మా అంచనాలు తప్పుతాయి: ఆర్‌బీఐ గవర్నర్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటుకు సంబంధించి తాము వేసిన అంచనాలు తప్పే అవకాశం ఉందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గవర్నర్ దువ్వూరి సుబ్బారావు జపాన్‌కు చెందిన నిక్కీ వార్తాపత్రికతో చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో
Source: Yahoo! Telugu: News | 11 Mar 2009 | 11:45 am

విప్లవాత్మక మార్పు కోసమే నేను వచ్చా: బాలయ్య

రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పును తీసుకురావడానికి తాను ప్రజల ముందుకు వచ్చానని నటుడు, తెలుగుదేశం పార్టీ నేత బాలకృష్ణ స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి ఈ మార్పు తప్పక తీసుకువస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా విలేకరులతో బాలకృష్ణ మాట్లాడుతూ, పరిశ్రమల కోసం అంటూ వేల ఎకరాల భూములను అధికార కాంగ్రెస్ పార్టీ స్వాహా చేస్తోందని విమర్శించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ.. రైతన్నలకు తీరని అన్యాయం చేస్తోందని ఎద్దేవా చేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Mar 2009 | 11:32 am

షెన్‌యాంగ్‌తో గేమ్ డ్రా: మూడో స్థానంలో హంపి

ఐఎస్ బ్యాంక్ అతాతుర్క్ మహిళా గ్రాండ్‌ప్రిక్స్ చెస్ టోర్నమెంట్‌లో ప్రస్తుతం టాస్ సీడ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి మరో గ్రాండ్‌మాస్టర్‌తో మూడో స్థానాన్ని పంచుకుంటోంది. షెన్‌యాంగ్‌తో జరిగిన గేమ్‌ను హంపి డ్రాగా ముగించింది. టోర్నీలో
Source: Yahoo! Telugu: News | 11 Mar 2009 | 11:03 am

వైద్యవిద్యార్థి ర్యాగింగ్ కేసు: నలుగురిపై హత్య అభియోగాలు

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థి ర్యాగింగ్ మరణంపై పోలీసులు మరో నలుగురు వైద్య విద్యార్థులపై హత్య అభియోగాలు నమోదు చేశారు. తాండా పట్టణంలోని రాజేంద్రప్రసాద్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చిత్రహింసలకు గురిచేయడంతో అమన్ కచ్రూ (19) అనే మెడికో మృతి చెందిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 11 Mar 2009 | 10:53 am

ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య రేసులో డార్విన్

ఉపఖండంలో భద్రతా పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉండటంతో, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య రేసులోకి బుధవారం డార్విన్ (ఆస్ట్రేలియా) నగరం దూసుకొచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు ఈ టోర్నీని తరలించాలని ఐసీసీ
Source: Yahoo! Telugu: News | 11 Mar 2009 | 10:30 am

నిరసన ప్రదర్శనలపై పాకిస్థాన్ ప్రభుత్వ నిషేధం

ప్రతిపక్ష పార్టీలు గురువారం భారీ ర్యాలీకి సన్నద్ధమవుతున్న సమయంలో, పాకిస్థాన్ ప్రభుత్వం నిరసన ప్రదర్శనలపై నిషేధం విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్- ఎన్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇస్లామాబాద్‌లో ఈ నెల
Source: Yahoo! Telugu: News | 11 Mar 2009 | 10:16 am

త్వరలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా: డీఎస్

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఊపందుకుంటున్న తరుణంలో.. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానంగా పాలక పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై బుధవారం సాయంత్రం కసరత్తు చేయనుంది. ఈ నేపథ్యంలో.. తొలివిడత నోటిఫికేషన్ వచ్చే సమయానికి తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలిపారు. మొత్తానికి త్వరలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని డీఎస్ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 11 Mar 2009 | 9:59 am

కాంగ్రెస్‌కు చురుకైన యువతీ యువకులు కావలెను

రాబోయే రాజకీయ ముఖ చిత్రంలో ఈసారి కుర్రాళ్ల సంఖ్య ఎక్కువ కానుంది. వృద్ధ నేతలను వదిలించుకుని మెరికల్లాంటి యువతీ యువకులకోసం ఆయా పార్టీలు వెతుకులాడుతున్నారు. ఈ విషయంలో భాజపా ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పవచ్చు. రాజస్థాన్‌లో పేరు మోసిన నేతల కొడుకు,కూతుళ్లకు తన తొలి జాబితాలో స్థానాన్ని కల్పించింది. తొలి జాబితాలో టిక్కెట్లు పొందిన యువతీ యువకులు మహా ఉత్సాహంతో తమ తమ నియోజకవర్గాల్లో చురుకుగా పార్టీని బలోపేతం చేసి తద్వారా విజయం సాధించేందుకు నిమగ్నమయ్యారు
Source: జాతీయ | 11 Mar 2009 | 9:53 am

పీఆర్పీ శక్తికి రాజమండ్రి సభ నిదర్శనం: చిరు

ప్రజారాజ్యం శక్తి ఏపాటిదో చెప్పేందుకు మంగళవారం రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభ నిదర్శనమని ఆ పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. తప్పుడు సర్వేలతో ప్రజారాజ్యం పార్టీకి ఆదరణ లేదని చెప్పాలనుకున్న వారికి రాజమండ్రి సభ తిరుగులేని...
Source: Yahoo! Telugu: News | 11 Mar 2009 | 9:53 am

ర్యాగింగ్ మరణం: నలుగురిపై హత్య అభియోగాలు

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థి ర్యాగింగ్ మరణంపై పోలీసులు మరో నలుగురు వైద్య విద్యార్థులపై హత్య అభియోగాలు నమోదు చేశారు. తాండా పట్టణంలోని రాజేంద్రప్రసాద్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ పేరుతో
Source: Yahoo! Telugu: News | 11 Mar 2009 | 9:48 am

నోటిఫికేషన్ సమయానికి జాబితా సిద్ధం: డీఎస్

వచ్చే ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ తొలి విడత నోటిఫికేషన్ వెలువరించే సమయానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల జాబితా సైతం వెలువడుతుందని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేర్కొన్నారు. అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు...
Source: Yahoo! Telugu: News | 11 Mar 2009 | 9:41 am

కఠిన నిబంధనలతో పార్లమెంట్‌లో తీవ్రవాద బిల్లు

ప్రస్తుతం ఉన్న చట్టవ్యతిరేక కార్యకలపాల నిరోధక చట్టాన్ని పటిష్టపరిచే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌లో తీవ్రవాద నిరోధక బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు తీవ్రవాద చర్యలపై
Source: Yahoo! Telugu: News | 11 Mar 2009 | 9:38 am

కివీస్‌పై భారత్ ఘనవిజయం: సిరీస్ కైవసం

హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం ద్వారా 5 వన్డేల సిరీస్‌లో 3-0 తేడాతో ఆధిక్యం సాధించిన భారత్ వన్డే సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంది. మ్యాచ్ మధ్యలో వర్షం...
Source: Yahoo! Telugu: News | 11 Mar 2009 | 9:33 am

కష్టపడేవారికే టికెట్లు: చంద్రబాబు

పార్టీకోసం కష్టపడేవారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించనున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టించి పనిచేసేవారు, గెలిచేవారికి పార్టీ సిద్ధాంతాల ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Mar 2009 | 9:03 am

లష్కరే సామర్థ్యాన్ని చూపించిన 26/11 దాడులు

పాకిస్థాన్‌లోని నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రాబల్య పెంపును గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడులు ప్రపంచానికి చూపించాయని అమెరికా అభిప్రాయపడింది. భారత్‌లో దాడులకు వ్యూహరచన,
Source: Yahoo! Telugu: News | 11 Mar 2009 | 8:33 am

సమ్మర్ స్పెషల్‌గా వస్తోన్న "కరెంట్"

నటసామ్రాట్ డా. అక్కినేని మనవడు, కింగ్ నాగార్జున మేనల్లుడు, యువ కథానాయకుడు సుశాంత్ హీరోగా, స్నేహాఉల్లాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "కరెంట్". అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Mar 2009 | 8:31 am

ముమైత్ "స్నేక్ డ్యాన్స్" సూపర్..!

టాలీవుడ్ సెక్సీభామ ముమైత్ ఖాన్ టైటిల్ పాత్ర పోషించిన తాజా చిత్రం "పున్నమినాగు". ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి నేతృత్వంలో, విజయ్ కుమార్ గౌడ్, జి. మహేశ్వరి రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Mar 2009 | 8:27 am

ఉగాది కానుకగా "ఆనందతాండవం"

"హ్యాపీడేస్" ఫేమ్ తమన్నా ప్రధాన పాత్రలో, ఆస్కార్ ఫిలింస్ పతాకంపై అగ్రనిర్మాత వి.రవిచంద్రన్ నిర్మిస్తున్న "ఆనందతాండవం" సినిమా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోని బిఎంజి ద్వారా ఈ సినిమా ఆడియోను, ఈ నెల...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Mar 2009 | 7:58 am

విశ్వాస తీర్మానం నెగ్గిన నవీన్ పట్నాయక్

భారతీయ జనతాపార్టీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో బీజేడీ పార్టీకి బలనిరూపణను ఎదుర్కోక తప్పలేదు. ఇందులో ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని బుధవారంనాడు విశ్వాస తీర్మానంలోర ఎనిమిది ఓట్లతో గెలుపొంది మళ్ళీ ప్రభుత్వపగ్గాలు చేపట్టినట్టైంది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభనుంచి వాకౌట్ చేయడంతో ఎనిమిదిమంది సభ్యుల మద్దతుతో బీజేడీ నాయకుడు నవీన్ పట్నాయక్ విశ్వాస తీర్మానం నెగ్గారు.
Source: జాతీయ | 11 Mar 2009 | 7:38 am

ఒరిస్సా ప్రభుత్వం బలపరీక్ష నేడే

ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బుధవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈరోజున జరిగే బలపరీక్షలో తాము ఖచ్చితంగా నెగ్గుతామని బీజేడీ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించుకోవటంతో ఈ పరిస్థితి తలెత్తింది. కాగా బీజేడీకి స్పీకర్‌తో సహా 61మంది సభ్యులుండగా జేఎమ్ఎమ్ పార్టీకిచెందినవారు నలుగురు. ఎన్సీపీకి చెందినవారు ఇద్దరు, సీపీఐ, సీపీఎమ్ చెరో ఒకరు తమ పార్టీకి మద్దతునిస్తున్నట్లు బీజేడీ పార్టీ ప్రతినిధి తెలిపారు.
Source: జాతీయ | 11 Mar 2009 | 7:32 am

మైనారిటీలో పడిన మేఘాలయ ప్రభుత్వం

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేతృత్వంలోని మేఘాలయ ప్రగతిశీల కూటమి (ఎంపీఏ) ప్రభుత్వం బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయింది. కేహెచ్ఎన్ఏఎం పార్టీకి చెందిన ఒకేఒక్క ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకోవడంతో.. ఎన్సీపీ ప్రభుత్వం మైనారిటీలోకి జారుకుంది.
Source: జాతీయ | 11 Mar 2009 | 7:29 am

ముమైత్ "స్నేక్ డ్యాన్స్" సూపర్..!

టాలీవుడ్ సెక్సీభామ ముమైత్ ఖాన్ టైటిల్ పాత్ర పోషించిన తాజా చిత్రం "పున్నమినాగు". ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి నేతృత్వంలో, విజయ్ కుమార్ గౌడ్, జి. మహేశ్వరి రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ పున్నమినాగు లోకకళ్యాణానికి ఏమి చేసిందనేదే పాయింట్‌ అని, ఇందులో ముమైత్ ఖాన్ వేసిన...
Source: వినోదం | 11 Mar 2009 | 7:15 am

తిరుపతి నుంచే పోటీ చేస్తా..: చిరంజీవి

రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తిరుపతి నుంచే పోటీ చేస్తానని ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. రెండో స్థానం నుంచి పోటీ చేస్తే అది నరసాపురమే అవుతుందని చిరు అన్నారు. ఎస్సీల వర్గీకరణపై తమ పార్టీకి ఖచ్చితమైన అభిప్రాయం ఉందని, శాస్త్రీయ పద్ధతిలో మాదిగలతో పాటు అణగారిన వర్గాలన్నింటికి న్యాయం జరగాలన్నదే తమ అభిమతమని చిరు పేర్కొన్నారు. రాష్ట్రంలో వేడెక్కుతున్న ఎన్నికల హడావుడి నేపథ్యంలో.. ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తామని చిరంజీవి బుధవారం ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Mar 2009 | 6:03 am

తృతీయ కూటమిలో చేరలేదు: బీజేడీ

తాము ఇంకా తృతీయ కూటమిలో చేరలేదని, దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) మంగళవారం స్పష్టం చేసింది. దీంతో బీజేడీ ఏ రాజకీయ కూటమిలో చేరుతుందనేది ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలింది.
Source: జాతీయ | 11 Mar 2009 | 5:50 am

ప్రముఖ రచయిత, పాత్రికేయుడు పతంజలి మృతి

ప్రముఖ రచయిత, పాత్రికేయుడు కె.వై.ఎన్ పతంజలి మరణించారు. విజయనగరం జిల్లా ఆలమండకు చెందిన ఆయన క్యాన్సర్‌తో కన్నుమూసినట్లు పతంజలి కుటుంబీకులు వెల్లడించారు. విశాఖలోని సింహాద్రి ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న పతంజలికి ఆరోగ్యం విషమించడంతో బుధవారం పరమపదించారని వారు తెలిపారు. విజయనగరం జిల్లా ఆలమండకు చెందిన ఆయన వృత్తిరీత్యా అనేక దిన పత్రికల్లో ఎడిటర్‌గా పనిచేశారు. ఆయన రాసిన నవలల్లో ఆత్మకథ, ఒక దెయ్యం ఆత్మకథ, గో పాత్రుడు, వీర బొబ్బిలి, అప్పన్న సర్దార్ వంటివి చాలా ప్రాచుర్యం పొందాయి.
Source: ఏపీ న్యూస్ | 11 Mar 2009 | 5:31 am

ర్యాగింగ్ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశం

హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం సంచలనం సృష్టించిన ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. కాంగ్రా జిల్లాలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రభుత్వ వైద్యకళాశాలలో కచ్రూ అనే మెడికో ర్యాగింగ్ భూతానికి బలైన సంగతి తెలిసిందే. సీనియర్లు విపరీతంగా కొట్టడంతో ఆదివారం రాత్రి టాండాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కచ్రూ కన్నుమూశాడు.
Source: జాతీయ | 11 Mar 2009 | 5:24 am

ప్రజారాజ్యంతోనే...రామరాజ్యం: చిరు

ప్రజారాజ్యం అధికారంతోనే రాష్ట్రంలో రామరాజ్యం రానుందని ఆ పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. గత 14 ఏళ్లుగా రాష్ట్రంలో అరణ్యకాండ జరుగుతోందని, ఎన్నికల యుద్ధకాండ ముగింపుతో రాష్ట్రంలో రామరాజ్యం మొదలుకానుందని చిరంజీవి వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో మంగళవారం సాయంత్రం జరిగిన సామాజిక న్యాయ శంఖారావం బహిరంగ సభలో చిరంజీవి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సభకు లక్షలాదిగా తరలివచ్చిన జన సందోహాన్ని చూసి చిరంజీవి ఆనందంతో ఉప్పొంగిపోయారు. దీంతో సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించిన చిరంజీవి కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Mar 2009 | 4:41 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 11 Mar 2009 | 4:03 am

మార్చి 11, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Mar 2009 | 4:03 am

ప్రతివారికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాదు..సోనియా

ఏప్రిల్ నెలలో జరుగనున్న అసెంబ్లీ, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతివారికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, సీనియర్లు విభేదాలు పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాల కోసం పాటు పడాలని ఆమె పార్టీ శ్రేణులకు హితవు పలికారు. కాంగ్రెస్ అభ్యర్ధులుగా ఎవరు పోటీ చేసినా వారందరికీ పూర్తి మద్దతుండాలని, పార్టీలో ఐకమత్యం, క్రమశిక్షణ ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. పార్టీ పట్ల ప్రజలలోనున్న సహృద్భావాన్ని ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో ఇందుకు విరుద్ధంగా అంతర్గత కలహాలతో ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుని, దూషించుకునేవారని, అలాంటి సంస్కృతికి అడ్డుకట్టవేయాలని ఆమె సూచించారు. ప్రాంతీయ, స్థానిక సమస్యల పట్ల స్పందించే జాతీయ దృక్పథం గల ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఆమె పార్టీ నాయకులకు తెలిపారు.
Source: జాతీయ | 11 Mar 2009 | 3:20 am

వచ్చే ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తాం: దేవేందర్

త్వరలో జరుగనున్న అసెంబ్లీ, ఎన్నికలు తమకు అత్యంత ప్రతిష్టాత్మకమైనవని, రాష్ట్ర భవిష్యత్తునే కాకుండా యావత్ భారత ముఖచిత్రాన్నే మార్చేస్తాయని ప్రజారాజ్యం పార్టీ ఉపాధ్యక్షుడు టి.దేవేందర్ గౌడ్ ఉద్ఘాటించారు. మన రాష్ట్రంలో ఆ రెండు పార్టీలే అధికారం అనుభవించాలా అని ఆయన నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో మార్పు తథ్యమన్నారు. అలాకాని పక్షంలో రాష్ట్ర రాజకీయాలు వైఎస్, బాబుల మధ్యే తిరుగుతాయని ఆయన హెచ్చరించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Mar 2009 | 2:35 pm

జనసంద్రంగా మారిన రాజమండ్రి లాలాచెరువు

ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సామాజిక న్యాయ శంఖారావం బహిరంగ సభకు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఫలితంగా రాజమహేంద్రవరంలోని లాలా చెరువు మైదానం జన సంద్రాన్ని తలపించింది. ఉత్తుంగ తరంగంలా తరలి వచ్చిన కార్యకర్తలు, చిరంజీవి అభిమానులతో జన సునామీగా మారింది.
Source: ఏపీ న్యూస్ | 10 Mar 2009 | 2:33 pm

జన్మకుండలి చూపండి..టికెట్ పొందండి

జన్మకుండలి చూపండి, టికెట్ పొందండి. ఇది అమ్మ మాటలు. అంటే తమిళనాడులోని అఖిల భారతీయ అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం(ఏఐఏడిఎమ్‌కే) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికల ఫార్ములా. తమిళనాడులో జయలలిత తన పార్టీ కార్యకర్తలకు ఎన్నికలలో పోటీ చేయడానికి ఆశించే అభ్యర్థులకు టికెట్లను ఈ విధంగా పంపిణీ చేస్తున్నారు. ముందుగా అమ్మ అభ్యర్థి యొక్క జన్మతేదీ, అభ్యర్థి పుట్టిన శుభ ఘడియలు చూసిన తర్వాతే అతను/ఆమె యొక్క ప్రజాబలం ఎంతవుందనే దానిపై వివరాలు సేకరించి పార్టీ టికెట్లను ఇస్తున్నారు.
Source: జాతీయ | 10 Mar 2009 | 2:30 pm

సామాజిక న్యాయంతో ఉలిక్కిపడిన పార్టీలు: చిరు

ప్రజారాజ్యం సిద్ధాతంమైన సామాజిక న్యాయంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయని ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలను తమ పార్టీ వచ్చిన తర్వాతే అధికార ప్రతిపక్ష పార్టీలు ఆకాశానికి ఎత్తి, సామాజిక న్యాయాన్ని వల్లె వేస్తున్నాయని దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 10 Mar 2009 | 2:15 pm