జైన దేవాలయం కొలనుపాక... చూసొద్దాం రండి

దేశంలో జైన దేవాలయాలకు ప్రముఖమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నా మన రాష్ట్రంలోనూ ఓ ప్రముఖమైన జైన దేవాలయం ఉంది. నల్గొండ జిల్లాలోని కొలనుపాక ప్రముఖ జైన దేవాలయంగా గత కొన్నేళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
Source: వినోదం | 10 Mar 2009 | 11:52 am

30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వండి: ఎమ్మార్పీఎస్

వచ్చే ఎన్నికల్లో తమకు నాలుగు లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించాల్సిందిగా మహాకూటమిని ఎమ్మార్పీఎస్ కోరింది. ఇందులో భాగంగా తెలంగాణలో మూడు లోక్‌సభ స్థానాలు, కోస్తా లేదా రాయలసీమలో మరో లోక్‌సభ స్థానం...
Source: Yahoo! Telugu: News | 10 Mar 2009 | 11:20 am

నిల్చున్నవారిని చూడలేక..!

బస్‌లో కళ్ళుమూసుకుని కూర్చొన్న శీనుని... "ఎందుకలా కూర్చున్నావు... ఒంట్లో నలతగా ఉందా..?" అడిగాడు సురేష్...
Source: వినోదం | 10 Mar 2009 | 11:17 am

దిల్‌కుశ్ అతిథి గృహంలో రాజు విచారణ

సత్యం కంప్యూటర్స్ ఆర్థిక కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజును సీబీఐ విచారించడం ప్రారంభించింది. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న దిల్‌కుశ్ అతిథి గృహంలో...
Source: Yahoo! Telugu: News | 10 Mar 2009 | 11:12 am

ఛీ..ఛీ.. మంచం మీదెలా...!

"మావారికి పిచ్చికుక్క కరిచింది. మీరు వెంటనే రావాలి సార్...!" కంగారుగా చెప్పింది సీతాలు "మీరేం గాభరా పడకండి...
Source: వినోదం | 10 Mar 2009 | 11:12 am

రూ. 21,116తో ఆడపిల్లకు అందలం: బీజేపీ

ఎన్నికల ప్రణాళిక ముసాయిదాలో భాగంగా భారతీయ జనతా పార్టీ రెండు విశేషమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆడపిల్ల పుట్టంగానే రూ. 21,116లను డిపాజిట్ చేసే హామీ ఒకటికాగా గోదావరిలో ఎప్పుడూ నీళ్లుండేలా చూడడం మరొకటి.
Source: Yahoo! Telugu: News | 10 Mar 2009 | 11:08 am

అజ్మల్ అమీర్ కసబ్‌కు మూడంచెల భద్రత

ముంబయి ఉగ్రవాద దాడుల సందర్భంగా భద్రతా దళాలకు పట్టుబడిన ఒకేఒక్క తీవ్రవాది మొహమ్మద్ అజ్మల్ అమీర్ అలియాస్ కసబ్‌కు అధికారిక యంత్రాంగం మూడంచెల భద్రత కల్పిస్తోంది. ఆర్థూర్ రోడ్డు జైలులో అజ్మల్‌ను ఉంచినట్లు మహారాష్ట్ర
Source: Yahoo! Telugu: News | 10 Mar 2009 | 11:08 am

ఒరిస్సా: విశ్వాసపరీక్షలో గట్టెక్కడంపై బీజేడీ ధీమా

ఒరిస్సా రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం, దానిని గట్టెక్కగలమని ధీమా వ్యక్తం చేసింది. బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల బీజేపీ మద్దతు ఉపసంహరించిన
Source: Yahoo! Telugu: News | 10 Mar 2009 | 10:59 am

మతస్వేచ్ఛ దుర్వినియోగంపై పీఎం ఆందోళన

దేశంలో రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛా హక్కును ఇతర మతాలను అణచి వేసేందుకు ఓ పావులా ఉపయోగించరాదని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఏమతాన్నైనా స్వీకరించే, ఆచరించే పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం కల్పిస్తోందని, అదే సమయంలో ఇతర మతాలను దూషించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
Source: జాతీయ | 10 Mar 2009 | 10:42 am

మరింత కుచించుకుపోనున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మరింత కుచించుకుపోనుందని, వృద్ధి రేటు సున్నాకన్నా కింది స్థాయికి చేరుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చాలామంది ఈ పరిస్థితి
Source: Yahoo! Telugu: News | 10 Mar 2009 | 9:41 am

మరో వారంలో సీట్ల సర్దుబాటు: రాఘవులు

మరో వారంరోజుల్లో మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు పేర్కొన్నారు. మహాకూటమిలో పలు పార్టీలు ఉండడం కొత్తగా ఎమ్మార్పీఎస్ చేరుతామంటూ రావడం తదితర కారణాల వల్ల సీట్ల...
Source: Yahoo! Telugu: News | 10 Mar 2009 | 9:37 am

రవీంద్రనాథ్‌ కోసం కార్యకర్తల ఆమరణ దీక్షలు

ముఖ్యమంత్రి వైఎస్ బావమరిది, కడప మేయర్ అయిన రవీంద్రనాథ్‌రెడ్డికి కడప అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతూ మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలు ఆమరణ దీక్షలు ప్రారంభించారు. రవీంద్రనాథ్‌రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇచ్చేవరకు తాము దీక్ష...
Source: Yahoo! Telugu: News | 10 Mar 2009 | 9:27 am

లాలూ, అధికారులపై కేసు పెట్టండి: కోర్టు

రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై పోలీసు కేసు పెట్టాలని బీహార్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లాలో గత నెలలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి కూలిపోయిన ఘటనపై లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర
Source: Yahoo! Telugu: News | 10 Mar 2009 | 9:27 am

అణు ఒప్పందంలో కీలక పాత్రధారి మీనన్

భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన ప్రతిష్టాత్మక పౌర అణు ఒప్పందంలో కీలక పాత్రధారి భారత విదేశాంగ మంత్రిత్వ కార్యదర్శి శివశంకర్ మీనన్ అని అగ్రదేశం అమెరికా కితాబిచ్చింది. మీనన్ చూపిన కార్యదక్షత, పట్టుదల, ప్రదర్శించిన చతురత, నైపుణ్యం వల్లే ఇరు దేశాల మధ్య ఒప్పందం కార్యరూపం దాల్చిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యంత్రాంగం అభిప్రాయపడింది.
Source: జాతీయ | 10 Mar 2009 | 8:58 am

ఎయిమ్స్ కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ డేకా ఎంపిక

కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న ఎయిమ్స్ డైరెక్టర్ పదవికి కొత్త వ్యక్తిని ప్రభుత్వం ఎట్టకేలకు ఖరారు చేసింది. దేశంలోనే ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థగా వెలుగొందుతున్న ఎయిమ్స్‌లో ప్రస్తుతం ఈఎన్‌టీ విభాగం అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ ఆర్‌సీ డేకాను...
Source: Yahoo! Telugu: News | 10 Mar 2009 | 8:09 am

కూలిన బ్రిడ్జి: లాలూపై కేసు నమోదుకు ఆదేశం

నిర్మాణంలో ఉన్న రైలు వంతెన కూలిపోవడంతో కేంద్ర రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా బీహార్ కోర్టు ఆదేశించింది. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే బ్రిడ్జి కూలి పోయింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.
Source: జాతీయ | 10 Mar 2009 | 7:30 am

వికృతరూపం దాల్చిన ర్యాగింగ్: మెడికో మృతి

మరోసారి ర్యాగింగ్ వికృతరూపం దాల్చడంతో ప్రథమ సంవత్సరం చదువుతున్న మెడికో మృతి చెందాడు. ర్యాగింగ్ పేరుతో తాగిన మత్తులో సీనియర్లు విపరీతంగా కొట్టడంతో సదరు మెడికో మృతి చెందాడు. మృతి చెందడానికి ముందు సదరు మెడికో ర్యాగింగ్ గురించి కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం గమనార్హం.
Source: జాతీయ | 10 Mar 2009 | 7:16 am

ఎయిమ్స్ డైరక్టర్‌గా ఆర్.సి.డెకా నియామకం

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరక్టర్‌గా డాక్టర్ ఆర్.సి.డెకా నియమితులయ్యారు. ఈఎన్‌టి విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన దేశ అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్‌ డైరక్టర్‌గా నియమితులయ్యారు. ఈ నియామకంతో గత తొమ్మిది నెలలుగా నెలకొన్న సరైన వ్యక్తి కోసం చేస్తున్న అన్వేషణకు తెరపడింది. డెకా నియామకానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
Source: జాతీయ | 10 Mar 2009 | 7:00 am

"ముద్దు" సీన్ ప్రచారం: సుస్మితా "గుర్రు"

తాజాగా నటించిన 'కర్మా ఔర్ హోలీ' చిత్రంలో మాజీ ప్రియుడు రణ్‌దీప్‌ హుడాతో తాను చేసిన ముద్దు సీన్‌ను నిర్మాతలు ప్రచారం చేసుకోవడం పట్ల సుస్మితా సేన్ ఆగ్రహంతో ఊగిపోతోంది. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడుతూ 'కర్మా ఔర్ హోలీ' చిత్ర నిర్మాతలు ప్రచారం కోసం ఇలా చీప్...
Source: వినోదం | 10 Mar 2009 | 6:27 am

గాంధీజీ వస్తువులను ప్రదర్శనకు ఉంచాలి

జాతిపిత మహాత్మాగాంధీ వస్తువులను అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ప్రదర్శనకు ఉంచాలని కోల్‌కతాకు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ కోరింది. ఈ మేరకు కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను విజ్ఞప్తి చేసింది. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన గాంధీజీ వస్తువుల వేలం పాటలో మాల్యా ఆ వస్తువులను 1.8 మిలియన్ డాలర్లకు కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 10 Mar 2009 | 5:30 am

"ఎస్టీ లాడర్" ప్రకటనలో నటించనున్న ఫ్రిడా

ప్రముఖ సౌందర్య సాధనాల ఉత్పత్తి సంస్థ "ఎస్టీ లాడర్"కు చెందిన ఓ ప్రకటనలో, "స్లమ్‌డాగ్ మిలియనీర్" హీరోయిన్ ఫ్రిడా ఫింటో నటించనుంది. ఎస్టీ లాడర్ కంపెనీకి ఫ్రిడాతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు కోటి రూపాయల విలువగల ఈ ఒప్పందం మేరకు లిజ్‌హార్లీ, గ్వైనెత్ పాల్‌త్రో కలిసి ఫ్రిడా ఓ ప్రకటనలో నటించనుందని ఎస్టీ లాడర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎనిమిది ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న "స్లమ్‌డాగ్" చిత్రానికి ఒకవైపు అవార్డుల పంట పండుతుంటే.. మరోవైపు ఆ చిత్రంలో నటించిన తారలకు సిరుల వర్షం కురుస్తోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో అందరినీ ఆకట్టుకున్న ఫ్రిడా పింటో ఎస్టీ లాడర్ ప్రకటనలో నటించే అవకాశం పొందిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందడం గమనార్హం.
Source: వినోదం | 10 Mar 2009 | 5:26 am

పాక్ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం: ప్రణబ్

ముంబై దాడులకు సంబంధించి పాకిస్థాన్ సంధించిన ప్రశ్నలకు త్వరలో సమాధానం పంపుతామని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. మీకు ముందుగా వెల్లడించినట్టుగా త్వరలోనే పంపుతామని ఆయన తెలిపారు. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు.
Source: జాతీయ | 10 Mar 2009 | 4:56 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 10 Mar 2009 | 3:59 am

మార్చి 10, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 10 Mar 2009 | 3:56 am

ఎన్డీయే కూటమికి బీజేడీ రాం.. రాం

ఒరిస్సాలోని అధికార బీజేడీ పార్టీ ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకున్నట్టు ప్రకటించింది. బీజేడీ-భాజపాల చెలిమికి చెల్లుచీటి పడిన రెండు రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ దామోదర్ రౌత్ సోమవారం రాత్రి వెల్లడించారు. ఈనెల 11వ తేదీన ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ బలపరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో బీజేడీ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Source: జాతీయ | 10 Mar 2009 | 3:36 am

అద్వానీ వెబ్‌సైట్‌నుంచి జాతీయపతాకం తొలగింపు

భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి లాల్ కృష్ణ అద్వానీ వెబ్‌సైట్‌నుంచి పాలాయిలోనున్న మహాత్మా గాంధీ ఫౌండేషన్ ఫిర్యాదు మేరకు జాతీయ పతాకాన్ని తొలగించారు. జాతీయ పతాకాన్ని ఎన్నికలలో ప్రచారంకొరకు ఉపయోగించకూడదన్న ఫిర్యాదు రావడంతో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎల్‌కే అద్వానీ.కమ్ వెబ్‌సైట్‌నుంచి తొలగించడం జరిగింది. ఎన్నికల ప్రచారం కొరకు జాతీయ పతాకాన్ని ఉపయోగించడం సమంజసం కాదని మహాత్మా గాంధీ ఫౌండేషన్ ఓ ప్రకటనలో కోరింది. అద్వానీ హోంశాఖ మంత్రిగానున్నప్పుడు జాతీయ పతాకాన్ని ఉపయోగించే విధానాన్ని ఆయనే రూపొందించారని ఫౌండేషన్ పేర్కొంది.
Source: జాతీయ | 9 Mar 2009 | 1:17 pm

లేచి పోదామా...? అంటోన్న సంధ్య

"ప్రేమిస్తే" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరోయిన్ "సంధ్య". ఈ సినిమా తర్వాత సంధ్య వెండితెరపై అసలు కన్పించడంలేదని, ఎందుకో చాలా గ్యాప్ తీసుకుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఒకవైపేమో ఆమెకు ఛాన్స్‌లే రాలేదని కొందరంటుంటే, మరోవైపు ఆమెకు ఛాన్స్‌లొచ్చినా.. ఆ క్యారెక్టర్లు సంధ్యకు ఏమాత్రం నచ్చకే స్క్రీన్‌పై మళ్ళీ కనిపించలేదని అంటున్నారు. ఈ విషయమై సంధ్యను కదిలిస్తే.. ఆమె కూడా అదే సమాధానమిచ్చింది. అంతేకాదు.. ప్రతిరోజూ తాను ఏరోబిక్స్ చేస్తానని, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుంటానని కూడా చెప్పింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే..? "ప్రేమిస్తే" ద్వారా తనకు గుర్తింపు వచ్చిందని, ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే తనను వెతుక్కుంటూ వచ్చాయని చెప్పింది. దీంతో బోర్ కొట్టి అలాంటి చిత్రాల్లో నటించేందుకు అంగీకరించలేదని సంధ్య స్పష్టం చేసింది.
Source: వినోదం | 9 Mar 2009 | 1:14 pm

"సమ్మక్క-సారక్క" అభినందన సభ

బాబూమోహన్ తనయుడు ఉదయ్‌బాబు కథానాయకుడిగా, ప్రేమ టైటిల్ పాత్ర పోషించిన శ్రీ మేడారం "సమ్మక్క-సారక్క మహాత్మ్యం" చిత్రం శతదినోత్సవ అభినందన సభ సోమవారంనాడు జరిగింది. ఈ నెల 3వ తేదీతో ఈ చిత్రం వందరోజులు పూర్తి చేసుకుందని చిత్ర నిర్మాణ సారధి బాబూమోహన్ అన్నారు. తెలంగాణాలో విడుదలైన అన్ని థియేటర్లలో చిత్రానికి మంచి స్పందన దక్కిందన్నారు. ఇటువంటి చిత్రాలకు ప్రమోషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని బాబూమోహన్ తెలిపారు.
Source: వినోదం | 9 Mar 2009 | 12:15 pm

సినీ "మాస్టార్స్.కామ్" ప్రారంభం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల వివరాలను, విశేషాలను తెలుసుకోవడం కోసం "మాస్టర్స్. కామ్"ను ప్రారంభించారు. ఈ డాట్‌కామ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిల్మ్ నగర్ కల్చరల్ సొసైటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్. దాసరి నారాయణరావు వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మా అధ్యక్షులు మురళీమోహన్ మాట్లాడుతూ.. "మా" 15వ వార్షికోత్సవం సందర్భంగా నటీనటుల వివరాలు, విశేషాలను తెలిపే వెబ్‌సైట్‌ను ప్రారంభించామని, దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్న నటీనటులను సన్మానించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
Source: వినోదం | 9 Mar 2009 | 12:02 pm

సినీ విశేషాల 'మాస్టర్స్.కామ్' ప్రారంభం

సినీ విశేషాలతో కూడిన మాస్టర్స్.కామ్‌ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రారంభించింది. ఫిల్మ్‌నగర్ కల్చర్ల సొసైటీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాసరి నారాయణరావు మాస్టర్స్.కామ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2009 | 11:44 am

సమ్మక్క సారక్క మహత్యం అభినందన సభ

హాస్యనటుడు బాబూమోహన్ తనయుడు ఉదయ్‌బాబు హీరోగా ప్రేమ టైటిల్ పాత్ర పోషించిన శ్రీ మేడారం సమ్మక్క సారక్క మహత్యం చిత్రం నూరు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ జరుపుకుంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2009 | 11:43 am

అర్జున్ హీరోగా రానున్న 'జై సాంబశివ'

యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా తమిళంలో నిర్మించబడిన తిరువణ్ణామలై చిత్రం తెలుగులో జై సాంబశివ పేరుతో విడుదల కానుంది. సాయి బాలాజీ ఫిలింస్ పతాకంపై గంగవరపు శ్రీనివాసులు నాయుడు, కె. హజరత్ రెడ్డిలు సంయుక్తంగా తెలుగులో అందిస్తున్న...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2009 | 11:43 am

ఏప్రిల్ 2న ఒబామాతో ప్రధాని భేటీ

ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చే నెల 2వ తేదీన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాతో సమావేశం కానున్నారు. ఇంగ్లండు ప్రధాని ఆహ్వానం మేరకు జి-20 సదస్సుకు హాజరు కానున్న ప్రధాని అక్కడ ఒబామాతో పలు అంశాలపై చర్చలు జరుపుతారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రధాని ఏప్రిల్ ఒకటో తేదీన న్యూఢిల్లీ నుంచి బయలుదేరి వెళతారనీ, ఏప్రిల్ 4న తిరిగి భారత్ చేరుకుంటారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 9 Mar 2009 | 11:39 am

స్టివార్ట్‌కు లారెన్స్ ఒలివర్ అవార్డు

హాలీవుడ్ నటుడు పాట్రిక్ స్టివార్టు.. ప్రతిష్టాత్మక లారెన్స్ ఒలివర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. హామ్లెట్ చిత్రంలో క్లాడియస్ పాత్రలో చేసిన నటనకు ప్రతిగా ఈ అవార్డుకు స్టివార్ట్ ఎంపికైనట్లు హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు ఈ అవార్డును స్టివార్ట్ మూడు సార్లు గెలుపొందాడు. తొలిసారి ఈ అవార్డును 1979లో ఆంటొనీ అండ్ క్లియోపాత్రా చిత్రంలో నటనకు అందుకున్నాడు. కాగా, హామ్లెట్‌లో డేవిడ్ టెన్నాంట్ ప్రధాన పాత్రను పోషించగా.. రాయల్ షేక్స్‌స్పియర్ నిర్మాణ కంపెనీ ఈ చిత్రాన్ని రూపొందించింది.
Source: వినోదం | 9 Mar 2009 | 11:09 am

అర్జున్-సాయికుమార్‌ల "జై సాంబశివ"

తమిళంలో విజయం సాధించిన "తిరువణ్ణామలై" చిత్రం తెలుగులో "జై సాంబశివ" అనే పేరుతో అనువాదమౌతోంది. యాక్షన్ హీరో అర్జున్ ద్విపాత్రాభినయంలో, సాయిబాలాజీ ఫిలింస్ పతాకంపై.. గంగవరపు శ్రీనివాసులు నాయుడు, కె. హజరత్ రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పేరరసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కథానాయికగా పూజాగాంధీ, విలన్‌గా సాయికుమార్ నటించారు.
Source: వినోదం | 9 Mar 2009 | 11:09 am