సినీ విశేషాల 'మాస్టర్స్.కామ్' ప్రారంభం

సినీ విశేషాలతో కూడిన మాస్టర్స్.కామ్‌ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రారంభించింది. ఫిల్మ్‌నగర్ కల్చర్ల సొసైటీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాసరి నారాయణరావు మాస్టర్స్.కామ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2009 | 11:44 am

సమ్మక్క సారక్క మహత్యం అభినందన సభ

హాస్యనటుడు బాబూమోహన్ తనయుడు ఉదయ్‌బాబు హీరోగా ప్రేమ టైటిల్ పాత్ర పోషించిన శ్రీ మేడారం సమ్మక్క సారక్క మహత్యం చిత్రం నూరు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ జరుపుకుంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2009 | 11:43 am

అర్జున్ హీరోగా రానున్న 'జై సాంబశివ'

యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా తమిళంలో నిర్మించబడిన తిరువణ్ణామలై చిత్రం తెలుగులో జై సాంబశివ పేరుతో విడుదల కానుంది. సాయి బాలాజీ ఫిలింస్ పతాకంపై గంగవరపు శ్రీనివాసులు నాయుడు, కె. హజరత్ రెడ్డిలు సంయుక్తంగా తెలుగులో అందిస్తున్న...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2009 | 11:43 am

ఏప్రిల్ 2న ఒబామాతో ప్రధాని భేటీ

ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చే నెల 2వ తేదీన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాతో సమావేశం కానున్నారు. ఇంగ్లండు ప్రధాని ఆహ్వానం మేరకు జి-20 సదస్సుకు హాజరు కానున్న ప్రధాని అక్కడ ఒబామాతో పలు అంశాలపై చర్చలు జరుపుతారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రధాని ఏప్రిల్ ఒకటో తేదీన న్యూఢిల్లీ నుంచి బయలుదేరి వెళతారనీ, ఏప్రిల్ 4న తిరిగి భారత్ చేరుకుంటారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 9 Mar 2009 | 11:39 am

చివరి క్షణం వరకు వేచిచూస్తాం: దిగ్విజయ్

ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు ఖరారు చేసుకునేందుకు చివరి క్షణం వరకు వేచిచూస్తామని కాంగ్రెస్ తెలిపింది. ముందురోజు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు కొనసాగించే అవకాశాన్ని ఉత్తరప్రదేశ్‌లో ఆరు లోక్‌సభ సీట్లు మాత్రమే ఇస్తామనే ప్రతిపాదనతో ఎస్పీ పూర్తిగా నీరుగార్చిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 9 Mar 2009 | 11:32 am

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కసబ్ విచారణ

ముంబయి దాడుల సందర్భంగా ప్రాణాలతో చిక్కిన అజ్మల్ అమిర్ కసబ్‌ను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనుంది. కసబ్‌ను కోర్టుకు తరలించాలంటే సెక్యూరిటీ పరమైన సమస్యలు అధికంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు ఈ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మధ్య ముంబయిలోని ఆర్తూర్ రోడ్‌లోని జైలులో హై సెక్యురిటీ బారక్‌లో ఉంచిన కసబ్‌ను అక్కడినుంచే కోర్టు విచారించనుంది.
Source: జాతీయ | 9 Mar 2009 | 11:31 am

మూడేళ్ల కనిష్ట స్థాయికి బీఎస్ఈ సూచి పతనం

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సోమవారం నష్టాల్లో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రతికూల ప్రభావంతో 67 పాయింట్ల నష్టపోయి 8,326 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ను, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, సాంకేతిక రంగ వాటాల అమ్మకాల్లో
Source: Yahoo! Telugu: News | 9 Mar 2009 | 11:17 am

చివరి క్షణం వరకు వేచిచూస్తాం: దిగ్విజయ్

ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు ఖరారు చేసుకునేందుకు చివరి క్షణం వరకు వేచిచూస్తామని కాంగ్రెస్ తెలిపింది. ముందురోజు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు కొనసాగించే అవకాశాన్ని ఉత్తరప్రదేశ్‌లో ఆరు
Source: Yahoo! Telugu: News | 9 Mar 2009 | 11:07 am

డీఐజీపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం: చంద్రబాబు

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేలా మాట్లాడిన డీఐజీ యాదవ్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. బాధ్యత గల ఉద్యోగం చేస్తూ అధికార ప్రభుత్వం కార్యకర్తలా డీఐజీ వ్యవహరించడం సరైనది కాదంటూ...
Source: Yahoo! Telugu: News | 9 Mar 2009 | 11:02 am

భద్రత లేకపోతే ఐపీఎల్‌కు నో: దక్షిణాఫ్రికా

భద్రతా ప్రమాణాలు తగిన స్థాయిలో లేనిపక్షంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో ఆడేందుకు దక్షిణాఫ్రికా క్రికెటర్లెవరూ భారత్ రాబోరని వారికి రక్షణ కల్పిస్తున్న సంస్థ స్పష్టం చేసింది. ఐపీఎల్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా క్రికెటర్ల భద్రతా
Source: Yahoo! Telugu: News | 9 Mar 2009 | 10:58 am

గోల్ఫ్ ర్యాంకింగ్స్: 36వ స్థానంలో జీవ్ మిల్కాసింగ్

భారత నెంబర్‌వన్ గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ తాజాగా ప్రకటించిన ప్రపంచ గోల్ఫ్ ర్యాంకింగ్స్‌లో 36వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే మరో భారత గోల్ఫర్ జ్యోతి రణ్‌ధావా 117వ స్థానానికి ఏగబాకాడు. థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న
Source: Yahoo! Telugu: News | 9 Mar 2009 | 10:49 am

మేమిప్పటికీ ఎన్డీఏ భాగస్వాములమే: బీజేడీ

బీజేపీతో రాష్ట్ర స్థాయిలో సంబంధాలు తెంచుకున్నప్పటికీ, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలో తాము ఇప్పటికీ భాగస్వాములమేనని బిజూ జనతాదళ్ (బీజేడీ) ఉద్ఘాటించింది. జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుంటే, తాము ఎన్డీఏలోనే
Source: Yahoo! Telugu: News | 9 Mar 2009 | 10:42 am

ఫైడ్ గ్రాండ్ ప్రిక్స్ చెస్ టోర్నీలో హంపీ విజయం

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ఐఎస్ బ్యాంక్ అతాతుర్క్ ఫైడ్ గ్రాండ్ ప్రిక్స్ చెస్ టోర్నమెంట్ రెండో రౌండు ముగిసే సమయానికి భారత గ్రాండ్‌మాస్టర్, టాప్ సీడ్ కోనేరు హంపీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రెండో రౌండులో హంపీ
Source: Yahoo! Telugu: News | 9 Mar 2009 | 10:07 am

మహాకూటమి కలిసి వెళ్తాం: ఎమ్మార్పీఎస్

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ఎమ్మార్పీఎస్ మహాకూటమితో కలిసి వెళ్లేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా తాము పోటీ చేయదల్చుకున్న సీట్ల విషయమై టీడీపీ, వామపక్షాలు, టీఆర్ఎస్‌ను కలిసి చర్చించేందుకు ఎమ్మార్పీఎస్...
Source: Yahoo! Telugu: News | 9 Mar 2009 | 10:03 am

పాక్ అణ్వాయుధాలే భారత్‌ను అడ్డుకున్నాయి

ముంబయి ఉగ్రవాద దాడులు, పార్లమెంట్‌పై దాడి అనంతరం పాకిస్థాన్‌పై సైనిక చర్యకు దిగే అవకాశాన్ని పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలే అడ్డుకున్నాయని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్‌చౌదరి తెలిపారు. గత ఏడాది ముంబయి మహానగరం
Source: Yahoo! Telugu: News | 9 Mar 2009 | 9:42 am

వారం రోజుల్లో కాంగ్రెస్ తొలి జాబితా: మొయిలీ

మరోవారంలో కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్ధుల పేర్లు వెల్లడించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో అభ్యర్ధుల పేర్లు వెల్లడించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ...
Source: Yahoo! Telugu: News | 9 Mar 2009 | 9:40 am

శ్రీలంక వివాదంపై జయలలిత నిరాహారదీక్ష

శ్రీలంకలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీలంక తమిళుల వివాదంపై జయలలిత ఒక రోజుపాటు నిరాహార దీక్ష చేయనున్నారు. శ్రీలంకలో తక్షణ కాల్పుల విరమణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలని జయలలిత డిమాండ్ చేస్తున్నారు.
Source: జాతీయ | 9 Mar 2009 | 8:23 am

"మార్పు" మా నినాదం: అద్వానీ స్పష్టీకరణ

స్వతంత్ర నిర్ణయాధికారాలు లేని ప్రధానిమంత్రి మన్మోహన్ సింగ్‌తో సహా, యూపీఏ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు, దేశ ప్రజల మార్పు కోసం భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఓటర్లకు పిలుపునిచ్చారు. డెహ్రాడూన్‌లో ఆదివారం జరిగిన విజయ్‌ సంకల్ప్ యాత్రలో ఆయన పాల్గొని యూపీఏ సర్కారుపై విమర్శల వర్షం గుప్పించారు.
Source: జాతీయ | 9 Mar 2009 | 7:22 am

సహనానికి పరీక్ష... 'నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్'

కథలో బలం లేకుండా ఓ చిత్రాన్ని రూపొందిస్తే చూసే ప్రేక్షకుడి ఆ చిత్రం సహనానికి ఎంతటి పరీక్ష పెడుతోందో చెప్పేందుకు నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ చిత్రం ఓ చక్కని ఉదాహరణ. ఇంగ్లీష్, హిందీ సినిమాలను అనుకరించడమే పనిగా పెట్టుకుని చెప్పాలనుకున్న...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2009 | 6:41 am

మార్చి 20న ప్రేక్షకుల ముందుకు టార్గెట్

ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రలో శివబాలజీ హీరోగా, శ్రద్దాదాస్‌లు నటిస్తున్న చిత్రం టార్గెట్. సిరిసాయి సూర్య మూవీస్ పతాకంపై దశరథ్ సంగిశెట్టి, బి. రామకృష్ణలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేష్‌రాజా దర్శకుడు. సెన్సార్‌తో సాహా అన్ని కార్యక్రమాలు...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2009 | 6:15 am

ఎస్.ఎం.వి. ఫిలింస్ నుంచి కొత్త చిత్రం

యువత మనోభావాలు, ప్రేమ అంశాలు ప్రధానంగా ఎస్.ఎం.వి. ఫిలింస్ ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. శివసాయి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆనంద్ అగర్వాల్ సమర్పిస్తున్నారు. గండెల్లి సుదర్శన్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2009 | 6:12 am

మహిళల మనసు టీడీపీకే తెలుసు: బాబు

మహిళల మనసు తమకు మాత్రమే తెలుసునని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల మనసు తెలుసు కాబట్టే తాము ఉచితంగా టీవీలు అందిస్తామని ప్రకటించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కాంగ్రెస్, పీఆర్పీలు సైతం టీవీలు ఇవ్వాలని అనుకున్నాయని అయితే తాము ఆ పథకాన్ని ప్రకటించేసరికి ఆ పార్టీలు తెగ బాధపడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
Source: ఏపీ న్యూస్ | 9 Mar 2009 | 6:02 am

భూములను స్వాహా చేస్తున్న కాంగ్రెస్: బాలయ్య

రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కడి భూములను వదలిపెట్టకుండా స్వాహా చేస్తోందని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు టీడీపీ గుర్తింపు తీసుకువస్తే నేడు కాంగ్రెస్ పార్టీ ఆ విధానానికి పూర్తిగా స్వస్తి పలికిందని పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Mar 2009 | 6:00 am

ప్రజారాజ్యం పక్షానే యువత: చిరంజీవి

రాష్ట్రంలోని యువత మొత్తం ప్రజారాజ్యం పక్షానే నిలిచుందని ఆ పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. పీఆర్పీతో యువతకున్న అనుబంధాన్ని చూచి వారి ఓట్లను జాబితానుంచి తొలిగిస్తున్నారని ఈ సందర్భంగా చిరంజీవి వ్యాఖ్యానించారు. అయితే వారు యువత ఓట్లను మాత్రమే తొలగించగలరని కానీ తమ మధ్య ఉన్న బంధాన్ని మాత్రం తొలగించలేరని ఆయన స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 9 Mar 2009 | 5:59 am

కాంగ్రెస్‌ను ఓడించడమే మా సిద్ధాంతం: రాఘవులు

కాంగ్రెస్‌ను ఓడించడమే తమ సిద్ధాంతమంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి. వి. రాఘవులు పేర్కొన్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఈ ఎన్నికల వరకు తమ పార్టీ సిద్ధాంతం అదేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలను ఓడించి తృతియ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడమే తమ ముందున్న సిద్ధాంతమని మిగిలిన విషయాలను ఆపైన మాత్రమే ఆలోచిస్తామని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Mar 2009 | 5:57 am

వందరోజుల్లో తెలంగాణ, ఎస్సీ వర్గీకణ: బీజేపీ

తాము అధికారంలోకి వస్తే వందరోజుల్లోనే తెలంగాణ ఇవ్వడంతో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా చేస్తామంటూ బీజేపీ ప్రకటించింది. దీంతోపాటు రైతులకు 4 శాతం వడ్డీకే రుణాలిస్తామని కూడా ఆ పార్టీ పేర్కొంది. అలాగే గంగా, కావేరీ నదులను అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని బీజేపీ ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 9 Mar 2009 | 5:56 am

ఏలూరు వద్ద రోడ్డు ప్రమాదం: 5గురు మృతి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా దాదాపు 15మంది గాచపడ్డారు. ఇసుక లారీ బోల్తాపడిన ఘటనలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Source: ఏపీ న్యూస్ | 9 Mar 2009 | 5:55 am

ఆరు సీట్లిస్తాం: ఎస్పీ - మాకేం వద్దు: కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ల మధ్య సంబంధాలు పతనం అంచున వేలాడుతున్నాయి. రాజకీయంగా కీలకమైన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 80 సీట్లలో ఆరు సీట్లు మాత్రమే ఇస్తామని ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ పార్టీ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని ములాయం సింగ్ స్వయంగా ప్రకటించడం గమనార్హం. మాజీ బీజేపీ నేత కళ్యాణ్ సింగ్‌తో ఆదివారం సమావేశం అనంతరం ములాయం కాంగ్రెస్‌కు తాము ఆరు సీట్లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఎస్పీ ఆరు సీట్ల ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది.
Source: జాతీయ | 9 Mar 2009 | 5:50 am

విషయంలేని "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్"

సినిమా... "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్" నటీనటులు.. శివాజీ, కావేరీ ఝా, బ్రహ్మానందం, బబ్లూ, విజయ్, రమాప్రభ తదితరులు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఎం. నాగేంద్రకుమార్, కథకు సంబంధంలేని పేరు, నటనకు అవకాశంలేని పాత్రలు, కామెడీ పేరుతో పరీక్ష పెట్టే సన్నివేశాలు వెరసి ఈ చిత్రం చాలా పూర్‌గా ఉందనే చెప్పాలి.
Source: వినోదం | 9 Mar 2009 | 5:48 am

కాంగ్రెస్-టీసీ పొత్తు క్లీన్‌స్వీప్‌‌గా చేయాలి: మమతా

వామపక్షాల కంచుకోటగా ఉన్న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య కుదిరే పొత్తు క్లీన్‌స్వీ‌ప్‌ చేసేదిలా ఉండాలని బెంగాల్ అగ్గిబరాటా మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 42 పార్లమెంట్ స్థానాల్లో తమ కూటమి విజయభేరీ మోగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ దిశగానే కూటమి మధ్య సీట్ల సర్దుబాటు, చర్చలు సాగుతాయని మమతా చెప్పారు.
Source: జాతీయ | 9 Mar 2009 | 5:47 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2009 | 4:09 am

మార్చి 09, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2009 | 4:07 am

కేంద్రంలో తృతీయ కూటమి ప్రభుత్వం: కారత్

వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో తృతీయ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ జోస్యం చెప్పారు. ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీతో బిజూ జనతాదళ్ తెగతెంపులు చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయమైన ఏకేజీ భవన్‌లో రెండు రోజులపాటు జరిగిన కేంద్ర కమిటీ సమావేశం అనంతరం ఆదివారం పశ్చిమబెంగాల్‌ సహా మొత్తం 15 రాష్ట్రాలు, అండమాన్‌ నికోబార్‌లలో పోటీ చేయనున్న 59 స్థానాలను, అక్కడ బరిలోకి దిగనున్న అభ్యర్థుల జాబితాను కారత్‌ విడుదల చేశారు.
Source: జాతీయ | 9 Mar 2009 | 3:57 am

బీజేడీతో సీపీఎం ఎన్నికల పొత్తు: ఏచూరీ

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌ పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకోనున్నట్టు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ వెల్లడించారు. ఈ అశంపై ఆయన నవీన్‌తో చర్చలు జరుపుతామని ఆయన ఆదివారం స్వయంగా వెల్లడించారు. ఇదిలావుండగా, మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడు దేవెగౌడ మాత్రం, తృతీయ కూటమలో చేరాల్సిందిగా కోరుతూ నవీన్‌కు లేఖ రాశారు. దీంతో ఒరిస్సా రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
Source: జాతీయ | 9 Mar 2009 | 3:53 am

బల నిరూపణపై ఒరిస్సా సీఎంకు గవర్నర్ ఆదేశం

భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరణతో మైనారిటీలో పడిన ఒరిస్సాలోని అధికార బిజూ జనతాదళ్ ప్రభుత్వం ఈనెల 11వ తేదీన బలాన్ని నిరూపించుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఎం.సి.భండారీ ఆదేశించారు. ఆ మరుక్షణమే గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కలిసి తమకు 74 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వెల్లడించారు. అయినప్పటికీ, గవర్నర్ ఆదేశం మేరుకు ఈనెల 11వ తేదీన బలపరీక్షకు సిద్ధమని ఆయన ప్రకటించారు.
Source: జాతీయ | 8 Mar 2009 | 12:35 pm

సంపాదన రాజకీయాలు ప్రమాదకరం: లోక్‌సత్తా

రాజకీయాలను సంపాదన మార్గంగా ఎంచుకునేవారు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారయణ్ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలన్నీ ఉన్నత లక్ష్యాలతో ఏర్పటయినా, కాలగమనంలో పెడదారి పట్టిన నాయకుల వలన కలుషితమయ్యాయని విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Mar 2009 | 11:02 am

అవినీతిమయ ప్రభుత్వం: కాంగ్రెస్‌పై చిరు నిప్పులు

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడానికే పరిమితమయిందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆరోపించారు. ఆదిలాబాద్ ప్రజలు రాష్ట్ర ప్రజలు కాదా అని ప్రశ్నించారు. వీరిని ఎందుకు వదిలేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మందుల సరఫరా కేంద్రం నుంచి జరగాలట.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇవ్వడం లేదు.. ఇదేనా ప్రజలపట్ల ఉన్న ప్రేమ.
Source: ఏపీ న్యూస్ | 8 Mar 2009 | 11:00 am