మార్చి 15, 2009 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా 15.00 అభిరుచి 15.30 ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 15 Mar 2009 | 6:12 am

ఈ వారం


Source: Yahoo! Telugu: Entertainment | 15 Mar 2009 | 6:07 am

3,423 అభ్యర్థులపై సీఈసీ అనర్హత వేటు

ఎన్నికల ఖర్చులను సమర్పించనందుకు గాను 3423 అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనర్హత వేటు వేసింది. వీరిలో 1075 మంది ఉత్తరప్రదేశ్‌, 616 మంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. వీరింతా మూడు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
Source: జాతీయ | 15 Mar 2009 | 6:06 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 15 Mar 2009 | 6:06 am

నేడు మూడో కూటమి నేతల విందు భోజనం

దేశంలో తాజాగా ఏర్పాటైన తృతీయ కూటమి నేతల విందుభోజన సమావేశం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి నివాసంలో ఆదివారం జరుగనుంది. ఈ సమావేశానికి వామపక్షాల నేతలతో సహా, తెలుగుదేశం, జనతాదళ్ (ఎస్), తెలంగాణ రాష్ట్ర సమితి, అన్నాడీఎంకే, హర్యానా జనహిత్ కాంగ్రెస్‌తో సహా మొత్తం 11 పార్టీల నేతలు హాజరుకానున్నారు.
Source: జాతీయ | 15 Mar 2009 | 5:42 am

మా ప్రధాని అభ్యర్థి మన్మోహనుడే: కాంగ్రెస్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి మన్మోహన్ సింగేనని కాంగ్రెస్ పార్టీ మరోమారు స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రధానమంత్రి మన్మోహన్ సింగే తమ ప్రధాని అభ్యర్థి. ఆయన, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వంలో 15వ లోక్‌సభ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సిద్ధమైందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 14 Mar 2009 | 1:43 pm

మూడో కూటమి నిర్ధిష్టమైన ఎజెండా లేదు: భాజపా

తాజాగా ఏర్పాటైన తృతీయ కూటమికి నిర్ధిష్టమైన ఎజెండా లేదని భారతీయ జనతా పార్టీ ఎద్దేవా చేసింది. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ మూడో కూటమి అనేక పార్టీల కలగూర గంపలా ఉందని, ఆ కూటమికి స్పష్టమైన ప్రణాళిక లేదని ఆయన ఆరోపించారు. మూడో కూటమిని దేశ ప్రజలు అంగీకరించబోరని, గుర్తించబోరనే విషయాన్ని గత చరిత్రే చెబుతుందన్నారు.
Source: జాతీయ | 14 Mar 2009 | 1:27 pm

ప్రజలను విరాళాలర్థిస్తున్న రాజకీయ పార్టీలు

"ప్రజల వద్దకు పాలన" అంటూ ఒకప్పుడు నినాదం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ తాజాగా సామాన్య ప్రజల వద్దకు విరాళాలకోసం వెళుతోంది. పార్టీకి విరాళాలను సమర్పించాల్సిందిగా ఇంటర్నెట్‌లో అభ్యర్థనలు చేస్తోంది. తెలుగుదేశం వేసిన ఈ కొత్త రకం అడుగు జాడల్లో పీఆర్పీ, లోక్‌సత్తా వంటి పార్టీలు సైతం నడుస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 14 Mar 2009 | 1:16 pm

16 నుంచి చిరంజీవి కృష్ణా జిల్లా పర్యటన

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కృష్ణా జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 16వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించాల్సి ఉన్నందున ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించకుండా రోడ్‌షోలు నిర్వహిస్తూ, చిన్నపాటి జంక్షన్‌లలో చిరంజీవి ప్రసంగించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 14 Mar 2009 | 12:27 pm

ప్రధానమంత్రి రేసులో లేను: ములాయం సింగ్

దేశ అత్యున్నత పీఠమైన ప్రధానమంత్రి రేసులో తాను లేనని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌తో స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని, వామపక్షాలు తమ మిత్రులేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 14 Mar 2009 | 11:23 am