలయం అధ్యాపకులు మంగళవారం బంద్‌కు పూనుకున్నారు. దీంతో గూంటురు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.Source: Yahoo! Telugu: News | 17 Mar 2009 | 10:05 am ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడండి: భాజపావరుణ్ గాంధీ వ్యాఖ్యలతో భాజపా బుర్ర బొప్పి కట్టినట్లయింది. అసలే మత పార్టీ ముద్రతో సతమతమవుతుంటే, వరుణ్ లాంటి నాయకులు తమ వ్యాఖ్యలతో ఆ ముద్రకు మరింత బలాన్ని చేకూర్చడంపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మైనార్టీ వర్గాలను దృష్టిలో పెట్టుకుని వరుణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. దీంతో భాజపా తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, ఆయా సమావేశాలలో పాల్గొనే నేతలు ప్రసంగించే ముందు ఏం మాట్లాడాలో ముందుగా కసరత్తు చేయమని సూచించింది. వరుణ్ వ్యాఖ్యల వంటివి ఏ నాయకుడు చేయకూడదని ప్రతి ఒక్కరినీ హెచ్చరించింది.Source: జాతీయ | 17 Mar 2009 | 9:37 am సుశాంత్‌కు పుట్టిరోజు శుభాకాంక్షలుకాళిదాసు చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన సుశాంత్ మార్చి 18న తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటుడిగా తొలి పుట్టినరోజు జరుపుకుంటున్న సుశాంత్ ప్రస్తుతం కరెంట్ అనే...Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2009 | 7:40 am యూపీఏలో భాగస్వాములం: లాలూ-పాశ్వాన్తాము యూపీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నట్టు కేంద్ర మంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ అధ్యక్షుడు), రామ్ విలాస్ పాశ్వాన్ (ఎల్జేపీ అధ్యక్షుడు) స్పష్టం చేశారు. కేంద్రంలో మతవాద శక్తులు అధికారంలోకి రాకుండా ఉండేందుకే తాము యూపీఏలో మిత్రపక్షాలుగా ఉంటున్నట్టు చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం యూపీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.Source: జాతీయ | 17 Mar 2009 | 7:39 am శింబు, స్నేహ జంటగా రానున్న 'మా వాడు'తమిళంలో శింబు, స్నేహ, సనాఖాన్‌ల కాంబినేషన్‌లో నిర్మించిన ఓ చిత్రాన్ని తెలుగులో మా వాడు పేరుతో విడుదల చేయనున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన కె. మురళీథరన్, వి. స్వామినాథన్‌లే తెలుగులోనూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2009 | 7:36 am కొత్తవారితో సూపర్‌గుడ్ కొత్త చిత్రంతెలుగులో హిట్ చిత్రాలను నిర్మించిన సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ మరో తాజా చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తమిళం నుంచి రీమేక్ చేయనున్న తమ కొత్త చిత్రాన్ని కొత్తవారితో నిర్మించడానికి ఆ సంస్థ నిర్ణయించింది. తమిళంలో...Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2009 | 7:34 am త్వరలో ప్రేక్షకుల ముందుకు అ..ఆ..ఇ..ఈశ్రీకాంత్, మీరాజాస్మిన్, సదాలు హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం అ..ఆ..ఇ..ఈ. అతను ఆమె ఇంతలో ఈమె అనేది ఈ చిత్రం ఉప శీర్షిక. కల్పన ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం లోగోను సోమవారం...Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2009 | 7:33 am విజయవంతంగా పరీక్షలు రాసిన ప్రణీతగత ఏడాది డిసెంబర్‌లో యాసిడ్‌దాడికి గురైన ప్రణీత తన విద్యాభాసంలో భాగంగా ఇంజినీరింగ్ పరీక్షలను విజయవంతంగా రాస్తోంది. పరీక్షల కోసం ప్రణీత ఆదివారం హన్మకొండకు చేరుకుంది.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2009 | 6:51 am నేటితో రాజు సోదరులకు సీబీఐ కస్టడీ పూర్తిసత్యం కంప్యూటర్స్ మాజీ ఛైర్మన్ రామలింగరాజు, అతని సోదరుడు రామరాజుకు సీబీఐ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. కుంభకోణానికి సంబంధించి వారివద్ద విచారించేందుకు సీబీఐకి కోర్టు ఇచ్చిన గడువు నేటితో పూర్తికానుంది. దీంతో ఆయనను మంగళవారం సాయంత్రం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రాజుతోపాటు ఆయన సోదరుడు, సత్యం మాజీ సీఎఫ్ఓ, ఆ సంస్థ మాజీ ఆడిటర్లను సైతం సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2009 | 6:42 am ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు అప్పులు: జూ ఎన్టీఆర్కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్దిదారులు అప్పు ఊబిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారని సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని లబ్ధిదారులు సంతోషపడేలోపే వారికి అప్పులు మిగులుతున్నాయని ఆయన విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2009 | 5:59 am బెల్టుషాపులు తొలగింపునకు ఈసీ గడువువచ్చే మూడురోజుల్లో రాష్ట్రంలోని బెల్టుషాపులన్నింటినీ రద్దు చేసి తీరాల్సిందేనని ఎన్నికల సంఘం హుకుం జారీచేసింది. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థి అయినా ఓటర్లకు మద్యం సరఫరా చేసినట్టు తేలితే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని కూడా ఈసీ హెచ్చరించింది.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2009 | 5:56 am పగటి దొంగలుగా కాంగ్రెస్ నేతలు: బాలయ్యదొంగలు రాత్రి పూట మాత్రమే దోచుకుంటారని, కానీ, రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ నేతలు పగటి దొంగలుగా వేషాలు వేసి దోచుకుంటున్నారని సినీ నటుడు, తెదేపా నేత బాలకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో ఆత్మహత్యలకు గురవుతున్న రైతులు, చేనేత కార్మికుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2009 | 5:55 am పక్షపాతంగా వ్యవహరిస్తున్న మీడియా: జేపీరాష్ట్ర మీడియా పక్షపాతంగా వ్యవహరిస్తోందని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. అలాగే రాష్ట్ర రాజకీయాలు కూడా కుటుంబ వ్యవస్థగా మారాయని ఆరోపించారు. కొడుకులు, కూతుళ్లు, బామ్మర్దులు, మేనల్లుళ్లతో రాజకీయా పార్టీలను కుటుంబ సంస్థలుగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2009 | 5:52 am నేడు చిరంజీవి కృష్ణా జిల్లా పర్యటనప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేపట్టే కృష్ణా జిల్లా పర్యటన మంగళవారం నుంచి సాగనుంది. మూడు రోజుల పాటుసాగే ఈ యాత్రలో తొలి విడతగా జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తారు. దివిసీమలోని నాగాయలంక నుంచి విజయవాడ వరకు చిరు రోడ్‌షో సాగుతుంది. చిరంజీవి మంగళవారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో అవనిగడ్డ చేరుకుని, అక్కడ నుంచి కారులో నాగయలంకు వెళ్లి, ప్రజా అంకిత యాత్రను ప్రారంభిస్తారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2009 | 5:49 am అధికారంలోకి వస్తే "అణు"పై సమీక్ష: సీపీఎంతృతీయ కూటమి అధికారంలోకి వస్తే భారత్ - అమెరికా అణు ఒప్పందంపై సమీక్ష నిర్వహిస్తామని సీపీఎం ప్రకటించింది. ఈ అంశాన్ని సోమవారం ఇక్కడి విడుదల చేసిన మేనిఫెస్టోలో ఆ పార్టీ పేర్కొంది. తమకు అధికారం ఇస్తే అణు ఒప్పందాన్ని సమీక్షిస్తామని ప్రకటించింది. రక్షణ ఒప్పందం సహా అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రద్దు చేస్తామని తెలిపింది.Source: జాతీయ | 17 Mar 2009 | 5:25 am నేడు భాజపా సీఈసీ భేటీ: జైట్లీ గైర్హాజరు!భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ప్రధాన కార్యదర్శి అరుణ్ జైట్లీల మధ్య వివాదం రోజురోజుకూ జఠిలమవుతోంది. వీరిద్దరి మధ్య విభేదాల కారణంగా పార్టీ జాతీయ ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సోమవారం రాత్రి ఊహాగానాలు వినిపించాయి. బీజేపీ సీఈసీ సమావేశం మంగళవారం జరగాల్సివుంది.Source: జాతీయ | 17 Mar 2009 | 5:01 am వరుణ్ గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులుబీజేపీ అభ్యర్థిగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న వరుణ్ గాంధీ తాజాగా పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయనకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బీజేపీ నాయకత్వం కూడా వరుణ్ వ్యాఖ్యలపట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.Source: జాతీయ | 17 Mar 2009 | 5:00 am తృతీయ ఫ్రంట్.. గమ్యం లేని నావలాంటిది: వెంకయ్యదేశంలో తాజాగా ఆవిర్భవించిన తృతీయ కూటమి గమ్యం లేని నావలాంటిదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. నిర్ధిష్టమైన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ఆశయాలు లేని పలు రాజకీయ పార్టీల సమ్మేళనంతో ఏర్పాటైన ఈ కూటమి ఒక కలగూర గంపలాంటిదన్నారు.Source: జాతీయ | 17 Mar 2009 | 3:56 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2009 | 3:08 am ఎన్టీఆర్... ముందు మీ తల్లికి న్యాయం చేయి: షబ్బీర్జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోలలో కాంగ్రెస్‌ను దుయ్యబట్టడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో ఓనమాలు తెలియని చిన్నపిల్లవాడని ఎద్దేవా చేసింది. పిల్లవానిపైనా బ్రహ్మాస్తం అన్న చందంగా.. రాజకీయ పరిణతిలేని అతని వ్యాఖ్యలపై తాను స్పందించబోనని మంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం చేస్తామంటున్న జూనియర్ ఎన్టీఆర్ తొలుత తన తల్లికి న్యాయం చేయాలని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 16 Mar 2009 | 2:20 pm
|