|
మూడో కూటమి నిర్ధిష్టమైన ఎజెండా లేదు: భాజపాతాజాగా ఏర్పాటైన తృతీయ కూటమికి నిర్ధిష్టమైన ఎజెండా లేదని భారతీయ జనతా పార్టీ ఎద్దేవా చేసింది. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ మూడో కూటమి అనేక పార్టీల కలగూర గంపలా ఉందని, ఆ కూటమికి స్పష్టమైన ప్రణాళిక లేదని ఆయన ఆరోపించారు. మూడో కూటమిని దేశ ప్రజలు అంగీకరించబోరని, గుర్తించబోరనే విషయాన్ని గత చరిత్రే చెబుతుందన్నారు.Source: జాతీయ | 14 Mar 2009 | 1:27 pm ప్రజలను విరాళాలర్థిస్తున్న రాజకీయ పార్టీలు"ప్రజల వద్దకు పాలన" అంటూ ఒకప్పుడు నినాదం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ తాజాగా సామాన్య ప్రజల వద్దకు విరాళాలకోసం వెళుతోంది. పార్టీకి విరాళాలను సమర్పించాల్సిందిగా ఇంటర్నెట్‌లో అభ్యర్థనలు చేస్తోంది. తెలుగుదేశం వేసిన ఈ కొత్త రకం అడుగు జాడల్లో పీఆర్పీ, లోక్‌సత్తా వంటి పార్టీలు సైతం నడుస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 14 Mar 2009 | 1:16 pm 16 నుంచి చిరంజీవి కృష్ణా జిల్లా పర్యటనప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కృష్ణా జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 16వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించాల్సి ఉన్నందున ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించకుండా రోడ్‌షోలు నిర్వహిస్తూ, చిన్నపాటి జంక్షన్‌లలో చిరంజీవి ప్రసంగించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు ఆయన చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 14 Mar 2009 | 12:27 pm ప్రధానమంత్రి రేసులో లేను: ములాయం సింగ్దేశ అత్యున్నత పీఠమైన ప్రధానమంత్రి రేసులో తాను లేనని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌తో స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని, వామపక్షాలు తమ మిత్రులేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.Source: జాతీయ | 14 Mar 2009 | 11:23 am భూపతి ముందంజ: సానియా వెనుకంజఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి ముందంజ వేశాడు. బహామాస్‌కు చెందిన మార్క్ నోవెల్స్‌తో జత కట్టిన భూపతి, రష్యా జోడీ అయిన డిమిత్రీ తుర్సునోవ్, ఇగోర్ కునిత్సిన్‌పై జయకేతనం...Source: Yahoo! Telugu: News | 14 Mar 2009 | 10:05 am యూపీఏకు, ఎన్డీఏకు దూరం: నవీన్ స్పష్టంఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే యూపీఏ కూటమికిగానీ, ఎన్డీఏ కూటమికిగానీ తాము మద్దతు ఇవ్వబోమని బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రకటించారు. నవీన్ చేసిన ఈ ప్రకటనతో బీజేడీ సైతం తృతీయ ఫ్రంట్‌లో...Source: Yahoo! Telugu: News | 14 Mar 2009 | 9:39 am జమ్మూ, కాశ్మీర్‌లో పర్యటించనున్న చిదంబరంకేంద్ర హోంశాఖ మంత్రి పి చిదంబరం త్వరలో జమ్మూ-కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో భద్రతా పరిస్థితులను సమీక్షించాల్సిందిగా జమ్మూ-కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పంపిన ఆహ్వానం మేరకు చిదంబరం ఈ పర్యటనకు...Source: Yahoo! Telugu: News | 14 Mar 2009 | 8:47 am 16నుంచి కృష్ణా జిల్లాలో చిరంజీవి పర్యటనప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈ నెల 16నుంచి కృష్ణా జిల్లాలో పర్యటన నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రోడ్‌షోలతోపాటు ప్రధాన కూడళ్లలో ప్రసంగించనున్నారని పీఆర్పీ వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 14 Mar 2009 | 8:15 am చివరి వన్డేలో భారత్‌పై కివీస్ ఘన విజయంసిరీస్ గెలిచేశామన్న ఉదాసీనతో, కివీస్ బౌలర్లను చితగొట్టేయగలమన్న ధీమానో తెలియదుగానీ చివరివన్డేలో భారత బ్యాట్స్‌మెన్ పూర్తి నిర్లక్ష్యంతో ఆడారు. ఫలితం... రోహిత్‌శర్మ (43 నాటౌట్), సెహ్వాగ్ (40)లు తప్ప తక్కిన బ్యాట్స్‌మెన్ అంతా రెండంకెల...Source: Yahoo! Telugu: News | 14 Mar 2009 | 8:12 am ప్రధాని పదవి రేసులో లేను: ములాయం స్పష్టందేశ ప్రధాని పదవి కోసం తాను పోటీ చేయడం లేదని సమాజ్‌వాదీ పార్టీ ఛీఫ్ ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. వామపక్షాలతో తన స్నేహం ఎప్పటిలానే కొనసాగుతుందని చెప్పిన ములాయం, ఇటీవల ప్రారంభించిన మూడో ఫ్రంట్‌పై వ్యాఖ్యానించడానికి...Source: Yahoo! Telugu: News | 14 Mar 2009 | 8:12 am కాంగ్రెస్-భాజపాలకు మద్దతు ఇవ్వం: నవీన్ఎన్నికల పోలింగ్ అనంతరం కాంగ్రెస్ లేదా భాజపా నేతృత్వాల్లో ఏర్పడే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోమని ఒరిస్సా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన తృతీయ కూటమిలో చేరుతారనే సంకేతాలు పరోక్షంగా ఇచ్చినట్టేనని మూడో కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.Source: జాతీయ | 14 Mar 2009 | 7:58 am యూపీఏ లేకుండా "సెక్యులర్" అసాధ్యం: పాశ్వాన్యూపీఏ భాగస్వామ్యం లేకుండా కేంద్రంలో లౌకికవాద ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యమని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖామంత్రి, లోక్‌జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎనిమిది పార్టీలతో కలిసి ఏర్పడిన తృతీయ కూటమి బలీయంగా ఉందని, అయితే, ఎన్నికల అనంతరం యూపీఏ సాకారం లేకుండా సెక్యులర్ ప్రభుత్వ ఏర్పాటు చేయడం కష్టసాధ్యమన్నారు.Source: జాతీయ | 14 Mar 2009 | 7:32 am ప్రజల పేదరికమే నేతలకు ఓటుబ్యాంకు: జేపీప్రజల పేదరికమే నేతలకు ఓటుబ్యాంకుగా మారడం దురదృష్టకరమని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ విమర్శించారు. ప్రజల పేదరికాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తున్న రాజకీయ పార్టీలు కేవలం ప్రజాకర్షక పథకాలతోనే సరిపెడుతున్నాయని...Source: Yahoo! Telugu: News | 14 Mar 2009 | 7:29 am అద్వానీని కలుసుకున్న ముకేశ్ అంబానీదేశీయ ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛీఫ్ ముకేశ్ అంబానీ శనివారం భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య సమావేశం సుమారు 30 నిమిషాల పాటు సాగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటి...Source: Yahoo! Telugu: News | 14 Mar 2009 | 7:29 am రాష్ట్ర అభ్యర్ధుల జాబితా సిద్ధం: మొయిలీవచ్చే ఎన్నికల్లో రాష్ట్రంనుంచి పార్టీ తరపున బరిలో దిగనున్న అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని, దీనికి సంబంధించి పూర్తి జాబితా సిద్ధమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 14 Mar 2009 | 6:47 am మోడీ నా వారసుడు కాదు: ఎల్కే.అద్వానీభారతీయ జనతా పార్టీలోని ద్వితీయతరం నేతల్లో అత్యంత ప్రజాధారణ పొందిన వ్యక్తిగా పేరుగాంచిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన వారసుడు కాదని ఆ పార్టీ అగ్రనేత, ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థి లాల్‌కృష్ణ అద్వానీ స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం పార్టీలో అత్యంత ప్రాచూర్యం ఉన్న నేత అని ఆయన కితాబిచ్చారు.Source: జాతీయ | 14 Mar 2009 | 6:47 am రాజకీయ పరిష్కారం కనుక్కోండి: అమెరికాదేశంలో నెలకొన్న తమిళుల సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాల్సిందిగా శ్రీలంకకు అమెరికా సూచించింది. అదేసమయంలో అభివృద్ధిని తమిళులతో పంచుకునేందుకు శ్రీలంక ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా అమెరికా కోరింది.Source: Yahoo! Telugu: News | 14 Mar 2009 | 6:31 am ధన బలం అడ్డుకట్టకు ప్రత్యేక నిఘా: గోపాలస్వామిసార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ధన బలంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక రోజు పాటు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల పనులను సమీక్షించిన గోపాలస్వామి, పలు అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో ధనబలాన్ని అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు.Source: జాతీయ | 14 Mar 2009 | 6:28 am మార్చి 16నుంచి ఒంటిపూట తరగతులువేసవి ఎండలు ప్రారంభం కావడంతో... ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐక్యోపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) శుక్రవారం ఓ ప్రకటన ఈ విషయం వెల్లడించింది. విద్యాశాఖ సంచాలకులు భానుమూర్తి ఒంటిపూట తరగతుల నిర్వహణకు సంబంధించి ఉత్తర్వులు జారీచేసినట్టు యూటీఎఫ్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటన ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు ఉదయం ఎనిమిది గంటలనుంచి మధ్యాహ్నం 12.30 గంటలవరకు మాత్రమే పనిచేస్తాయి. అదేసమయంలో... మార్చి 23నుంచి పదవతరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించిన పాఠశాలల్లో తరగతులు మాత్రం డీఈవోల నిర్ణయానికి అనుగుణంగా జరుగనున్నట్లు విద్యాశాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.Source: ఏపీ న్యూస్ | 14 Mar 2009 | 5:57 am 50శాతం పూర్తయిన నాని, మాధవీలత చిత్రంనాని (అష్టాచమ్మా) కథానాయకుడిగా, మాధవీలత (నచ్చావులే) నాయికగా జెమినీ సర్క్యూట్ సమర్పణలో ఓ కొత్త చిత్రాన్ని నిర్మితమవుతోంది. ఈ చిత్రానికి సత్యం బెల్లంకొండ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్న ప్రేమకథా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని...Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2009 | 5:52 am టీవీలు ఉన్నవారికేనా.. పేదలకు వద్దా..?! : ఎన్టీఆర్కలర్ టీవీలు పెద్దవాళ్లకు మాత్రమే ఉంటే సరిపోతుందా, పేదలకు మాత్రం ఉండకూడదా, పేదలు టీవీ చూస్తే తప్పేంటి అని.. సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. ఉన్నవాళ్లు బెడ్‌రూముల్లో, బాత్రూంలలో, కారుల్లో, బారుల్లో... ఇలా అన్నిచోట్లా టీవీలు పెట్టుకుంటుంటే.. పేదలకు మాత్రం కలర్ టీవీ చూసే అర్హత మాత్రం ఉండకూడదా అని ఆయన నిలదీస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టిన జూనియర్ ఎన్టీఆర్... తన రోడ్‌షోలో భాగంగా, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి తన ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎనిమిది చోట్ల ప్రసంగించిన ఎన్టీఆర్.... ప్రతిచోటా తెదేపా హామీలను పునరుద్ఘాటించడంతో పాటు, అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రకటించిన నగదు బదిలీ పథకం వల్ల పేదలు సోమరులవుతారంటూ వస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు.Source: ఏపీ న్యూస్ | 14 Mar 2009 | 5:52 am ముంబై దాడులు: పాక్‌కు భారత్ సమాధానంముంబై దాడులకు సంబంధించి పాకిస్థాన్ అడిగిన ప్రశ్నలకు భారత్ లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చింది. ఉగ్రవాది కసబ్ డీఎన్‌ఏ శాంపిల్స్‌తో సహా ఫోరెన్సిక్ నివేదికలను కూడా పాక్‌కు అందించినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికైనా పాక్ తక్షణం స్పందించి, ముంబై ముష్కరులను చట్టం ముందు నిలిబెట్టేందుకు దాయాదిదేశం కృషి చేయాలని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం సూచించారు.Source: జాతీయ | 14 Mar 2009 | 5:46 am ఎన్నికలను సజావుగా జరపండి : ఈసీఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా జరిగేలా చూడాలని... కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలస్వామి కలెక్టర్లు, ఎస్పీలను కోరారు. ఈ సందర్భంగా ఆయన... రాష్ట్రంలోని పరిస్థితులను, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ వివరాల గురించి సబంధిత అధికారులతో చర్చించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహాలులో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల అధికారులైన గోపాలస్వామి, నవీన్‌చావ్లా, ఖురేషీలతో సహా రాష్ట్రం ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావులు కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించారు. ఈ సమావేశంలో భద్రత తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు వీరు చర్చలు జరిపారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కడప జిల్లాపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ జిల్లాలో విధులను నిర్వహించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కలెక్టర్ శశిభూషణ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. దీంతోపాటు ఓటర్ల నమోదు, ఫోటో ఓటర్ల జాబితా, ఫోటో గుర్తింపు కార్డుల జారీ, ఎన్నికల సిబ్బంది నియామకం, సెక్యురిటీ తదితర అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాలవారీగా సమీక్ష జరిపింది.Source: ఏపీ న్యూస్ | 14 Mar 2009 | 5:13 am అలాంటివి పట్టించుకోం : అల్లు అరవింద్ప్రజారాజ్యం పార్టీని విమర్శిస్తూ వచ్చే సినిమాల గురించి తాము పట్టించుకోమని... ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ స్పష్టం చేశారు. దాసరినారాయణరావు ప్రధానపాత్రలో నటించిన మేస్త్రీ చిత్రం గురించి కొంతమంది ప్రశ్నించిన సమయంలో అల్లు అరవింద్ పై విధంగా స్పందించడం గమనార్హం. ఈ విషయమై అల్లు అరవింద్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఇలాంటి చిత్రాలు రావడం సహజమని అన్నారు. ఇలాంటి చిత్రాలు రెండు వారాలపాటు ఆడి పోతాయని వాటిగురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తాను ఆ చిత్రాన్ని చూడలేదని, అయితే కొత్త పార్టీల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆ చిత్రంలో చెప్పినట్టు తనకు తెలియవచ్చిందని అల్లు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 14 Mar 2009 | 5:07 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2009 | 4:59 am మార్చి 14, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమా...Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2009 | 4:57 am భూమిక ఓటు టీడీపీకిప్రముఖ సినీ నటి భూమిక తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో శనివారం బాబును కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. సినీదిగ్గజాలు జయసుధ, జీవిత, రాజశేఖర్, శ్రీహరిలాంటి ప్రముఖులు చేరడంతో తమ పార్టీలోనూ మరికొంతమంది సినీ నటులను చేర్పించుకోవడానికి టీడీపీ నాయకత్వం గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదిలావుండగా ప్రస్తుతం ఆ పార్టీకి కొత్త సినీ తారల ఆకర్షణ అంతగా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Source: ఏపీ న్యూస్ | 14 Mar 2009 | 4:30 am అమెరికా రాయబారిగా మీరా శంకర్ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి మీరా శంకర్ అమెరికాలో భారతదేశంతరపున నూతన రాయబారిగా నియమితులవనున్నారు. ఈ పదవిలో నియమించబడే రెండవ మహిళగా ఆమె గుర్తింపు పొందనున్నారు. ప్రస్తుతం ఆమె జర్మనీలో భారతదేశంతరపున రాయబారిగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో తన సహ ఉద్యోగి రోనేన్ సేన్ స్థానంలో చేరనున్నారు. మార్చినెల 31వ తేదీకి సేన్ పదవీ కాలం పూర్తి కావస్తుంది. మీరా 1973 బ్యాచ్‌కు చెందిన అధికారిణి అని, మీరాను భారతదేశం తరపున అమెరికా దేశానికి రాయబారిగా నియమిస్తున్నట్లు విదేశాంగమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆమె నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఆ శాఖ తెలిపింది.Source: జాతీయ | 14 Mar 2009 | 4:04 am జయప్రదపై బీజేపీ ఫిర్యాదుసమాజ్వాదీ పార్టీకి చెందిన సభ్యురాలు, ప్రముఖ సినీనటి జయప్రద ఓటర్లకు డబ్బులు పంచినట్లు భారతీయ జనతాపార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పుర్ నియోజకవర్గానికి సమాజ్ వాదీ పార్టీ తరపున జయప్రద అక్కడి ఓటర్లకు డబ్బులు పంచి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.Source: జాతీయ | 14 Mar 2009 | 3:37 am ఎన్నికల గోదాలో మేము అంపైర్లం: ఈసీరానున్న లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో తాము కేవలం అంపైర్లు మాత్రమేనని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ...రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు 5 కోట్ల 66 లక్షల 87 వేల 957 మంది ఓటర్లున్నారని, వీరికి అందరికి ఓటరు గుర్తింపు కార్డులను అందించామని, ఇంకా అందని వారికి త్వరలోనే అధికారులు ఓటరు గుర్తింపు కార్డులను వారికి అందించే ఏర్పాట్లలో నిమగ్నమైనారని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల గోదాములో తాము కేవలం అంపైర్లు మాత్రమేనని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 13 Mar 2009 | 2:43 pm 26/11 దాడులు: పాక్ సందేహాలకు భారత్ జవాబులుముంబయి దాడుల్లో పాకిస్తాన్ జాతీయుల ప్రమేయంపై 400 పేజీలలో పాకిస్తాన్ లేవనెత్తిన 30 ప్రశ్నలకు భారతదేశం సమాధానాలిచ్చింది. వీటితోపాటు దాడులకు సంబంధించిన ఫోర్సెనిక్ రిపోర్టులను భారతదేశ విదేశాంగ కార్యదర్శి శివశంకర్ మీనన్ పాకిస్తాన్ హై కమిషనర్ షాహిద్ మాలిక్‌కు న్యూఢిల్లీలో అందజేశారు. దాడులకు పాల్పడిన సమయంలో ఉగ్రవాదులు ఉపయోగించిన సెల్ ఫోన్లు, సంభాషణల తాలూకు రుజువులతో సహా వారి వేలి ముద్రలను నివేదికలో పొందుపరిచారు. అంతకుముందు కేంద్ర హోం శాఖా మంత్రి చిదంబరం ఈ నివేదికను కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు.Source: జాతీయ | 13 Mar 2009 | 2:02 pm కాంగ్రెస్‌కు గెలుపు ఖాయం: దేవినేని జోస్యంవచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని నెహ్రూ (రాజశేఖర్) జోస్యం చెప్పారు. 230 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెల్చుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పరిపాలనలోనే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందని దేవినేని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి తిరిగి పట్టం కడుతాయని దేవినేని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేసే దేవినేని, ఏప్రిల్ నాలుగో తేదీన నామినేషన్‌ను దాఖలు చేస్తానని ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 13 Mar 2009 | 1:23 pm మెదక్‌నుంచి విజయశాంతి పోటీ: కేసీఆర్తమ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మెదక్ స్థానం నుంచి తమ పార్టీక చెందిన విజయశాంతిని బరిలోకి దించుతామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఒకవేళ విజయశాంతి కాకుంటే తానే మెదక్ స్థానం నుంచి పోటీకి నిలుస్తానని కేసీఆర్ పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 13 Mar 2009 | 1:04 pm
|