భూములను అమ్ముకున్న వైఎస్: ఎన్టీఆర్

అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని భూములను అమ్ముకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ విమర్శించారు. లక్ష్యసాధన అంటూ మాటిమాటికి చెప్పే వైఎస్‌కు లక్ష కోట్ల రూపాయల సంపాదనే లక్ష్యమని ఇది ఇన్నాళ్లకు...
Source: Yahoo! Telugu: News | 13 Mar 2009 | 11:27 am

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 413 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం లాభాల బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ల సానుకూల ప్రభావంతో 137 పాయింట్లు వృద్ధి చెంది 8481 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌, అనంతరం దాదాపుగా రోజు మొత్తం లాభాల్లోనే నిలిచింది.
Source: Yahoo! Telugu: News | 13 Mar 2009 | 11:21 am

రాష్ట్రంలో తొలిజాబితా ప్రకటించిన బీజేపీ

రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతాపార్టీ తన తొలి జాబితాను ప్రకటించింది. తొలి జాబితా సందర్భంగా బీజేపీ 8 లోక్‌సభ, 43 శాసనసభ స్థానాలకు తన అభ్యర్ధులను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం సినీనటుడు నరేష్...
Source: Yahoo! Telugu: News | 13 Mar 2009 | 10:55 am

బాండ్ గర్ల్‌గా ఫ్రిడా పింటో..!

అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది.. కానీ దురదృష్టం తలుపు తడుతూనే ఉంటుంది. అయితే ఈ సామెత ఫ్రీడా పింటో విషయంలో తిరగరాయాల్సిందే. స్లమ్‌డాగ్ చిత్రం రాక ముందు.. ఎవరో ఎమిటో తెలియని ఫ్రిడా... ఇప్పుడు యావత్‌సినీ ప్రపంచ దృష్టినీ ఆకర్షిస్తోంది. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలో నటనకు ఆస్కార్ అవార్డు పొందడంతో.. ఆమెకు మరింత క్రేజ్ పెరిగిదంటే.. నమ్మశక్యం కాదేమో. కానీ ఇది నమ్మితీరాల్సిందే. ఇందుకు నిదర్శనంగా జేమ్స్ బాండ్ చిత్రంలో కథానాయికగా ఫ్రిడా నటించే అవకాశాలున్నాయని హాలీవుడ్ వర్గాల ప్రస్తుత తాజా సమాచారం.
Source: వినోదం | 13 Mar 2009 | 10:48 am

తృతీయ కూటమి పీఎం అభ్యర్థిత్వానికి మాయ పట్టు

దేశ రాజకీయాల్లో కొత్తగా ఏర్పడిన తృతీయ కూటమిని ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఎవరికి ఇవ్వాలనే ప్రశ్న వేధిస్తోంది. ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం యూపీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి పట్టుబడుతున్నట్లు
Source: Yahoo! Telugu: News | 13 Mar 2009 | 10:48 am

ఇండియన్ వెల్స్ రెండో రౌండులోకి సానియా

భారత మహిళా టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ఇండియన్ వెల్స్ సింగిల్స్ రెండో రౌండులోకి అడుగుపెట్టింది. 4.5 మిలియన్ డాలర్ల ఈ బీఎన్‌పీ పారిబాస్ ఓపెన్‌లో సానియా మీర్జాకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ తొలి రౌండులో
Source: Yahoo! Telugu: News | 13 Mar 2009 | 10:31 am

ఉచిత టీవీల ప్రకటన రాజ్యాంగ విరుద్ధం: జేపీ

తాము అధికారంలోకి వస్తే ఉచిత టీవీలను ఇస్తామంటూ టీడీపీ పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనే లక్ష్యంతో గుప్పించే ఇలాంటి హామీలపై చర్యలు తీసుకోవాలని...
Source: Yahoo! Telugu: News | 13 Mar 2009 | 10:26 am

వెళ్లిరమ్మన్నందుకే...!

"నువ్వు హత్య చేసిన వ్యక్తి నీకు ప్రాణదానం చేసిన వ్యక్తి కదా..!" అడిగాడు లాయర్ "అవును" చెప్పాడు హంతకుడు...
Source: వినోదం | 13 Mar 2009 | 10:07 am

ఏమైనా చేస్తాడు..?

"ఏవండీ... నేను సడన్‌గా ఒకరోజు చచ్చిపోతే మీరు ఎలా బ్రతుకుతారో ఏంటో...? నాకు బెంగగా వుంది...!" అంది భార్య...
Source: వినోదం | 13 Mar 2009 | 10:06 am

ఐపీఎల్ భద్రతపై హోం శాఖ సమావేశం పూర్తి

హోం మంత్రి పి.చిదంబరం శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ భద్రతపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భద్రతా సంస్థల ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశంలో సాధారణ ఎన్నికలు, ఐపీఎల్ రెండో సీజన్
Source: Yahoo! Telugu: News | 13 Mar 2009 | 10:04 am

కాంగ్రెస్, టీసీ మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పొత్తు కుదుర్చుకున్న తృణమూల్ కాంగ్రెస్ (టీసీ), కాంగ్రెస్ పార్టీల మధ్య తాజాగా సీట్ల పంపక ఒప్పందం కూడా ఖారారైంది. రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై బుధవారం రాత్రి ఓ అవగాహనకు వచ్చాయి. రాష్ట్రంలో అధికార లెఫ్ట్ ఫ్రంట్‌ను సంయుక్తంగా ఎదుర్కోవాలని కాంగ్రెస్, టీసీ ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 13 Mar 2009 | 9:49 am

కేరళ: అధికార వామపక్ష కూటమిలో చీలిక

కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్)లో చీలిక వచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సీపీఎం, సీపీఐ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. తాజా పరిణామాలను పరిశీలించేందుకు న్యూఢిల్లీలో సీపీఎం
Source: Yahoo! Telugu: News | 13 Mar 2009 | 9:46 am

మహారాష్ట్ర వాదికి ఓ అవకాశం ఇవ్వాలి: పవార్

దేశ అత్యున్నత పీఠమైన ప్రధానమంత్రి పదవిని అధిరోహించేందుకు మహారాష్ట్రకు చెందిన నేతకు ఒక అవకాశం ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్.సి.పి. అధినేత శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలకు చెందిన వారు ప్రధానమంత్రి పదవిని అధిరోహించారని ఆయన గుర్తు చేశారు.
Source: జాతీయ | 13 Mar 2009 | 9:24 am

దలైలామాతో చర్చలకు సిద్ధం: చైనా ప్రధాని

టిబెట్ వివాదంపై దలైలామాతో చర్చలు జరిపేందుకు చైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధానమంత్రి వెన్ జియబావో తెలిపారు. దలైలామా చర్చలకు కట్టుబడి ఉంటే, అందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చైనాలో టిబెట్
Source: Yahoo! Telugu: News | 13 Mar 2009 | 9:23 am

అమృత అరోరా హనిమూన్ క్యాన్సిల్..!

బాలీవుడ్ గ్లామరస్ స్టార్ అమృత అరోరా హనిమూన్ క్యాన్సిల్ అయిందట..!. ఇటీవలే షకీల్ లాడెక్‌ను వివాహమాడిన అమృత అరోరాకు జ్వరమొచ్చిందట. అందుకే ఆమె హనిమూన్ రద్దైందని అరోరా సన్నిహితుల సమాచారం. పెళ్లి సమయంలో అతిథులను గౌరవించడం, కొత్త పెళ్లి కూతురుగా తన అందం చెదిరిపోకుండా...
Source: వినోదం | 13 Mar 2009 | 8:42 am

ప్రధాని అభ్యర్థిత్వంపై రాజీలేదు: బీఎస్పీ

తృతీయ కూటమి ఆవిర్భవించి ఇంకా 24 గంటలు కూడా పూర్తికాకముందే అపుడే అల్టిమేటాలు జారీ అవుతున్నాయి. మూడో కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తక్షణం తేల్చాలని బహుజన్ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) శుక్రవారం అల్టిమేటం జారీ చేసింది. తృతీయ కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా మాయావతిని ప్రకటించాలని, ఇందులో ఎలాంటి రాజీలేదని ఆ పార్టీ తేల్చి చెప్పింది.
Source: జాతీయ | 13 Mar 2009 | 8:05 am

ర్యాంగింగ్ పేరుతో విద్యార్ధినిపై వేధింపులు

ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధిని తనపై జరిగిన ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధిని ప్రాణాలతో బయటపడడం కాస్త...
Source: Yahoo! Telugu: News | 13 Mar 2009 | 7:29 am

జి- 20 సమావేశాలకు ప్రధాని మన్మోహన్

లండన్‌లో వచ్చే నెల 2న జరిగే జి- 20 సమావేశానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని గురువారం ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న ప్రధాని మన్మోహన్ ఈ సమావేశాల్లో పాల్గొనడంపైఅనుమానాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 13 Mar 2009 | 6:47 am

మహారాష్ట్రలో కుదిరిన భాజపా-సేన పొత్తు

మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేనల మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారైంది. మొత్తం 48 సీట్లకు గాను భాజపా 26 సీట్లలోనూ, శివసేన 22 సెగ్మెంట్లలో పోటీ చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించాయి. పొత్తు ఖరారుపై శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడవచ్చని భాజపా వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 13 Mar 2009 | 5:13 am

అతీఫ్ నన్ను బెదిరించాడు: సాదీక్ వెల్లడి

ఢిల్లీలోని బాత్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన అతీఫ్ తనను 7/11 ముంబయి రైలు పేలుళ్లకు బాధ్యతవహించాలని బెదిరించినట్లు ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదిగా భావిస్తున్న మొహమ్మద్ సాదీక్ షేక్ ప్రత్యేక మోకా కోర్టులో చెప్పాడు.
Source: జాతీయ | 13 Mar 2009 | 4:14 am

పాక్‌లో రాజకీయ సంక్షోభం: భారత్‌లో ఆందోళన

పాకిస్థాన్‌లో తాజా రాజకీయ సంక్షోభం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. పొరుగుదేశంలో నాయకత్వం తాజా సంక్షోభాన్ని స్నేహపూరిత వాతావరణంలో పరిష్కరించుకోవాలని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం పాక్‌లో తాజా పరిణామాలపై కేబినెట్ భద్రతా కమిటీ (సీసీఎస్) సమావేశంలో సమీక్ష జరిపారు.
Source: జాతీయ | 13 Mar 2009 | 4:13 am

మూడో ఫ్రంట్ ఆవిర్భావం: నేతల తలోరాగం

ఎనిమిది పార్టీల ఆధ్వర్యంలో అట్టహాసంగా తృతీయ కూటమి ఆవిర్భవించింది. ఇది దేశ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలకు తెరలేపింది. కర్ణాటక రాజధాని బెంగుళూరుకు సమీపంలోని తుముకూరు వేదికగా జేడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో సీపీఎం, సీపీఐ, తెదేపా, తెరాస, బీఎస్పీ, అన్నాడీఎంకే, ఆర్.ఎస్.పి., ఫార్వర్డ్ బ్లాక్, హర్యానా జనహిత్ పార్టీల నేతలు ఒకటిగా చేరారు. రానున్న ఎన్నికల్లో అధికార వికేంద్రీకరణఏ ప్రాతిపదికగా తమ కూటమి యూపీఏ, ఎన్డీయే కూటములకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ప్రకటించారు.
Source: జాతీయ | 13 Mar 2009 | 4:12 am

నగదు పంపిణీ: ములాయంకు ఈసీ నోటీసు

హోలీ సంబరాల్లో తన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ సమక్షంలో ఆ పార్టీ కార్యకర్తలు డబ్బు పంపిణీ చేసిన సంఘటనను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఈనెల 14వ తేదీ లోగా సమాధానం చెప్పాలని కోరుతూ నోటీసును కూడా జారీ చేసింది. పలు టీవీ ఛానళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్స్‌ను ఆధారంగా తీసుకుని ములాయంకు నోటీసులు జారీ చేసినట్టు ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి గురువారం ఢిల్లీలో వివరణ ఇచ్చారు.
Source: జాతీయ | 13 Mar 2009 | 4:11 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2009 | 3:49 am

మార్చి 13, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి 14:30 శ్రీ కృష్ణ లీలలు 15:00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2009 | 3:47 am

పాక్‌లో పరిస్థితులపై భారత్ ఆందోళన

పాకిస్థాన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో సంభవిస్తున్న పరిణామాలు భారత్ భద్రతపై ప్రభావం చూపే అవకాశముందని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ పరిస్థితులు పూర్తిగా ఆ దేశ అంతర్గత వ్యవహారమని దీనిపై భారత్ వ్యాఖ్యానించబోదని ఆయన అన్నారు.
Source: జాతీయ | 12 Mar 2009 | 2:36 pm

చిరంజీవి నాకు నచ్చిన వ్యక్తి: పోసాని

ఆపరేషన్ దుర్యోధన, మెంటల్ కృష్ణ వంటి చిత్రాలను రూపొందించిన పోసాని తాజాగా "రాజావారి చేపల చెరువు" అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మధ్యనే పీఆర్పీలో చేరారు. ప్రరాపాలో కార్యకర్తగా చేరానని, చిరంజీవి మంచి తనమే తనను దగ్గర చేసిందంటోన్న పోసాని పలు విషయాలపై స్పందించారు. అందులో కొన్ని సంగతులు మీ కోసం.. ప్రశ్న.. "రాజావారి చేపల చెరువు" ద్వారా ఏం చెప్పబోతున్నారు..? జ.. ఇది రాజకీయ నేపథ్యంలో కూడిన కథ. ఇందులో నేను పోలీస్ ఆఫీసర్‌ను. ప్రశ్న.. ఇండస్ట్రీలో ఉంటూ దానిపైనే దుమ్మెత్తిపోయడం ఎంత వరకు సమంజసం..? జ.. నా దృష్టిలో సమంజసమే. వేరే రంగం గురించి నాకు అంతగా తెలియదు. అందుకే నాకు జరిగిన ఉదంతాలతో ఇండస్ట్రీ గురించి చెబుతుంటాను. ప్రశ్న... సినిమాకు స్క్రిప్ట్ ముఖ్యమా? లేదా హీరో, దర్శకుడు కీలకమా? జ.. స్క్రిప్ట్ వల్ల సినిమాలు ఆడవు. అందులో అన్ని అంశాలుండాలి. ప్రశ్న... పీఆర్పీలోనే ఎందుకు చేరారు? జ.. చిరంజీవి నాకు నచ్చిన వ్యక్తి. ప్రజాసేవకుడు అందుకే చేరాను. ప్రశ్న.. వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు సమంజసం? జ.. వ్యక్తిగత విమర్శలకు నేను వ్యతిరేకం. ఏది నిజం, ఏది అసత్యం తెలుసుకుని మాట్లాడాలి.
Source: వినోదం | 12 Mar 2009 | 12:49 pm

త్రిష కాంగ్రెస్ తరపున పర్యటిస్తుందట...?!!

బక్కపలచని భామ త్రిష కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయనుందనే వార్తలు టాలీవుడ్ సినీ పరిశ్రమలో గుప్పుమన్నాయి. దీనిపై త్రిష స్పందించేలోపే రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాలకు ఈ వార్తను సెల్ ఫోన్లు మోసేశాయి. కాంగ్రెస్ పార్టీ తరపున తాను పర్యటించబోతున్నానని సినీ మిత్రులు ఒకరు చెపితే త్రిషకు తెలిసిందట. ఈ విషయాన్ని తెలుసుకుని త్రిష ఆశ్చర్యానికి లోనైందట. అసలు రాజకీయాలలో ప్రవేశించే వయసు తనది కాదని చెప్పిందట. అంటే... ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పొలిటిక్స్‌లో ప్రవేశించాలనే కోరిక ఉన్నట్లు తెలియడం లేదూ.
Source: వినోదం | 12 Mar 2009 | 12:26 pm

ప్రజారాజ్యంలో చేరిన మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు

ప్రజారాజ్యం పార్టీలో మరో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు చేరారు. ఆయన అనుచరగణంతో గురువారం మధ్యాహ్నం హైదరబాద్‌లోని పీఆర్పీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆ పార్టీలో చేరారు. యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ల సమక్షంలో ఆయన పీఆర్పీ సభ్యత్వం తీసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Mar 2009 | 11:00 am

కాంగ్రెస్‌లో చేరనున్న భాజపా నేత కృష్ణంరాజు

బీజేపీ పార్టీకి చెందిన సినీనటుడు కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ను కలిసి తను పార్టీ మారే అంశాన్ని చర్చించనున్నారు. కృష్ణంరాజు పార్టీ మారే విషయమై నాలుగురోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నా ఆయన మాత్రం ఈ విషయమై నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం వైఎస్‌తో కృష్ణంరాజు భేటీ ఖరారు కావడంతో ఊహాగానాలకు తెరపడే సమయం ఆసన్నమైంది.
Source: ఏపీ న్యూస్ | 12 Mar 2009 | 10:41 am