జయలలిత మాతో సంభాషిస్తూనే ఉన్నారు: కారత్

ఏఐఏడిఎంకె చీఫ్ జయలలిత తమతో తరచూ చర్చలలో పాలుపంచుకుంటున్నారని సీపీఐ(ఎమ్) ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ వెల్లడించారు. సీపీఐ(ఎమ్) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆదివారం తృతీయ కూటమి నాయకులు చేపట్టిన సమావేశంలో జయలలిత పాల్గొనకపోయినప్పటికీ తమతో తరచూ ఫోను సంభాషణలు సాగిస్తూనే ఉన్నారన్నారు.
Source: జాతీయ | 16 Mar 2009 | 12:46 pm

ఐపీఎల్‌కు భద్రతా దళాలను కేటాయించలేం: కేంద్రం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌కు సంబంధించి తలెత్తిన భద్రతాపరమైన సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. వాటికి పరిష్కారం కనుగొనేందుకు హోంశాఖతో తాజాగా బీసీసీఐ అధికారులు జరిపిన చర్చల్లో ఎటువంటి
Source: Yahoo! Telugu: News | 16 Mar 2009 | 12:06 pm

భాజపా నేతల విభేదాల్లో ఆర్.ఎస్.ఎస్ జోక్యం

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ప్రధాన కార్యదర్శి అరుణ్ జైట్లీ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ఆర్.ఎస్.ఎస్ చొరవచూపుతోంది. అయితే, పార్టీకి చెందిన అగ్ర నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ అగ్రనేత, ఎన్డీయే కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థి ఎల్‌.కె.అద్వానీ వివరణ ఇచ్చారు.
Source: జాతీయ | 16 Mar 2009 | 11:54 am

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 187 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సోమవారం లాభాల బాటలో పయనించింది. 37 పాయింట్ల వృద్ధితో 8,794 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, ఆ తరువాత కొద్దిసేపు లాభాల్లోనే నిలిచింది. అయితే ఆపై నష్టాల్లోకి జారుకున్న సూచి, ఒకానొక దశలో
Source: Yahoo! Telugu: News | 16 Mar 2009 | 11:40 am

పాక్‌లో రాజకీయ సంక్షోభానికి తెర: భారత్ హర్షం

పాకిస్థాన్‌లో గత కొన్నిరోజులగా అశాంతికి కారణమైన రాజకీయ సంక్షోభానికి పరిష్కారం లభించడంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. గత అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తొలగించిన న్యాయమూర్తులందరినీ పునర్నియమించాలని డిమాండ్ చేస్తూ
Source: Yahoo! Telugu: News | 16 Mar 2009 | 11:29 am

ఏప్రిల్ 4నే శ్రీరామనవమి: భద్రాచలం దేవస్థానం

ఏప్రిల్ 4నే శ్రీరామనవమి పర్వదినమని భద్రాచలం శ్రీ సీతారాములవారి దేవస్థానం ప్రకటించింది. శ్రీరామనవమి పర్వదినానికి సంబంధించిన తేదీపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దేవస్థానం ఈ ప్రకటన చేయడం విశేషం.
Source: Yahoo! Telugu: News | 16 Mar 2009 | 11:27 am

బీజేపీలో విభేదాలేమీ లేవు: అద్వానీ స్పష్టీకరణ

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ జెట్లీ, అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఆర్ఎస్ఎస్ రంగప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీలో నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేవని పార్టీ ప్రధాన
Source: Yahoo! Telugu: News | 16 Mar 2009 | 11:21 am

పీఆర్పీ ఉమ్మడి గుర్తు: తీర్పు రేపటికి వాయిదా

ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడిగుర్తు కేటాయించే పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల్లో ప్రభావం చూపగలదని భావిస్తున్న పీఆర్పీకి...
Source: Yahoo! Telugu: News | 16 Mar 2009 | 11:17 am

యూపీఏ విదేశాంగ విధానమే పెద్ద మోసం

కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వ విదేశాంగ విధానమే పెద్ద మోసమని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ఆరోపించారు. విదేశాంగ విధానం విషయంలో యూపీఏ కూటమి ప్రబుత్వం
Source: Yahoo! Telugu: News | 16 Mar 2009 | 11:10 am

తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడండి: ఎన్టీఆర్

తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకై అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కాలంటూ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల పేరుతో అభివృద్ధి చేస్తామంటూ చెప్పి వేల కోట్ల రూపాయలను దోచుకున్న కాంగ్రెస్...
Source: Yahoo! Telugu: News | 16 Mar 2009 | 11:06 am

తృతీయ కూటమికి మద్దతుగా నిలిచిన మరాండి

జార్ఖంఢ్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ బాబూలాల్ మరాండి వామపక్షాలు, తొమ్మిది ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో ఏర్పాటయిన తృతీయ కూటమికి మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఈ మేరకు మరాండి
Source: Yahoo! Telugu: News | 16 Mar 2009 | 10:52 am

ఎన్నికల్లో పోటీ చేయను: ఉప్పునూతల

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో యువతకు, బీసీలకు అవకాశం కల్పించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ మాత్రమే చేయనని, అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తానని ఉప్పునూతల అన్నారు. ప్రచారంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 16 Mar 2009 | 10:49 am

తృతీయ కూటమికి మరాండీ మద్దతు

దేశంలో తాజాగా ఏర్పాటైన మూడో కూటమికి జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్రంలో యూపీఏ, ఎన్డీయే యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈమేరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరాండీ ఓ లేఖ రాశారు.
Source: జాతీయ | 16 Mar 2009 | 10:34 am

అమ్మ పక్కనే ఉందిగా...!

"ఏమయ్యా సూరీ...! పాపం మొన్న మీనాన్న పోయారటగా...? పోయేముందు ఏం చెప్పారు...?" అడిగాడు ప్రక్కింటి కవీందర్...
Source: వినోదం | 16 Mar 2009 | 10:22 am

చెక్కులాగే తిరిగి వచ్చింది

"మీరు నాకు ఇచ్చిన చెక్కు మంచి చెక్కు కాదు... అది తిరిగి వచ్చింది" పేషెంట్‌ని కోపంగా అడిగాడు డాక్టర్ "అలాగా...! అయితే నాగుండె నొప్పి...
Source: వినోదం | 16 Mar 2009 | 10:21 am

గోల్ఫ్ ర్యాంకింగ్స్: 29వ స్థానంలో మిల్కాసింగ్

డబ్ల్యూజీసీ- సీఏ ఛాంపియన్‌షిప్‌ను నాలుగో స్థానంతో ముగించిన భారత అగ్రశ్రేణి గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ తాజాగా ప్రకటించిన ప్రపంచ గోల్ఫ్ ర్యాంకింగ్స్‌లో 29వ స్థానంలో నిలిచాడు. జీవ్ మిల్కాసింగ్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. ఇదిలా ఉంటే
Source: Yahoo! Telugu: News | 16 Mar 2009 | 10:18 am

కరీనా కపూర్ పర్సనల్ టచ్

బాలీవుడ్ అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న అందాల ముద్దుగుమ్మ కరీనా కపూర్. తన అందచందాలతో.. ఇట్టే యువతను ఆకర్షించే ఈ భామకు, "రెఫ్యూజ్" చిత్రం మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్...
Source: వినోదం | 16 Mar 2009 | 8:53 am

పీఆర్పీకి ఉమ్మడి గుర్తు: నేడు విచారణ

తమ పార్టీ అభ్యర్ధులకు ఉమ్మడిగుర్తు కేటాయించే విషయమై ప్రజారాజ్యం పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ నిర్వహించనుంది. ఉమ్మడి గుర్తు ఇవ్వలేమంటూ ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పిన సమయంలో రెండోసారి హైకోర్టును ఆశ్రయించిన పీఆర్పీ ఈసారి ఎలాంటి ఫలితాన్ని సాధించనుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Source: ఏపీ న్యూస్ | 16 Mar 2009 | 8:02 am

ఎస్సీ వర్గీకరణ వదలిపెట్టండి: మాలమహానాడు

ఎస్సీల వర్గీకరణ అంశానికి ఏ పార్టీకూడా ప్రాముఖ్యం ఇవ్వరాదని తెలంగాణ మాలమహానాడు సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఎస్సీల వర్గీకరణ అంశాన్ని ఏపార్టీకూడా తమ మేనిఫెస్టోలో చేర్చవద్దని కూడా ఆ సంఘాలు కోరాయి.
Source: ఏపీ న్యూస్ | 16 Mar 2009 | 8:00 am

మృత్యువుకు చేరువైన జేడ్..!

బ్రిటన్ బుల్లితెర రియాల్టీ షోర్ స్టార్ జేడ్ గూడీ మరణానికి మరింత చేరువయింది. ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణిస్తున్నందు వల్ల మరో ఒక్క రోజు కంటే ఎక్కువ సమయం బ్రతికే అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పినట్లు హాలీవుడ్ వర్గాల సమాచారం. ఆదివారం రాత్రి ఆమె ఆరోగ్యం అనూహ్యంగా క్షీణించిందని.. దీంతో ఆమెకు ప్రస్తుతం శ్వాస సంబంధిత సమస్యను కూడా ఎదుర్కొంటోందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె కనీసం మాట్లాడేందుకు కూడా బాగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నాయి.
Source: వినోదం | 16 Mar 2009 | 7:40 am

రఘుపతి వెంకయ్య విగ్రహం ఏర్పాటు యత్నాలు

తెరపై బొమ్మలు మాట్లాడుతాయని వాటిని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పారిస్‌లోని టెక్నాలజీతో ప్రవేశపెట్టిన ఘనుడు రఘుపతి వెంకయ్యనాయుడు. 1886లోనే దానికోసం మెషినరీకి 30వేలు అవుతాయని తెలుసుకుని తనకున్న...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Mar 2009 | 6:54 am

రాజీవ్, సోనియా కాంబినేషన్‌లో చిత్రం

నోట్‌బుక్ ఫేమ్ రాజీవ్ కథానాయకుడిగా, వినాయకుడు ఫేమ్ సోనియా కథానాయికగా ఓ కొత్త చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. విజయ్ గణపతి క్రియేషన్స్ పతాకంపై ఎం. రామలింగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి, జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వం...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Mar 2009 | 6:48 am

ఉగాదికి 'బుద్ధిమంతుడు'గా రానున్న ఉపేంద్ర

ఉపేంద్ర కన్నడంలో నటించిన చిత్రాన్ని తెలుగులో "బుద్ధిమంతుడు"గా అనువదించారు. గాలి జనార్థన నాయుడు సమర్పిస్తున్న ఈ చిత్రానికి సి.హెచ్. లక్ష్మీకాంతరెడ్డి, పి. హనుమంతరెడ్డి నిర్మాణ సారధ్యం వహించిన ఈ చిత్రం ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు
Source: Yahoo! Telugu: Entertainment | 16 Mar 2009 | 6:46 am

"ఆనందతాండవం" ఆడియో విడుదల

సిద్ధార్థ్, తమన్నా జంటగా ఆస్కార్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందిన చిత్రం "ఆనందంతాండవం". తెలుగులో ఎస్.వి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ప్రసాద్‌‌ల్యాబ్స్‌లో జరిగింది. సోనీ...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Mar 2009 | 6:43 am

వాజ్‌పేయి ఆశీస్సుల కోసం సంజయ్ ఆకాంక్ష

ఎన్నికలకు ముందుగా భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి ఆశీస్సులు పొందాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆశపడుతున్నారు. ఈ విషయాన్ని మున్నాభాయ్ ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. తన తండ్రి సునీల్ దత్‌కు ఇచ్చినంత గౌరవ మర్యాదలను వాజ్‌పేయికి కూడా ఇస్తాను. అందువల్ల ఆయన ఆశీస్సులు పొందాలని భావిస్తున్నాను. ఎన్నికలకు ముందుగానే తన కోరిక తప్పక నెరవేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 16 Mar 2009 | 6:36 am

దేశంలో 365 రోజుల ఉపాధి హామీ పథకం: బీఎస్పీ

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా 365 రోజుల పాటు అమలులో ఉండేలా జాతీయ గ్రామీణ హామీ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత్రి, యూపీ ముఖ్యమంత్రి మాయావతి ప్రకటించారు. మూడో కూటమి నేతలకు ఆమె ఆదివారం రాత్రి విందు ఇచ్చిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 16 Mar 2009 | 6:03 am

ఇందిరమ్మ రాజ్యంలో పేదోడికి అన్యాయం: జూ ఎన్టీఆర్

ఇందిరమ్మ రాజ్యంలో పెదవాడికి తీరని అన్యాయం జరుగుతోందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలోని పేదలు మూడుపూటలా తిండితినగలుగుతారని సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నవేళ ఒక్కపూట తిండికే కష్టపడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితి మారాలంటే తెదేపాతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 16 Mar 2009 | 5:51 am

ఏంజెలీనా జోలీ మళ్లీ గర్భవతి..!

ఆస్కార్ అవార్డు విజేత ఏంజెలీనా జోలీ మళ్లీ గర్భవతి అయినట్లు హాలీవుడ్ వర్గాల సమాచారం. జోలీ.. తను రూపొందిస్తున్న కొత్త చిత్రం సాల్ట్‌లో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన స్టంట్స్‌ను కొంత వరకు తగ్గించిందట. దీంతో ఆమె మళ్లీ పిల్లలకు జన్మనిచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిసింది. సాల్ట్ చిత్రం యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం... ఈ చిత్రానికి సంబంధించి జోలీ చివరి నిమిషంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసిందన్నారు. బహుశా ఆమె గర్భవతి అయివుండవచ్చని తెలిపారు. యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్న ఈ చిత్రంలో పైకప్పులపై ఛేజింగ్ సీన్‌లో జోలీ పాల్గొనాల్సి ఉంది.
Source: వినోదం | 16 Mar 2009 | 5:50 am

నేడు చిలీ దేశాధ్యక్షుడు భారత్‌కు రాక

ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం చిలీ దేశాధ్యక్షుడు మైఖేల్ బాచ్‌లెట్ సోమవారం న్యూఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయనకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సాదర స్వాగతం పలుకుతారు. బాచ్‌లెట్ రాకతో 60 సంవత్సరాలుగా ఉన్న భారత్-చిలీ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని ఇరు దేశాల ప్రతినిధులు భావిస్తున్నారు.
Source: జాతీయ | 16 Mar 2009 | 5:45 am

సికింద్రాబాద్‌లో పీఆర్పీ "ప్రజా విజయభేరి"

ఈ నెల 21న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో "ప్రజా విజయభేరి" పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయని చిరు తెలియజేశారు. అంతకుముందే మంగళవారం నుంచి మూడురోజుల పాటు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నట్లు మెగాస్టార్ వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 16 Mar 2009 | 5:44 am

మహారాష్ట్ర డిజిపిపై కొరడా ఝుళిపించిన ఈసీ

మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నియమించిన డిజిపి ఎస్.ఎస్.వీర్క్‌ను ఎన్నికల విధుల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించింది. ఆయన స్థానంలో కొత్త డిజిపిని నియమించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. గతంలో పంజాబ్ పోలీసు డిజిపిగా వీర్క్ పని చేస్తున్న సమయంలో కూడా ఆయన్ను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం గమనార్హం.
Source: జాతీయ | 16 Mar 2009 | 4:50 am

దేశంలో తృతీయ ప్రత్యామ్నాయం తథ్యం: మాయా

కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల నేతృత్వంలోని యూపీఏ, ఎన్డీయే కూటములకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని దేశ ప్రజల ముందుంచుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాయావతి ప్రకటించారు. తన నివాసంలో తృతీయ కూటమి నేతలకు ఇచ్చిన విందులో ఆమె మాట్లాడుతూ.. కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తామందరం కలిసి ముందుకు సాగాలని పిలునిచ్చారు.
Source: జాతీయ | 16 Mar 2009 | 4:12 am

దాడికి ప్రతిదాడి తప్పదు: మంత్రి చిదంబరం

మన పొరుగున ఉన్న దేశాలు ముంబై తరహా దాడులకు పాల్పడితే భారత్ ఎదురుదాడి చేయడం ఖాయమని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. మూడు నెలల క్రితం కంటే.. భారత్ ఇపుడు ఎంతో సురక్షితంగా ఉందన్నారు. తన సొంత నియోజకవర్గమైన శివగంగై (తమిళనాడు)లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: జాతీయ | 16 Mar 2009 | 3:59 am

మార్చి 16, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Mar 2009 | 2:49 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 16 Mar 2009 | 2:48 am