|
ప్రజారాజ్యంలో చేరిన మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబుప్రజారాజ్యం పార్టీలో మరో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు చేరారు. ఆయన అనుచరగణంతో గురువారం మధ్యాహ్నం హైదరబాద్‌లోని పీఆర్పీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆ పార్టీలో చేరారు. యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ల సమక్షంలో ఆయన పీఆర్పీ సభ్యత్వం తీసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Mar 2009 | 11:00 am పాక్ మరిన్ని చర్యలు తీసుకోవాలి: భారత్పాకిస్థాన్ ప్రభుత్వం ముంబయి ఉగ్రవాద దాడుల కుట్రదారులను చట్టం ముందునిలబెట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. ముంబయి దాడులపై పాకిస్థాన్ ప్రభుత్వం కూడా దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ మాట్లాడుతూ.. పాక్ లక్ష్యాన్ని సాధించే దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.Source: జాతీయ | 12 Mar 2009 | 10:51 am లాయర్ల పిటిషన్‌ను తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టుఆందోళనబాటలో ఉన్న న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఫిబ్రవరి 19న మద్రాస్ హైకోర్టు ప్రాగంణంలో లాయర్లకు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు పోలీసులు అధిక సంఖ్యలో కోర్టు ప్రాంగణంలో ఉన్నారనే ఆరోపణలపై తక్షణ విచారణ జరపాలని కోరుతూ న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.Source: జాతీయ | 12 Mar 2009 | 10:50 am కాంగ్రెస్‌లో చేరనున్న భాజపా నేత కృష్ణంరాజుబీజేపీ పార్టీకి చెందిన సినీనటుడు కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ను కలిసి తను పార్టీ మారే అంశాన్ని చర్చించనున్నారు. కృష్ణంరాజు పార్టీ మారే విషయమై నాలుగురోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నా ఆయన మాత్రం ఈ విషయమై నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం వైఎస్‌తో కృష్ణంరాజు భేటీ ఖరారు కావడంతో ఊహాగానాలకు తెరపడే సమయం ఆసన్నమైంది.Source: ఏపీ న్యూస్ | 12 Mar 2009 | 10:41 am అసెంబ్లీ ఎన్నికలు:- కొత్త ముఖాలకే ఛాన్స్: డీఎస్అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ముఖాలకే ఛాన్స్ ఇవ్వనున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై చర్చించడానికి ఢిల్లీకి వెళ్లిన డీఎస్, ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు బుధవారం హైదరాబాద్‌కు తిరిగొచ్చారు.Source: ఏపీ న్యూస్ | 12 Mar 2009 | 10:14 am ఆరోగ్యశ్రీ ద్వారా కొత్త కార్డులు వద్దు: ఈసీరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎన్నికలు ముగిసేవరకు కొత్త కార్డులు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా రోగ నిర్ధారణ శిబిరాలను సైతం నిర్వహించవద్దని ఈసీ కోరింది. అయితే శిబిరాలు నిలిపేస్తే వైద్యం అందక పెద్ద ఎత్తున రోగులు మృతిచెందే అవకాశం ఉందని విలేకరులు చెప్పడంతో ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఈసీ తెలిపింది.Source: ఏపీ న్యూస్ | 12 Mar 2009 | 9:45 am అక్షయ్ కుమార్ అంటే "కైలీ"కి భలే ఇష్టమట..!బాలీవుడ్ యంగ్ స్టార్ అక్షయ్ కుమార్ అంటేనే... ఆస్ట్రేలియా పాప్ స్టార్ కైలీ మినోగ్ భలే ఇష్టమట..!. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ కైలీ మినోగ్ అక్షయ్ కుమార్ హీరోగా నటించే "బ్లూ" సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే.Source: వినోదం | 12 Mar 2009 | 8:40 am నేడు బెంగుళూరులో తృతీయ కూటమి సమరభేరి!కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కూటములకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమిని గురువారం మరోమారు తెరపైకి రానుంది. ఇందుకోసం జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడ ఆధ్వర్యంలో ఓ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. బెంగళూరుకు సమీపంలో నిర్వహించనున్న ఈ ర్యాలీలో సీపీఐ, సీపీఎం, తెరాస, తెదేపా, అన్నాడీఎంకే, ఫార్వర్డ్ బ్లాక్, ఆరెస్పీ, బీఎస్పీల నేతలు పాలు పంచుకోనున్నారు.Source: జాతీయ | 12 Mar 2009 | 7:23 am "సమర్థుడి"ని ట్రైలర్‌లో వీక్షించండికృష్ణంరాజు, రాజా, సంజనలు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం "సమర్థుడు". ఈ చిత్రం ఆడియో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియో సిడీనీ కృష్ణంరాజు విడుదల చేసి దర్శకుడు బి గోపాల్‌కు అందజేశారు. ఆడియో కేసెట్‌ను వెంకట్రామిరెడ్డి విడుదల చేశారు.Source: వినోదం | 12 Mar 2009 | 6:38 am మూడో కూటమిలో చేరలేదు: బీజేడీమూడో కూటమిలో చేరినట్టు వచ్చిన వార్తలను బిజూ జనతాదళ్ (బీజెడీ) తోసిపుచ్చింది. ఇప్పటి వరకు తాము ఏవరికీ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి దామోదర్ రౌత్ స్పష్టం చేశారు. అదేసమయంలో తాము ఎన్డీయే కూటమిలో ఇంకా కొనసాగుతున్నామని, కూటమితో పూర్తిస్థాయిలో తెగతెంపులు చేసుకోలేదని ఆయన మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.Source: జాతీయ | 12 Mar 2009 | 6:03 am వేసవి కానుకగా వస్తోన్న "వీడొక్కడే"ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవిఎం పతాకంపై 174వ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న "వీడొక్కడే" చిత్రం వేసవి కానుకగా తెరపైకి రానుంది. సూర్య, తమన్న హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న "వీడొక్కడే" ద్విభాషా చిత్రంగా (తమిళ, తెలుగు) తెరకెక్కనుంది. కె.వి. ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఆఫ్రికా, తాంజానియాలో 80 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. విదేశీ లొకేషన్లలో భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.Source: వినోదం | 12 Mar 2009 | 5:59 am డీజీపి యాదవ్ భవితవ్యం తేలేది నేడే!రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి పెద్దబాస్‌గా వ్యవహిస్తూ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించిన డిజిపి.యాదవ్ భవితవ్యం నేడు తేలనుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు దీనిపై సమీక్ష నిర్వహించి, యాదవ్‌ను బాధ్యతల్లో కొనసాగించాలా? వద్దా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారు.Source: ఏపీ న్యూస్ | 12 Mar 2009 | 5:24 am ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తాం: చిరంజీవితాము అధికారంలోకి వచ్చినా ప్రస్తుత ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను కొనసాగిస్తామని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 12 Mar 2009 | 5:08 am మేఘాలయా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభంమేఘాలయలో నెలకొన్న రాజకీయ సంక్షోభం విశ్వాసపరీక్షకు దారితీస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్సీపీ నేతృత్వంలోని మేఘాలయ ప్రగతిశీల కూటమి (ఎంపీఏ) ప్రభుత్వం బుధవారం ఓ సీనియర్ మంత్రి రాజీనామా చేయడంతో మైనారిటీలోకి జారుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో తాజాగా రాజకీయ సంక్షోభం ఏర్పడింది.Source: జాతీయ | 12 Mar 2009 | 4:49 am చెన్నైలో ఎన్.ఎస్.జి విభాగ కేంద్రం: కేంద్రంతమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఎన్.ఎస్.జి కేంద్ర విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ప్రధాని మన్మోనహన్ సింగ్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధికి ఓ లేఖ రాశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి అధికారిక పత్రికా ప్రకటనలో వెల్లడించింది.Source: జాతీయ | 12 Mar 2009 | 4:11 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2009 | 4:03 am మార్చి 12, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి 14:30 శ్రీ కృష్ణ లీలలు 15:00 ప్రేమ మందిరం ...Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2009 | 4:01 am కాంగ్రెస్, టీసీ మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందంపశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పొత్తు కుదుర్చుకున్న తృణమూల్ కాంగ్రెస్ (టీసీ), కాంగ్రెస్ పార్టీల మధ్య తాజాగా సీట్ల పంపక ఒప్పందం కూడా ఖారారైంది. రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై బుధవారం రాత్రి ఓ అవగాహనకు వచ్చాయి. రాష్ట్రంలో అధికార లెఫ్ట్ ఫ్రంట్‌ను సంయుక్తంగా ఎదుర్కోవాలని కాంగ్రెస్, టీసీ ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.Source: జాతీయ | 12 Mar 2009 | 3:14 am పార్లమెంట్‌లో తీవ్రవాద నిరోధక బిల్లుప్రస్తుతం ఉన్న చట్టవ్యతిరేక కార్యకలపాల నిరోధక చట్టాన్ని పటిష్టపరిచే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌లో తీవ్రవాద నిరోధక బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు తీవ్రవాద చర్యలపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్ట పరిధిలో విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.Source: జాతీయ | 11 Mar 2009 | 3:30 pm కాంగ్రెస్ మెప్పుకోసమే మేస్త్రీ తీశారా...?దర్శకరత్న దాసరి నారాయణ రావు నిర్మించిన "మేస్త్రి" చిత్రంలో ప్రరాపా అధినేత చిరంజీవిని ఏకేశారని విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ పార్టీ మెప్పుకోసమే మేస్త్రీ సినిమా తీశారని... ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇంకా రిలీజ్ కాని ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కార్మికుల నాయకుడిగా దాసరి నటిస్తే.. నిమ్నజాతికి చెందిన మేజర్‌గా మోహన్ బాబు నటించారు. రియల్ స్టార్ శ్రీహరి పోలీసు అధికారిగా నటించాడు.Source: వినోదం | 11 Mar 2009 | 2:52 pm తెలుగుదేశం పార్టీకి వీరారెడ్డి గుడ్బైతెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వీరారెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెదేపా తరపున కడపజిల్లా నేతగా వ్యవహరించిన వీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు పార్టీ శ్రేణుల సమాచారం. రాజీనామా చేసిన సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ.. మైసూరా రెడ్డి తనను మోసం చేశారని వ్యాఖ్యానించారు. అంతకుముందే ఆ పార్టీ సీనియర్ నేత చెరుకు ముత్యం రెడ్డి తెదేపాకు రాజీనామా చేసిన సంగతి విదితమే.Source: ఏపీ న్యూస్ | 11 Mar 2009 | 2:48 pm మా అంచనాలు తప్పుతాయి: ఆర్‌బీఐ గవర్నర్ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటుకు సంబంధించి తాము వేసిన అంచనాలు తప్పే అవకాశం ఉందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గవర్నర్ దువ్వూరి సుబ్బారావు జపాన్‌కు చెందిన నిక్కీ వార్తాపత్రికతో చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోSource: Yahoo! Telugu: News | 11 Mar 2009 | 11:45 am విప్లవాత్మక మార్పు కోసమే నేను వచ్చా: బాలయ్యరాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పును తీసుకురావడానికి తాను ప్రజల ముందుకు వచ్చానని నటుడు, తెలుగుదేశం పార్టీ నేత బాలకృష్ణ స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి ఈ మార్పు తప్పక తీసుకువస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా విలేకరులతో బాలకృష్ణ మాట్లాడుతూ, పరిశ్రమల కోసం అంటూ వేల ఎకరాల భూములను అధికార కాంగ్రెస్ పార్టీ స్వాహా చేస్తోందని విమర్శించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ.. రైతన్నలకు తీరని అన్యాయం చేస్తోందని ఎద్దేవా చేశారు.Source: ఏపీ న్యూస్ | 11 Mar 2009 | 11:32 am మృత్యుముఖంలోకి చేరనున్న గూడీగత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బ్రిటన్ రియాల్టీ టీవీ షో స్టార్ జేడ్ గూడీ.. అనుకున్న సమయం కంటే ముందుగానే మృత్యుముఖంలోకి జారుకునే అవకాశాలున్నాయని ఆసుపత్రి వైద్యులు ఊహిస్తున్నారు. బిగ్ బ్రదర్ రియాల్టీ షో మాజీ తార అయిన గూడీలో భయం కారణంగా కనీసం తన ఇద్దరు తనయులను చూడాలని కూడా ఆమె అనుకోవడం లేదుట. ఆమెకు.. ఐదేళ్ల బాబీ, నాలుగేళ్ల ఫ్రెడ్డీలు ఉన్నారు. కాగా, ఆమెకు ఆసుపత్రి బెడ్‌పై చనిపోవడం కూడా ఇష్టం లేదని సన్‌డాట్‌కోడాట్.యూకే పత్రిక వెల్లడించింది.Source: వినోదం | 11 Mar 2009 | 11:04 am షెన్‌యాంగ్‌తో గేమ్ డ్రా: మూడో స్థానంలో హంపిఐఎస్ బ్యాంక్ అతాతుర్క్ మహిళా గ్రాండ్‌ప్రిక్స్ చెస్ టోర్నమెంట్‌లో ప్రస్తుతం టాస్ సీడ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి మరో గ్రాండ్‌మాస్టర్‌తో మూడో స్థానాన్ని పంచుకుంటోంది. షెన్‌యాంగ్‌తో జరిగిన గేమ్‌ను హంపి డ్రాగా ముగించింది. టోర్నీలోSource: Yahoo! Telugu: News | 11 Mar 2009 | 11:03 am వైద్యవిద్యార్థి ర్యాగింగ్ కేసు: నలుగురిపై హత్య అభియోగాలుహిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థి ర్యాగింగ్ మరణంపై పోలీసులు మరో నలుగురు వైద్య విద్యార్థులపై హత్య అభియోగాలు నమోదు చేశారు. తాండా పట్టణంలోని రాజేంద్రప్రసాద్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చిత్రహింసలకు గురిచేయడంతో అమన్ కచ్రూ (19) అనే మెడికో మృతి చెందిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 11 Mar 2009 | 10:53 am ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య రేసులో డార్విన్ఉపఖండంలో భద్రతా పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉండటంతో, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య రేసులోకి బుధవారం డార్విన్ (ఆస్ట్రేలియా) నగరం దూసుకొచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు ఈ టోర్నీని తరలించాలని ఐసీసీSource: Yahoo! Telugu: News | 11 Mar 2009 | 10:30 am నిరసన ప్రదర్శనలపై పాకిస్థాన్ ప్రభుత్వ నిషేధంప్రతిపక్ష పార్టీలు గురువారం భారీ ర్యాలీకి సన్నద్ధమవుతున్న సమయంలో, పాకిస్థాన్ ప్రభుత్వం నిరసన ప్రదర్శనలపై నిషేధం విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్- ఎన్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇస్లామాబాద్‌లో ఈ నెలSource: Yahoo! Telugu: News | 11 Mar 2009 | 10:16 am
|