|
బల నిరూపణపై ఒరిస్సా సీఎంకు గవర్నర్ ఆదేశంభారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరణతో మైనారిటీలో పడిన ఒరిస్సాలోని అధికార బిజూ జనతాదళ్ ప్రభుత్వం ఈనెల 11వ తేదీన బలాన్ని నిరూపించుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఎం.సి.భండారీ ఆదేశించారు. ఆ మరుక్షణమే గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కలిసి తమకు 74 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వెల్లడించారు. అయినప్పటికీ, గవర్నర్ ఆదేశం మేరుకు ఈనెల 11వ తేదీన బలపరీక్షకు సిద్ధమని ఆయన ప్రకటించారు.Source: జాతీయ | 8 Mar 2009 | 12:35 pm కాంగ్రెస్-ఎస్పీ పొత్తుకు అవకాశాలు: యాదవ్కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తుకు ఇంకా అవకాశాలు ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ వెల్లడించారు. ఆయన ఆదివారం న్యూఢిల్లీలోని ఎస్పీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో సత్‌సబంధాలు కొనసాగుతాయని చెప్పారు. దీనికి నిదర్శనమే, కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ చేసే ఆరు స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపబోమని ఆయన ప్రకటించారు.Source: జాతీయ | 8 Mar 2009 | 10:00 am అభ్యర్ధుల జాబితాతో ఢిల్లీకి వైఎస్-డీఎస్అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ చివరి దఫా కసరత్తులు ప్రారంభించింది. గత కొన్ని రోజులగా అభ్యర్థుల ఎంపికపై తీవ్రస్థాయిలో మంతనాలు, రోజూ గంటల కొద్దీ సమీక్షలు, చర్చలు జరిపి ఒక జాబితాను తయారు చేశారు. ఆ తర్వాత దీనిపై అధినేత్రి సోనియా గాంధీతో ఆమోదముద్ర వేయించేందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 8 Mar 2009 | 8:45 am ప్రారంభమైన బాలయ్య నెల్లూరు పర్యటనతెలుగుదేశం పార్టీ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నెల్లూరు జిల్లా పర్యటన ఆదివారం ప్రారంభమైంది తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తడ నుంచి ఆయన జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. పర్యటన ప్రారంభానికి ముందు తడలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలో రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోపై బాలకృష్ణ ప్రశంసల జల్లు కురిపించారు.Source: ఏపీ న్యూస్ | 8 Mar 2009 | 8:29 am సీపీఎంకు కట్టా నర్సయ్య గుడ్బైకమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో సీపీఎం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఆ పార్టీకి చెందిన మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో సహా, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్‌బై చెప్పారు. పార్టీ అగ్రనాయకత్వంలో నెలకొన్న అంతర్గత విభేధాల కారణంగా పదవికి రాజీనామా చేసి, పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో తన రాజకీయ భవితవ్యాన్ని వెల్లడిస్తానని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 8 Mar 2009 | 8:10 am కాంగ్రెస్-భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాటు: బర్ధన్సార్వత్రిక ఎన్నికల అనంతరం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని సీపీఐ జతీయ కార్యదర్శి ఏబీ.బర్ధన్ మరోమారు స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల్లో దేశ ఓటర్లు ఆ రెండు పార్టీలు మినహా మిగిలిన పార్టీలకే పట్టం కడుతారని, అందువల్ల తాము ప్రభుత్వం ఏర్పాటుకు పూనుకుంటామన్నారు.Source: జాతీయ | 8 Mar 2009 | 8:10 am భవిష్యత్తులో గాంధీజీ వస్తువుల వేలానికి బ్రేక్మహాత్మా గాంధీకి సంబంధించిన ఏ వస్తువులను భవిష్యత్తులో వేలం వేయడానికి వీలులేకుండా చేసే దిశగా భారతదేశం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించనుంది. భవిష్యత్తులో గాంధీజీకి చెందిన ఏ వస్తువును ఎవరూ బహిరంగంగా వేలం వేయడానికి వీలులేకుండా చేసే మార్గాలేమిటన్నదానిపై తాము దృష్టి పెట్టామనీ, దీనిపై ఇప్పటికే అంతర్జాతీయ కోర్టులకు తమ విన్నపాలను పంపామని కళలు, సంస్కృతి శాఖకు సంబంధించిన అధికారి ఒకరు తెలిపారు.Source: జాతీయ | 8 Mar 2009 | 8:10 am పొత్తు విచ్ఛిన్నం: భాజపా అత్యవసర భేటీఒరిస్సాలో అధికార బిజూ జనతాదళ్‌తో చెలిమి వికటించడంతో భారతీయ జనతా పార్టీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం జరిగే ఈ సమావేశానిక్ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో సహా, అగ్రనేత ఎల్కే అద్వానీ, సెట్రల్ కమటీ ఆఫీస్ బేరర్లు హాజరవుతున్నారు. ఒరిస్సా అసెంబ్లీకి కూడా వచ్చే లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 8 Mar 2009 | 8:09 am కాంగ్రెస్‌ను ఎదుర్కొంటాం: ఎస్పీసమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్‌కు మరో షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులపై తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ప్రకటించింది. ఒకవైపు సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన నెలకొని ఉండగా మరోవైపు ఎస్పీ కాంగ్రెస్‌పై వ్యూహాత్మక ఒత్తిడి తెస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ బలంగా ఉన్న 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంపై ఎస్పీ అసంతృప్తితో ఉంది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ మాట్లాడుతూ... తమ సిట్టింగ్ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిందనీ, అయితే ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ వారికి దీటుగా జవాబిస్తుందన్నారు.Source: జాతీయ | 8 Mar 2009 | 7:15 am ఒరిస్సాలో ముగిసిన భాజపా-బీజెడీ స్నేహబంధంఒరిస్సా రాష్ట్రంలో అధికారం బిజూ జనతాదళ్, భారతీయ జనతా పార్టీ స్నేహబంధానికి తెరపడింది. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కిరాకపోవడంతో బీజేడీకి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకోవాలని భాజపా నిర్ణయించింది. ఫలితంగా 11 సంవత్సరాల స్నేహబంధం తెగిపోయింది. సీట్ల పంపిణీపై శనివారం ఇరు పార్టీల నేతల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో ఒరిస్సా ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ భాజపాతో పొత్తు ముగిసిందని ప్రకటించారు.Source: జాతీయ | 8 Mar 2009 | 6:09 am మార్చి 08, 2009 కార్యక్రమాలు06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 శుభోదయం 09.00 పంచతంత్రం 09.30 విష్ణు పురాణం 11.00 చెప్పాలనిఉంది 12.00 ఈనాడు సినిమా 15.00 అభిరుచి 15.30 ఈనాడు సినిమాSource: Yahoo! Telugu: Entertainment | 8 Mar 2009 | 5:01 am ఈ వారంSource: Yahoo! Telugu: Entertainment | 8 Mar 2009 | 5:00 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 8 Mar 2009 | 4:59 am అద్వానీకి పెరుగుతున్న ఆదరణప్రపంచవ్యాప్తంగా యువకులు యంగిస్థాన్ అంటూ భారతదేశాన్ని యువతగా చూడాలనుకుంటున్నారు యువకులు. అలాంటి యువకులు బీజేపీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా లాల్ కృష్ణ అద్వానీని యువకులు తమ ఇంటర్నెట్ ద్వారాకూడా యువకులు అతనిని ఆరాధించేవారు అధికమైనారని సర్వేలు తెలుపుతున్నాయి. 81 సంవత్సరాల వయసు కలిగిన అద్వానీ గత కొన్ని నెలల క్రితం తన సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంలో ఇంటర్నెట్ అనేది మానవ సభ్యసమాజాన్ని మార్చే యంత్రంగా ఆయన ఇంటర్నెట్‌ను అభివర్ణించారు.Source: జాతీయ | 7 Mar 2009 | 3:47 pm జాతీయ రహదారిపై పేలిన ఆయిల్ టాంకర్ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి మూడు ట్రాక్టర్లు, రెండు లారీలను ఢీకొట్టి పేలిపోయింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం కాగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలలోకి వెళితే...తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం చెక్‌పోస్ట్ సమీపంలో 5వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది.Source: ఏపీ న్యూస్ | 7 Mar 2009 | 3:35 pm వెంకయ్యా...అలా మాట్లాడకయ్యా : బర్దన్బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు లెఫ్ట్ కూటమిపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సమంజసంగా లేవని, ఆయన తన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్ హితవు పలికారు. ఇది ఆయన స్థాయికి తగదని బర్దన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏఐవైఎస్ఎఫ్ యూత్ పార్లమెంట్ సమావేశాల ప్రారంభానంతరం విలేకరులతో మాట్లాడుతూ...బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడి లెఫ్ట్ కూటమిపై చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గట్టు లేవని ఆయన పేర్కొన్నారు.Source: జాతీయ | 7 Mar 2009 | 3:22 pm మా బాధ్యత కాదు...!"సార్... వచ్చే నెల నుంచీ నా జీతం పెంచాలండీ..." అన్నాడు ఉద్యోగి "ఎందుకు నాయనా...? ఏం ఘనకార్యం సాధించావని..?"...Source: వినోదం | 7 Mar 2009 | 1:57 pm అందమైన భార్య...!"అందమైన భార్య కావాలని ప్రకటన నివ్వడం చాలా పొరపాటయ్యింది" విచారంగా అన్నాడు ముని...Source: వినోదం | 7 Mar 2009 | 1:55 pm నెలాఖరుకు వస్తోన్న ప్రభాస్ "బిల్లా"భక్తకన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు వంటి చిత్రాలను నిర్మించిన గోపీకృష్ణా మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ చాలా విరామం తర్వాత నిర్మిస్తున్న తాజా చిత్రం "బిల్లా". కృష్ణంరాజు, ప్రభాస్ తొలిసారి నటిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.Source: వినోదం | 7 Mar 2009 | 1:46 pm వినూత్న తరహా ప్రచారానికి భాజపా శ్రీకారంప్రచారంలో ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కే భారతీయ జనతాపార్టీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి కూడా సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా... భారతీయ జనతాపార్టీ యువజన విభాగం "అద్వానీ ఎట్ ద రేట్ ఆఫ్ క్యాంపస్" అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా... భాజపా అధ్యక్షుడు ఎల్.కే అద్వానీ దేశంలోని ఐఐఎంలను, ఇతర ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌ను సందర్శించి తమ పార్టీ విధానాలు, ప్రణాళికను వివరించి యువ ఎంబీఏల మద్ధతును కోరతారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తమ పార్టీ గెలిచినట్లయితే చేసే పనులను ఆయన వివరిస్తారు.Source: జాతీయ | 7 Mar 2009 | 1:44 pm
|